Motorola Edge 30 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 18 Oct 2022 12:38:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన Motorola Edge 30 Ultra 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ https://www.91mobiles.com/telugu/motorola-edge-30-ultra-12gb-ram-256gb-storage-varient-launched-in-india/ Tue, 18 Oct 2022 12:38:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=2950 హైలైట్స్ భారత్ లో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఒకే ఒక వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ తాజాగా 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ వేరియంట్ లాంచ్ తో 30 అల్ట్రా లైనప్ లో చేరిన మరొక హ్యాండ్సెట్ సెప్టెంబర్ నెలలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటోరోలా తన ఫ్లాగ్షిప్ డివైజ్ Motorola Edge 30 […]

The post భారత్ లో లాంచ్ అయిన Motorola Edge 30 Ultra 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్
  • ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఒకే ఒక వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • తాజాగా 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ వేరియంట్ లాంచ్ తో 30 అల్ట్రా లైనప్ లో చేరిన మరొక హ్యాండ్సెట్

సెప్టెంబర్ నెలలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటోరోలా తన ఫ్లాగ్షిప్ డివైజ్ Motorola Edge 30 Ultra ని భారత్ లో లాంచ్ చేసింది. అప్పుడు కేవలం 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ మాత్రమే మార్కెట్ లోకి వచ్చింది. అయితే 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ఎప్పుడు వస్తుందా అని మోటో లవర్స్ ఎదురు చూశారు. తాజాగా మోటోరోలా కంపెనీ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది.

200ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన భారతదేశపు తొలి ఫోన్ గా Motorola Edge 30 Ultra పరిగణించబడుతోంది. దీంతో పాటు ఈ ఫోన్లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 50ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలీఫోటో లెన్స్, 60ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ప్రధాన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరి లేటెస్ట్ వేరియంట్ ధర, ఆఫర్ల గురించి తెలుసుకుందాం పదండి.

భారత్ లో Motorola Edge 30 Ultra 12GB వేరియంట్ ధర, లభ్యత

Motorola Edge 30 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా నిర్ణయించారు. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్, అంటే రూ.3000 వరకు అన్ని ఆఫర్లు కలుపుకుని ప్రయోజనం పొందవచ్చు.

Motorola Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

Motorola Edge 30 Ultra లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే ని కలిగి ఉంది. హెచ్డీఆర్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. ఇకపోతే ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని కలిగి ఉంది. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Motorola Edge 30 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ తో కూడిన 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీ1 మెయిన్ కెమెరా ఉంది. అలాగే 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో 2x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో ముందు వైపున 60ఎంపి కెమెరా అందించారు. Motorola Edge 30 Ultra 8కే, 4కే హెచ్డీఆర్10+ వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Motorola Edge 30 Ultra లో 4610ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 198.5 గ్రాములు కాగా, మందం 8.39 మిల్లీ మీటర్లు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని కంపెనీ హామీ ఇస్తోంది.

Motorola Edge 30 Ultra లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు. ఇంకా ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ ని అందించారు. ఎన్ఎఫ్‌సీ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచ్ అయిన Motorola Edge 30 Ultra 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఈరోజు అర్థరాత్రి నుంచి Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/moto-edge-30-ultra-edge-30-fusion-first-sale/ Wed, 21 Sep 2022 15:04:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2492 హైలైట్స్: గత వారం భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Ultra, Edge 30 Fusion స్మార్ట్ ఫోన్స్ నేడు అర్థరాత్రి మొదలు కానున్న ఈ ఫోన్ల ఫస్ట్ సేల్ 200ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్న Moto Edge 30 Ultra ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ గత వారం భారత్ లో Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఈ […]

The post ఈరోజు అర్థరాత్రి నుంచి Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గత వారం భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Ultra, Edge 30 Fusion స్మార్ట్ ఫోన్స్
  • నేడు అర్థరాత్రి మొదలు కానున్న ఈ ఫోన్ల ఫస్ట్ సేల్
  • 200ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్న Moto Edge 30 Ultra

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ గత వారం భారత్ లో Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఈ రెండు ఫోన్లు సేల్ కి వస్తున్నాయి. 200ఎంపి కెమెరాతో లాంచ్ అవుతోన్న తొలి ఫోన్ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా కావడం విశేషం. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5, 1250 నిట్స్ బ్రైట్నెస్, 1500హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ 4.0 కస్టమ్ స్కిన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 4610 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ టర్బో పవర్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ చార్జింగ్ Moto Edge 30 Ultra లో ఉన్నాయి.

Moto Edge 30 Ultra యొక్క కెమెరా గురించి మాట్లాడితే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో F/1.95 అపర్చర్ తో కూడిన 200MP Samsung ISOCELL HP1 సెన్సర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12MP టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 60MP OmniVision OV60A ఫ్రంట్ కెమెరా ఉంది. 60ఎంపి కెమెరా వ్లాగింగ్ చేసే వారికి ఎంతో ఉపయోగపడనుంది.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Fusion లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్, అడ్రెనో 660 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

ఇప్పుడు Moto Edge 30 Fusion యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ఫీచర్ కలిగి ఉంది. అలాగే 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. అల్ట్రావైడ్ లెన్స్, మ్యాక్రో ఆప్షన్ ని కలిగి ఉంది. ఇక మూడో కెమెరాగా 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంది. ఇప్పుడు Moto Edge 30 Fusion బ్యాటరీ విభాగం పై ఓ కన్నేద్దాం పదండి. Moto Edge 30 Fusion లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా Moto Edge 30 Fusion లో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

Moto Edge 30 Ultra, Edge 30 Fusion ధరలు

Moto Edge 30 Ultra 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ ని రూ.54,999 కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు Moto Edge 30 Fusion 8జిబి + 128జిబి ధర రూ.42,999 గా ఉంది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ ని రూ.39,999 కే సొంతం చేసుకోవచ్చు.

The post ఈరోజు అర్థరాత్రి నుంచి Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra https://www.91mobiles.com/telugu/moto-edge-30-ultra-launched-india-price-specs-availability/ Tue, 13 Sep 2022 12:10:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=2301 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Ultra ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra భారత్ లో Moto Edge 30 Ultra ధర రూ.59,999 Moto Edge 30 Ultra: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా భారత్ లో రెండు కొత్త 5జీ ఫోన్లను లాంచ్ చేసింది. Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion ఫోన్లను మోటోరోలా భారతీయులకు పరిచయం […]

The post భారత్ లో లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Ultra
  • ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra
  • భారత్ లో Moto Edge 30 Ultra ధర రూ.59,999

Moto Edge 30 Ultra: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా భారత్ లో రెండు కొత్త 5జీ ఫోన్లను లాంచ్ చేసింది. Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion ఫోన్లను మోటోరోలా భారతీయులకు పరిచయం చేసింది. Moto Edge 30 Ultra గురించి మాట్లాడితే, ఇది ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్. ఇందులో శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ1 సెన్సర్ ను వాడారు. అలాగే స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని ఈ ఫోన్లో అమర్చారు.

Moto Edge 30 Ultra ధర, అమ్మకం

Moto Edge 30 Ultra 8జిబి + 128జిబి వర్షన్ ధరను మోటోరోలా కంపెనీ రూ.59,999 గా నిర్ణయించింది. ఇక లాంచ్ ఆఫర్ క్రింద, ఈ ఫోన్ ప్రస్తుతానికి రూ.54,999 కి అమ్మబడుతుంది. ఈ డివైస్ రెండు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్. ఆఫర్ ధర ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కనుక, ఫోన్ నచ్చితే కనుక సేల్ తేదీ రోజున ఆర్డర్ చేసుకుంటే బెటర్.

సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు Moto Edge 30 Ultra సేల్ కి వస్తోంది. ఫోన్ ని ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్ ఔట్‌లెట్స్, రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, రూ.14,699 విలువ గల జియో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇవి రూ.100 విలువ గల 40 రీచార్జ్ వోచర్స్, రూ.10,699 పార్ట్నర్ వోచర్స్ కలుపుకుని వస్తాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫోన్ సేల్ కి వస్తుండటంతో కస్టమర్లు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంది.

Moto Edge 30 Ultra కెమెరా

Moto Edge 30 Ultra యొక్క కెమెరా గురించి మాట్లాడితే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో F/1.95 అపర్చర్ తో కూడిన 200MP Samsung ISOCELL HP1 సెన్సర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12MP టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 60MP OmniVision OV60A ఫ్రంట్ కెమెరా ఉంది. 60ఎంపి కెమెరా వ్లాగింగ్ చేసే వారికి ఎంతో ఉపయోగపడనుంది.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5, 1250 నిట్స్ బ్రైట్నెస్, 1500హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ 4.0 కస్టమ్ స్కిన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 4610 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ టర్బో పవర్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ చార్జింగ్ Moto Edge 30 Ultra లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post భారత్ లో లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 13 న భారత్ లో లాంచ్ అవుతోన్న Moto Edge 30 Ultra https://www.91mobiles.com/telugu/motorola-edge-30-ultra-india-launch-date/ Mon, 12 Sep 2022 08:33:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=2265 హైలైట్స్: ఇటీవలె గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన Moto Edge 30 Ultra, సెప్టెంబర్ 13 న భారత్ లో ఎంట్రీకి రెడీ Moto Edge 30 Ultra ప్రపంచపు తొలి 200ఎంపి మెయిన్ కెమెరా సెన్సర్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి వరకు ర్యామ్, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు సెప్టెంబర్ 13 న భారత మార్కెట్ లో Moto Edge 30 Ultra లాంచ్ […]

The post సెప్టెంబర్ 13 న భారత్ లో లాంచ్ అవుతోన్న Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఇటీవలె గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన Moto Edge 30 Ultra, సెప్టెంబర్ 13 న భారత్ లో ఎంట్రీకి రెడీ
  • Moto Edge 30 Ultra ప్రపంచపు తొలి 200ఎంపి మెయిన్ కెమెరా సెన్సర్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి వరకు ర్యామ్, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

సెప్టెంబర్ 13 న భారత మార్కెట్ లో Moto Edge 30 Ultra లాంచ్ అవుతుందని మోటోరోలా సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ డివైజ్ ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ గా పిలవబడుతోంది. రీసెంట్ గా ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలె చైనాలో లాంచ్ అయిన మోటోరోలా ఎక్స్30 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క రీబ్రాండ్ వర్షన్ గా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా వచ్చింది. లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 125వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

Moto Edge 30 Ultra ఇండియా లాంచ్ తేదీ, ధర

సెప్టెంబర్ 13 న Moto Edge 30 Ultra భారత్ లో లాంచ్ కానుంది. గతవారంలో ఈ ఫ్లాగ్షిప్ భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేశారు. కానీ ఎందుచేతనో లాంచ్ కాలేదు. దీంతో ఇప్పుడు మరో తేదీని కంపెనీ ప్రకటించింది. లాంచ్ కోసం మోటోరోలా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

899.99 యూరోలు (రూ.72,900) తో Moto Edge 30 Ultra గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. అదే ధరతో లేదంటే కాస్త తక్కువ ధరకి భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది. ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్స్ ద్వారా Moto Edge 30 Ultra ని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Ultra లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1250 నిట్స్ బ్రైట్నెస్, డీసీ డిమ్మింగ్, 1500హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, ఫుల్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

Moto Edge 30 Ultra లో 200 ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 60ఎంపి ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. 5జీ, 4జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. Moto Edge 30 Ultra లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ట్రిపుల్ మైక్రోఫోన్ సిస్టమ్, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post సెప్టెంబర్ 13 న భారత్ లో లాంచ్ అవుతోన్న Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra https://www.91mobiles.com/telugu/motorola-edge-30-ultra-launched-globally-price-specs/ Fri, 09 Sep 2022 13:48:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=2234 హైలైట్స్: ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 60ఎంపి సెల్ఫీ కెమెరా, 125వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన Moto Edge 30 Ultra సెప్టెంబర్ 13 న భారత్ లో లాంచ్ కానున్న Moto Edge 30 Ultra ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. దీంతో […]

The post లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 60ఎంపి సెల్ఫీ కెమెరా, 125వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన Moto Edge 30 Ultra
  • సెప్టెంబర్ 13 న భారత్ లో లాంచ్ కానున్న Moto Edge 30 Ultra

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. దీంతో పాటు మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్, మోటో ఎడ్జ్ 30 నియో కూడా లాంచ్ అయ్యాయి. గత నెలలో చైనాలో లాంచ్ అయిన మోటోరోలా ఎక్స్30 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ ఈ Moto Edge 30 Ultra. ఈ ఫోన్ ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్. ఇది శాంసంగ్ తయారు చేసిన 200 ఎంపి లెన్స్. హ్యాండ్సెట్ విషయానికి వస్తే, ఇది పంచ్-హోల్ కటౌట్ తో వస్తోంది. కర్వ్డ్ ఎడ్జెస్, అల్యూమినియమ్ ఫ్రేమ్, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటివి ఇందులో ఉన్నాయి.

సెప్టెంబర్ 13 న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ చేశాడు. అసలైతే, మోటోరోలా ఈ వారంలో భారత్ లో ఓ ఈవెంట్ నిర్వహించాల్సింది. కానీ, ఎందుకో వాయిదా పడింది. మోటోరోలా ఇంకా లాంచ్ తేదీని వెల్లడించాల్సి ఉంది.

 

Moto Edge 30 Ultra ధర

Moto Edge 30 Ultra ధర 899.99 యూరోలు (దాదాపు రూ.72,900) గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: స్టార్‌లైట్ వైట్ మరియు ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Ultra 6.67 అంగుళాల ఫుల్-హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1250 నిట్స్ బ్రైట్నెస్, డీసీ డిమ్మింగ్, 1500 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ 4.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Moto Edge 30 Ultra లో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఫోన్ వెనకాల ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు. ఇక 200ఎంపి ప్రైమరీ శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ1 సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ని కలిగి ఉంది. 50 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 12 ఎంపి టెలీఫోటో 2ఎక్స్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 60ఎంపి కెమెరా ఉంది.

Moto Edge 30 Ultra లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 5జీ, 4జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎల్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ట్రిపుల్ మైక్రోఫోన్ అర్రే, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Moto Edge 30 Ultra https://www.91mobiles.com/telugu/motorola-edge-30-ultra-spotted-on-geekbench-score-details/ Wed, 27 Jul 2022 13:01:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=1295 హైలైట్స్: గీక్ బెంచ్ వెబ్ సైట్ లిస్టింగ్ లో కనిపించిన మోటో ఎడ్జ్ 30 అల్ట్రా (ఎక్స్30 ప్రో) త్వరలో చైనాలో తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తున్న మోటో ఎడ్జ్30 అల్ట్రా మోటోరోలా నుంచి వస్తున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్30 అల్ట్రా లాంచ్ కి ముందు గీక్ […]

The post లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గీక్ బెంచ్ వెబ్ సైట్ లిస్టింగ్ లో కనిపించిన మోటో ఎడ్జ్ 30 అల్ట్రా (ఎక్స్30 ప్రో)
  • త్వరలో చైనాలో తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తున్న మోటో ఎడ్జ్30 అల్ట్రా

మోటోరోలా నుంచి వస్తున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్30 అల్ట్రా లాంచ్ కి ముందు గీక్ బెంచ్ అనే బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ పై కనిపించింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్స్, గీక్ బెంచ్ వెబ్ సైట్ లో కనిపించాయి. ఆగస్టు 2 న మోటో ఎక్స్30 ప్రో అనే పేరుతో చైనాలో ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా అని పిలవబడనుంది.

గీక్ బెంచ్ పై దర్శనమిచ్చిన Moto Edge 30 Ultra

గీక్ బెంచ్ యొక్క బెంచ్ మార్కింగ్ టెస్ట్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ కలిగిన మోటో ఎడ్జ్30 అల్ట్రా చెప్పుకోదగిన స్కోర్ నే నమోదు చేసింది. సింగిల్ స్కోర్ టెస్ట్ లో మోటో ఎడ్జ్30 అల్ట్రా 1,252 పాయింట్లను సాధించగా, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,972 పాయంట్లను సాధించింది.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 200 ఎంపి కెమెరా ప్రధాన ఫీచర్ గా వస్తోంది. దీనికి తోడు 50ఎంపి అల్ట్రావైడ్, 12ఎంపి పొట్రెయిట్ కెమెరాలు ఉంటాయి. ఇక డివైజ్ లో ముందువైపున 60ఎంపి కెమెరా ఉండనున్నట్లు సమాచారం. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇందులో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉండనున్నాయి.

మోటో ఎడ్జ్ 30 అల్ట్రా లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 50 వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

చైనాలో మోటో ఎక్స్ 30 ప్రో గా లాంచ్ అవుతోన్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 2022, ఆగస్టు 2 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తర్వాత ఇదే డివైజ్ ఎడ్జ్ 30 అల్ట్రా అనే పేరుతో గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ ఇటీవలె బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో క్లియరెన్స్ కూడా పొందింది. దీంతో త్వరలోనే భారత్ లో ఫోన్ లాంచ్ కానుందని స్పష్టమైంది.

భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఔత్సాహికులు వేచి చూస్తున్నారు. భారత మార్కెట్ లోకి ఎడ్జ్ 30 అల్ట్రా ప్రవేశించాక, కచ్చితంగా ఇతర ఫ్లాగ్ షిప్స్ కి మాంచి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఫోన్ స్పెసిఫికేషన్స్ బట్టి పేపర్ పై బలంగా కనిపిస్తోంది. కానీ, లాంచ్ తర్వాత యూజర్ పెర్ఫామెన్స్ తో ఫోన్ సక్సెస్ నిర్ణయించబడుతుంది. 60 ఎంపి ఫ్రంట్ కెమెరా వ్లాగింగ్ చేసే వారికి బాగా ఉపయోగపడనుంది. అలాగే, 200ఎంపి కెమెరాతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉండటంతో పెర్ఫామెన్స్ కి తిరుగుండదు. ప్రధానంగా ఈ మూడు ఫీచర్లు ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

The post లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola Edge 30 Ultra: ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ తో తీసిన ఫస్ట్ పిక్ ఇదిగో..!! https://www.91mobiles.com/telugu/motorola-edge-30-ultra-200mp-camera-sample-revealed-before-the-launch/ Thu, 14 Jul 2022 14:49:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=975 హైలైట్స్: నెట్టింట్లో ప్రత్యక్షమైన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కెమెరా శాంపిల్ ఈ నెలలో చైనాలో లాంచ్ కానున్న ఎడ్జ్ 30 అల్ట్రా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 125 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న ఎడ్జ్ 30 అల్ట్రా   లాంచ్ కి ముందు మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కెమెరా శాంపిల్ లీక్ అయ్యింది. దీంతో 200ఎంపి భారీ సెన్సర్ నుంచి మనం ఏం ఆశించవచ్చో తెలిసినట్లైంది. శాంసంగ్ తయారు […]

The post Motorola Edge 30 Ultra: ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ తో తీసిన ఫస్ట్ పిక్ ఇదిగో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కెమెరా శాంపిల్
  • ఈ నెలలో చైనాలో లాంచ్ కానున్న ఎడ్జ్ 30 అల్ట్రా
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 125 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న ఎడ్జ్ 30 అల్ట్రా

 

లాంచ్ కి ముందు మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కెమెరా శాంపిల్ లీక్ అయ్యింది. దీంతో 200ఎంపి భారీ సెన్సర్ నుంచి మనం ఏం ఆశించవచ్చో తెలిసినట్లైంది. శాంసంగ్ తయారు చేసిన 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ1 సెన్సర్ ను వినియోగించనున్నట్లు మోటోరోలా ఇదివరకే కన్ఫర్మ్ చేసింది. తాజాగా మోటోరోలా యొక్క చైనా జనరల్ మేనేజర్ చెన్ జిన్ వీబో ద్వారా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కెమెరా శాంపిల్ ను షేర్ చేశాడు. ఇక ఈ ఫోన్ ఈ నెలలోనే చైనాలో లాంచ్ అవుతోంది. 200ఎంపి కెమెరాతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కావడం విశేషం. దీంతో ఈ ఫోన్ కెమెరాపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ ధర, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Motorola Edge 30 Ultra కెమెరా శాంపిల్

పైన కనిపిస్తున్న ఇమేజ్ సెన్సర్ యొక్క 4-ఇన్-1 పిక్సెల్ ప్రాసెసింగ్ వాడుకుని, 50ఎంపి రెజుల్యూషన్ వద్ద క్యాప్చర్ చేయబడింది. వీబో అనే సామాజిక మాద్యమంలో షేర్ చేయబడినది కావున, ఈ పిక్ కచ్చితంగా కంప్రెస్ కాబడినదని అర్థం చేసుకోవాలి. 108ఎంపి కెమెరాలు సపోర్ట్ చేసే 9-ఇన్-1 పిక్సెల్ ప్రాసెసింగ్ తో పోల్చితే, మోటో 200ఎంపి యొక్క 4-ఇన్-1 పిక్సెల్ ప్రాసెసింగ్ ఎంతో ఉత్తమమైనదని మోటోరోలా కంపెనీ చెబుతోంది. ఇక కెమెరా శాంపిల్ 13ఎంబి సైజుకి మార్చబడినది.

Motorola Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 6.73-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. అలాగే స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను ఈ ఫోన్లో అమర్చారు. ఇప్పుడు బ్యాటరీ విభాగంపై ఓ కన్నేద్దాం పదండి. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ సంగతి చూద్దాం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజీ కలిగి ఉంది.

  • 6.73-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 200ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 60ఎంపి సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • మైయూఎక్స్ ఓఎస్ కస్టమ్ స్కిన్

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా యొక్క కెమెరా విభాగం విశేషాలు ఇక్కడ చూద్దాం. ఈ ఫోన్లో 200ఎంపి ప్రైమరీ కెమెరాను అమర్చారు. అలాగే 50 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ థర్డ్ సెన్సర్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 60ఎంపి కెమెరా ఉంది. VLOGS చేసే వారికి ఈ 60ఎంపి కెమెరా ఎంతో ఉపయోగపడనుంది. ఇకపోతే, ఎడ్జ్ 30 అల్ట్రా ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత, మైయూఎక్స్ కస్టమ్ ఓఎస్ పై పని చేయనుంది.

The post Motorola Edge 30 Ultra: ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ తో తీసిన ఫస్ట్ పిక్ ఇదిగో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra https://www.91mobiles.com/telugu/motorola-edge-30-ultra-to-come-with-144hz-display-and-to-have-200mp-large-sensor/ Tue, 12 Jul 2022 10:07:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=913 హైలైట్స్: * 6.67-ఇంచ్ 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra * 200MP ప్రైమరీ కెమెరా ఉండనుందని అంచనా * 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తున్న ఎడ్జ్ 30 అల్ట్రా త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. తాజాగా 91మొబైల్స్ హిందీ కథనం ఈ ఫోన్ యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, కలర్, మెమొరీ వేరియంట్స్ ని […]

The post 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* 6.67-ఇంచ్ 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra

* 200MP ప్రైమరీ కెమెరా ఉండనుందని అంచనా

* 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తున్న ఎడ్జ్ 30 అల్ట్రా

త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. తాజాగా 91మొబైల్స్ హిందీ కథనం ఈ ఫోన్ యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, కలర్, మెమొరీ వేరియంట్స్ ని కన్ఫర్మ్ చేస్తోంది. లీక్స్ ని బట్టి, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండనున్నట్లు అర్థమవుతోంది. దీంతో మోటోరోలా ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ లో మరింత పటిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Motorola Edge 30 Ultra: ఇప్పటి వరకు రివీల్ అయిన ముఖ్యమైన ఫీచర్లు

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్లు ఇప్పటికి విడుదలయ్యాయి. తాజాగా ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండనున్నట్లు ఓ సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడొస్తున్న ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్స్ లో ఈ డిస్ప్లే రెజుల్యూషన్ తక్కువనే చెప్పాలి. అలాగే ఇప్పటి వరకు మోటోరోలా నుంచి వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్స్ లో కెల్లా ఇదే హయ్యస్ట్ వేరియంట్ అనేది గమనించాలి. దాన్ని బట్టి ఈ ఫోన్ కూడా భారీ డిస్ప్లే ను కలిగి ఉంటే బాగుండేది.

ఇక ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్లను ఓసారి పరిశీలిస్తే, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, వైట్, గ్రే కలర్ ఆప్షన్స్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి.

ఇప్పటికే పలు కథనాలను బట్టి, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా భారీ ప్రధాన కెమెరాతో రానుందని స్పష్టమైంది. ఇది 1/1.22-ఇంచ్ సైజులో ఉంటుందని, శాంసంగ్ ISOCELL HP1 ఇమేజ్ సెన్సర్ అని సమాచారం. ఇక 200MP ఇమేజ్ సెన్సర్ కలిగిన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఈ కెమెరా కలిగిన తొలి స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది.

ఇతర స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం. ఈ ఫోన్లో 50MP సెకండరీ కెమెరా, 12MP థర్డ్ సెన్సర్ ఉంటాయి. ఇక టెలీఫోటో లెన్స్ ఉంటుందో లేదో ఇంకా తెలియదు. ఎడ్జ్ 30 అల్ట్రా యొక్క ప్రధాన కెమెరా లెన్స్ 50ఎంఎం ఉంటుందని, మిగతా రెండు 35ఎంఎం, 85ఎంఎం ఫోకల్ లెంగ్త్ ఉంటాయని పలు కథనాలు చెబుతున్నాయి. ఇవన్నీ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీలో విభిన్నమైన లెన్సెస్ అని చెప్పవచ్చు. కానీ, పోట్రెయిట్ ఫోటోగ్రఫీని టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Motorola Edge 30 Ultra లాంచ్ టైమ్ లైన్

వస్తోన్న ఊహాగానాలను బట్టి, ఈ ఫోన్ ముందు భాగాన 60MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే 144 హెర్ట్జ్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే అతి త్వరలో బ్రాండ్ నుంచి పలు టీజర్లు కూడా విడుదలవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి మోటోరోలా పేరెంట్ కంపెనీ అయిన లెనోవో ఈ ఫోన్ ని ఏయే మార్కెట్లలో లాంచ్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే గత రెండు వేరియంట్స్ ఇండియాలో లాంచ్ అయిపోయాయి.

The post 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>