Comparison - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 03 Oct 2024 15:39:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40e vs Nothing Phone (2a) Plus: రూ.30,000 లోపు ఏది బెటర్? https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-nothing-phone-2a-plus-which-is-better-under-30k-budget/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-nothing-phone-2a-plus-which-is-better-under-30k-budget/#respond Thu, 03 Oct 2024 15:38:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=13896 Vivo V40e స్మార్ట్‌ఫోన్ వివో వీ40 సిరీస్ లో వచ్చిన మూడో డివైజ్. ఈ ఫోన్ గత మోడల్ వివో వీ30ఈ కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర భారత్‌లో రూ.28,999 గా ఉంది. ఇదే సెగ్మెంట్‌లో వచ్చిన Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్, వివో వీ40ఈ కి గట్టి పోటీదారు అని చెప్పవచ్చు. మీరు గనుక, ఈ రెండు ఫోన్లలో దేన్ని ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉంటే, ఈ ఆర్టికల్ […]

The post Vivo V40e vs Nothing Phone (2a) Plus: రూ.30,000 లోపు ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

Vivo V40e స్మార్ట్‌ఫోన్ వివో వీ40 సిరీస్ లో వచ్చిన మూడో డివైజ్. ఈ ఫోన్ గత మోడల్ వివో వీ30ఈ కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర భారత్‌లో రూ.28,999 గా ఉంది. ఇదే సెగ్మెంట్‌లో వచ్చిన Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్, వివో వీ40ఈ కి గట్టి పోటీదారు అని చెప్పవచ్చు. మీరు గనుక, ఈ రెండు ఫోన్లలో దేన్ని ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉంటే, ఈ ఆర్టికల్ మీ కొరకే. ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి, ఏది బెటర్ ఆప్షన్ అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

Vivo V40e vs Nothing Phone (2a) Plus: ధరలు

వివో వీ40ఈ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్
8జిబి+128జిబి: రూ.28,999 8జిబి+256జిబి: రూ.27,999
8జిబి+256జిబి: రూ.30,999 12జిబి+256జిబి: రూ.29,999

 

రెండు ఫోన్ల ధరలను గమనిస్తే, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, వివో వీ40ఈ కంటే తక్కువ ధర కలిగి ఉండటంతో పాటు, బేస్ వేరియంట్‌లో ఎక్కువ స్టోరేజీని అందిస్తోంది. అంతేకాదు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ యొక్క హయ్యర్ వేరియంట్ కూడా వివో వీ40ఈ కంటే తక్కువ ధరలో లభిస్తుండటమే గాక, ఎక్కువ ర్యామ్ ని కూడా ఆఫర్ చేస్తోంది. మరోవైపు, వివో వీ40ఈ యొక్క టాప్ మోడల్ 8జిబి ర్యామ్‌ని మాత్రమే అందిస్తోంది.

Vivo V40e vs Nothing Phone (2a) Plus: డిజైన్

స్పెసిఫికేషన్స్ వివో వీ40ఈ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్
కలర్ రాయల్ బ్రాంజ్, మింట్ గ్రీన్ గ్రే, బ్లాక్
చుట్టుకొలత 163.7 x 75 x 7.5 161.7 x 76.3 x 8.5
బరువు 183 గ్రాములు 190 గ్రాములు
భద్రత ఐపీ64 ఐపీ53

 

వివో వీ40ఈ చూడటానికి దాదాపుగా ఇతర వీ40 సిరీస్ ఫోన్ల మాదిరే కనిపిస్తుంది. స్లిమ్ మరియు ప్రీమియమ్ డిజైన్ కలిగి ఉంది. మింట్ గ్రీన్ ఎడిషన్ బ్యాక్ ప్యానెల్ పై ప్యాటర్న్ ఫినిష్ ఉంది. మరోవైపు, రాయల్ బ్రాంజ్ వేరియంట్ ప్లెయిన్ ఫినిష్ తో వచ్చింది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కంటే వివో వీ40ఈ ఎంతో కాంపాక్ట్‌గా మరియు తేలికగా ఉంటుంది.

మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, స్టాండర్డ్ ఫోన్ 2ఏ మాదిరే బ్యాక్ ప్యానెల్ పై గ్లైఫ్ లైటింగ్ తో కూడిన డిజైన్ తో వచ్చింది. ట్రాన్స్‌పరెంట్ రియర్ ప్యానెల్ తో వచ్చిన ఈ ఫోన్ లో కెమెరా మాడ్యూల్ పక్కన మూడు లైట్స్ ఉంటాయి. గ్రే ఎడిషన్ మెటాలిక్ ఫినిష్ కలిగి ఉంది. బ్లాక్ వేరియంట్ గ్లాసీ లుక్ తో ఉంది.

రెండు ఫోన్లలో, వివో వీ40ఈ ఐపీ64 రేటింగ్ తో వచ్చింది. ఇది దుమ్ము మరియు నీటి జల్లుల నుంచి రక్షణ అందిస్తుంది. మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఐపీ53 రేటింగ్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా వర్షంలో ఉపయోగించేందుకు పనికిరావు.

Vivo V40e vs Nothing Phone (2a) Plus: డిస్ప్లే

ఫోన్ డిస్ప్లే
వివో వీ40ఈ 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 388పీపీఐ, 1080×2392 రెజుల్యూషన్
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 395పీపీఐ, 1080×2412 రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5

 

రెండు ఫోన్లలో ఒకే విధమైన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్లలో ఉన్నాయి. అయితే, వివో వీ40ఈ లో కాస్త పెద్ద స్క్రీన్ ఉంది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది.

Vivo V40e vs Nothing Phone (2a) Plus: పెర్ఫామెన్స్

ఫోన్  ప్రాసెసర్
వివో వీ40ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 700
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో

 

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్సెట్ వాడారు. వివో వీ40ఈ లో డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. డైమెన్సిటీ 7350 కాస్త శక్తివంతమైంది. ఫోన్ 2ఏ లో 12జిబి వరకు ర్యామ్ ఆప్షన్ అందిస్తుండగా, వివో వీ40ఈ లో కేవలం 8జిబి ర్యామ్ మాత్రమే అందిస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, వివో వీ40ఈ కంటే మెరుగ్గా ఉంది.

ఫోన్ అంటుటు గీక్‌బెంచ్ సింగిల్-కోర్ గీక్‌బెంచ్ మల్టీ-కోర్
వివో వీ40ఈ 6,70,195 962 2892
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 7,71,491 1,121 2,203

 

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ అంటుటు టెస్ట్ లో 7,71,491 పాయింట్లు సాధించి, వివో వీ40ఈ (అంటుటు 6,70,195) పై విజయం సాధించింది. గీక్‌బెంచ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సింగిల్-కోర్ టెస్టులో ఫోన్ 2ఏ 1121 పాయింట్లు సాధించగా, వివో వీ40ఈ 962 పాయింట్లు సాధించింది. అయితే మల్టీ-కోర్ టెస్టులో మాత్రం వివో వీ40ఈ 2,892 పాయింట్లు నమోదు చేయగా, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 2,203 పాయింట్లు మాత్రమే సాధించింది.

Vivo V40e vs Nothing Phone (2a) Plus: కెమెరా

ఫోన్ రియర్ కెమెరా ఫ్రంట్ కెమెరా
వివో వీ40ఈ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 4కే/30ఎఫ్‌పీఎస్ 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 4కే రికార్డింగ్
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 4కే/30ఎఫ్‌పీఎస్ 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 4కే రికార్డింగ్

 

కెమెరా విభాగంలో, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, వివో వీ40ఈ పై కాస్త పైచేయి సాధించింది. రెండు ఫోన్లలో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంది. అయితే ఫోన్ 2ఏ లో సెకండరీ కెమెరా వివో వీ40ఈ తో పోల్చితే బెటర్ గా ఉంది. నథింగ్ లో 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉండగా, వివో వీ40ఈ లో కేవలం 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. ఇక రెండు ఫోన్లలో కూడా 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇంకా మేం, వివో వీ40ఈ యొక్క కెమెరా క్వాలిటీని టెస్ట్ చేయలేదు. మీరు, నథింగ్ ఫోన్ 2ఏ యొక్క కెమెరా శాంపిల్స్ ను క్రింద గమనించవచ్చు.

Vivo V40e vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ, చార్జింగ్

ఫోన్ బ్యాటరీ చార్జింగ్ స్పీడ్ పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ 20%-100% చార్జింగ్ టైమ్
వివో వీ40ఈ 5000ఎంఏహెచ్ 50 వాట్ 15 గంటల 51 నిమిషాలు 42 నిమిషాలు
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 5000 ఎంఏహెచ్ 50 వాట్ 14 గంటల 34 నిమిషాలు 51 నిమిషాలు

 

రెండు ఫోన్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. అయితే పీసీమార్క్ బ్యాటరీ టెస్టులో ఫలితాలు కాస్త వేరుగా ఉన్నాయి. వివో వీ40ఈ బ్యాటరీ 1 గంటా 13 నిమిషాలు ఎక్కువ సమయం నడిచింది. నథింద్ ఫోన్ 2ఏ ప్లస్ ఈ టెస్టులో కాస్త వెనుకబడింది.

రెండు ఫోన్లు కూడా 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ కి సపోర్ట్ చేస్తాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కంటే 9 నిమిషాలు తక్కువ సమయం వివో వీ40ఈ తీసుకుంది.

Vivo V40e vs Nothing Phone (2a) Plus: సాఫ్ట్‌వేర్

ఫోన్ సాఫ్ట్‌వేర్
వివో వీ40ఈ ఆండ్రాయిడ్ 14, ఫన్‌టచ్ఓఎస్, 3+4 అప్డేట్ పాలసీ
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఆండ్రాయిడ్ 14, నథింగ్ఓఎస్, 3+4 అప్డేట్ పాలసీ

 

వివో వీ40ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అయితే నథింగ్ లో బ్లోట్ వేర్ ఉండదు. కానీ, వివో వీ40ఈ లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. అయితే వీటిని మీరు తీసివేయచ్చు. రెండు సంస్థలు కూడా, 3 ఏళ్ళు ఓఎస్, నాలుగేళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నాయి.

ఏది బెటర్?

Vivo V40e కంటే Nothing Phone (2a) Plus బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. శక్తివంతమైన చిప్సెట్, బెటర్ కెమెరా సెటప్, డిస్ప్లే ప్రొటెక్షన్, క్లీన్ సాఫ్ట్‌వేర్ వంటివి నథింగ్ లో ఉన్నాయి. అంతేకాదు, వివో వీ40ఈ కంటే తక్కువ ధరలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లభిస్తోంది.

అయితే, వివో వీ40ఈ లో బెటర్ ఐపీ రేటింగ్, మంచి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ వంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మీకు బ్యాటరీ లైఫ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ కావాలంటే కొంత డబ్బు ఎక్కువ చెల్లించి వివో వీ40ఈ తీసుకోండి. లేదంటే నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ను ఎంచుకోండి.

The post Vivo V40e vs Nothing Phone (2a) Plus: రూ.30,000 లోపు ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-nothing-phone-2a-plus-which-is-better-under-30k-budget/feed/ 0
Samsung Galaxy M55s vs Realme 13: రూ.20,000 లోపు ఏది బెటర్ ఫోన్? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-vs-realme-13-comparison-which-is-better-under-20k-budget/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-vs-realme-13-comparison-which-is-better-under-20k-budget/#respond Sun, 29 Sep 2024 16:04:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=13820 Samsung Galaxy M55s స్మార్ట్‌ఫోన్ ఎమ్-సిరీస్ లో శాంసంగ్ నుంచి వచ్చిన కొత్త ఫోన్. దీని ప్రారంభ ధర రూ.19,999 గా ఉంది. ఇది రూ.20,000 లోపు సెగ్మెంట్ క్రిందకి వస్తుంది. ధరను బట్టి ఈ ఫోన్ హార్డ్‌వేర్ ఇతర ఫీచర్లు సరిగ్గానే ఉన్నాయనిపిస్తోంది. అయితే, ఇదే ధర శ్రేణిలో, లాంచైన Realme 13 డివైజ్ శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ కి బెటర్ ఆల్టర్నేటివ్‌గా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఫోన్లను పోల్చి ఏది బెటర్ అనే […]

The post Samsung Galaxy M55s vs Realme 13: రూ.20,000 లోపు ఏది బెటర్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>

Samsung Galaxy M55s స్మార్ట్‌ఫోన్ ఎమ్-సిరీస్ లో శాంసంగ్ నుంచి వచ్చిన కొత్త ఫోన్. దీని ప్రారంభ ధర రూ.19,999 గా ఉంది. ఇది రూ.20,000 లోపు సెగ్మెంట్ క్రిందకి వస్తుంది. ధరను బట్టి ఈ ఫోన్ హార్డ్‌వేర్ ఇతర ఫీచర్లు సరిగ్గానే ఉన్నాయనిపిస్తోంది. అయితే, ఇదే ధర శ్రేణిలో, లాంచైన Realme 13 డివైజ్ శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ కి బెటర్ ఆల్టర్నేటివ్‌గా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఫోన్లను పోల్చి ఏది బెటర్ అనే విషయం తెలుసుకుందాం.

Samsung Galaxy M55s vs Realme 13: ధర

శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ రియల్మీ 13
8జిబి+128జిబి ధర రూ.19,999 8జిబి+128జిబి ధర రూ.17,999
8జిబి+256జిబి ధర రూ.22,999 8జిబి+256జిబి ధర రూ.19,999

 

ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధర భారత్‌లో రూ.20,000 లోపు ఉంది. రియల్మీ 13 తో పోల్చితే శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ ధర కాస్త ఎక్కువగా ఉంది. రెండు ఫోన్లు ఒకే విధమైన ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తున్నాయి. అవి: 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ.

Samsung Galaxy M55s vs Realme 13: డిజైన్

స్పెసిఫికేషన్స్ శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ రియల్మీ 13
కలర్స్ థండర్ బ్లాక్, కోరల్ గ్రీన్ స్పీడ్ గ్రీన్, డార్క్ పర్పుల్
చుట్టుకొలత 163.9 x 76.5 x 7.8 మి.మీ 165.6 x 76.1 x 7.8 మి.మీ
బరువు 180 గ్రాములు 190 గ్రాములు
ప్రొటెక్షన్ ఐపీ64

 

శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ డివైజ్ మూడు డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్స్ లో లభిస్తుంది. అవి: స్ట్రిప్స్, ప్లెయిన్, మరియు టెక్షర్డ్. ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లాక్ మ్యాట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మూడు కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. రియల్మీ 13 తో పోల్చితే గెలాక్సీ ఎమ్55 ఎస్ చాలా తక్కువ బరువుంది. ఐపీ రేటింగ్ లేకపోవడంతో ఈ ఫోన్ దుమ్ము, నీటి జల్లుల నుంచి రక్షణ పొందలేదు.

మరోవైపు, రియల్మీ 13 డ్యూయట్-టోన్ ఫినిష్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై టెక్షర్డ్ ప్యాటర్న్ ఉంది. గ్రీన్ మరియు పర్పుల్ కలర్స్ లో లభిస్తుంది. కెమెరా సెటప్ రింగ్ మాడ్యూల్ లో ఉంటుంది. ఐపీ64 రేటింగ్ వల్లన ఫోన్‌కి దుమ్ము మరియు నీటి జల్లుల నుంచి రక్షణ లభిస్తుంది.

Samsung Galaxy M55s vs Realme 13: డిస్ప్లే

ఫోన్ డిస్ప్లే
శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్
రియల్మీ 13 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 రెజుల్యూషన్

 

రెండు ఫోన్లలో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ (1080*2400) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. శాంసంగ్ ఎమ్55ఎస్ లో సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, ఇన్ఫినిటీ-ఓ ప్యానెల్ ఉండగా, రియల్మీ 13 లో ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఇచ్చారు.

Samsung Galaxy M55s vs Realme 13: పెర్ఫామెన్స్

ఫోన్ ప్రాసెసర్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
రియల్మీ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6300

 

శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. రియల్మీ 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. డైమెన్సిటీ 6300 చిప్సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. శాంసంగ్ ఫోన్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో రాగా, రియల్మీ డివైజ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వచ్చింది.

రియల్మీ 13 అంటుటు స్కోర్ 4,45,281 పాయింట్లు స్కోర్ చేసింది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 782 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1,978 పాయింట్లు నమోదు చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ పెర్ఫామెన్స్‌ను మేం ఇంకా టెస్ట్ చేయలేదు.

Samsung Galaxy M55s vs Realme 13: కెమెరాలు

ఫోన్ వెనుక కెమెరాలు ముందు కెమెరా
శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ 50ఎంపి ఫ్రంట్ కెమెరా
రియల్మీ 13 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా 16ఎంపి ఫ్రంట్ కెమెరా

 

కెమెరా విభాగంలో శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ క్లియర్ విన్నర్ అని చెప్పవచ్చు. రెండు ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అయితే శాంసంగ్ లో అదనంగా 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. ముందువైపు, శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ లో 50ఎంపి కెమెరా ఇచ్చారు. రియల్మీ 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

అయితే, శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ యొక్క కెమెరా పెర్ఫామెన్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు మీరు పూర్తి రివ్యూ కోసం వేచి చూడాలి. సరే, ఓసారి రియల్మీ 13 యొక్క కెమెరా శాంపిల్స్ క్రింద అందించాం. ఓ లుక్ వేయండి.

Samsung Galaxy M55s vs Realme 13: బ్యాటరీ, చార్జింగ్

ఫోన్ బ్యాటరీ చార్జింగ్ స్పీడ్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ 5,000 ఎంఏహెచ్ 45 వాట్
రియల్మీ 13 5,000 ఎంఏహెచ్ 45 వాట్

 

రెండు ఫోన్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ ఫోన్లు 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13 స్మార్ట్‌ఫోన్ 11 గంటల 12 నిమిషాలు నడిచింది. అలాగే 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 57 నిమిషాల సమయం తీసుకుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ నుంచి కూడా ఇదే విధమైన ఫలితాలను ఆశించవచ్చు.

Samsung Galaxy M55s vs Realme 13: సాఫ్ట్‌వేర్

ఫోన్ సాఫ్ట్‌వేర్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, వన్‌యూఐ, 4+5 అప్డేట్ పాలసీ
రియల్మీ 13 ఆండ్రాయిడ్ 14 ఓఎస్, రియల్మీయూఐ 2+3 అప్డేట్ పాలసీ

 

శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా కొన్ని థర్డ్-పార్టీ యాప్స్ తో వస్తాయి. కానీ, మీరు వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. శాంసంగ్ 4 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తుంది. మరోవైపు, రియల్మీ 13 కి కేవలం రెండు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. గెలాక్సీ ఎమ్55ఎస్ లో హార్డ్‌వేర్-బేస్డ్ సెక్యూరిటీ సెల్యూషన్ ‘శాంసంగ్ నాక్స్ వాల్ట్’ ఉంటుంది.

The post Samsung Galaxy M55s vs Realme 13: రూ.20,000 లోపు ఏది బెటర్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-vs-realme-13-comparison-which-is-better-under-20k-budget/feed/ 0
Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: ఏది బెటర్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్? https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-motorola-edge-50-pro-comparison-which-is-better-premium-mid-range-phone/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-motorola-edge-50-pro-comparison-which-is-better-premium-mid-range-phone/#respond Thu, 19 Sep 2024 14:39:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13613 Vivo T3 Ultra ఇటీవలె భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ.31,999 గా ఉంది. ఈ ధర శ్రేణిలో Motorola Edge 50 Pro కూడా లాంచ్ అయ్యింది. వివో టీ3 అల్ట్రా కి ఇది ఆల్టర్నేటివ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో మనం వివో టీ3 అల్ట్రా మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్ అనే […]

The post Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: ఏది బెటర్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>

Vivo T3 Ultra ఇటీవలె భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ.31,999 గా ఉంది. ఈ ధర శ్రేణిలో Motorola Edge 50 Pro కూడా లాంచ్ అయ్యింది. వివో టీ3 అల్ట్రా కి ఇది ఆల్టర్నేటివ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో మనం వివో టీ3 అల్ట్రా మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్ అనే విషయాన్ని తెలుసుకుందాం.

Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ వివో టీ3 అల్ట్రా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో
డిస్ప్లే 6.78-ఇంచ్ 1.2కే అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 423పీపీఐ, 1260*2800 రెజుల్యూషన్, షాట్ జెన్సేషన్ ఆల్ఫా 6.7-ఇంచ్ 1.2కే పీఓఎల్ఈడీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 446పీపీఐ, 1220*2712 రెజుల్యూషన్
చుట్టుకొలత 164.2 x 74.9 x 7.6 మి.మీ 161.2 x 72.4 x 8.1 మి.మీ
బరువు 192 గ్రాములు 186 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ ఆండ్రాయిడ్ 14
రియర్ కెమెరా 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్, 13ఎంపి అల్ట్రావైడ్, 10ఎంపి టెలీఫోటో
ఫ్రంట్ కెమెరా 50ఎంపి సెల్ఫీ కెమెరా 50ఎంపి సెల్ఫీ కెమెరా
వీడియో 4కే/60ఎఫ్‌పీఎస్ 4కే/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
బ్యాటరీ, చార్జింగ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్
ర్యామ్, స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
కలర్స్ లునార్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ వెనిలా క్రీమ్, లక్స్ లావెండర్, మూన్‌లైట్ పెర్ల్, బ్లాక్ బ్యూటీ

 

Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: ధర

వివో టీ3 అల్ట్రా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో
8జిబి+128జిబి ధర రూ.31,999
8జిబి+256జిబి ధర రూ.33,999 8జిబి+256జిబి ధర రూ.31,999
12జిబి+512జిబి ధర రూ.35,999 12జిబి+256జిబి ధర రూ.35,999

 

Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: డిజైన్

రెండు ఫోన్లు కూడా ప్రీమియమ్ లుక్ తో ఉన్నాయి. అయితే, వివో టీ3 అల్ట్రా డిజైన్ ను గమనిస్తే.. మినిమలిజమ్, ఎర్గనామిక్స్, సాలిడ్ ఇన్-హ్యాండ్ ఫీల్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కర్వ్డ్ డిజైన్, మంచి బిల్డ్ క్వాలిటీ, స్టైలిష్ లుక్ తో ఉంది.

వివో టీ3 అల్ట్రా చూడటానికి స్లిమ్ గా ఉంది. ఎడ్జ్ 50 ప్రో లగ్జరియస్ లుక్ తో ఉంది. రెండు ఫోన్లు కూడా ఐపీ68 రేటింగ్ తో వచ్చాయి. దీని ద్వారా వాటర్ అండ్ డస్ట్ నుంచి ఫోన్లకు రక్షణ లభిస్తుంది. వర్షంలో, నీటి లోపల 1.5 మీటర్ల వరకు అరగంట సేపు ఉన్నా ఈ ఫోన్లకు ఏమీ కాదు.

Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: డిస్ప్లే

Vivo T3 Ultra

వివో టీ3 అల్ట్రా లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.2కే అమోలెడ్ డిస్ప్లే ఉంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో 10-బిట్ 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ 3డీ కర్వ్డ్ స్క్రీన్ ఉంది. అయితే, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. వివో టీ3 అల్ట్రా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది.

Moto Edge 50 Pro

వివో టీ3 అల్ట్రా షాట్ జెన్సేషన్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వచ్చింది. దీని వ్లలన స్క్రాచెస్ నుంచి డిస్ప్లేకి రక్షణ లభిస్తుంది. ఓవరాల్ గా రెండు ఫోన్లు కూడా రిచ్ అండ్ స్మూథ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: పెర్ఫామెన్స్

వివో టీ3 అల్ట్రా లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ అందించారు. ఈ చిప్సెట్ ఎంతో శక్తివంతమైంది. అన్ని రకాల టాస్కులను స్మూథ్ గా చేస్తుంది. అయితే, మేం జరిపిన టెస్టుల సమయంలో, హెవీ లోడ్ ఉన్నప్పుడు పెర్ఫామెన్స్ తగ్గినట్లు అనిపించింది. ఏదేమైనా, జనరల్ యూజ్ విషయంలో డివైజ్ బాగా పెర్ఫామ్ చేస్తుంది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ వివో టీ3 అల్ట్రా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో
అంటుటు 14,44,926 8,27,231
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,854 1,142
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 5,066 3,119

 

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ అందించారు. ఇది డెయిలీ టాస్కులు, గేమింగ్ వంటి వాటికి బాగా సరిపోతుంది. ఎక్కువ ఒత్తిడితో కూడిన టాస్కులను హ్యాండిల్ చేసేటప్పుడు వేడెక్కడం, పనితీరు మందగించడం వంటివి మేం గమనించాం. దీంతో, వివో టీ3 అల్ట్రా, మోటో ఎడ్జ్ 50 ప్రో పై పైచేయి సాధించింది.

Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: కెమెరాలు

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో విలక్షణమైన కెమెరా సెటప్ ఉంది. ఇది వివో టీ3 అల్ట్రాతో పోల్చితే ఎంతో బాగుంది. రెండు ఫోన్లలో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్ ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ లో 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో/మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. వివో టీ3 అల్ట్రా లో 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. రెండు ఫోన్లలో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

మేం జరిపిన టెస్టులో, వివో టీ3 అల్ట్రా పొట్రెయిట్ ఫోటోగ్రఫీ, లో-లైట్ కండిషన్స్ లో బాగా పెర్ఫామ్ చేసింది. ఇక్కడ ఆరా లైట్ కి థ్యాంక్స్ చెప్పుకోవల్సిందే. కానీ, ఇండోర్ వీడియో ఫ్లికరింగ్ అనేది సమస్యగా మారింది. అలాగే, అప్పుడప్పుడు ఇమేజ్‌ని ఓవర్-ప్రాసెసర్ చేస్తోంది.

 

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో-లైట్ షాట్స్ బాగా తీస్తోంది. డీటెయిల్డ్ పొట్రెయిట్స్ కూడా వివిధ రకాల ఫోకల్ లెంగ్త్స్‌లో బాగా కనిపించాయి. అయితే, సెల్ఫీలు ఓవర్‌ఎక్స్‌పోజ్ అవ్వడం మరియు టెలీఫోటో లెన్స్ తో తీసిన ఇమేజెస్ కలర్ షిఫ్ట్ అవ్వడం మైనస్‌గా కనిపిస్తోంది.

Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: బ్యాటరీ, చార్జింగ్

వివో టీ3 అల్ట్రా లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో మంచి ప్రదర్శన కనబరిచింది. టెస్టు ఫలితాలను చూస్తే, మోటో ఎడ్జ్ 50 ప్రో 12 గంటల 30 నిమిషాలు నడవగా, వివో టీ3 అల్ట్రా 12 గంటల 14 నిమిషాల పాటు నడిచింది.

మోటో ఎడ్జ్ 50 ప్రో ను 125 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేయగా, కేవలం 30 నిమిషాల్లో 100 శాతం చార్జ్ అయ్యింది. మరోవైపు, వివో టీ3 అల్ట్రా ను 80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేయగా, పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 38 నిమిషాల సమయం పట్టింది. ఫాస్ట్ చార్జింగ్ మోడ్ తీసేసి, చార్జ్ చేయగా, వివో టీ3 అల్ట్రా కి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 47 నిమిషాలు సమయం పట్టింది.

Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: సాఫ్ట్‌వేర్

వివో టీ3 అల్ట్రా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఎడ్జ్ 50 ప్రో క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రెండు ఫోన్లకు ఆయా కంపెనీలు, 3 ఏళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నాయి.

పరిమితమైన ఏఐ ఫీచర్లు, స్మూథ్ యానిమేషన్స్ తో వివో టీ3 అల్ట్రా ఎఫిషియంట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ను అందిస్తుంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఎన్నో కనెక్టివిటీ ఆప్షన్స్, కస్టమైజేషన్, మోటో కనెక్ట్, మోటో సెక్యూర్ వంటి సెక్యూరిటీ టూల్స్ తో ఫీచర్-రిచ్ ఎక్స్ అనుభూతిని అందిస్తుంది.

ఏది బెటర్?

ఓవరాల్ గా రెండు ఫోన్లు కూడా చెప్పుకోదగిన పెర్ఫామెన్స్ ను అందిస్తాయి. వివో టీ3 అల్ట్రా బెటర్ డిస్ప్లే ప్యానెల్, ప్రొటెక్షన్, సూపీరియర్ చిప్సెట్, లో-లైట్ పెర్ఫామెన్స్ వంటి విషయాల్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కంటే మెరుగ్గా ఉంది.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో.. స్మూథ్ డిస్ప్లే, బెటర్ బ్యాటరీ బ్యాకప్, ఫాస్టర్ చార్జింగ్ స్పీడ్, విలక్షణమైన కెమెరా సెటప్, క్లీన్ సాఫ్ట్‌వేర్ వంటి విషయాల్లో వివో టీ3 అల్ట్రా కంటే బాగుంది.

The post Vivo T3 Ultra vs Motorola Edge 50 Pro: ఏది బెటర్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-motorola-edge-50-pro-comparison-which-is-better-premium-mid-range-phone/feed/ 0
Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/ https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/#respond Tue, 17 Sep 2024 17:14:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13551 Realme 13 స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌ని ఓ మోస్తరు ధరలో చక్కటి మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫోన్ తో పోటీపడేందుకు మరొక ఫోన్ CMF Phone 1 పేరుతో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇవ్వగా, సీఎంఎఫ్ ఫోన్ 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. నేడు ఈ రెండు ఫోన్లను మనం పోల్చి […]

The post Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

Realme 13 స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌ని ఓ మోస్తరు ధరలో చక్కటి మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫోన్ తో పోటీపడేందుకు మరొక ఫోన్ CMF Phone 1 పేరుతో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇవ్వగా, సీఎంఎఫ్ ఫోన్ 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. నేడు ఈ రెండు ఫోన్లను మనం పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుందో తెలుసుకుందాం.

Realme 13 vs CMF Phone 1: ధరలు

స్టోరేజీ వేరియంట్స్ రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
6జిబి+128జిబి రూ.15,999
8జిబి+128జిబి రూ.17,999 రూ.17,999
8జిబి+256జిబి రూ.19,999

 

గీక్‌బెంచ్

ఇప్పుడు రెండు ఫోన్ల యొక్క గీక్‌బెంచ్ స్కోర్లను చెక్ చేద్దాం. ఈ టెస్ట్ కోసం రెండు ఫోన్ల యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ ను ఎంచుకోవడం జరిగింది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)

స్కోర్లను బట్టి చూస్తే, సీఎంఎఫ్ ఫోన్ 1, రియల్మీ 13 కంటే బెటర్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ టెస్టుల్లో రియల్మీ 13 వెనకబడింది. సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ అనేది బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్ లపై ప్రభావం చూపుతుంది. మరోవైపు, మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ వీడియో ఎడిటింగ్, గేమింగ్ వంటి హెవీ టాస్కులపై ప్రభావం చూపుతుంది. బెంచ్‌మార్క్స్ ప్రకారం, సీఎంఎఫ్ ఫోన్ 1 లో ఈ అన్నీ టాస్కులు స్మూథ్ గా నడుస్తాయని స్పష్టమవుతోంది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
సింగిల్-కోర్ 782 1015
మల్టీ-కోర్ 1978 2867

 

విజేత: CMF Phone 1

అంటుటు

గీక్‌బెంచ్ కంటే మరింత లోతైన ఫలితాలను అంటుటు అందిస్తుంది. ఇది సీపీయూ, జీపీయూ, మెమొరీ మరియు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. ఇక్కడ కూడా.. అంటుటు స్కోర్ల విషయానికి వస్తే, రియల్మీ 13 పై సీఎంఎఫ్ ఫోన్ 1 పైచేయి సాధించింది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)

రెండు ఫోన్ల యొక్క ఫలితాలను గమనిస్తే, సీఎంఎఫ్ ఫోన్ 1 యొక్క జీపీయూ స్కోర్ ఎక్కువగా ఉంది. ఇతర స్కోర్లు కూడా దాదాపు అదే విధంగా ఉన్నాయి. రియల్మీ 13 తో పోల్చితే, సీఎంఎఫ్ ఫోన్ 1 అన్ని విభాగాల్లోనూ బెటర్ గా పెర్ఫామర్ గా నిలిచింది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
అంటుటు 4,52,218 6,42,187

 

విజేత: CMF Phone 1

సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్

తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క చిప్సెట్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుందో అనే విషయాన్ని సీపీయూ థ్రాట్లిల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ కోసం మేము, బర్నవుట్ బెంచ్‌మార్క్ యాప్ ను ఉపయోగించాం. ఈ టెస్టులో సీఎంఎఫ్ ఫోన్ 1 కంటే రియల్మీ 13 మంచి స్కోర్ చేసింది. మీరు గనుక, రోజూ ఎక్కువగా గేమ్స్ ఆడటంతో పాటు ఇంటెన్సివ్ టాస్కులు చేస్తే, మీకు రియల్మీ 13 బాగా సరిపోతుంది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)
రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
ఒత్తిడి సమయంలో పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ 63.5 58.2

 

విజేత: Realme 13

గేమింగ్ టెస్ట్

మేం రెండు ఫోన్లలోనూ ఒక్కో దానిలో 30 నిమిషాల చొప్పున కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ గేమ్‌లను ఆడాం. ఈ మూడు గేముల్లోనూ సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ గా పెర్ఫామ్ చేసింది. హీట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే.. 90 నిమిషాల గేమింగ్ సెషన్ తర్వాత, రియల్మీ 13 యొక్క టెంపరేచర్ 15.3 డిగ్రీలు పెరిగింది. సీఎంఎఫ్ ఫోన్ 1 యొక్క టెంపరేచర్ 14.6 డిగ్రీలు పెరిగింది.

థర్మల్స్ విషయానికి వస్తే, రెండు ఫోన్లలో పెద్దగా తేడా లేదు. అయితే, మీరు గనుక రోజూ గేమ్స్ ఆడే వారైతే, మీకు సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ ఆప్షన్ అవుతుంది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
90 నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 5.1 డిగ్రీల సెల్సియస్ 4.86 డిగ్రీల సెల్సియస్

 

విజేత: CMF Phone 1

ఏది బెటర్?

అన్ని ఫలితాలను బట్టి చూస్తే, Realme 13 పై CMF Phone 1 విజయం సాధించిందని అర్థమవుతోంది. మంచి బెంచ్‌మార్క్ ఫలితాలను సీఎంఎఫ్ ఫోన్ 1 కలిగి ఉంది. గేమింగ్ పెర్ఫామెన్స్ కూడా బాగుంది. హీట్ మేనేజ్మెంట్ ఫర్వాలేదు. రెండు ఫోన్లలో CMF Phone 1 బెటర్ చాయిస్ అని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే, దీని ధర కూడా తక్కువే.

ఈ స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: గౌరవ్ శర్మ

The post Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/feed/ 0
Vivo T3 Ultra vs Vivo V40: రెండు ఫోన్లలో ఏది బెటర్? https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-vivo-v40-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-vivo-v40-comparison-which-is-better/#respond Sun, 15 Sep 2024 15:33:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=13492 వివో టీ3 సిరీస్ లో లేటెస్ట్ గా లాంచైన ఫోన్ Vivo T3 Ultra. ఈ ఫోన్ రూ.31,999 ల ప్రారంభ ధరతో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. విషయమేంటంటే, వీ40 ప్రో డివైజ్‌లో కూడా ఇదే చిప్సెట్ వాడారు. మరోవైపు, Vivo V40 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండు […]

The post Vivo T3 Ultra vs Vivo V40: రెండు ఫోన్లలో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

వివో టీ3 సిరీస్ లో లేటెస్ట్ గా లాంచైన ఫోన్ Vivo T3 Ultra. ఈ ఫోన్ రూ.31,999 ల ప్రారంభ ధరతో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. విషయమేంటంటే, వీ40 ప్రో డివైజ్‌లో కూడా ఇదే చిప్సెట్ వాడారు. మరోవైపు, Vivo V40 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్ అనే విషయాన్ని తెలుసుకుందాం.

Vivo T3 Ultra vs Vivo V40: స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ వివో టీ3 అల్ట్రా వివో వీ40
డిస్ప్లే 6.78-ఇంచ్ 1.2కే అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 453పీపీఐ, 1260*2800 రెజుల్యూషన్, షాట్ జెన్సేషన్ ఆల్ఫా 6.78-ఇంచ్ 1.2కే అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 453పీపీఐ, 1260*2800 రెజుల్యూషన్, షాట్ జెన్సేషన్ ఆల్ఫా
చుట్టుకొలత 164.2 x 74.9 x 7.6 మి.మీ 164.2 x 75 x 7.6 మి.మీ
బరువు 192 గ్రాములు 190 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్
రియర్ కెమెరా 50ఎంపి ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ 50ఎంపి ఓఐఎస్, 50ఎంపి అల్ట్రావైడ్
సెల్ఫీ కెమెరా 50ఎంపి ఫ్రంట్ కెమెరా 50ఎంపి ఫ్రంట్ కెమెరా
వీడియో 4కే/60ఎఫ్‌పీఎస్ 4కే/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
బ్యాటరీ, చార్జింగ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్
ర్యామ్, స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ
కలర్స్ లునార్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ టైటానియమ్ గ్రే, లోటస్ పర్పుల్, గంగెస్ బ్లూ

 

Vivo T3 Ultra vs Vivo V40: ధర

Vivo T3 Ultra Vivo V40
8జిబి+128జిబి ధర రూ.31,999 8జిబి+128జిబి ధర రూ.34,999
8జిబి+256జిబి ధర రూ.33,999 8జిబి+256జిబి ధర రూ.36,999
12జిబి+512జిబి ధర రూ.35,999 12జిబి+512జిబి ధర రూ.41,999

 

Vivo T3 Ultra vs Vivo V40: డిజైన్

Vivo T3 Ultra మరియు Vivo V40 ఫోన్లు చూడటానికి ఒకే విధంగా కనిపిస్తాయి. రెండింట్లో ఏది ఏ ఫోన్ అని చెప్పడం కష్టమే. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై పిల్-షేప్డ్ కెమెరా ఐల్యాండ్ ఇచ్చారు. ఇందులో రెండు కెమెరాలు ఉంటాయి. ఇంకా ఆరా ఫ్లాష్‌లైట్ కూడా ఉంటుంది.

ఈ రెండు ఫోన్లు కూడా ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చాయి. వివో టీ3 ప్లేన్ ఫినిష్ తో రాగా, వివో వీ40 గంగేస్ బ్లూ ఎడిషన్ వేవ్-ప్యాటర్న్ తో ప్రీమియమ్ లుక్ కలిగి ఉంది.

Vivo T3 Ultra vs Vivo V40: డిస్ప్లే

వివో వీ40 మరియు వివో టీ3 అల్ట్రా ఫోన్లలో 1.2కే రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా షాట్ జెన్సేషన్ ఆల్ఫా డిస్ప్లే ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్ల నుంచి ఒకే విధమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.

Vivo T3 Ultra vs Vivo V40: పెర్ఫామెన్స్

వివో టీ3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ అందించారు. మరోవైపు, వివో వీ40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఇచ్చారు. రెండింటిని చూస్తే డైమెన్సిటీ 9300+ యొక్క పెర్ఫామెన్స్ మెరుగ్గా ఉంటుంది. క్రింద బెంచ్‌మార్క్ స్కోర్స్ అందించాం. ఓసారి చూడండి.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
అంటుటు 15,24,110 8,10,635
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,811 1,165
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 5,299 3,216

 

మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ యొక్క అంటుటు స్కోర్ 15,24,110 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1,811 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 5,299 పాయింట్లుగా ఉంది. మరోవైపు, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ యొక్క అంటుటు స్కోర్ 8,10,635 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1,165 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3216 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo T3 Ultra vs Vivo V40: కెమెరాలు

కెమెరా విభాగానికి వస్తే, వివో వీ40 జీస్ లెన్సెస్‌తో స్పష్టమైన విజేతగా నిలుస్తోంది. రెండు ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. కానీ, వీ40 లో జీస్ సెన్సర్ ఉండటం, ఇంకా 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. రెండు ఫోన్లలో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ప్రొవైడ్ చేశారు.

వివో వీ40 కెమెరా పనితీరు చూసి మేం ఇంప్రెస్ అయ్యాం. వివో టీ3 అల్ట్రా యొక్క డీటెయిల్డ్ కెమెరా రివ్యూ ఇంకా తెలియాల్సి ఉంది.

Vivo T3 Ultra vs Vivo V40: బ్యాటరీ, చార్జింగ్

వివో టీ3 అల్ట్రా మరియు వివో వీ40 ఫోన్లలో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. టెస్టింగ్ సందర్భంగా, వివో వీ40 ఫోన్ లో హెవీగా వాడిన తర్వాత కాస్త బ్యాటరీ పవర్ మిగిలి ఉంది. మేం జరిపిన, పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 13 గంటలు స్కోర్ చేసింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్ కి 35 నిమిషాల సమయం పట్టింది. ఇవే ఫలితాలను వివో టీ3 అల్ట్రా నుంచి ఆశించవచ్చు.

Vivo T3 Ultra vs Vivo V40: సాఫ్ట్‌వేర్

రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. టీ3 అల్ట్రాకి రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. మరోవైపు, వివో వీ40 కి 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. రెండు ఫోన్లు ఏఐ టూల్స్ తో వచ్చాయి.

ఏది బెటర్?

ప్రారంభ ధర పరంగా చూస్తే.. కొత్తగా రిలీజైన వివో టీ3 అల్ట్రా, వివో వీ40కి బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా చెప్పవచ్చు. దీంట్లో శక్తివంతమైన చిప్సెట్ ఉంది. అయితే, వివో వీ40 లో జీస్ లెన్సెస్ తో కూడిన బెటర్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా మరియు ప్రీమియమ్ డిజైన్ కావాలంటే, వివో వీ40 మీకు బెస్ట్ ఆప్షన్. లేదంటే వివో టీ3 అల్ట్రా ఎంచుకోండి.

The post Vivo T3 Ultra vs Vivo V40: రెండు ఫోన్లలో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-vivo-v40-comparison-which-is-better/feed/ 0
Infinix Hot 50 vs itel Color Pro: ఏది బెటర్ బడ్జెట్ ఫోన్? https://www.91mobiles.com/telugu/infinix-hot-50-vs-itel-color-pro-comparison-which-is-better-budget-phone/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-vs-itel-color-pro-comparison-which-is-better-budget-phone/#respond Mon, 09 Sep 2024 17:25:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=13395 Infinix Hot 50 భారత్‌లో రూ.9,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. తక్కువ ధరలో పర్వాలేదనిపించే స్పెసిఫికేషన్స్ ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. చవకగా ఒక మంచి ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరిపోతుంది. అయితే, ఇదే ధర శ్రేణిలో ఐటెల్ కంపెనీ నుంచి itel Color Pro అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ అందుబాటులో ఉంది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చిన ఇది ఇన్ఫినిక్స్ హాట్ 50 […]

The post Infinix Hot 50 vs itel Color Pro: ఏది బెటర్ బడ్జెట్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>

Infinix Hot 50 భారత్‌లో రూ.9,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. తక్కువ ధరలో పర్వాలేదనిపించే స్పెసిఫికేషన్స్ ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. చవకగా ఒక మంచి ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరిపోతుంది.

అయితే, ఇదే ధర శ్రేణిలో ఐటెల్ కంపెనీ నుంచి itel Color Pro అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ అందుబాటులో ఉంది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చిన ఇది ఇన్ఫినిక్స్ హాట్ 50 కి ఆల్టర్నేటివ్ ఆప్షన్‌గా నిలవనుంది. ఈ ఆర్టికల్ లో, మేం Infinix Hot 50 మరియు itel Color Pro ఫోన్లను పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్, ఏది వాల్యూ ఫర్ మనీ ఆప్షనో చెప్పే ప్రయత్నం చేస్తాం.

Infinix Hot 50 vs itel Color Pro: స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ ఇన్ఫినిక్స్ హాట్ 50 ఐటెల్ కలర్ ప్రో
డిస్ప్లే 6.7-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్ 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్
డైమెన్షన్స్ 165.7 మి.మీ x 77.1 మి.మీ x 7.8 మి.మీ 163.5 మి.మీ x 75.5 మి.మీ x 8.3 మి.మీ
బరువు 188 గ్రాములు 190 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్ 14 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఐటెల్ఓఎస్
రియర్ కెెమెరా 48ఎంపి ప్రైమరీ ఏఐ కెమెరా 50ఎంపి ప్రైమరీ ఏఐ సెన్సర్
ఫ్రంట్ కెమెరా 8ఎంపి 8ఎంపి
వీడియో 1080పి/30ఎఫ్‌పీఎస్ 1080పి/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 మీడియాటెక్ డైమెన్సిటీ 6080
బ్యాటరీ, చార్జింగ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్
ర్యామ్, స్టోరేజీ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ 6జిబి ర్యామ్/128జిబి స్టోరేజీ
కలర్స్ స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ, సేజ్ గ్రీన్, డ్రీమీ పర్పుల్ లావెండర్ ఫాంటసీ & రివర్ బ్లూ

 

Infinix Hot 50 vs itel Color Pro: ధర

ఇన్ఫినిక్స్ హాట్ 50 ఐటెల్ కలర్ ప్రో
4జిబి+128జిబి ధర రూ.9,999 6జిబి+128జిబి ధర రూ.9,999
6జిబి+128జిబి ధర రూ.10,999

 

Infinix Hot 50 vs itel Color Pro: డిజైన్

ఇన్ఫినిక్స్ హాట్ 50 ప్లాస్టిక్ మరియు వీగన్ లెదర్ మోడల్స్ లో అందుబాటులో ఉంది. స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ, సేజ్ గ్రీన్ కలర్స్ ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిష్ తో వచ్చాయి. డ్రీమీ పర్పుల్ వేరియంట్ మాత్రం వీగన్ లెదర్ బాడీతో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ ఐపీ54 రేటింగ్ తో వచ్చింది.

మరోవైపు, ఐటెల్ కలర్ ప్రో ప్లాస్టిక్ బాడీ, డ్యూయల్ టోన్ ఫినిష్ తో వచ్చింది. సూర్యకాంతి పడినప్పుడు ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ రంగులు మారుస్తుంది. ఇదే ఈ ఫోన్ లో హైలైట్ అని చెప్పవచ్చు. ఇకపోతే, ఈ ఫోన్ లావెండర్ ఫాంటసీ మరియు రివర్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ ఐపీ రేటింగ్ తో రాలేదు.

Infinix Hot 50 vs itel Color Pro: డిస్ప్లే

ఇన్ఫినిక్స్ హాట్ 50 మరియు ఐటెల్ కలర్ ప్రో ఫోన్లు రెండూ కూడా ఒకే విధమైన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. హాట్ 50 లో కాస్త పెద్ద డిస్ప్లే ఉంది. ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ రెజుల్యూషన్ రెండు ఫోన్లలో అందించారు. క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది.

అయితే, ఇన్ఫినిక్స్ హాట్ 50 లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ విషయంలో ఐటెల్ కలర్ ప్రో కంటే మెరుగ్గా ఉంది. ఐటెల్ కలర్ ప్రో లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు.

Infinix Hot 50 vs itel Color Pro: పెర్ఫామెన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇచ్చారు. ఐటెల్ కలర్ ప్రో లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. రెండు ప్రాసెసర్స్ లో డైమెన్సిటీ 6300 చిప్ మెరుగైనది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 మీడియాటెక్ డైమెన్సిటీ 6080
అంటుటు 4,33,932 4,32,270
గీక్‌బెంచ్ (సింగిల్ కోర్) 781 పాయింట్లు 752 పాయింట్లు
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 1,981 పాయింట్లు 2,081 పాయింట్లు

 

రెండు ఫోన్ల యొక్క బెంచ్‌మార్క్ ఫలితాలను పరిశీలిస్తే, కలర్ ప్రో అంటుటు స్కోర్ 4,32,270 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ సింగిల్-కోర్ పై 752 పాయింట్లు, మల్టీ-కోర్ పై 2081 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు, హాట్ 50 యొక్క అంటుటు స్కోర్ 4,33,932 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 781 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1981 పాయింట్లు నమోదు చేసింది.

Infinix Hot 50 vs itel Color Pro: కెమెరాలు

రెండు ఫోన్ల యొక్క కెమెరా విభాగాన్ని పరిశీలిస్తే, కలర్ ప్రో డివైజ్ బెటర్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. హాట్ 50 లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. కలర్ ప్రో లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి.

ఐటెల్ కలర్ ప్రో యొక్క కెమెరా పెర్ఫామెన్స్, ప్రత్యేకించి లో-లైట్ కండీషన్స్ లో బాగుంది.

Infinix Hot 50 vs itel Color Pro: బ్యాటరీ, చార్జింగ్

ఇన్పినిక్స్ హాట్ 50 మరియు ఐటెల్ కలర్ ప్రో ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లు డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. కానీ, స్లోగా చార్జ్ అవుతాయి. మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఐటెల్ కలర్ ప్రో 12 గంటల 38 నిమిషాల పాటు పనిచేసింది. 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 1 గంటా 41 నిమిషాల సమయం పట్టింది. ఇన్ఫినిక్స్ హాట్ 50 కూడా దాదాపుగా ఇదే స్థాయి స్కోర్ చేసింది.

Infinix Hot 50 vs itel Color Pro: సాఫ్ట్‌వేర్

ఇన్ఫినిక్స్ హాట్ 50 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. కలర్ ప్రో డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఐటెల్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు ఫోన్లకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. అయితే ఓఎస్ అప్డేట్స్ మాత్రం లభించకపోవచ్చు. అయితే ఇన్ఫినిక్స్ హాట్ 50 లో ఏఐ ఫీచర్లు, ఫోటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. కలర్ ప్రో లో ఇవేవీ లేవు.

ఏది బెటర్?

మీరు ఏ ఫోన్ ఎంపిక చేసుకున్నప్పటికీ, రెండు ఫోన్లు కూడా అన్ని విభాగాల్లో బాగానే పెర్ఫామ్ చేస్తాయి. అయితే, రెండింట్లో ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. ఇక ఛాయిస్ అనేది, మీ వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది.

మీరు గనుక లెదర్ బ్యాక్, ఐపీ54 ప్రొటెక్షన్, స్మూథ్ డిస్ప్లే, అప్-టు-డేట్ సాఫ్ట్‌వేర్, సుపీరియర్ పెర్ఫామెన్స్ కోరుకుంటే, Infinix Hot 50 బెటర్. అయితే, మీరు కలర్ షిఫ్టింగ్ డిజైన్, బెటర్ కెమెరా సెటప్, ఎక్కువ ర్యామ్, తక్కువ ధర వంటివి కావాలంటే అప్పుడు itel Color Pro మీకు బెటర్ ఆప్షన్.

 

The post Infinix Hot 50 vs itel Color Pro: ఏది బెటర్ బడ్జెట్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50-vs-itel-color-pro-comparison-which-is-better-budget-phone/feed/ 0
Realme 13+ vs Motorola Edge 50 Fusion: రెండింట్లో ఏది బెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్? https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-comparison-which-is-the-best-mid-range-phone/ https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-comparison-which-is-the-best-mid-range-phone/#respond Tue, 03 Sep 2024 18:04:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13327 Realme 13+ ఫోన్ భారత్ లో రూ.22,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే ఈ ధర శ్రేణిలో రియల్మీ 13 ప్లస్‌కి మరొక ఆప్షన్‌గా Motorola Edge 50 Fusion కూడా రేసులో ఉంది. మరి, ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్? ఈ విషయాన్ని తేల్చేందుకు మనం Realme 13 Plus మరియు Motorola Edge 50 Fusion ఫోన్లను అన్ని విభాగాల్లో పోల్చి చూద్దాం. Realme 13+ vs Motorola Edge 50 Fusion: […]

The post Realme 13+ vs Motorola Edge 50 Fusion: రెండింట్లో ఏది బెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>

Realme 13+ ఫోన్ భారత్ లో రూ.22,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే ఈ ధర శ్రేణిలో రియల్మీ 13 ప్లస్‌కి మరొక ఆప్షన్‌గా Motorola Edge 50 Fusion కూడా రేసులో ఉంది. మరి, ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్? ఈ విషయాన్ని తేల్చేందుకు మనం Realme 13 Plus మరియు Motorola Edge 50 Fusion ఫోన్లను అన్ని విభాగాల్లో పోల్చి చూద్దాం.

Realme 13+ vs Motorola Edge 50 Fusion: స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ రియల్మీ 13 ప్లస్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
డిస్ప్లే 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 395 పీపీఐ, 1080*2400 రెజుల్యూషన్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ పీఓఎల్ఈడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 393 పీపీఐ, 1080*2400 రెజుల్యూషన్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
చుట్టుకొలత 161.7 x 74.7 x 7.6 మి.మీ 161.9 x 73.1 x 7.9 మి.మీ
బరువు 185 గ్రాములు 174.9 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 ఆండ్రాయిడ్ 14 ఓఎస్
రియర్ కెమెరా 50ఎంపి ఓఐఎస్, 2ఎంపి డెప్త్ 50ఎంపి ఓఐఎస్, 13ఎంపి అల్ట్రావైడ్
సెల్ఫీ కెమెరా 16ఎంపి కెమెరా 32ఎంపి కెమెరా
వీడియో 4కే/30ఎఫ్‌పీఎస్ 4కే/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
బ్యాటరీ, చార్జింగ్ 5500 ఎంఏహెచ్, 80 వాట్ చార్జింగ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ చార్జింగ్
స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ
కలర్స్ విక్టరీ గోల్డ్, స్పీడ్ గ్రీన్, డార్క్ పర్పుల్ మార్ష్‌మాలో బ్లూ, ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్

 

Realme 13+ vs Motorola Edge 50 Fusion: ధర

రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ధర రూ.22,999 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ధర రూ.22,999
8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర రూ.24,999 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర రూ.24,999
12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర రూ.26,999

Realme 13 Plus vs Motorola Edge 50 Fusion: డిజైన్

రియల్మీ 13+ డ్యూయల్-టోన్ ఫినిష్, టెక్షర్డ్ ప్యాటర్న్ తో వచ్చింది. డార్క్ పర్పుల్, విక్టరీ గోల్డ్, స్పీడ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ65 రేటింగ్ కలిగి ఉంది.

మరోవైపు, Motorola Edge 50 Fusion వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చింది. మార్ష్‌మాలో బ్లూ మరియు హాట్ పింక్, ఫారెస్ట్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. ఫారెస్ట్ బ్లూ వేరియంట్ మ్యాట్ ఫినిష్ తో వచ్చింది. ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్‌ తో వచ్చింది.

Realme 13+ vs Motorola Edge 50 Fusion: డిస్ప్లే

రియల్మీ 13 ప్లస్ లో అమోలెడ్ ప్యానెల్ అందించారు. మరోవైపు, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో పీఓఎల్ఈడీ స్క్రీన్ ఉంది. ఇక్కడ రియల్మీ 13 ప్లస్‌ది కాస్త పైచేయిగా ఉంది. అయితే, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో కర్వ్డ్ ప్యానెల్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. రియల్మీ 13 ప్లస్ లో ఫ్లాట్ డిస్ప్లే ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. రియల్మీ 13 ప్లస్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందించారు.

Realme 13+ vs Motorola Edge 50 Fusion: పెర్ఫామెన్స్

రియల్మీ 13 ప్లస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ తో వచ్చింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ అందించారు. రెండింట్లో, డైమెన్సిటీ 7300 ఎంతో శక్తివంతమైంది. ఇప్పుడు బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.

ప్లాట్ఫామ్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
అంటుటు 7,39,074 6,20,648
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,050 పాయింట్లు 1,020 పాయింట్లు
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,957 పాయింట్లు 2,945 పాయింట్లు

 

అంటుటు టెస్టులో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కేవలం 6,20,648 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, రియల్మీ 13 ప్లస్ 7,39,074 పాయింట్లు స్కోర్ చేసింది. గీక్‌బెంచ్ లో ఎడ్జ్ 50 ఫ్యూజన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2945 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, రియల్మీ 13+ సింగిల్-కోర్ టెస్ట్ లో 1,050 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2,957 పాయింట్లు స్కోర్ చేసింది.

Realme 13+ vs Motorola Edge 50 Fusion: కెమెరాలు

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్మీ 13 ప్లస్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియర్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, రెండు ఫోన్లలో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంది. అయితే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. రియల్మీ 13 ప్లస్ లో 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్ ఉంది. చూస్తుంటే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 50ఎంపి+13ఎంపి కెమెరా యూనిట్ తో కాస్త బలంగా కనిపిస్తోంది.

Realme 13+ vs Motorola Edge 50 Fusion: బ్యాటరీ, చార్జింగ్

రియల్మీ 13+ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13 ప్లస్, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కంటే ఎక్కువసేపు పని చేసింది.

రియల్మీ 13 ప్లస్ 10 గంటల 37 నిమిషాల పాటు పని చేసింది. మరోవైపు, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ 9 గంటల 53 నిమిషాల పాటు పని చేసింది.

80 వాట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు రియల్మీ 13 ప్లస్ కి 31 నిమిషాల సమయం పట్టింది.

68 వాట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి 54 నిమిషాల సమయం పట్టింది. చార్జ్ బూస్ట్ ఫీచర్ తో 36 నిమిషాలు పట్టింది.

రియల్మీ 13 ప్లస్ లో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు ప్లే చేయగా, 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 5 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.

Realme 13+ vs Motorola Edge 50 Fusion: సాఫ్ట్‌వేర్

రియల్మీ 13 ప్లస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్టాక్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 ప్లస్ రెండు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కి 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మోటో ఏఐ ఫీచర్లతో వచ్చింది. ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఇంజిన్, వీడియో స్టెబిలైజేషన్, ఏఐ వాల్‌పేపర్స్ ఈ ఫోన్ లో లభిస్తాయి. రియల్మీ 13 ప్లస్ లో కూడా ఏఐ ఫీచర్లను అందించారు.

ఏది బెటర్?

రెండు ఫోన్లలో కూడా ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. మీకు గనుక, కర్వ్డ్ ప్రొటెక్టెడ్ డిస్ప్లే, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, బెటర్ కెమెరా సెటప్ కావాలనుకుంటే Motorola Edge 50 Fusion ను ఎంచుకోండి. అయితే, బెటర్ డిస్ప్లే ప్యానెల్, మంచి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ కావాలనుకుంటే Realme 13+ ను ఎంచుకోండి.

The post Realme 13+ vs Motorola Edge 50 Fusion: రెండింట్లో ఏది బెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-comparison-which-is-the-best-mid-range-phone/feed/ 0
Vivo T3 Pro vs iQOO Z9s Pro: రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్? https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-iqoo-z9s-pro-comparison-which-is-better-option/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-iqoo-z9s-pro-comparison-which-is-better-option/#respond Fri, 30 Aug 2024 17:31:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=13266 గతేడాది లాంచైన వివో టీ2 ప్రో కి సక్సెసర్ గా Vivo T3 Pro భారత్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. మరోవైపు, దీనికి పోటీగా iQOO Z9s Pro రంగంలోకి దిగింది. ఈ ఆర్టికల్ లో మేం Vivo T3 Pro ని iQOO Z9s Pro తో ప్రతీ విభాగంలో పోల్చి చూసి, ఒకవేళ మీ బడ్జెట్ రూ.25,000 లోపు అయితే, రెండింట్లో ఏది మీకు బెటర్ […]

The post Vivo T3 Pro vs iQOO Z9s Pro: రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్? first appeared on 91Mobiles Telugu.

]]>

గతేడాది లాంచైన వివో టీ2 ప్రో కి సక్సెసర్ గా Vivo T3 Pro భారత్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. మరోవైపు, దీనికి పోటీగా iQOO Z9s Pro రంగంలోకి దిగింది. ఈ ఆర్టికల్ లో మేం Vivo T3 Pro ని iQOO Z9s Pro తో ప్రతీ విభాగంలో పోల్చి చూసి, ఒకవేళ మీ బడ్జెట్ రూ.25,000 లోపు అయితే, రెండింట్లో ఏది మీకు బెటర్ అనే విషయం తెలియజేస్తాం. కాబట్టి, మీరు ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదివి అన్ని వివరాలను తెలుసుకోండి.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ వివో టీ3 ప్రో ఐకూ జెడ్9ఎస్ ప్రో
డిస్ప్లే 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 388పీపీఐ, 1080×2392 రెజుల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, షాట్ జెన్సేషన్ 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 388 పీపీఐ, 1080×2392 రెజుల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, షాట్ జెన్సేషన్
చుట్టుకొలత 163.7 x 75 x 7.9 మిల్లీమీటర్లు 163.7 x 75 x 7.9 మిల్లీమీటర్లు
బరువు 184/190 గ్రాములు 184/190 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ 14 ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ 14
రియర్ కెమెరా 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్
ఫ్రంట్ కెమెరా 16ఎంపి కెమెరా 16ఎంపి కెమెరా
వీడియో 4కే/30ఎఫ్‌పీఎస్ 4కే/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
బ్యాటరీ, చార్జింగ్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్
స్టోరేజీ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ
కలర్స్ శాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ ఫ్లాంబాయంట్ ఆరెంజ్, లక్స్ మార్బుల్

 

Vivo T3 Pro vs iQOO Z9s Pro: భారత్‌లో ధర

వివో టీ3 ప్రో ఐకూ జెడ్9ఎస్ ప్రో
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999
12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999

 

Vivo T3 Pro vs iQOO Z9s Pro: డిజైన్

వివో టీ3 ప్రో మరియు ఐకూ జెడ్9ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్లు ఐడెంటికల్ డిజైన్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా కర్వ్డ్ బాడీ, మెటల్ ఫ్రేమ్ తో వచ్చాయి. రియర్ ప్యానెల్ పై స్క్వేర్ కెమెరా ఐల్యాండ్ ఉంటుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో కర్వ్డ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

వివో టీ3 ప్రో మరియు ఐకూ జెడ్9ఎస్ ప్రో ఫోన్ల యొక్క బ్యాక్ ప్యానెల్ వీగన్ లెదర్ తో తయారైంది. ఆరెంజ్ కలర్ లో గోల్డ్ ఫ్రేమ్ తో వచ్చింది.

ఐకూ జెడ్9ఎస్ ప్రో డివైజ్ ఫ్లాంబాయంట్ ఆరెంజ్, లక్స్ మార్బుల్ కలర్స్ లో లభిస్తుంది. మరోవైపు, వివో టీ3 ప్రో శాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: డిస్ప్లే

వివో టీ3 ప్రో మరియు ఐకూ జెడ్ 9ఎస్ ప్రో ఫోన్లు దాదాపుగా ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, షాట్ జెన్సేషన్ గ్లాస్ ఉన్నాయి.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: పెర్ఫామెన్స్

ఈ రెండు ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. అయితే ఇక్కడ వివో టీ3 ప్రో పై ఐకూ జెడ్9ఎస్ ప్రో కి ఉన్న ఒక అడ్వాంటేజీ ఉంది. అదే ర్యామ్ కెపాసిటీ. ఐకూ జెడ్9ఎస్ ప్రో డివైజ్ 12జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో వచ్చింది. కానీ, వివో టీ3 ప్రో మాత్రం 8జిబి ర్యామ్ ఆప్షన్ ని ఆఫర్ చేస్తుంది.

మేం జరిపిన టెస్టింగ్ లో, ఏయే ఫోన్లు ఎంత స్కోర్ చేశాయో క్రింద అందించాం. ఓసారి చూడండి.

టెస్ట్ పేరు వివో టీ3 ప్రో ఐకూ జెడ్9ఎస్ ప్రో
అంటుటు 8,12,119 8,03,223
గీక్‌బెంచ్ సింగిల్-కోర్ 1,147 1,131
గీక్‌బెంచ్ మల్టీ-కోర్ 3,117 3,074

Vivo T3 Pro vs iQOO Z9s Pro: కెమెరాలు

కెమెరా విభాగంలో, రెండు ఫోన్లు కూడా ఒకే విధమైన కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్లలో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ వాడారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్లలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రెండు ఫోన్లలో ఏ ఫోన్‌ని మీరు ఎంచుకున్నా సరే, మీకు ఒకే విధమైన ఫోటోగ్రఫీ ఫలితాలు వస్తాయి.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: బ్యాటరీ, చార్జింగ్

ఈ రెండు ఫోన్లలో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. కానీ, మా టెస్టింగ్ లో పెర్ఫామెన్స్ విషయంలో చాలా తేడా ఉంది. ఆ వివరాలు చూద్దాం.

వివో టీ3 ప్రో మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 15 గంటల, 52 నిమిషాల వరకు పని చేసింది. మరోవైపు, ఐకూ జెడ్9ఎస్ ప్రో డివైజ్ 14 గంటల, 22 నిమిషాల వరకు పని చేసింది.

చార్జింగ్ విషయానికి వస్తే, వివో టీ3 ప్రో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాల సమయం తీసుకుంది. మరోవైపు, ఐకూ జెడ్9ఎస్ ప్రో కి 39 నిమిషాల సమయం పట్టింది.

వివో టీ3 ప్రో లో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియో చూస్తే, 2 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. మరోవైపు, ఐకూ జెడ్9ఎస్ లో 3 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: సాఫ్ట్‌వేర్

రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. ఈ రెండు ఫోన్లకు రెండేళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. అంటే ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 వరకు అప్డేట్స్ పొందుతాయి.

రెండు ఫోన్లు 45 ప్రీ-ఇన్‌స్టాల్డ్ థర్డ్-పార్టీ యాప్స్ తో వస్తున్నాయి. మీరు గనుక వీటిని వద్దనుకుంటే, రిమూవ్ చేసుకోవచ్చు. ఇకపోతే, వివో టీ3 ప్రో మరియు ఐకూ జెడ్9ఎస్ ప్రో ఫోన్లు ఏఐ ఫీచర్స్ తో వచ్చాయి. ఇందులో భాగంగా, ఏఐ ఫోటో ఎన్హాన్స్, ఏఐ ఎరేజ్ ఫీచర్లను అందించారు.

ఏది బెటర్?

Vivo T3 Pro, iQOO Z9s Pro ఫోన్లను పోల్చి చూశాక, రెండు ఫోన్లు కూడా ప్రతీ విభాగంలో ఒకే విధమైన పెర్ఫామెన్స్ చూపించాయి. అయితే, రెండు ఫోన్లలో కొన్ని ముఖ్యమూన తేడాలు ఉన్నాయి.

వివో టీ3 ప్రో యొక్క బ్యాటరీ మరియు పెర్ఫామెన్స్ యొక్క బెంచ్‌మార్క్ రిజల్ట్స్, ఐకూ జెడ్9ఎస్ ప్రో కంటే బాగున్నాయి. మరోవైపు, ఐకూ జెడ్9ఎస్ ప్రో ఎక్కువ ర్యామ్ ఆప్షన్స్ ఆఫర్ చేస్తోంది. వివో టీ3 ప్రో కంటే తక్కువ సమయంలో ఐకూ జెడ్9ఎస్ ప్రో బ్యాటరీ చార్జ్ అవుతుంది.

మీకు గనుక పెర్ఫామెన్స్, బ్యాటరీ లైఫ్ ముఖ్యమైతే వివో టీ3 ప్రో ఎంచుకోండి. కానీ, ఎక్కువ ర్యామ్ మరియు త్వరగా ఫోన్ చార్జ్ అవ్వాలంటే ఐకూ జెడ్9ఎస్ ప్రో ఎంపిక చేసుకోండి.

The post Vivo T3 Pro vs iQOO Z9s Pro: రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-iqoo-z9s-pro-comparison-which-is-better-option/feed/ 0
OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/#respond Wed, 21 Aug 2024 18:27:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13104 రూ.20,000 లోపు ఫోన్ల మార్కెట్ లో పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో OnePlus Nord CE4 Lite, Realme P1 స్మార్ట్‌ఫోన్లు ముందు వరుసలో ఉంటాయి. మరి ఈ రెండింట్లో ఏ ఫోన్ ఫాస్ట్ గా పెర్ఫామ్ చేస్తుందనే విషయం తెలుసుకునేందుకు పెర్ఫామెన్స్ కంపేరిజన్ ను నిర్వహించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. డివైజెస్ యొక్క ప్రస్తుత ధరలు OnePlus Nord CE4 Lite: 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. […]

The post OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

రూ.20,000 లోపు ఫోన్ల మార్కెట్ లో పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో OnePlus Nord CE4 Lite, Realme P1 స్మార్ట్‌ఫోన్లు ముందు వరుసలో ఉంటాయి. మరి ఈ రెండింట్లో ఏ ఫోన్ ఫాస్ట్ గా పెర్ఫామ్ చేస్తుందనే విషయం తెలుసుకునేందుకు పెర్ఫామెన్స్ కంపేరిజన్ ను నిర్వహించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

డివైజెస్ యొక్క ప్రస్తుత ధరలు

OnePlus Nord CE4 Lite: 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
8జిబి+256జిబి మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

Realme P1: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,499 గా ఉంది.

గీక్‌బెంచ్

బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌పై వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ సింగిల్-కోర్ టెస్ట్ లో 914 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2056 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, రియల్మీ పీ1, సింగిల్-కోర్ టెస్ట్ లో 959 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2390 పాయింట్లు స్కోర్ చేసింది.

బెంచ్‌మార్క్ స్కోర్స్ ప్రకారం, సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ టాస్కుల్లో రియల్మీ పీ1 పనితనం బాగుంటుందని తెలుస్తోంది. వెబ్‌ బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్ అనే విషయాలు సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ పై ఆధారపడి ఉంటాయి. ఇక, ఫోటో, వీడియో ఎడిటింగ్ మరియు 3డీ గేమింగ్ అనేవి మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ పై ఆధారపడి ఉంటాయి.

విజేత: Realme P1

అంటుటు

గీక్‌బెంచ్ టెస్ట్ తో పోల్చితే అంటుటు టెస్ట్ అనేది మరింత లోతైనది. ఈ టెస్టు, ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క ఓవరాల్ పెర్ఫామెన్స్‌ను అంచనా వేస్తుంది. సీపీయూ పెర్ఫామెన్స్, జీపీయూ పెర్ఫామెన్స్, మెమొరీ పెర్ఫామెన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విభాగాలు ఈ టెస్టులో కవర్ అవుతాయి. OnePlus Nord CE4 Lite 4,75,981 పాయింట్లు నమోదు చేసింది. Realme P1 డివైజ్ 6,02,920 స్కోరు నమోదు చేసింది.

ఈ టెస్టులో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ కంటే రియల్మీ పీ1 మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

సీఈ4 లైట్ సీపీయూ స్కోర్ 154830 గా ఉంది. రియల్మీ పీ1 సీపీయూ స్కోర్ 181016 గా ఉంది.

సీఈ4 లైట్ జీపీయూ స్కోర్ 85405 గా ఉంది. రియల్మీ పీ1 జీపీయూ స్కోర్ 112468 గా ఉంది.

సీఈ4 లైట్ మెమొరీ స్కోర్ 115196 గా ఉంది. రియల్మీ పీ1 మెమొరీ స్కోర్ 149719 గా ఉంది.

సీఈ4 లైట్ యొక్క యూజర్ ఎక్స్‌పీరియన్స్ స్కోర్ 112590 గా ఉంది. రియల్మీ పీ1 స్కోర్ 159699 గా ఉంది.

ఈ స్కోర్లను గమనిస్తే, Realme P1 స్పష్టమైన ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది.

విజేత: Realme P1

సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్

ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క స్టెబిలిటీని అంచనా వేసేదే ఈ సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్. ఈ టెస్ట్ కోసం మేం Burnout బెంచ్‌మార్క్ యాప్ వినియోగించాం. ఇది స్మార్ట్‌ఫోన్‌ని థర్మల్ థ్రాట్లింగ్ కి గురిచేసి, పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ రాబడుతుంది. OnePlus Nord CE4 Lite 55.4 శాతం ఔట్‌పుట్‌తో స్టేబుల్‌గా లేదని తెలిసింది. మరోవైపు, Realme P1 76.7 శాతం ఔట్‌పుట్‌తో స్టెబిలిటీ విషయంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్‌ కంటే మెరుగ్గా ఉంది.

మీరు గనుక రెగ్యులర్ గా ఇంటెన్సివ్ టాస్కులను చేసే వారైతే, మీకు రెండు ఫోన్లలో Realme P1 బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

విజేత: Realme P1

గేమింగ్ టెస్ట్

గేమింగ్ టెస్ట్ లో భాగంగా రెండు ఫోన్లలో, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ మరియు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్‌ని ఆడటం జరిగింది. మీడియమ్ సెట్టింగ్స్ తో రెండు ఫోన్లు కూడా గేమ్స్‌ను బాగానే రన్ చేస్తున్నాయి. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీలో 50ఎఫ్‌పీఎస్ వద్ద, బీజీఎంఐ లో 30ఎఫ్‌పీఎస్ వద్ద ఫ్రేమ్ రేట్స్ స్టడీగా ఉన్నాయి.

రియల్మీ పీ1 లో శక్తివంతమైన చిప్సెట్ ఉండటం వల్లన, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ తో పోల్చితే, బీజీఎంఐని హయ్యర్ రెజుల్యూషన్ పై రన్ చేయగలదు. అలాగే కాస్త బెటర్ ఫ్రేమ్ రేట్స్ ను కూడా అందించగలదు.

గేమింగ్ పెర్ఫామెన్స్ తో పాటు, ఈ ఫోన్లు గేమ్ ఆడేటప్పుడు, హీట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాయనే విషయాన్ని కూడా మేం టెస్ట్ చేశాం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ యొక్క టెంపరేచర్ 6.9 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. మరోవైపు రియల్మీ పీ1 యొక్క టెంపరేచర్ 5.2 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. రియల్మీ పీ1 హీట్‌ని బాగా మేనేజ్ చేసింది. దీని ద్వారా ఫోన్ యొక్క జీవితకాలం పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

విజేత: Realme P1

ఏది బెటర్?

పెర్ఫామెన్స్ కంపారిజన్ లో Realme P1 స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE4 Lite కంటే బాగా పెర్ఫామ్ చేసింది. మేం జరిపిన ప్రతీ టెస్టులో రియల్మీ పీ1, తన ప్రత్యర్థి అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ పై పైచేయి సాధించింది. రూ.20,000 లోపు మీకు బెటర్‌గా పెర్ఫామ్ చేసే ఫోన్ కావాలంటే, రెండింట్లో Realme P1 మీకు సరైన ఆప్షన్ గా నిలుస్తుంది.

స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఉజ్వల్ శర్మ

The post OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/feed/ 0
Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/#respond Mon, 12 Aug 2024 18:20:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=12962 నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో POCO బ్రాండ్ నుంచి M6 Plus అనే ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ని మరియు పోకో ఎమ్6 ప్లస్ ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ […]

The post Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? first appeared on 91Mobiles Telugu.

]]>

నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో POCO బ్రాండ్ నుంచి M6 Plus అనే ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ని మరియు పోకో ఎమ్6 ప్లస్ ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ ఆర్టికల్ లో మేం అందిస్తోన్న రెండు ఫోన్ల యొక్క టెస్టింగ్ సమాచారం తెలుసుకొని, ఏది ఉత్తమమైనదో ఒక నిర్దారణకు రండి.

Infinix Note 40X vs POCO M6 Plus స్పెసిఫికేషన్స్

Infinix Note 40X

డిస్ప్లే: 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్.

డైమెన్షన్స్: 168.9 మి.మీ పొడవు, 76.4 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం.

బరువు: 201 గ్రాముల బరువు

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్

రియర్ కెమెరా: 108ఎంపి ప్రైమరీ, 2ఎంపి మ్యాక్రో, ఏఐ లెన్స్

సెల్ఫీ కెమెరా: 8ఎంపి ఫ్రంట్ కెమెరా

వీడియో: 1080పీ 60ఎఫ్‌పీఎస్

చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300

బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్

స్టోరేజీ: 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ

కలర్స్: లైమ్ గ్రీన్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్

POCO M6 Plus

డిస్ప్లే: 6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్

డైమెన్షన్స్: 168.6 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం

బరువు: 205 గ్రాములు

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్

రియర్ కెమెరా: 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా

సెల్ఫీ కెమెరా: 13ఎంపి ఫ్రంట్ కెమెరా

వీడియో: 1080పీ 30ఎఫ్‌పీఎస్

చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్

బ్యాటరీ, చార్జింగ్: 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్

స్టోరేజీ: 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ

కలర్స్: మిస్టీ ల్యావెండర్, ఐస్ సిల్వర్, గ్రాఫైట్ బ్లాక్

Infinix Note 40X vs POCO M6 Plus: భారత్‌లో ధర

Infinix Note 40X 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999

Infinix Note 40X 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999

POCO M6 Plus 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,499

POCO M6 Plus 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,499

Infinix Note 40X vs POCO M6 Plus: డిజైన్

Infinix Note 40X ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమ వైపున బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో, స్క్వేర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది. POCO M6 Plus లో గ్లాస్ బాడీ, డ్యూయల్-టోన్ ఫినిష్ తో వచ్చింది. పర్పుల్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: డిస్ప్లే

ఈ రెండు ఫోన్లలో ఫుల్‌హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అయితే పోకో ఎమ్6 ప్లస్ లో కాస్త పెద్ద డిస్ప్లే మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

డిస్ప్లే సైజ్ పక్కనబెడితే, పోకో ఎమ్6 ప్లస్ లో ఇచ్చిన గొరిల్లా గ్లాస్ లేయర్ స్క్రీన్‌ను స్క్రాచెస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది తప్పా రెండు ఫోన్లలో ఒకే విధమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: పెర్ఫామెన్స్

POCO M6 Plus స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్ వాడారు. మరోవైపు Infinix Note 40X లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ వాడారు. ఇక్కడ ఎమ్6 ప్లస్ లో మెరుగైన చిప్సెట్ ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ను ఇంకా మేం టెస్ట్ చేయలేదు. అయితే డైమెన్సిటీ 6300 చిప్ కలిగిన రియల్మీ నార్జో ఎన్65 ను టెస్ట్ చేశాం. మా టెస్టింగ్ సందర్భంగా, ఈ చిప్సెట్ 4,20,659 అంటుటు స్కోర్ చేసింది. అలాగే గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 748 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1941 పాయింట్లు స్కోర్ చేసింది.

మరోవైపు, POCO M6 Plus అంటుటు పై 4,33,376 పాయింట్లు స్కోర్ చేసింది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 960 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2205 పాయింట్లు నమోదు చేసింది. అయితే Infinix Note 40X విభిన్న ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇది మల్టీ-టాస్కింగ్ విషయంలో ఉపయోగపడుతుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: కెమెరాలు

POCO M6 Plus లో Infinix Note 40X కంటే మెరుగైన సెల్ఫీ కెమెరా ఉంది. పోకో ఎమ్6 ప్లస్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రెండు ఫోన్లలోను 108ఎంపి మెయిన్ కెమెరాను అందించారు.

Infinix Note 40X vs POCO M6 Plus: బ్యాటరీ మరియు చార్జింగ్

ఈ రెండు ఫోన్లలోని బ్యాటరీ కెపాసిటీల విషయానికి వస్తే, మరీ పెద్దగా మార్పు లేదు. Note 40X లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. M6 Plus లో 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఎమ్6 ప్లస్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. అదే, నోట్ 40ఎక్స్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో, POCO M6 Plus 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు దాదాపు గంట సమయం పట్టింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ లో 18 వాట్ చార్జింగ్ కాబట్టి, ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు.

Infinix Note 40X vs POCO M6 Plus: సాఫ్ట్‌వేర్

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. నోట్ 40ఎక్స్ ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఎమ్6 ప్లస్ హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఓఎస్ అప్డేట్స్ విషయంలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ పై కంపెనీ ఏ ప్రకటన చేయలేదు. మరోవైపు పోకో మాత్రం, తన ఎమ్6 ప్లస్ కు 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని తెలిపింది.

ఏది బెటర్?

కంపారిజన్ ను ఆధారంగా చేసుకుంటే, రూ.15,000 లోపు బడ్జెట్‌లో POCO M6 Plus బెటర్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్ అని చెప్పవచ్చు. అలాగే ఈ ఫోన్ లో నోట్ 40ఎక్స్ 5జీతో పోల్చితే.. మంచి ప్రాసెసర్, బెస్ట్ సెల్ఫీ కెమెరా, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, భద్రతతో కూడిన డిస్ప్లే ఉన్నాయి.

అయితే, Infinix Note 40X కూడా తక్కువేం కాదు. ధరను బట్టి, ఈ ఫోన్ కూడా మంచి హార్డ్‌వేర్ ను ఆఫర్ చేస్తోంది. ఇక మీరు, Poco M6 Plus కి బదులుగా Infinix Note 40X ను తీసుకున్నా ఏం డిస్సపాయింట్ అవ్వరు.

The post Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/feed/ 0