India Launch - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 10 Oct 2024 14:37:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/#respond Thu, 10 Oct 2024 14:37:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=14042 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y300 Plus 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. రూ.23,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Vivo Y300 Plus […]

The post Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo Y300 Plus విడుదల
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • నేటి నుంచి సేల్ ప్రారంభం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y300 Plus 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. రూ.23,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo Y300 Plus ధర, సేల్ వివరాలు

Vivo Y300 Plus స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.23,999 గా నిర్ణయించారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. రిటైల్ స్టోర్స్ మరియు సాధారణ మొబైల్ షాప్స్ లో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Vivo Y300 Plus 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y300 Plus 5G లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y300 Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y300 Plus 5G స్మార్ట్‌ఫోన్ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y300 Plus 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y300 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y300 Plus 5G లో భద్రత కోసం ఐపీ54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు. ఇది తేలికపాటి నీటి జల్లులు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ అందిస్తుంది.

The post Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/feed/ 0
Tecno Spark 30C 5G: 48MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-launched-india-48mp-camera-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-launched-india-48mp-camera-5000mah-battery/#respond Tue, 08 Oct 2024 11:11:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=13983 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్‌లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Tecno Spark 30C 5G: 48MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Tecno Spark 30C 5G విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్
  • 8జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్‌లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Spark 30C 5G ధర, సేల్ వివరాలు

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. టెక్నో వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ లో కూడా ఫోన్ కొనవచ్చు.

Tecno Spark 30C 5G డిజైన్, కలర్స్

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్‌లో పంచ్ హోల్ నాచ్ కటౌట్ ఉంది. స్క్రీన్ ఫ్లాట్ గా, కనిపించేంత బెజెల్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ అజూర్ స్కై, మిడ్నైట్ షాడో మరియు అరోరా క్లౌడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అన్ని వేరియంట్స్ డ్యూయల్ టోన్ ఫినిష్ తో ఉంటాయి.

Tecno Spark 30C 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark 30C 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 30C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 30C 5G డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా మెమొరీని గరిష్టంగా 8జిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: Tecno Spark 30C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Spark 30C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Tecno Spark 30C 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Tecno Spark 30C 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, 10 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Spark 30C 5G లో డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Tecno Spark 30C 5G: 48MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-launched-india-48mp-camera-5000mah-battery/feed/ 0
Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/#respond Fri, 04 Oct 2024 09:35:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=13917 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్‌లో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. భారతదేశపు మొదటి డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్‌ ఇదేనంటూ లావా సంస్థ చెబుతోంది. ఈ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్ పై కూడా ఒక స్క్రీన్ ఉంది. రూ.20,000 నుంచి రూ.25,000 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, […]

The post Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Lava Agni 3 5G విడుదల
  • ప్రధానాకర్షణగా డ్యూయల్ డిస్ప్లే
  • ప్రారంభ ధర రూ.20,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్‌లో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. భారతదేశపు మొదటి డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్‌ ఇదేనంటూ లావా సంస్థ చెబుతోంది. ఈ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్ పై కూడా ఒక స్క్రీన్ ఉంది. రూ.20,000 నుంచి రూ.25,000 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం.

Lava Agni 3 5G డిజైన్

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ రెండు డిస్ప్లేలతో రావడం విశేషం. ముందువైపు భారీ అమోలెడ్ స్క్రీన్, బ్యాక్ ప్యానెల్ పై చిన్న అమోలెడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. ఈ బ్యాక్ ప్యానెల్ పై గల స్క్రీన్‌కి కంపెనీ ఇన్‌స్టా స్క్రీన్ అని పేరు పెట్టింది.

Lava Agni 3 5G సెకండరీ స్క్రీన్ ద్వారా మెసేజెస్, నోటిఫికేషన్స్ చెక్ చేయవచ్చు. కెమెరాను కూడా ఈ స్క్రీన్ తో ఆపరేట్ చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క కుడివైపు ఫ్రేమ్ పై యాక్షన్ కీ కూడా ఇచ్చారు.

Lava Agni 3 5G ధర

  • Lava Agni 3 5G డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను తెలుసుకుందాం.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను చార్జర్ లేకుండా రూ.20,999 గా పెట్టారు.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర చార్జర్ లేకుండా రూ.22,999 గా ఉంది.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు.

అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్‌కి వస్తోంది. హీథర్ గ్లాస్ మరియు ప్రిస్టిన్ గ్లాస్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు Lava Agni 3 5G ప్రీ-బుకింగ్స్ కొనసాగుతాయి. ప్రీ-బుకింగ్స్ చేసుకునే వారికి రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.

అగ్ని 1 ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసే వారికి రూ.4,000, అగ్ని 2 ఎక్స్‌చేంజ్ చేసే వారికి రూ.8,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, 2652*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. వైడ్‌వైన్ ఎల్1 సపోర్ట్ కూడా ఉంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ యాప్స్ లో వెబ్‌సిరీస్ లేదా సినిమాలను హెచ్డీలో చూడవచ్చు.

సెకండరీ డిస్ప్లే: Lava Agni 3 5G ఫోన్‌కి బ్యాక్ ప్యానెల్ పై 1.74-ఇంచ్ 2డీ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ 336*480 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఈ డిస్ప్లే ద్వారా బ్యాక్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవచ్చు. ఇంకా కాల్స్, మెసేజెస్, నోటిఫికేషణ్స్, మ్యూజిక్ కంట్రోల్, అలారమ్, టైమర్, స్టాప్ వాచ్, ఫిట్నెస్ ట్రాకర్ వంటి వాటిని యాక్సెస్ చేయవచ్చు.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. భారీ వేపర్ చాంబర్ కూలింగ్ ను ఇందులో అందించారు.

మెమొరీ: Lava Agni 3 5G డివైజ్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Lava Agni 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6ఈ, నావిక్, ఓటీజీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Lava Agni 3 5G ఐపీ64 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

The post Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/feed/ 0
Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/#respond Wed, 25 Sep 2024 08:45:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=13735 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ భారత్ లో విడుదలైంది. ఈ ఫోన్ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 16జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7300 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo […]

The post Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Vivo V40e విడుదల
  • డైమెన్సిటీ 7300 చిప్సెట్
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ భారత్ లో విడుదలైంది. ఈ ఫోన్ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 16జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7300 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40e ధర, లభ్యత

Vivo V40e స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.28,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.30,999 గా పెట్టారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికార వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్‌కి వస్తోంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ పై 10 శాతం డిస్కౌంట్ లేదా 10 శాతం ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు. అంతేకాదు, 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

Vivo V40e డిజైన్

Vivo V40e స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, ఆరా లైట్ ఉన్నాయి. ముందువైపు 3డీ కర్వ్డ్ డిజైన్ ఉంది. ఈ ఫోన్ 0.749 సెంటీమీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ రాయల్ బ్రాంజ్ మరియు మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo V40e స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40e లో 6.77-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ ట్రూ కలర్స్, 2392*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 93.3% స్క్రీన్ టు బాడీ రేషియో, 8,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

చిప్సెట్: Vivo V40e స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40e స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo V40e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ప్రొఫెషనల్ నైట్ పొట్రెయిట్ ఓఐఎస్+ఈఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఐ ఏఎఫ్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo V40e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo V40e స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/feed/ 0
Tecno Pop 9 5G: 48MP Ai కెమెరాతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-launched-india-48mp-ai-camera/ https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-launched-india-48mp-ai-camera/#respond Tue, 24 Sep 2024 09:05:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13709 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా భారతీయ మార్కెట్ లో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Pop 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48ఎంపి ఏఐ మెయిన్ కెమెరా, 8జిబి వరకు ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Tecno Pop 9 5G: 48MP Ai కెమెరాతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Tecno Pop 9 5G విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్
  • 48ఎంపి ఏఐ మెయన్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా భారతీయ మార్కెట్ లో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Pop 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48ఎంపి ఏఐ మెయిన్ కెమెరా, 8జిబి వరకు ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Tecno Pop 9 5G ధర, సేల్ వివరాలు

Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,499 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా పెట్టారు. ఈ ఫోన్ మిడ్నైట్ షాడో, అజూర్ స్కై మరియు అరోరా క్లౌడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు.

Tecno Pop 9 5G డిజైన్

Tecno Pop 9 5G బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. ఫ్రంట్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంది. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు.

Tecno Pop 9 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Pop 9 5G లో 6.67-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Tecno Pop 9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ అందించారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ని ఆఫర్ చేస్తుంది. 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Tecno Pop 9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Pop 9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Tecno Pop 9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Pop 9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 రేటింగ్, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 4 ఏళ్ళు ల్యాగ్-ఫ్రీ పెర్ఫామెన్స్ ను కంపెనీ హామీ ఇస్తోంది.

The post Tecno Pop 9 5G: 48MP Ai కెమెరాతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-launched-india-48mp-ai-camera/feed/ 0
Samsung Galaxy M55s 5G: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎమ్55ఎస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-launched-india-50mp-ois-camera/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-launched-india-50mp-ois-camera/#respond Mon, 23 Sep 2024 09:17:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=13682 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. సూపర్ అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టెక్షర్డ్ ప్యాటర్న్ బ్యాక్ ప్యానెల్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఓసారి గెలాక్సీ ఎమ్55ఎస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం. Samsung Galaxy M55s 5G ధర, లభ్యత […]

The post Samsung Galaxy M55s 5G: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎమ్55ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Samsung Galaxy M55s 5G విడుదల
  • 50ఎంపి రియర్, ఫ్రంట్ కెమెరా
  • సూపర్ అమోలెడ్+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. సూపర్ అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టెక్షర్డ్ ప్యాటర్న్ బ్యాక్ ప్యానెల్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఓసారి గెలాక్సీ ఎమ్55ఎస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం.

Samsung Galaxy M55s 5G ధర, లభ్యత

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.17,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్లను కూడా కలిపితే ఈ ధరకు ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M55s 5G డిజైన్, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M55s 5G డివైజ్ స్టైలిష్ ఫ్యూజన్ డిజైన్, 7.8 మి.మీ మందం, టెక్షర్డ్ బ్యాక్ ప్యానెల్ (ప్లాస్టిక్ మెటీరియల్), ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, ఫాట్ ఫ్రంట్ డిస్ప్లే, పంచ్ హోల్ నాచ్ తో వచ్చింది.

Samsung Galaxy M55s 5G డివైజ్ కోరల్ గ్రీన్ మరియు థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M55s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55s 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్+ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. విజన్ బూస్టర్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

చిప్సెట్: Samsung Galaxy M55s 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ అందించారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్ గా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55s 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M55s 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55s 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M55s 5G: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎమ్55ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-launched-india-50mp-ois-camera/feed/ 0
Honor 200 Lite 5G భారత్‌లో విడుదల.. అమోలెడ్ డిస్ప్లే, డైమెన్సిటీ 6080 చిప్సెట్ https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-launched-india-amoled-display-dimensity-6080-chipset/ https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-launched-india-amoled-display-dimensity-6080-chipset/#respond Thu, 19 Sep 2024 08:53:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=13601 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor నేడు భారతీయ మార్కెట్ లో 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Honor 200 Lite 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ 6.78 మి.మీ అల్ట్రా స్లిమ్ డిజైన్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Honor 200 Lite 5G భారత్‌లో విడుదల.. అమోలెడ్ డిస్ప్లే, డైమెన్సిటీ 6080 చిప్సెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Honor 200 Lite 5G లాంచ్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • ప్రారంభ ధర రూ.17,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor నేడు భారతీయ మార్కెట్ లో 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Honor 200 Lite 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ 6.78 మి.మీ అల్ట్రా స్లిమ్ డిజైన్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor 200 Lite 5G ధర, సేల్ వివరాలు

Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.17,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ రూ.15,999 కే లభించనుంది. సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Honor 200 Lite 5G డిజైన్

Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ స్లిమ్ గా ఉంది. ఈ ఫోన్ బాడీ పాలికార్బొనేట్ ప్లాస్టిక్ తో తయారైంది. ఈ ఫోన్ 6.78 మి.మీ మందం, 166 గ్రాముల బరువు ఉంది. ఈ ఫోన్ స్టారీ బ్లూ, సైయన్ లే్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.

Honor 200 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor 200 Lite 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1200 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్, 93.7% స్క్రీన్ టు బాడీ రేషియో, 3240 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, టీయూవీ సర్టిఫికేషన్ ఉన్నాయి.

చిప్సెట్: Honor 200 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Honor 200 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ ర్యామ్ టర్బో టెక్నాలజీని కూడా కలిగి ఉంది. దీని ద్వారా 16జిబి వరకు ర్యామ్ పవర్ ను పొందవచ్చు.

కెమెరా: Honor 200 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కూడా ఎల్ఈడీ లైట్ ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Honor 200 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఏఐ ఫీచర్లు: Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ లో మ్యాజిక్ పోర్టల్ 14, మ్యాజిక్ లాక్ స్క్రీన్, ఏఐ ఫోటోగ్రఫీ, ఇన్‌స్టంట్ మూవీ, మ్యాజిక్ క్యాప్సూల్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ: Honor 200 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

సెక్యూరిటీ: Honor 200 Lite 5G లో భద్రత కోసం ఐపీ52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ అందించారు.

The post Honor 200 Lite 5G భారత్‌లో విడుదల.. అమోలెడ్ డిస్ప్లే, డైమెన్సిటీ 6080 చిప్సెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-launched-india-amoled-display-dimensity-6080-chipset/feed/ 0
Infinix Zero 40 5G: 50MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన జీరో 40 5జీ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-launched-india-50mp-front-camera/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-launched-india-50mp-front-camera/#respond Wed, 18 Sep 2024 10:59:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13576 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్, 12జిబి ర్యామ్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 108ఎంపి రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Infinix Zero 40 5G: 50MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన జీరో 40 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Infinix Zero 40 5G విడుదల
  • 108ఎంపి మెయిన్ కెమెరా
  • డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్, 12జిబి ర్యామ్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 108ఎంపి రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Infinix Zero 40 5G ధర, లభ్యత

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.27,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.30,999 గా పెట్టారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ లభిస్తుంది.

డిస్కౌంట్ తర్వాత, బేస్ మోడల్ రూ.24,999 కి, టాప్ మోడల్ రూ.27,999 కి లభిస్తుంది.

మూవింట్ టైటానియమ్, రాక్ బ్లాక్ మరియు వయొలెట్ గార్డెన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Zero 40 5G సేల్ ప్రారంభమవుతుంది. రిటైల్ ఔట్‌లెట్స్ లో కూడా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Infinix Zero 40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 40 5G లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Zero 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ అందించారు. ఈ ఫోన్ 24జిబి వరకు డైనమిక్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్‌లో అందించారు.

సాఫ్ట్‌వేర్: Infinix Zero 40 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఇన్ఫినిక్స్ యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Infinix Zero 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 20 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Zero 40 5G లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జెమిని ఏఐ అసిస్టెంట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Infinix Zero 40 5G: 50MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన జీరో 40 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-launched-india-50mp-front-camera/feed/ 0
Samsung Galaxy F05: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన శాంసంగ్ ఫోన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-launched-india-50mp-camera-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-launched-india-50mp-camera-5000mah-battery/#respond Wed, 18 Sep 2024 04:31:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=13560 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy F05 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung […]

The post Samsung Galaxy F05: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన శాంసంగ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Samsung Galaxy F05 విడుదల
  • 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 50ఎంపి కెమెరా, 5000mAh బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy F05 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy F05 ధర, సేల్ వివరాలు

Samsung Galaxy F05 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.7,999 గా నిర్ణయించారు.

ఈ ఫోన్ ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా సెప్టెంబర్ 20 నుంచి ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy F05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్ ఉంది. భారీ డిస్ప్లేను ఇష్టపడే వారికి ఇది బాగా సరిపోతుంది.

ప్రాసెసర్: Samsung Galaxy F05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఇచ్చారు. మల్టీ-టాస్కింగ్, యాప్ నేవిగేషన్ కి ఇది బాగా సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F05 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 8జిబి వరకు ర్యామ్ ను పెంచుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని ఎక్స్‌ప్యాండ్ చేసుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy F05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy F05 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy F05 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. రెండేళ్ళు ఓఎస్ అప్‌గ్రేడ్స్ మరియు 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Samsung Galaxy F05 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy F05 లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.

The post Samsung Galaxy F05: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన శాంసంగ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-launched-india-50mp-camera-5000mah-battery/feed/ 0
HMD Skyline: 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో కొత్త హెచ్ఎండి ఫోన్ విడుదల https://www.91mobiles.com/telugu/hmd-skyline-launched-india-144hz-refresh-rate/ https://www.91mobiles.com/telugu/hmd-skyline-launched-india-144hz-refresh-rate/#respond Tue, 17 Sep 2024 08:03:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=13536 ఫిన్‌ల్యాండ్ కు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ HMD తాజాగా భారతీయ మార్కెట్ లో HMD Skyline అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ కవర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చింది. అలాగే యాప్స్, నేవిగేషన్ మరియు ఏఐ-పవర్డ్ అసిస్టెంట్‌‌ను యాక్సెస్ చేసేందుకు కస్టమ్ బటన్స్‌ను ఈ ఫోన్ లో అందించారు. జులై నెలలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారతీయ వేరియంట్ లో మార్పులేమీ లేవు. ఓసారి ఈ ఫోన్ యొక్క […]

The post HMD Skyline: 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో కొత్త హెచ్ఎండి ఫోన్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో HMD Skyline లాంచ్
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • డివైజ్ ధర రూ.35,999

ఫిన్‌ల్యాండ్ కు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ HMD తాజాగా భారతీయ మార్కెట్ లో HMD Skyline అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ కవర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చింది. అలాగే యాప్స్, నేవిగేషన్ మరియు ఏఐ-పవర్డ్ అసిస్టెంట్‌‌ను యాక్సెస్ చేసేందుకు కస్టమ్ బటన్స్‌ను ఈ ఫోన్ లో అందించారు. జులై నెలలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారతీయ వేరియంట్ లో మార్పులేమీ లేవు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

HMD Skyline ధర మరియు లభ్యత

HMD Skyline స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.35,999 గా నిర్ణయించారు.

సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అమెజాన్.ఇన్, హెచ్ఎండి.కామ్, మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

HMD Skyline డివైజ్ ట్విస్టెడ్ బ్లాక్ మరియు నియన్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, కస్టమర్లకు 33 వాట్ టైప్ సీ ఫాస్ట్ చార్జర్ ని కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

HMD Skyline స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Skyline లో 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Skyline స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు.

మెమొరీ: HMD Skyline 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 512జిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: HMD Skyline లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ ఓఐఎస్, ఈఐఎస్ టెక్నాలజీతో వచ్చింది. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Skyline లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: HMD Skyline డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: HMD Skyline లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Skyline లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, జెన్ 2 రిపేరబులిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post HMD Skyline: 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో కొత్త హెచ్ఎండి ఫోన్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-skyline-launched-india-144hz-refresh-rate/feed/ 0