Motorola - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 Jan 2024 16:08:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: 6000mAh బ్యాటరీతో లాంచైన Moto G24 Power https://www.91mobiles.com/telugu/moto-g24-power-launched-india-6000mah-battery/ Tue, 30 Jan 2024 16:08:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=9982 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G24 Power డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 30 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Moto G24 Power స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం […]

The post Motorola: 6000mAh బ్యాటరీతో లాంచైన Moto G24 Power first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Moto G24 Power
  • 6000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్
  • Moto G24 Power ప్రారంభ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G24 Power డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 30 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Moto G24 Power స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G24 Power ధర

  • Moto G24 Power డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
  • Moto G24 Power 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,999 గా ఉంది.
  • Moto G24 Power 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంది.
  • Moto G24 Power స్మార్ట్‌ఫోన్ గ్లేసియర్ బ్లూ మరియు ఇంక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Moto G24 Power కొనుగోలుపై రూ.750 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ యూజర్ కి లభిస్తుంది.
  • Moto G24 Power డివైజ్ ని ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి మోటోరోలా, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Moto G24 Power స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G24 Power లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G24 Power లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. మాలి-జీ52 గ్రాఫిక్స్ ని ఈ ఫోన్ లో అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 Power డివైజ్ 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మెమొరీ కార్డ్ ద్వారా 1టిబి వరకు స్టోరేజీ పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Moto G24 Power డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Moto G24 Power లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Moto G24 Power లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ టర్బో చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G24 Power లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఎఫ్ఎమ్ రేడియో, వాటర్-రిపెలెంట్ డిజైన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola: 6000mAh బ్యాటరీతో లాంచైన Moto G24 Power first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో యూఎస్‌లో లాంచైన Moto G Play (2024) https://www.91mobiles.com/telugu/moto-g-play-2024-launched-in-usa-with-50mp-camera-5000mah-battery/ Wed, 17 Jan 2024 07:00:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=9755 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ‘జీ ప్లే’ సిరీస్ ని ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా Moto G Play (2024) డివైజ్ ని లాంచ్ చేసింది. యూఎస్ మార్కెట్ లో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. Moto G Play (2024) స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, వర్చువల్ ర్యామ్, 6.5-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Moto G Play (2024) యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post Motorola: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో యూఎస్‌లో లాంచైన Moto G Play (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూఎస్ మార్కెట్‌లో లాంచైన Moto G Play (2024)
  • 6.5-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Snapdragon 680 చిప్సెట్ పై పని చేయనున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ‘జీ ప్లే’ సిరీస్ ని ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా Moto G Play (2024) డివైజ్ ని లాంచ్ చేసింది. యూఎస్ మార్కెట్ లో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. Moto G Play (2024) స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, వర్చువల్ ర్యామ్, 6.5-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Moto G Play (2024) యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Moto G Play (2024) ధర

  • Moto G Play (2024) డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
  • ఈ వేరియంట్ ధరను యూఎస్ లో 149 డాలర్లు (సుమారు రూ.12,384) గా నిర్ణయించారు.
  • Moto G Play (2024) డివైజ్‌ ఫిబ్రవరి 8 నుంచి యూఎస్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • Moto G Play (2024) స్మార్ట్‌ఫోన్ డీప్ ఇండిగో సింగిల్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

Moto G Play (2024) స్పెసిఫికేషన్స్

Moto G Play (2024) లో స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్, 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

  • డిస్ప్లే: Moto G Play (2024) లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 1600*720) పిక్సెల్స్ రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G Play (2024) లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G Play (2024) లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
  • కెమెరా: Moto G Play (2024) లో 50ఎంపి సింగిల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Moto G Play (2024) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Moto G Play (2024) డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G Play (2024) లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Motorola: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో యూఎస్‌లో లాంచైన Moto G Play (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
Flipkart Big Billion Days సేల్: Motorola Edge 30 Ultra, Moto G84, Moto E32 ఫోన్లపై ఆఫర్స్! https://www.91mobiles.com/telugu/motorola-phones-offers-flipkart-big-billion-days-sale-2023/ Fri, 29 Sep 2023 14:48:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=8231 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 సందర్భంగా ఎన్నో మోటోరోలా ఫోన్లపై డిస్కౌంట్స్ లభించనున్నాయి. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. పాపులర్ బ్రాండ్స్ కి సంబంధించిన డీల్స్ ని ఇంకా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించలేదు. ఈలోపు మోటోరోలా ఇండియా సేల్ కోసం తన ఆఫర్లను ప్రకటించింది. మోటోరోలా ఎడ్జ్, మోటో జీ, మోటో ఈ సిరీస్ ఫోన్లను సేల్ సందర్భంగా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా మోటోరోలా ఫోన్ […]

The post Flipkart Big Billion Days సేల్: Motorola Edge 30 Ultra, Moto G84, Moto E32 ఫోన్లపై ఆఫర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పలు ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన మోటోరోలా ఇండియా
  • బిల్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫోన్లపై డిస్కౌంట్
  • మోటో ఎడ్జ్, జీ, ఈ సిరీస్ ల ఫోన్లపై తగ్గిన ధరలు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 సందర్భంగా ఎన్నో మోటోరోలా ఫోన్లపై డిస్కౌంట్స్ లభించనున్నాయి. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. పాపులర్ బ్రాండ్స్ కి సంబంధించిన డీల్స్ ని ఇంకా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించలేదు. ఈలోపు మోటోరోలా ఇండియా సేల్ కోసం తన ఆఫర్లను ప్రకటించింది. మోటోరోలా ఎడ్జ్, మోటో జీ, మోటో ఈ సిరీస్ ఫోన్లను సేల్ సందర్భంగా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా మోటోరోలా ఫోన్ ఆఫర్స్

Moto Edge 40 Neo

  • Moto Edge 40 Neo 8జిబి+256జిబి మోడల్ ని బ్యాంక్ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ తో రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని బ్యాంక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ తో రూ.21,999 కే కొనుగోలు చేయవచ్చు.
  • Moto Edge 40 Neo లో 144 హెర్ట్జ్ పీ-ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Motorola G84

  • Motorola G84 స్మార్ట్ ఫోన్ ని సేల్ సందర్భంగా అన్ని ఆఫర్స్ కలుపుకుని 12జిబి+256జిబి వేరియంట్ ని రూ.16,999 కే సొంతం చేసుకోవచ్చు.
  • Motorola G84 లో 120 హెర్ట్జ్ పీ-ఓఎల్ఈడీ స్క్రీన్, ఆండ్రాయిడ్ 13ఓఎస్, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Motorola G54

  • Motorola G54 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ని అన్ని ఆఫర్స్ కలుపుకుని రూ.12,999 కి సొంతం చేసుకోవచ్చు.
  • Motorola G54 డివైజ్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola E13

  • Motorola E13 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ఆఫర్స్ తర్వాత రూ.6,749 కి లభిస్తుంది.
  • Motorola E13 లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 13ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
మోడల్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్ ధర
Motorola Edge 30 Ultra రూ.59,999 రూ.39,999
Motorola Edge 30 Fusion రూ.42,999 రూ.29,999
Motorola Edge 40 రూ.29,999 ఇంకా ప్రకటించలేదు
Motorola Edge 30 8+128GB రూ.26,999 రూ.25,999
Motorola Edge 40 Neo 8+128GB రూ.23,999 రూ.19,999
Motorola Edge 40 Neo 12+256GB రూ.25,999 రూ.21,999
Moto G84 రూ.19,999 రూ.16,999
Moto G73 రూ.18,999 రూ.14,999
Moto G54 8+128GB రూ.15,999 రూ.12,999
Moto G54 12+256GB రూ.18,999 రూ.14,999
Moto G32 8+128GB రూ.11,999 రూ.8,999
Moto G14 4+128GB రూ.9,999 రూ.8,099
Moto G13 4+128GB రూ.9,999 రూ.8,999
Moto E32 రూ.8,999 రూ.8,099
Moto E13 2+64GB రూ.6,999 రూ.5,399
Moto E13 4+64GB రూ.7,999 రూ.5,849
Moto E13 8+128GB రూ.11,999 రూ.8,999

The post Flipkart Big Billion Days సేల్: Motorola Edge 30 Ultra, Moto G84, Moto E32 ఫోన్లపై ఆఫర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Jio 5G కి సపోర్ట్ చేసే 10 Motorola స్మార్ట్ ఫోన్స్ https://www.91mobiles.com/telugu/reliance-jio-5g-support-for-10-motorola-smartphones/ Thu, 05 Jan 2023 13:36:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=4359 హైలైట్స్ Jio 5G కి సపోర్ట్ చేస్తున్న 10 మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ లో ఉన్న ప్రముఖ ఫోన్స్ Motorola Edge 30 Ultra, Motorola Edge 20 Fusion Airtel 5G ప్లస్ హై-స్పీడ్ నెట్వర్క్ సర్వీస్ కి కూడా సపోర్ట్ చేయనున్న మోటోరోలా డివైజెస్ Jio 5G సర్వీసెస్ కి యాక్సెస్ అయ్యేందుకై మోటోరోలా కంపెనీ కొన్ని ఎంపిక చేయబడిన మోటో డివైజెస్ కి కొత్త అప్డేట్ పంపింది. ఈ అప్డేట్ ద్వారా […]

The post Jio 5G కి సపోర్ట్ చేసే 10 Motorola స్మార్ట్ ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Jio 5G కి సపోర్ట్ చేస్తున్న 10 మోటోరోలా స్మార్ట్ ఫోన్స్
  • లిస్ట్ లో ఉన్న ప్రముఖ ఫోన్స్ Motorola Edge 30 Ultra, Motorola Edge 20 Fusion
  • Airtel 5G ప్లస్ హై-స్పీడ్ నెట్వర్క్ సర్వీస్ కి కూడా సపోర్ట్ చేయనున్న మోటోరోలా డివైజెస్

Jio 5G సర్వీసెస్ కి యాక్సెస్ అయ్యేందుకై మోటోరోలా కంపెనీ కొన్ని ఎంపిక చేయబడిన మోటో డివైజెస్ కి కొత్త అప్డేట్ పంపింది. ఈ అప్డేట్ ద్వారా సంబంధిత మోడల్స్ వాడుతోన్న యూజర్లు జియో 5జీని వాడుకోవచ్చు. ఈ జాబితాలో మొత్తం 10 మోటోరోలా ఫోన్లు ఉన్నాయి. 4జీ ప్లాన్స్ పై కొనసాగుతోన్న జియో యూజర్లు ఇప్పుడు జియో యొక్క 5జీ వెల్కమ్ ఆఫర్ ని పొందేందుకు ప్రయత్నించవచ్చు.

జియోతో పాటు, మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు 21 భారతీయ నగరాల వ్యాప్తంగా ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను పొందే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

Jio 5G సేవలను పొందే Motorola స్మార్ట్‌ఫోన్స్

Jio 5G కి సపోర్ట్ చేసే మోటోరోలా ఫోన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

  • Motorola Edge 30 Ultra
  • Motorola Edge 30 Fusion
  • Moto G62 5G
  • Motorola Edge 30
  • Moto G82 5G
  • Motorola Edge 30 Pro
  • Moto G71 5G
  • Moto G51 5G
  • Motorola Edge 20
  • Motorola Edge 20 Fusion

మోటోరోలా తో పాటు, రిలయన్స్ జియో సంస్థ జియో 5జీ సేవలను అందించేందుకై పాపులర్ బ్రాండ్స్ అయిన రియల్మీ, వన్‌ప్లస్ మరియు షావోమి లతో జట్టుకట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాలు, నగరాల వ్యాప్తంగా జియో ట్రూ 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది.

జియో 5జీ నెట్వర్క్ ని 16 వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. వాటిలో వన్ ప్లస్ 10ఆర్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, వన్ ప్లస్ నార్డ్ 2, వన్ ప్లస్ 10 ప్రో, వన్ ప్లస్ 9 ఆర్‌టీ, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 8 డివైజెస్ ఉన్నాయి.

ఇకపోతే రియల్మీకి చెందిన 16 స్మార్ట్ ఫోన్లు జియో ట్రూ 5జీకి సపోర్ట్ చేస్తాయి. వాటిలో రియల్మీ జీటీ నియో 2, రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ జీటీ 2 ప్రో, రియల్మీ జీటీ నియో 3 తదితర ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ జియో అందించే హై-స్పీడ్ 5జీ డేటాకి యాక్సెస్ కలిగి ఉన్నాయి. ఇక రెడ్మీ, షావోమి విషయానికి వస్తే, రెడ్మీ నోట్ 10టీ 5జీ, రెడ్మీ నోట్ 11టీ 5జీ, షావోమి 12 5జీ, షావోమీ 11ఎక్స్ ప్రో, షావోమి 11ఐ హైపర్ చార్జ్ 5జీ, షావోమి 11 అల్ట్రా 5జీ ఉన్నాయి.

ప్రస్తుతం రిలయన్స్ జియో 5జీ ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లో అందుబాటులో ఉంది. జియో 5జీ ఇంకా ఇండోర్, భోపాల్ నగరాల్లో కూడా ఇటీవలె అందుబాటులోకి వచ్చింది. 2023 జనవరిలో జబల్‌పూర్, గ్వాలియర్ నగరాల్లో కూడా అందుబాటులోకి రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Jio 5G కి సపోర్ట్ చేసే 10 Motorola స్మార్ట్ ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Moto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు https://www.91mobiles.com/telugu/motorola-razr-2022-moto-x30-pro-launch-rescheduled/ Fri, 05 Aug 2022 07:06:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=1512 హైలైట్స్: ఆగస్టు 11 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ కానున్న మోటో ఎక్స్30 ప్రో, మోటో రేజర్ 2022 శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తర్వాత జరగనున్న మోటోరోలా లాంచ్ ఈవెంట్ గ్లోబల్ మార్కెట్ లో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో రిలీజ్ కానున్న మోటో ఎక్స్30 ప్రో మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 లాంచ్ ఈవెంట్ ఆగస్టు 11 వ తేదీకి రీషెడ్యూల్ కాబడింది. ఈ ఈవెంట్ లో మోటోరోలా 200 […]

The post Moto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 11 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ కానున్న మోటో ఎక్స్30 ప్రో, మోటో రేజర్ 2022
  • శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తర్వాత జరగనున్న మోటోరోలా లాంచ్ ఈవెంట్
  • గ్లోబల్ మార్కెట్ లో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో రిలీజ్ కానున్న మోటో ఎక్స్30 ప్రో

మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 లాంచ్ ఈవెంట్ ఆగస్టు 11 వ తేదీకి రీషెడ్యూల్ కాబడింది. ఈ ఈవెంట్ లో మోటోరోలా 200 ఎంపి కెమెరా ఫోన్ ని రిలీజ్ చేయనుంది. లెనోవో చైనా జీఎం చెన్ జిన్ పోస్ట్ చేసిన టీజర్ ని బట్టి, మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 ఆగస్టు 11 న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అసలైతే మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 ఫోన్స్ లాంచ్ ఆగస్టు 2 న జరగాల్సి ఉండగా, కొన్ని గంటల ముందు హఠాత్తుగా ఈవెంట్ రద్దైంది. అంతకు ముందు వన్ ప్లస్ ఏస్ ప్రో లాంచ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది. సరిగ్గా అదే రోజున న్యాన్సీ పాట్రీషియా పెలోసీ తైవాన్ దేశాన్ని విజిట్ చేయడంతో చైనాలో రేగిన రాజకీయ అలజడి కారణంగా, ఈవెంట్ ను రద్దు చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

Moto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు

లెనోవో మొబైల్ చైనా జీఎం చెన్ జిన్ వీబో లో పోస్ట్ చేసిన టీజర్ లో మోటో రేజర్ 2022 యొక్క కవర్ డిస్ప్లే కనిపిస్తోంది. ఈ డిస్ప్లే లో ఒక క్లాక్, డేట్ ఉన్నాయి.శాంసంగ్ తన ఫోర్త్-జెన్ ఫోల్డ్, ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసిన తదుపరి రోజునే మోటోరోలా మోటో ఎక్స్30 ప్రో, మోటో రేజర్ 2022 లను లాంచ్ చేయనుంది.

ఈవెంట్ ముగిసిన తర్వాత మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 సేల్ కి వెళ్ళే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఈ ఫోన్స్ అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వనున్నాయి. మోటో ఎక్స్30 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా అనే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అవుతుంది.

క్వార్ట్జ్ బ్లాక్, ట్రాన్‌క్విల్ బ్లూ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో మోటోరోలా రేజర్ 2022 లభించనుంది. ఇక దీని ధర 1,150 యూరోలు, (దాదాపు రూ.94,000). మరోవైపు, ప్రపంచపు తొలి 200 ఎంపి కెమెరా ఫోన్ అయిన మోటో ఎక్స్ 30 ప్రో వైట్, గ్రే అనే రెండు కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర 899 యూరోలు (దాదాపు రూ.71,500).

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 3-ఇచ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 50ఎంపి+13ఎంపి రియర్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు మోటోరోలా రేజర్ 2022 స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.

The post Moto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo https://www.91mobiles.com/telugu/motorola-edge-30-neo-spotted-on-geekbench-price-specs/ Thu, 04 Aug 2022 10:05:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=1492 హైలైట్స్: గీక్‌బెంచ్ పై కనిపించిన మోటోరోలా ఎడ్జ్ 30 నియో సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1848 పాయింట్లు సాధించిన హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు తన మోటో ఎడ్జ్ 30 సిరీస్ ను మరింత విస్తృతం చేయాలని మోటోరోలా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. రీసెంట్ గా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా విషయంలో పలు కథనాలు వచ్చాయి. […]

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గీక్‌బెంచ్ పై కనిపించిన మోటోరోలా ఎడ్జ్ 30 నియో
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1848 పాయింట్లు సాధించిన హ్యాండ్సెట్
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

తన మోటో ఎడ్జ్ 30 సిరీస్ ను మరింత విస్తృతం చేయాలని మోటోరోలా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. రీసెంట్ గా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా విషయంలో పలు కథనాలు వచ్చాయి. వాటిని బట్టి, ఎడ్జ్ 30 అల్ట్రా 200ఎంపి కెమెరాతో వస్తోందని తెలుస్తోంది. ఈలోపే మరొక డివైజ్ గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. అదే మోటోరోలా ఎడ్జ్ 30 నియో. ఇప్పుడు ఇదే ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్, గీక్ బెంచ్ లో కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

మైస్మార్ట్‌ప్రైస్ తొలుత గీక్ బెంచ్ పై మోటోరోలా ఎడ్జ్ 30 నియో ఫోన్ ని గుర్తించింది. ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 1848 పాయింట్లను సాధించింది.

Motorola Edge 30 Neo ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్‌బెంచ్ పై మోటోరోలా ఎడ్జ్ 30 నియో దర్శనమిచ్చింది. ఈ లిస్టింగ్ లో ఫోన్ కి సంబంధించిన కీలక ఫీచర్లైన ఓఎస్ వర్షన్, ర్యామ్, చిప్సెట్ కనిపించాయి. మోటో ఎడ్జ్ 30 నియో ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం. మయామీ అనే కోడ్ నేమ్ తో మోటో ఎడ్జ్ 30 నియో యొక్క మదర్‌బోర్డ్ సెక్షన్ మెన్షన్ చేయబడి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 695 లేదా స్నాప్ డ్రాగన్ 750జి చిప్సెట్ అయి ఉండొచ్చని అంచనా.

అంతకు ముందు, ట్విట్టర్ యూజర్ నీల్స్ అహ్రెన్స్మెయిర్ మోటో ఎడ్జ్ 30 నియో ధర 399 యూరోలు (దాదాపు రూ.32,000) ఉంటుందని వెల్లడించాడు. ఎడ్జ్ 30 లైట్ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా 30 నియో వస్తుందని చెప్పాడు. అదే కనుక నిజమైతే, ఇటీవలె ఆన్ లైన్లో కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. వాటి ఆధారంగా, ఎడ్జ్ 30 నియో లో 6.5 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 64ఎంపి కెమెరా (ఓఐఎస్), 4020ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. రూమర్ల ఆధారంగా ఈ ఫీచర్లను అంచనా వేస్తున్నాం. ఇవే నిజమని కచ్చితంగా చెప్పలేం.

మోటోరోలా ఎడ్జ్ 30 నియో 64ఎంపి ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశముందని  తెలుస్తోంది. ఈ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. ఇప్పటి వరకు ఎడ్జ్ 30 నియో గురించి అనుకున్న ఫీచర్లను (అంచనా) బట్టి ఫోన్ ధర రూ.32,000 అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. స్నాప్ డ్రాగన్ 695 లేదా స్నాప్ డ్రాగన్ 750జి చిప్సెట్స్ కి అంత ధర పెట్టడమంటే సరికాదు. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే, 64ఎంపి ఓఐఎస్ కెమెరా. ఈ ఒక్క ఫీచర్ ని సెల్లింగ్ పాయింట్ గా భావించి మార్కెట్ లోకి వెళ్తే దెబ్బపడే అవకాశముంది. కాస్త ధరను తగ్గిస్తే, యూజర్లు ఈ ఫోన్ పై కన్నేసే అవకాశముంది. త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 నియో కి సంబంధించిన అధికార ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Moto Edge 30 Fusion https://www.91mobiles.com/telugu/motorola-edge-30-fusion-to-launch-soon-india/ Tue, 02 Aug 2022 14:09:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=1437 హైలైట్స్: భారత్ లో బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ మోటో ఎక్స్‌టీ-2243-1 అనే మోడల్ నంబర్ కలిగిన హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ప్రస్తుతం మోటోరోలా యొక్క ఎడ్జ్ 30 సిరీస్ లో మోటో ఎడ్జ్ 30 మరియు మోటో ఎడ్జ్ 30 ప్రో అనే రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటో […]

The post త్వరలో లాంచ్ కానున్న Moto Edge 30 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్
  • మోటో ఎక్స్‌టీ-2243-1 అనే మోడల్ నంబర్ కలిగిన హ్యాండ్సెట్
  • స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

ప్రస్తుతం మోటోరోలా యొక్క ఎడ్జ్ 30 సిరీస్ లో మోటో ఎడ్జ్ 30 మరియు మోటో ఎడ్జ్ 30 ప్రో అనే రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటో ఎడ్జ్ 30 అల్ట్రా అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ సిద్ధమవుతోంది. ప్రపంచపు మొట్టమొదటి 200ఎంపి కెమెరా ఫోన్ గా ఇది పరిగణించబడుతోంది. ఈలోపు మోటోరోలా మోటో-ఎక్స్‌టీ-2243-1 అనే మోడల్ నంబర్ తో ఉన్న మరొక ఫోన్ కి బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. ఇది మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ అయి ఉంటుందని అందరూ అంచానా వేస్తున్నారు. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ లాంచ్ అయ్యాక, మోటో ఎడ్జ్ 30 ప్రో ఫోన్ కి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ధర కూడా దాదాపు అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

BIS సర్టిఫికేషన్

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఎక్స్‌టీ2243-1 అనే మోడల్ నంబర్ పై బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. దీన్ని బట్టి అతి త్వరలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అయితే, లిస్టింగ్ ద్వారా పెద్దగా హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియలేదు. అయితే ఎడ్జ్ 30 యొక్క స్టాండర్డ్ వేరియంట్ గా ఫ్యూజన్ ని రంగంలోకి దించొచ్చని మనం అంచనా వేయొచ్చు.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)

చైనాలో మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్, మోటో ఎస్30 అనే పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 4,400ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 32ఎంపి కెమెరాను అందించనున్నారు. 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయని అంచనా. ఇవి రూమర్ల ఆధారంగా చెప్పబడిన స్పెసిఫికేషన్స్, కాగా, త్వరలోనే లాంచ్ అయ్యే ఫోన్ యొక్క అసలైన స్పెసిఫికేషన్స్ వేరుగా ఉండే అవకాశముంది.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ లాంచ్ అయ్యాక, మోటో ఎడ్జ్ 30 ప్రో ఫోన్ కి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ధర కూడా దాదాపు అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇది కేవలం అంచనా మాత్రమే. వాస్తవంలో ఫోన్ లాంచ్ అయ్యాక గానీ, ఏ విషయం చెప్పలేం. కానీ, ఇప్పుడు ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ గా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఎంట్రీ ఇవ్వనుందని చెప్పవచ్చు.

The post త్వరలో లాంచ్ కానున్న Moto Edge 30 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
50ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో లాంచ్ అయిన Moto G32 https://www.91mobiles.com/telugu/moto-g32-launched-in-europe-price-specs/ Mon, 01 Aug 2022 05:34:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=1381 హైలైట్స్: యూరోప్ లో మోటో జీ32 ఫోన్ ని లాంచ్ చేసిన మోటోరోలా 90 హెర్ట్జ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జిబి ర్యామ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు త్వరలోనే భారత్ తో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో లాంచ్ కానున్న మోటో జీ32 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా యూరప్ లో మోటో జీ32 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మోటో జీ42 తో […]

The post 50ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో లాంచ్ అయిన Moto G32 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • యూరోప్ లో మోటో జీ32 ఫోన్ ని లాంచ్ చేసిన మోటోరోలా
  • 90 హెర్ట్జ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జిబి ర్యామ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • త్వరలోనే భారత్ తో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో లాంచ్ కానున్న మోటో జీ32

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా యూరప్ లో మోటో జీ32 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మోటో జీ42 తో పోల్చితే ఈ ఫోన్ కాస్త అప్‌గ్రేడెడ్ వర్షన్ అనిపిస్తోంది. జులై మొదటివారంలో మోటో జీ42 ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే భారత్ కి వచ్చేసరికి ఫోన్ యొక్క ఫీచర్లు మారిపోయే అవకాశముంది. ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ యూనిసాక్ చిప్సెట్ తో వచ్చే అవకాశముంది. ఇక యురోపియన్ వర్షన్ మోటో జీ32 విశేషాలు చూద్దాం. స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 90 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక గమనించగ్గ విషయం ఏంటంటే, ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లేకి బదులు, ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది.

Moto G32 ధర

యూరోప్ లో మోటో జీ32 4జిబి ర్యామ్, 128జిబి వేరియంట్ ధర 230 యూరోలుగా ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.19,000. సేటిన్ సిల్వర్, మినరల్ గ్రే అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

Moto G32 స్పెసిఫికేషన్స్

ఇప్పుడు స్పెసిఫికేషన్స్ వివరాలను చూద్దాం. మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 405 పిక్సెల్స్ పర్ ఇంచ్ (పీపీఐ), డీసీఐ-పీ3 కలర్ గేముత్ సపోర్ట్, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రోనో 610 జీపీయూ, 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ, మెమొరీ కార్డు ద్వారా 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ వెనకాల మూడు కెమెరాలను అమర్చారు. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, మూడోది 2ఎంపి మ్యాక్రో కెమెరా. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

మోటో జీ32 స్మార్ట్ ఫోన్లో 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జ్యాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇక ఆడియో కోసం, జీ32 లో డాల్బీ అట్మాస్ తో కూడిన రెండు స్పీకర్లను అమర్చారు. భద్రత కొరకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. ఈ డివైజ్ 184 గ్రాములు బరువుంటుందని అంచనా. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, మోటో జీ32 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

The post 50ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో లాంచ్ అయిన Moto G32 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Moto Edge 30 Ultra https://www.91mobiles.com/telugu/motorola-edge-30-ultra-spotted-on-geekbench-score-details/ Wed, 27 Jul 2022 13:01:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=1295 హైలైట్స్: గీక్ బెంచ్ వెబ్ సైట్ లిస్టింగ్ లో కనిపించిన మోటో ఎడ్జ్ 30 అల్ట్రా (ఎక్స్30 ప్రో) త్వరలో చైనాలో తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తున్న మోటో ఎడ్జ్30 అల్ట్రా మోటోరోలా నుంచి వస్తున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్30 అల్ట్రా లాంచ్ కి ముందు గీక్ […]

The post లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గీక్ బెంచ్ వెబ్ సైట్ లిస్టింగ్ లో కనిపించిన మోటో ఎడ్జ్ 30 అల్ట్రా (ఎక్స్30 ప్రో)
  • త్వరలో చైనాలో తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తున్న మోటో ఎడ్జ్30 అల్ట్రా

మోటోరోలా నుంచి వస్తున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్30 అల్ట్రా లాంచ్ కి ముందు గీక్ బెంచ్ అనే బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ పై కనిపించింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్స్, గీక్ బెంచ్ వెబ్ సైట్ లో కనిపించాయి. ఆగస్టు 2 న మోటో ఎక్స్30 ప్రో అనే పేరుతో చైనాలో ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా అని పిలవబడనుంది.

గీక్ బెంచ్ పై దర్శనమిచ్చిన Moto Edge 30 Ultra

గీక్ బెంచ్ యొక్క బెంచ్ మార్కింగ్ టెస్ట్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ కలిగిన మోటో ఎడ్జ్30 అల్ట్రా చెప్పుకోదగిన స్కోర్ నే నమోదు చేసింది. సింగిల్ స్కోర్ టెస్ట్ లో మోటో ఎడ్జ్30 అల్ట్రా 1,252 పాయింట్లను సాధించగా, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,972 పాయంట్లను సాధించింది.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 200 ఎంపి కెమెరా ప్రధాన ఫీచర్ గా వస్తోంది. దీనికి తోడు 50ఎంపి అల్ట్రావైడ్, 12ఎంపి పొట్రెయిట్ కెమెరాలు ఉంటాయి. ఇక డివైజ్ లో ముందువైపున 60ఎంపి కెమెరా ఉండనున్నట్లు సమాచారం. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇందులో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉండనున్నాయి.

మోటో ఎడ్జ్ 30 అల్ట్రా లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 50 వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

చైనాలో మోటో ఎక్స్ 30 ప్రో గా లాంచ్ అవుతోన్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 2022, ఆగస్టు 2 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తర్వాత ఇదే డివైజ్ ఎడ్జ్ 30 అల్ట్రా అనే పేరుతో గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ ఇటీవలె బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో క్లియరెన్స్ కూడా పొందింది. దీంతో త్వరలోనే భారత్ లో ఫోన్ లాంచ్ కానుందని స్పష్టమైంది.

భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఔత్సాహికులు వేచి చూస్తున్నారు. భారత మార్కెట్ లోకి ఎడ్జ్ 30 అల్ట్రా ప్రవేశించాక, కచ్చితంగా ఇతర ఫ్లాగ్ షిప్స్ కి మాంచి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఫోన్ స్పెసిఫికేషన్స్ బట్టి పేపర్ పై బలంగా కనిపిస్తోంది. కానీ, లాంచ్ తర్వాత యూజర్ పెర్ఫామెన్స్ తో ఫోన్ సక్సెస్ నిర్ణయించబడుతుంది. 60 ఎంపి ఫ్రంట్ కెమెరా వ్లాగింగ్ చేసే వారికి బాగా ఉపయోగపడనుంది. అలాగే, 200ఎంపి కెమెరాతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉండటంతో పెర్ఫామెన్స్ కి తిరుగుండదు. ప్రధానంగా ఈ మూడు ఫీచర్లు ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

The post లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Moto Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన Moto Razr 2022 ప్రధాన ఫీచర్లు https://www.91mobiles.com/telugu/motorola-razr-2022-spotted-on-geekbench-before-launch/ Wed, 27 Jul 2022 05:46:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=1280 హైలైట్స్: ఆగస్టు 2 న జరగబోవు మోటోరోలా లాంచ్ ఈవెంట్ లో ఎంట్రీ ఇవ్వనున్న మోటో రేజర్ 2022 స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 120హెర్ట్జ్ ఫోల్డబుల్ ప్యానెల్ తో వస్తున్న రేజర్ 2022 మోటో రేజర్ 2022 ధర 1,150 యూరోలు (దాదాపు రూ.94,000) ఉంటుందని అంచనా ఆగస్టు 2 న మోటోరోలా నిర్వహిస్తున్న లాంచ్ ఈవెంట్ లో మోటో రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Moto Razr 2022 ప్రధాన ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 2 న జరగబోవు మోటోరోలా లాంచ్ ఈవెంట్ లో ఎంట్రీ ఇవ్వనున్న మోటో రేజర్ 2022
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 120హెర్ట్జ్ ఫోల్డబుల్ ప్యానెల్ తో వస్తున్న రేజర్ 2022
  • మోటో రేజర్ 2022 ధర 1,150 యూరోలు (దాదాపు రూ.94,000) ఉంటుందని అంచనా

ఆగస్టు 2 న మోటోరోలా నిర్వహిస్తున్న లాంచ్ ఈవెంట్ లో మోటో రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్ ఈవెంట్ కు ముందు, మోటోరోలా రేజర్ 2022 ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు, ఫోన్ కవర్ డిస్ప్లే యొక్క గేమింగ్ కేపబులిటీ ఏంటో తెలియజేసింది. ఇప్పుడు చైనా సామాజిక మాధ్యమం వీబో పై మోటోరోలా ఒక కొత్త టీజర్ ను షేర్ చేసింది. దీన్ని బట్టి, మోటో రేజర్ 2022 లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ వాడినట్లు స్పష్టమైంది. మరో విషయమేంటంటే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న మొదటి ఫోల్డబుల్ ఫోన్ మోటో రేజర్ 2022 కావడం విశేషం.

ఇక మోటో రేజర్ 2022 1,150 యూరోలకు అంటే దాదాపు రూ.94,000 లకు అమ్ముడు కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. క్వార్ట్జ్ బ్లాక్ మరియు ట్రాన్క్విల్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఆగస్టు 2 న రాత్రి 7.30 గంటలకు మోటో రేజర్ 2022 లాంచ్ అయ్యాక అన్ని విషయాలపై క్లారిటీ రానుంది.

Geekbench లిస్టింగ్

మోటోరోలా XT2251 అనే మోడల్ నంబర్ తో మోటో రేజర్ 2022 గీక్ బెంచ్ పై దర్శనమిచ్చింది (via). స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు గీక్ బెంచ్ లిస్టింగ్ పై కనిపిస్తున్నాయి. ఇక హ్యాండ్సెట్ సింగిల్-కోర్ టెస్టులో 1251 పాయింట్లను స్కోర్ చేయగా, మల్టీ-స్కోర్ టెస్టులో 4076 పాయింట్లు స్కోర్ చేసింది.

Moto Razr 2022 స్పెసిఫికేషన్స్

మోటో రేజర్ 2022 స్పెసిఫికేషన్స్ గతంలోనే లీకైన విషయం తెలిసిందే. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ కలిగిన మోటో రేజర్ 2022 ఫోన్ 12 జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ని కలిగి ఉండనుంది. ఇక ఈ ఫోన్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై మోటో రేజర్ 2022 పని చేయనుంది.

మోటో రేజర్ 2022 ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ ఫోల్డబుల్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 3 అంగుళాల రియర్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

Moto Razr 2022 స్పెక్స్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్
  • 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ ఫోల్డబుల్ డిస్ప్లే
  • 3 అంగుళాల కవర్ డిస్ప్లే
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 50ఎంపి+13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

ఇక మోటో రేజర్ 2022 కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ ఫోన్ వెనకాల 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో ముందువైపున 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Moto Razr 2022 ప్రధాన ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>