OnePlus 11 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:32:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న OnePlus 11 ప్రీ-ఆర్డర్స్ https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-pre-order-date-confirmed-via-amazon/ Fri, 03 Feb 2023 11:29:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=4778 ఫిబ్రవరి 7 న భారత్ లో వన్ ప్లస్ సంస్థ పెద్ద ఈవెంట్ ని నిర్వహిస్తోంది. ఈవెంట్ లో OnePlus 11 ఫ్లాగ్షిప్ తో పాటు, OnePlus 11R కూడా లాంచ్ అవుతోంది. వీటికి తోడు, OnePlus Keyboard, OnePlus Buds Pro 2 కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో చైనాలో OnePlus 11 లాంచ్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ ఇప్పటికే అందిరికీ తెలుసు. ఇప్పుడు భారత్ లో లాంచ్ కి ముందు అమెజాన్ […]

The post ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న OnePlus 11 ప్రీ-ఆర్డర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోన్న OnePlus 11, అదే రోజున మొదలు కానున్న ప్రీ-ఆర్డర్స్
  • Snapdragon 8 Gen 2 చిప్సెట్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • లాంచ్ ఈవెంట్ లో అనౌన్స్ కానున్న OnePlus 11 డివైజ్ ధర

ఫిబ్రవరి 7 న భారత్ లో వన్ ప్లస్ సంస్థ పెద్ద ఈవెంట్ ని నిర్వహిస్తోంది. ఈవెంట్ లో OnePlus 11 ఫ్లాగ్షిప్ తో పాటు, OnePlus 11R కూడా లాంచ్ అవుతోంది. వీటికి తోడు, OnePlus Keyboard, OnePlus Buds Pro 2 కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో చైనాలో OnePlus 11 లాంచ్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ ఇప్పటికే అందిరికీ తెలుసు.

ఇప్పుడు భారత్ లో లాంచ్ కి ముందు అమెజాన్ లిస్టింగ్ ద్వారా OnePlus 11 ప్రీ-ఆర్డర్ తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 7 నుంచి OnePlus 11 డివైజ్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే లాంచ్ రోజునే సేల్ కూడా మొదలుకానుందన్న మాట.

తన నుంచి రాబోవు 2023 ఫ్లాగ్షిప్స్ 4 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ పొందుతాయని OnePlus సంస్థ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. ఇకపోతే ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ కెమెరా విభాగాన్ని వన్‌ప్లస్ సంస్థ హేజెల్‌బ్లడ్ సహకారంతో రూపొందించింది. ఇవన్నీ కలిసి ఫోన్ ని ఉత్తమమైన ఆప్షన్ గా నిలుపుతున్నాయి.

OnePlus 11 ధర (అంచనా)

భారత్ లో OnePlus 11 స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంటుందని సమాచారం. అలాగే 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.59,999 గా ఉండనుందని తెలుస్తోంది. 16జిబి ర్యామ్ + 512జిబి యూనిట్ ధర రూ.66,999 గా ఉంటుందని తెలుస్తోంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.49,999 గా పెట్టే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

OnePlus 11 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ ఈ4 ఓఎల్ఈడీ ఎల్టీపీవో 3.0 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3216*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ తో ఫోన్ వస్తోంది. OnePlus 11 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్నిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్ ఉంటుంది. ఇది ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది. 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 2x టెలీఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OnePlus 11 లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఐపీ54 రేటింగ్, అలర్ట్ స్లైడర్ తో ఈ ఫోన్ వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న OnePlus 11 ప్రీ-ఆర్డర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus 11, Buds Pro 2 ధరలు https://www.91mobiles.com/telugu/oneplus-11-buds-pro-2-oneplus-keyboard-prices-leaked-before-launch/ Mon, 23 Jan 2023 14:42:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=4608 OnePlus 11 లాంచ్ ఈవెంట్ భారత్ లో ఫిబ్రవరి 7 న జరగనుంది. ఈ ఆఫ్ లైన్ ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. ఇదే ఈవెంట్ లో ఫ్లాగ్షిప్ టీడబ్ల్యూఎస్ OnePlus Buds Pro 2 ని వన్ ప్లస్ లాంచ్ చేయబోతోంది. ఈ రెండు డివైజెస్ తో పాటు, OnePlus Keyboard కూడా లాంచ్ కానుంది. ఈ కీబోర్డ్ ని Keychron తో కలిసి వన్ ప్లస్ డెవలప్ చేసింది. Pricebaba వెలువరించిన కథనం ద్వారా OnePlus […]

The post లీకైన OnePlus 11, Buds Pro 2 ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 11, Buds Pro 2
  • 2023 లో భారత్ లో వన్ ప్లస్ యొక్క ఫస్ట్ ఈవెంట్ ఇదే
  • Keychron తో కలిసి కీబోర్డ్ ని డెవలప్ చేసిన వన్‌ప్లస్

OnePlus 11 లాంచ్ ఈవెంట్ భారత్ లో ఫిబ్రవరి 7 న జరగనుంది. ఈ ఆఫ్ లైన్ ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. ఇదే ఈవెంట్ లో ఫ్లాగ్షిప్ టీడబ్ల్యూఎస్ OnePlus Buds Pro 2 ని వన్ ప్లస్ లాంచ్ చేయబోతోంది. ఈ రెండు డివైజెస్ తో పాటు, OnePlus Keyboard కూడా లాంచ్ కానుంది. ఈ కీబోర్డ్ ని Keychron తో కలిసి వన్ ప్లస్ డెవలప్ చేసింది.

Pricebaba వెలువరించిన కథనం ద్వారా OnePlus 11, వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 మరియు వన్ ప్లస్ కీబోర్డ్ కి సంబంధించిన ధరలు బయటకు వచ్చాయి. లీక్ ని బట్టి, OnePlus 11 మూడు వేరియంట్స్ లో లభించనుంది. 16జిబి ర్యామ్ తో OnePlus 11 వస్తోంది. సరే, ఓసారి ఈ మూడు ప్రొడక్ట్స్ యొక్క వివరాలను తెలుసుకుందాం పదండి.

లీకైన OnePlus 11, OnePlus Buds Pro 2, OnePlus Keyboard భారత మార్కెట్ ధరలు

OnePlus 11 మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. 12జిబి ర్యామ్ బేస్ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.66,999 గా ఉంది.

ఇక OnePlus Buds Pro 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, 2021 లో వచ్చిన OnePlus Buds Pro కి సక్సెసర్ గా వస్తోంది. ఒక రిపోర్ట్ ప్రకారం, భారత్ లో OnePlus Buds Pro 2 ధర రూ.11,999 గా ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 13 కోసం డెవలప్ చేయబడిన గూగుల్ యొక్క సిగ్నేచర్ స్పేషియల్ ఆడియో ఫీచర్ సపోర్ట్ తో ఈ బడ్స్ వస్తున్నట్లు సమాచారం.

ఇక OnePlus తొలిసారిగా తీసుకొస్తోన్న Keyboard ధర రూ.9,999 గా ఉంది. ఇప్పటికే కీ-బోర్డ్ యొక్క మైక్రోసైట్ వన్ ప్లస్ వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. ఆర్‌సీసీ మెంబర్స్ కి ఈ డివైజ్ స్పెషల్ డిస్కౌంట్ పై లభిస్తుంది. మార్చి నుంచి మే మధ్యలో ఈ కీబోర్డ్ ని భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. తర్వాత సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

  • 6.7-inch క్యూహెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్
  • 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి+48ఎంపి+32ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • అలర్ట్ స్లైడర్
  • 5000mAh బ్యాటరీ
  • 100W ఫాస్ట్ చార్జింగ్
  • వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus 11, Buds Pro 2 ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
100వాట్ చార్జింగ్, 16జిబి ర్యామ్, అలర్ట్ స్లైడర్‌తో లాంచైన OnePlus 11 https://www.91mobiles.com/telugu/oneplus-11-launched-china-price-specs/ Wed, 04 Jan 2023 09:52:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=4324 హైలైట్స్ చైనాలో లాంచైన OnePlus 11 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఈ4 క్యూహెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో లాంచైన OnePlus 11 OnePlus 11 ప్రారంభ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.48,000) అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న OnePlus 11 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచైంది. దీంతో ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, క్యూహెచ్డీ+ […]

The post 100వాట్ చార్జింగ్, 16జిబి ర్యామ్, అలర్ట్ స్లైడర్‌తో లాంచైన OnePlus 11 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన OnePlus 11 స్మార్ట్ ఫోన్
  • 6.7-ఇంచ్ ఈ4 క్యూహెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో లాంచైన OnePlus 11
  • OnePlus 11 ప్రారంభ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.48,000)

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న OnePlus 11 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచైంది. దీంతో ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, క్యూహెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 16జిబి ర్యామ్, అలర్ట్ స్లైడర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో ఈ ఫోన్ లాంచైంది.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్, న్యారో బెజెల్స్, కార్నర్ పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్, హాజెల్‌బ్లడ్ కెమెరాస్ తో వచ్చింది. ఈసారి వన్ ప్లస్ 11 లో అలర్ట్ స్లైడర్ ఉంది. దీంతో అలర్ట్ స్లైడర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 512జిబి వరకు స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. సరే, ఓసారి OnePlus 11 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

OnePlus 11 ధర

OnePlus 11 స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.48,000) గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4399 యువాన్లు (సుమారు రూ.52,900) గా నిర్ణయించారు. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ యూనిట్ ధర 4899 యువాన్లు (సుమారు రూ.59,000) గా ఉంది. చైనాలో జనవరి 9 నుంచి OnePlus 11 అమ్మకాలు మొదలు కానున్నాయి.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

  • 6.7-inch క్యూహెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్
  • 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి+48ఎంపి+32ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • అలర్ట్ స్లైడర్

OnePlus 11 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ ఈ4 ఓఎల్ఈడీ ఎల్టీపీవో 3.0 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3216*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ ఉపయోగించారు. ఈ ఫోన్ లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. OnePlus 11 డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఐపీ54 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది. అలర్ట్ స్లైడర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

ఇప్పుడు OnePlus 11 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ సెన్సర్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ సెన్సర్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 100వాట్ చార్జింగ్, 16జిబి ర్యామ్, అలర్ట్ స్లైడర్‌తో లాంచైన OnePlus 11 first appeared on 91Mobiles Telugu.

]]>
RAW ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేయనున్న OnePlus 11; రివీలైన కెమెరా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-11-camera-specs-revealed-by-company/ Tue, 03 Jan 2023 10:04:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=4306 హైలైట్స్ జనవరి 4 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus 11, భారత్ ఫిబ్రవరి 7 న లాంచ్ కానున్న OnePlus 11 OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ని కూడా లాంచ్ చేయనున్న వన్ ప్లస్ సంస్థ OnePlus 11 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని ఖరారు చేసిన OnePlus చైనాలో OnePlus 11 ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు వన్ ప్లస్ రెడీ అవుతోంది. ఈ ఫోన్ […]

The post RAW ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేయనున్న OnePlus 11; రివీలైన కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 4 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus 11, భారత్ ఫిబ్రవరి 7 న లాంచ్ కానున్న OnePlus 11
  • OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ని కూడా లాంచ్ చేయనున్న వన్ ప్లస్ సంస్థ
  • OnePlus 11 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని ఖరారు చేసిన OnePlus

చైనాలో OnePlus 11 ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు వన్ ప్లస్ రెడీ అవుతోంది. ఈ ఫోన్ రేపు అనగా, జనవరి 4 న చైనాలో లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ఒకరోజు ముందు వన్ ప్లస్ సంస్థ OnePlus 11 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసింది. నేడు కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. కెమెరా రెజుల్యూషన్స్, సెన్సర్స్ కి సంబంధించిన సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. పదండి.

OnePlus 11 కెమెరా స్పెసిఫికేషన్స్

OnePlus 11 స్మార్ట్ ఫోన్ 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్ తో వస్తున్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. మెయిన్ కెమెరాతో పాటు ఇంకా 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ సెన్సర్ (మ్యాక్రో సెన్సర్), 2X సోని ఐఎంఎక్స్709 పోట్రెయిట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి సెన్సర్ ఉంటుంది.

OnePlus 11 అద్భుతమైన పొట్రెయిట్ ఇమేజెస్ ని అందించడంపై ఫోకస్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ ఫోన్ RAW ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఈసారి వన్ ప్లస్ కంపెనీ OnePlus 11 తో ఫోటోగ్రఫీపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి భారత్ లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో తెలియదు. రేపు చైనాలో లాంచ్ అయ్యాక ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ పై ఓ అవగాహన వస్తుంది.

OnePlus 11 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus 11 లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడినట్లు సమాచారం. 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, OnePlus 11 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు OnePlus 11 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 48ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎక్స్ జూమ్ పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. OnePlus 11 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post RAW ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేయనున్న OnePlus 11; రివీలైన కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus 11 రెండర్స్, బాక్స్ కంటెంట్స్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-11-specs-box-contents-renders-leaked-before-launch/ Fri, 30 Dec 2022 07:19:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4251 హైలైట్స్ చైనాలో జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోన్న OnePlus 11 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 7 వ తారీఖున భారత్ లో లాంచ్ కానున్న OnePlus 11 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న OnePlus 11 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus చైనాలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ OnePlus 11 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 4 న ఈ ఫోన్ చైనీస్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus 11 రెండర్స్, బాక్స్ కంటెంట్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోన్న OnePlus 11 స్మార్ట్ ఫోన్
  • ఫిబ్రవరి 7 వ తారీఖున భారత్ లో లాంచ్ కానున్న OnePlus 11
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న OnePlus 11

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus చైనాలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ OnePlus 11 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 4 న ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే లాంచ్ కి ముందు OnePlus 11 కి సంబంధించి డిజైన్ రెండర్, ప్రధాన స్పెసిఫికేషన్స్, బాక్స్ కంటెంట్స్ లీక్ అయ్యాయి.

లేటెస్ట్ లీక్ ని ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ షేర్ చేశాడు. అతడు చెబుతున్న దాని ప్రకారం, OnePlus 11 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం.

OnePlus 11 బాక్స్ కంటెంట్స్ (లీక్డ్)

OnePlus 11 రిటైల్ బాక్స్ లో డివైజ్, కేస్, చార్జింగ్ బ్రిక్, చార్జింగ్ కేబుల్ ఉంటాయి. వీటితో పాటు, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని స్టిక్కర్స్ OnePlus 11 రిటైల్ బాక్స్ లో ఉంటాయి.

OnePlus 11 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ (లీక్డ్)

OnePlus 11 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, 2కే (3216*1440) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. లీకైన రెండర్ ని బట్టి, OnePlus 11 కర్వ్డ్ డిస్ప్లే, కార్నర్ పంచ్-హోల్ డిజైన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OnePlus 11 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తోంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ ఉపయోగించారు. 8 జెన్ 2 చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. షావోమి 13 సిరీస్, ఐకూ 11 సిరీస్, వివో ఎక్స్90 ప్రో+, మోటో ఎక్స్40 ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్ ని వాడారు.

OnePlus 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ కెమెరాలను హాజెల్‌బ్లడ్ ట్యూన్ చేసింది. 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OnePlus 11 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి, 16జిబి + 512జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బరువు 205 గ్రాములు. OnePlus 11 లో ఐపీ54 రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13.0 పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus 11 రెండర్స్, బాక్స్ కంటెంట్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 4 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus 11 https://www.91mobiles.com/telugu/oneplus-11-china-launch-ram-storage-specs/ Mon, 26 Dec 2022 05:43:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=4163 హైలైట్స్ రివీల్ అయిన OnePlus 11 ర్యామ్ మరియు స్టోరేజీ స్పెసిఫికేషన్స్ చైనాలో జనవరి 4 న లాంచ్ అవుతోన్న OnePlus 11 ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవ్వనున్న OnePlus 11 వన్‌ప్లస్ 11 చైనాలో గ్లోబల్ మార్కెట్స్ కంటే ఒక నెల రోజుల ముందుగానే లాంచ్ కానుందని తాజాగా కంపెనీ ప్రకటించింది. జనవరి 4 న చైనాలో OnePlus 11 లాంచ్ అవుతుందని తన ప్రకటనలో పేర్కొంది. ఇక భారత్ తో […]

The post జనవరి 4 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus 11 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రివీల్ అయిన OnePlus 11 ర్యామ్ మరియు స్టోరేజీ స్పెసిఫికేషన్స్
  • చైనాలో జనవరి 4 న లాంచ్ అవుతోన్న OnePlus 11
  • ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవ్వనున్న OnePlus 11

వన్‌ప్లస్ 11 చైనాలో గ్లోబల్ మార్కెట్స్ కంటే ఒక నెల రోజుల ముందుగానే లాంచ్ కానుందని తాజాగా కంపెనీ ప్రకటించింది. జనవరి 4 న చైనాలో OnePlus 11 లాంచ్ అవుతుందని తన ప్రకటనలో పేర్కొంది. ఇక భారత్ తో పాటు, గ్లోబల్ గా OnePlus 11 ఫిబ్రవరి 7 న లాంచ్ అవ్వబోతోంది. OnePlus 11 తో పాటు ఇంకా OnePlus Buds Pro 2 TWS కూడా లాంచ్ కానుంది.

OnePlus 11 యొక్క ర్యామ్, స్టోరేజీ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. LPPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజీ టెక్నాలజీతో OnePlus 11 వస్తోంది. OnePlus 11 డివైజ్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుందని సమాచారం. OnePlus 11 యొక్క లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.

OnePlus 11 చైనా లాంచ్ తేదీ ఖరారు

పైన ప్రమోషనల్ పోస్టర్ లో కనిపిస్తోన్న విధంగా, OnePlus 11 చైనాలో జనవరి 4 న లాంచ్ అవుతోంది. పోస్టర్ లో డివైజ్ రెండు కలర్ వేరియంట్స్ లో వస్తుందని స్పష్టమవుతోంది. అలాగే OnePlus 11 ఫోన్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ తో రానున్నట్లు సమాచారం. అయితే 8జిబి వేరియంట్ ఉండబోదు. OnePlus 11 ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ తో స్టార్ట్ అవుతుంది.

OnePlus 11 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus 11 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ లో క్వాల్కమ్ యొక్క పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ని వాడారు. అలాగే ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.

OnePlus 11 కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. OnePlus 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో ఆక్సిజన్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో అందుబాటులో ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం OnePlus 11 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 5జీ, 4జీ వొల్టీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 4 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus 11 first appeared on 91Mobiles Telugu.

]]>
సిరామిక్ బాడీతో వస్తోన్న OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-to-come-with-ceramic-body-specs-tipped/ Fri, 18 Nov 2022 10:32:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=3530 హైలైట్స్: త్వరలో లాంచ్ కానున్న ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 హై బిల్డ్ క్వాలిటీతో వస్తోన్న OnePlus 11, ప్రత్యేక ఆకర్షణగా సిరామిక్ బాడీ టిప్‌స్టర్ ద్వారా లీకైన OnePlus 11 ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ త్వరలోనే తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 11 ని లాంచ్ చేయాలని వన్ ప్లస్ ప్లాన్ చేస్తోంది. చైనాతో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా ఏక కాలంలో OnePlus 11 సిరీస్ లాంచ్ కానుంది. తన తదుపరి ఫ్లాగ్షిప్ […]

The post సిరామిక్ బాడీతో వస్తోన్న OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో లాంచ్ కానున్న ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11
  • హై బిల్డ్ క్వాలిటీతో వస్తోన్న OnePlus 11, ప్రత్యేక ఆకర్షణగా సిరామిక్ బాడీ
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన OnePlus 11 ముఖ్యమైన స్పెసిఫికేషన్స్

త్వరలోనే తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 11 ని లాంచ్ చేయాలని వన్ ప్లస్ ప్లాన్ చేస్తోంది. చైనాతో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా ఏక కాలంలో OnePlus 11 సిరీస్ లాంచ్ కానుంది. తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ లో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుందని ఇదివరకే కంపెనీ ఖరారు చేసింది. ఇకపోతే తాజాగా OnePlus 11 కి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన వివరాల ప్రకారం, OnePlus 11 5G నాణ్యతపై బాగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రియర్ ప్యానెల్ కోసం సిరామిక్ మెటీరియల్ ని వాడినట్లు సమాచారం. దీంతో ఫోన్ కి షైనీ, ప్రీమియమ్ లుక్ వస్తుంది. సిరామిక్ వాడటం వల్లన మైనస్ ఏంటంటే ఫోన్ బరువు పెరుగుతుంది. ఇకపోతే ఫ్రేమ్ కోసం మెటల్ ని వాడే అవకాశం ఉంది. ఫ్లాగ్షిప్ కాబట్టి కచ్చితంగా మెటల్ ఫ్రేమ్ ఉంటుంది.

OnePlus 11 డివైజ్ 16జిబి వరకు ర్యామ్ ఆప్షన్ తో వస్తుందని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. ఇప్పటి వరకు వన్ ప్లస్ నుంచి వచ్చిన అన్ని ఫ్లాగ్షిప్స్ కూడా గరిష్టంగా 12జిబి ర్యామ్ ఆప్షన్ వరకు కలిగి ఉన్నాయి. అయితే వన్‌ప్లస్ 10ఆర్ చైనా వేరియంట్ మాత్రం 16జిబి వరకు ర్యామ్ ఆప్షన్ తో వచ్చింది. ఇది ఎంట్రీ లెవెల్ ప్రీమియమ్ ఫోన్ గా పరిగణించబడుతోంది. OnePlus 11 5G యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తున్నట్లు టిప్‌స్టర్ రివీల్ చేసింది.

OnePlus 11 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇదివరకే బయటకు వచ్చాయి. ఓసారి ఆ లీకైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం పదండి.

OnePlus 11 5G స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ రివీల్ చేసిన సమాచారాన్ని బట్టి, OnePlus 11 Pro మోడల్ OnePlus 11 గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. లీకైన డిజైన్ రెండర్స్ ద్వారా ఫోన్ రియర్ కెమెరా మాడ్యూల్ సర్క్యూలర్ షేప్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా సెన్సర్ ఉంటుంది. దీనికి తోడు 48 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

OnePlus 11 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్టాండర్డ్ వర్షన్ వన్‌ప్లస్ ఫోన్ లో క్యూహెచ్డీ+ రెజుల్యూషన్ ఉండటం ఇదే తొలిసారి. టాప్ లెఫ్ట్ కార్నర్ లో హోల్ పంచ్ కౌట్ ఉంటుంది. ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోంది.

OnePlus 11 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post సిరామిక్ బాడీతో వస్తోన్న OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 11 గా పిలవబడనున్న నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ ‘ప్రో’ మోడల్ https://www.91mobiles.com/telugu/oneplus-next-generation-flagship-to-be-called-as-one-plus-11-not-11-pro/ Tue, 18 Oct 2022 05:42:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2935 హైలైట్స్ ప్రో స్పెసిఫికేషన్స్ తో కూడిన వన్ ప్లస్ నెక్ట్స్ ఫ్లాగ్షిప్ పేరు ‘OnePlus 11’ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన వన్ ప్లస్ 10 ప్రో మాదిరిగా టాప్ ఎండ్ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండనున్న OnePlus 11 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ OnePlus 11 లో ఉండే అవకాశం ఈ ఏడాది వన్ […]

The post OnePlus 11 గా పిలవబడనున్న నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ ‘ప్రో’ మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రో స్పెసిఫికేషన్స్ తో కూడిన వన్ ప్లస్ నెక్ట్స్ ఫ్లాగ్షిప్ పేరు ‘OnePlus 11’
  • ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన వన్ ప్లస్ 10 ప్రో మాదిరిగా టాప్ ఎండ్ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండనున్న OnePlus 11
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ OnePlus 11 లో ఉండే అవకాశం

ఈ ఏడాది వన్ ప్లస్ కి బిజీగా గడిచిపోయింది. ఈలోపు వన్ ప్లస్ తదుపరి ఫ్లాగ్షిప్ OnePlus 11 Pro గురించి రూమర్లు వస్తూనే ఉన్నాయి. 2023 ఆరంభంలో వన్ ప్లస్ నెక్ట్స్ ఫ్లాగ్షిప్ లాంచ్ కానుందని సమాచారం. ప్రముఖ లీక్‌స్టర్ మ్యాక్స్ జాంబర్ చెబుతున్న దాన్ని బట్టి, ప్రో-స్పెసిఫికేషన్స్ కలిగిన నెక్ట్స్ వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 గా అంతర్జాతీయంగా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇందుకు గల కారణం ఏంటో ప్రస్తుతానికి తెలియదు.

దీనర్థం ఏంటంటే, డివైజ్ లో ప్రో-గ్రేడ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కానీ, ప్రో అని పిలవబడదన్న మాట. వన్‌ప్లస్ 10 ప్రో లాగే OnePlus 11 లో కూడా టాప్-ఎండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కానీ, OnePlus 11 Pro అని పిలవబడదంతే.

అది OnePlus 11, OnePlus 11 Pro కాదు

వన్ ప్లస్ 10 ప్రో లాంచ్ అయిన టైమ్‌లైన్ లోనే OnePlus 11 కూడా లాంచ్ అవ్వనుంది. ప్రో-స్పెసిఫికేషన్స్ కలిగినప్పటికీ వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 అనే పిలవబడుతుందని, ఎందుకంటే తర్వాత మరికొన్ని మోడల్స్ ని లాంచ్ చేసే ఆలోచనలో వన్ ప్లస్ ఉందని, టిప్‌స్టర్ మ్యాక్స్ జాంబర్ తెలిపాడు.

OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానుంది. మరి ప్రో వర్షన్ ని స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్ తో తీసుకురావడానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే లీకైన OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ నిజానికి OnePlus 11 కి సంబంధించినవి. OnePlus 11 స్మార్ట్ ఫోన్ 2023 జనవరి లో లాంచ్ అవుతుంది.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

ఇదివరకు 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ యొక్క స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో రానుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఇకపోతే ఈ ఫోన్ లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ సౌకర్యం ఉంటుంది. OnePlus 11 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OnePlus 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి 2x టెలీఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంటుంది. OnePlus 11 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా.

OnePlus 11 ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో రానుంది. అలాగే ఇందులో హాజెల్‌బ్లడ్ కెమెరా సెన్సర్స్, డాల్బి అట్మాస్ ఉంటాయి. 5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ OnePlus 11 లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OnePlus 11 గా పిలవబడనున్న నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ ‘ప్రో’ మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>