OPPO Reno 9 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 24 Nov 2022 10:33:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 12GB ర్యామ్, కర్వ్డ్ డిస్ప్లే తో లాంచ్ అయిన OPPO Reno 9 https://www.91mobiles.com/telugu/oppo-reno-9-launched-in-china-with-curved-display-snapdragon-778g-chipset/ Thu, 24 Nov 2022 06:39:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=3630 హైలైట్స్ చైనాలో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్ లైనప్ లో ఉన్న మోడల్స్: OPPO Reno 9, OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, డ్యూయల్-కోర్ పొట్రెయిట్ తో లాంచ్ అయిన OPPO Reno 9 అందరూ ఎదురు చూసిన సమయం వచ్చేసింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ […]

The post 12GB ర్యామ్, కర్వ్డ్ డిస్ప్లే తో లాంచ్ అయిన OPPO Reno 9 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్
  • లైనప్ లో ఉన్న మోడల్స్: OPPO Reno 9, OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, డ్యూయల్-కోర్ పొట్రెయిట్ తో లాంచ్ అయిన OPPO Reno 9

అందరూ ఎదురు చూసిన సమయం వచ్చేసింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+. మూడు ఫోన్లు కూడా కర్వ్డ్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్-హోల్ కటౌట్ కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. డివైజెస్ ని చూస్తుంటే ప్రీమియమ్ గా కనిపిస్తున్నాయి.

OPPO Reno 9 విషయానికి వస్తే, ఇది రెనో సిరీస్ లో బేస్ వేరియంట్. కర్వ్డ్ డిస్ప్లే తో OPPO Reno 9 రావడం విశేషం. ఈ రకం డిస్ప్లే ఫోన్ కి మంచి లుక్ తీసుకొచ్చింది. OPPO Reno 9 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా, డ్యూయల్-కోర్ పొట్రెయిట్ ఫీచర్, స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ తో వచ్చింది. OPPO Reno 9 టుమారో గోల్డ్, బ్లాక్, స్లైట్లీ డ్రంక్ అనే మూడు కలర్ వేరియంట్స్ లో లభించనుంది.

OPPO Reno 9 స్పెసిఫికేషన్స్

OPPO Reno 9 స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, బిలియన్ కలర్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ మూడు వైపులా బెజెల్స్ లేకుండా వచ్చింది. బాటమ్ లో 2.3 ఎంఎం చిన్ మాత్రమే ఉండటం విశేషం.

ఇప్పుడు OPPO Reno 9 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OPPO Reno 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

OPPO Reno 9 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OPPO Reno 9 డివైజ్ 174 గ్రాముల బరువు, 7.19 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ డివైజ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీఎన్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OPPO Reno 9 ధర

OPPO Reno 9 డివైజ్ మొత్తం 3 వేరియంట్లలో లభిచనుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • 8జిబి + 256జిబి ధర – CNY 2499 (సుమారు రూ.28,571)
  • 12జిబి + 256జిబి ధర – CNY 2699 (సుమారు రూ.30,858)
  • 12జిబి + 512జిబి ధర – CNY 2999 (సుమారు రూ.34,288)

Note: ఈ వార్తను తమిళంలో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 12GB ర్యామ్, కర్వ్డ్ డిస్ప్లే తో లాంచ్ అయిన OPPO Reno 9 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Reno 9 సిరీస్ డిజైన్ పిక్స్; రివీల్ అయిన కెమెరా మాడ్యూల్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-9-series-design-leaked-before-launch/ Mon, 14 Nov 2022 12:12:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=3417 హైలైట్స్ త్వరలో చైనాలో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్ ఈ లైనప్ లో ఉండే మోడల్స్: OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ తాజాగా లీకైన OPPO Reno 9 సిరీస్ డిజైన్ రెండర్స్ ద్వారా రివీల్ అయిన కెమెరా మాడ్యూల్, కలర్ ఆప్షన్స్ OPPO Reno 9 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Reno 9, Reno 9 Pro, Reno 9 […]

The post లీకైన OPPO Reno 9 సిరీస్ డిజైన్ పిక్స్; రివీల్ అయిన కెమెరా మాడ్యూల్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్
  • ఈ లైనప్ లో ఉండే మోడల్స్: OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+
  • తాజాగా లీకైన OPPO Reno 9 సిరీస్ డిజైన్ రెండర్స్ ద్వారా రివీల్ అయిన కెమెరా మాడ్యూల్, కలర్ ఆప్షన్స్

OPPO Reno 9 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. త్వరలోనే ఒప్పో నుంచి OPPO Reno 9 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటన రానుంది. తొలుత ఈ డివైజెస్ చైనాలో లాంచ్ అవుతాయి. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాయి. తాజాగా OPPO Reno 9 సిరీస్ యొక్క డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ వీటిని లీక్ చేశాడు. లీక్స్ ద్వారా OPPO Reno 9 సిరీస్ ఫోన్ల యొక్క కెమెరా మాడ్యూల్స్, కలర్ ఆప్షన్స్ వివరాలు రివీల్ అయ్యాయి.

తాజాగా లీకైన డిజైన్ రెండర్స్ ద్వారా OPPO Reno 9 సిరీస్ కొన్ని డిజైన్ మార్పులతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి OPPO Reno 9 సిరీస్ డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OPPO Reno 9 సిరీస్ డిజైన్ రెండర్స్

OPPO Reno 9 సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ ఆరంభంలో చైనాలో లాంచ్ కానుంది. OPPO Reno 9 సిరీస్ లో మూడు మోడల్స్ ఉంటాయి. వీటిలో చవకైనది స్టాండర్డ్ మోడల్ OPPO Reno 9. ఈ Reno 9 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెనో 8 మాదిరి కెమెరా మాడ్యూల్ ఇందులో లేదు. దానికి బదులుగా ఈ ఫోన్ రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ని కలిగి ఉంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్, డమ్మీ కటౌట్ ఉన్నాయి.

OPPO Reno 9 లో కర్వ్డ్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ ఉన్నాయి. కర్వ్డ్ ఫ్రేమ్ లో ఎడమ వైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. కుడివైపున పవర్ బటన్ ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంటాయి.

OPPO Reno 9 Pro లో డ్యూయల్ కెమెరా సెటప్, డ్యూయల్ టోన్ బ్యాక్ బాడీ ఉన్నాయి. శాంసంగ్ ఎస్22 వంటి కెమెరా మాడ్యూల్ డిజైన్ ఇందులో ఉంది. OPPO Reno 9 Pro రెండు రియర్ కెమెరాలు, డ్యూయల్ ఫ్లాష్ తో వస్తోంది. ఇందులో మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూ ఉంది. ముందు వైపున హోల్-పంచ్ కటౌట్ ఉంది. స్క్రీన్ ఎడ్జెస్ కర్వ్ కాబడి ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఇందులో ఉంటాయి.

OPPO Reno 9 Pro+ 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఎస్21 అల్ట్రా మాదిరి కెమెరా మాడ్యూల్ ఇందులో ఉంది. ఫ్రేమ్ కర్వ్డ్ గా ఉంది. పవర్ బటన్ కుడివైపున ఉంది. ఎడమ వైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. పంచ్ హోల్ కటౌట్ తో కూడిన కర్వ్డ్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంటాయి. ఈ ఫోన్ లో 50 ఎంపి సోని ఐఎంఎక్స్890 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.

OPPO Reno 9 స్మార్ట్ ఫోన్ రోజ్ గోల్డ్ కలర్ లో వస్తోంది. OPPO Reno 9 Pro స్మార్ట్ ఫోన్ షిమ్మరీ గోల్డ్ కలర్ ఆప్షన్, OPPO Reno 9 Pro+ 5G గ్రీన్ కలర్ ఆప్షన్ లో వస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OPPO Reno 9 సిరీస్ డిజైన్ పిక్స్; రివీల్ అయిన కెమెరా మాడ్యూల్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-9-series-specs-leaked-ahead-of-launch/ Fri, 11 Nov 2022 14:09:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=3393 హైలైట్స్ వచ్చే ఏడాది భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీకైన OPPO Reno 9 సిరీస్ స్పెసిఫికేషన్స్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న OPPO Reno 9 Pro+ OPPO Reno 9 సిరీస్ లాంచ్ దగ్గర్లోనే ఉంది. అయితే OPPO Reno 9 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ లైనప్ […]

The post లీకైన OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • వచ్చే ఏడాది భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్
  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీకైన OPPO Reno 9 సిరీస్ స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న OPPO Reno 9 Pro+

OPPO Reno 9 సిరీస్ లాంచ్ దగ్గర్లోనే ఉంది. అయితే OPPO Reno 9 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ లైనప్ లో కనీసం 3 మోడల్స్ ఉంటాయని చెబుతున్నారు. అవి: OPPO Reno 9, OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+. వచ్చే ఏడాది ఆరంభంలో OPPO Reno 9 సిరీస్ భారత్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈలోపు OPPO Reno 9 సిరీస్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి.

తాజాగా లీకైన సమాచారం ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చింది. OPPO Reno 9 సిరీస్ యొక్క ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్ వివరాలను టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఓసారి OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 9 Pro+ 5G స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానుంది. ఇదివరకు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుందని రూమర్లు వచ్చాయి. అయితే 8+ జెన్ 1 కూడా శక్తివంతంగా పని చేస్తుందని గమనించాలి. దాదాపుగా 8 జెన్ 2 చిప్ కి అటు ఇటుగా సమానమైన పెర్ఫామెన్స్ ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పెద్దగా బాధపడాల్సిన పని లేదు.

OPPO Reno 9 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఇందులో ఉంటుంది. అలాగే 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు ఇందులో ఉండనున్నాయి.

OPPO Reno 9 Pro+ 5G లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

OPPO Reno 9 Pro స్పెసిఫికేషన్స్

OPPO Reno 9 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా సెన్సర్ ఉండనుంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. OPPO Reno 9 Pro మరియు OPPO Reno 9 Pro+ ఫోన్లలో మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌‌పీయూ ఉంటుంది. ఇది లో-లైట్ ఫోటోగ్రఫీని మెరుగుపరచడంలో సాయపడుతుంది.

OPPO Reno 9 Pro లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది.

OPPO Reno 9 స్పెసిఫికేషన్స్

స్టాండర్డ్ వేరియంట్ అయిన OPPO Reno 9 లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంటుంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Reno 9 సిరీస్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎం ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతోంది. అలాగే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, బిలియన్ కలర్ సపోర్ట్ ఉంటాయని టిప్‌స్టర్ వెల్లడించింది. ఫోన్ చిన్ సైజ్ 2.3 ఎంఎం ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన OPPO Reno 9 లైవ్ ఇమేజెస్; రివీల్ అయిన డిజైన్ https://www.91mobiles.com/telugu/oppo-reno-9-live-images-design-leaked-before-launch/ Thu, 13 Oct 2022 05:34:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=2894 హైలైట్స్ ఈ ఏడాది OPPO Reno 9 లాంచ్ అవుతుందని అంచనా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO Reno 9 లైవ్ ఇమేజెస్, రివీల్ అయిన డిజైన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OPPO ఈ ఏడాది Reno 9 సిరీస్ ని లాంచ్ చేయనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. 2022 నవంబర్ లేదా డిసెంబర్ నెలలో Reno 9 సిరీస్ చైనాలో లాంచ్ […]

The post లాంచ్ కి ముందు లీకైన OPPO Reno 9 లైవ్ ఇమేజెస్; రివీల్ అయిన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఈ ఏడాది OPPO Reno 9 లాంచ్ అవుతుందని అంచనా
  • నవంబర్ లేదా డిసెంబర్ నెలలో చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం
  • తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO Reno 9 లైవ్ ఇమేజెస్, రివీల్ అయిన డిజైన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OPPO ఈ ఏడాది Reno 9 సిరీస్ ని లాంచ్ చేయనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. 2022 నవంబర్ లేదా డిసెంబర్ నెలలో Reno 9 సిరీస్ చైనాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒప్పో నుంచి దీనికి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఇటీవలి కాలంలో రెనో 9 కి యొక్క లీక్స్ వరుసగా నెట్టింట్లో కనిపిస్తుండటంతో, ఈ సిరీస్ లాంచ్ త్వరలోనే ఉండనుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా ఓ లీక్ ద్వారా OPPO Reno 9 డిజైన్, లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చాయి.

చైనాలో OPPO Reno 9 లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ తో పాటు, Reno 9 Pro, Reno 9 Pro Plus ఉంటాయి. ఒప్పో సంస్థ భారత్ లో కూడా Reno 9 సిరీస్ ని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే ఒప్పో నుంచి రెనో 9 సిరీస్ లాంచ్ కి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈలోపు మనం OPPO Reno 9 యొక్క లైవ్ ఇమేజెస్, డిజైన్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 9 లైవ్ ఇమేజెస్

 

OPPO Reno 9 కంపెనీ యొక్క అప్పర్ మిడ్-రేంజ్ ఆఫరింగ్ గా వస్తోంది. 2022 నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఈ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లాంచ్ కి ముందు ఫోన్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఫోన్ ని గమనిస్తే కొన్ని స్వల్పస్థాయి డిజైన్ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరా మాడ్యూల్ డిజైన్ కాస్త ట్వీక్ చేయబడింది. అయితే కెమెరా సెన్సర్ లేఔట్ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు కెమెరా మాడ్యూల్ ఫ్లాట్ గా, రెక్టాంగ్యులర్ షేప్ లో కనిపిస్తోంది.

OPPO Reno 9 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముందు చూస్తే, హోల్-పంచ్ కౌటౌట్ మధ్యలో కనిపిస్తోంది. ఇందులో ఫ్రంట్ కెమెరా ఉంది. OPPO Reno 8 హోల్-పంచ్ కటౌట్ టాప్ లెఫ్ట్ లో ఉంటుంది. ఇక స్క్రీన్ ఫ్లాట్ గా, సన్నని బెజెల్స్ తో కనిపిస్తోంది.

ఇప్పటి వరకు ఫోన్ డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్ కి సంబంధించి ఎక్కువ వివరాలు తెలియలేదు. అయితే OPPO Reno 9 స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ తో వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రో వేరియంట్స్ లో డైమెన్సిటీ 8000 చిప్పెట్ ఉండనుంది. 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్766 మెయిన్ కెమెరా సెన్సర్ తో రెనో 9 సిరీస్ ని ఒప్పో లాంచ్ చేయనుందని సమాచారం.

అలాగే OPPO Reno 9 4500ఎంఏహెచ్ యూనివర్శల్ ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్ (UFCS) స్టాండర్డ్ తో వస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. OPPO Reno 9 40 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. గత రెనో సిరీస్ అయిన OPPO Reno 8 లో 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్న విషయం గమనించాలి. అయితే UFCS స్టాండర్డ్ తో విభిన్న బ్రాండ్స్ కి చెందిన చార్జర్ తో ఫోన్ ని చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఈ స్టాండర్డ్ 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని ఆఫర్ చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన OPPO Reno 9 లైవ్ ఇమేజెస్; రివీల్ అయిన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 778G ప్రాసెసర్ తో వస్తోన్న OPPO Reno 9 https://www.91mobiles.com/telugu/oppo-reno-9-series-to-come-with-snapdragon-778g-processor/ Tue, 04 Oct 2022 11:08:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=2734 హైలైట్స్: త్వరలోనే Reno 8 సిరీస్ సక్సెసర్ Reno 9 సిరీస్ ని లాంచ్ చేయనున్న OPPO Snapdragon 778G చిప్ తో రానున్న Reno 9 సిరీస్, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో వస్తుందని ఇది వరకు వచ్చిన ఊహాగానాలు UFCS (Universal Fast Charging Specification) స్టాండర్డ్ తో వస్తున్న Reno 9 సిరీస్ Reno 8 సిరీస్ లాంచ్ తర్వాత Reno 9 సిరీస్ పై ఒప్పో కంపెనీ […]

The post Snapdragon 778G ప్రాసెసర్ తో వస్తోన్న OPPO Reno 9 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలోనే Reno 8 సిరీస్ సక్సెసర్ Reno 9 సిరీస్ ని లాంచ్ చేయనున్న OPPO
  • Snapdragon 778G చిప్ తో రానున్న Reno 9 సిరీస్, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో వస్తుందని ఇది వరకు వచ్చిన ఊహాగానాలు
  • UFCS (Universal Fast Charging Specification) స్టాండర్డ్ తో వస్తున్న Reno 9 సిరీస్

Reno 8 సిరీస్ లాంచ్ తర్వాత Reno 9 సిరీస్ పై ఒప్పో కంపెనీ దృష్టి పెట్టింది. ఇదివరకు ఒప్పో Reno 9 సిరీస్ యొక్క చార్జింగ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. తాజాగా ఈ లైనప్ యొక్క చిప్సెట్ ఏంటో తెలిసింది. Weibo ద్వారా ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station షేర్ చేసిన సమాచారాన్ని బట్టి, ఒప్పో Reno 9 సిరీస్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 7 జెన్ 1 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తుందని ఇదివరకు భావించారు. కానీ తాజాగా 778జి చిప్సెట్ సీన్ లోకి వచ్చింది.

Reno 9 సిరీస్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం. ఇది UFCS సపోర్ట్ తో వస్తోంది. UFCS స్టాండర్డ్ ని అడాప్ట్ చేసుకున్న తొలి స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో కావడం విశేషం. అయితే రెనో 8 సిరీస్ లో ఉన్న 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో పోల్చితే Reno 9 సిరీస్ లో అందించిన 40వాట్ చార్జింగ్ చాలా తక్కువ.

Reno 9 సిరీస్ ప్రాసెసర్

తాజాగా బయటకు వచ్చిన లీక్స్ ని బట్టి, Reno 9 సిరీస్ లో కాస్త పాతదైన Snapdragon 778G చిప్సెట్ ని వాడనున్నట్లు తెలుస్తోంది. Snapdragon 7 Gen 1 చిప్ లేదా MediaTek Dimensity 800 సిరీస్ చిప్ ని Reno 9 సిరీస్ లో వినియోగిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం Snapdragon 7 Gen 1 చిప్ కేవలం Reno 8 Pro చైనా వేరియంట్ మరియు Xiaomi Civi 2 ఫోన్ల లోనే ఉంది. అలాగే కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే అమ్ముడయ్యే పలు హ్యాండ్సెట్స్ లో ఈ చిప్సెట్ ఉంది.

న్యూ జనరేషన్ చిప్సెట్స్ తో ఫోన్లు లాంచ్ అవుతోన్న తరుణంలో Reno 9 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ వాడటం కచ్చితంగా డౌన్‌గ్రేడ్ అనే చెప్పాలి. మరి ఈ వార్త నిజమైతే, లాంచ్ తర్వాత కస్టమర్ల నుంచి ఈ ఫోన్ కి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

ఇక Snapdragon 778G చిప్సెట్ విషయానికి వస్తే, ఇదొక 5జీ ప్రాసెసర్. 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి, గేమ్స్ ఆడేందుకు ఈ ప్రాసెసర్ బాగానే పని చేస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాసెసర్ మంచి ఫలితాలనే ఇచ్చింది. అయితే రానున్న రోజుల్లో లాంచ్ కాబోవు స్మార్ట్ ఫోన్లు దీని కంటే మెరుగైన చిప్సెట్స్ తో లాంచ్ అవ్వనున్నాయి. ఈ తరుణంలో ఒప్పో కంపెనీ Reno 9 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్ ని వాడటం ఆమోదయోగ్యం కాదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Snapdragon 778G ప్రాసెసర్ తో వస్తోన్న OPPO Reno 9 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Reno 9 సిరీస్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-9-series-battery-fast-charging-specifications-revealed/ Fri, 30 Sep 2022 11:12:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=2677 హైలైట్స్: రెనో 8 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న OPPO Reno 9 సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 సిరీస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ చిప్సెట్స్ తో వస్తున్న OPPO Reno 9 సిరీస్ యూనివర్శల్ ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్ (UFCS) ని అడాప్ట్ చేసుకున్న తొలి కంపెనీ OPPO OPPO కంపెనీ కొన్ని నెలల క్రితం Reno 8 సిరీస్ ని భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది. […]

The post లీకైన OPPO Reno 9 సిరీస్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రెనో 8 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న OPPO Reno 9 సిరీస్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 సిరీస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ చిప్సెట్స్ తో వస్తున్న OPPO Reno 9 సిరీస్
  • యూనివర్శల్ ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్ (UFCS) ని అడాప్ట్ చేసుకున్న తొలి కంపెనీ OPPO

OPPO కంపెనీ కొన్ని నెలల క్రితం Reno 8 సిరీస్ ని భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది. త్వరలోనే OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేయాలని ఒప్పో సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. OPPO Reno 9 సిరీస్ నవంబర్ నెలలో ఎంట్రీ ఇవ్వనుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station చైనీస్ సోషల్ మీడియా మాధ్యమం Weibo లో OPPO Reno 9 సిరీస్ కి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ఆ లీక్ ప్రకారం, OPPO Reno 9 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ చిప్సెట్స్ తో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

సరికొత్త UFCS (యూనివర్శల్ ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్) ని అడాప్ట్ చేసుకున్న తొలి కంపెనీగా ఒప్పో నిలవనుంది. ఇది గరిష్టంగా 40వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగిన ఏకీకృత చార్జింగ్ స్టాండర్డ్. Reno 9 సిరీస్ UFCS సపోర్ట్ కలిగిన 4500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

OPPO Reno 9 సిరీస్

OPPO Reno 9 సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7, మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ చిప్సెట్స్ తో లాంచ్ అవుతోంది. రెనో 8 సిరీస్ కూడా ఇదే విధంగా వచ్చింది. OPPO Reno 9 సిరీస్ యూఎఫ్‌సీఎస్ స్టాండర్డ్ తో వస్తోంది. ప్రస్తుతం దీని ద్వారా 40 వాట్ చార్జింగ్ కెపాసిటీతో చార్జ్ చేయవచ్చు. ఈ వివరాలు కాకుండా ఇంకా వేరే ఇతర విషయాలు ప్రస్తుతానికి తెలియలేదు. రానున్న రోజుల్లో OPPO Reno 9 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

UFCS స్టాండర్డ్ అంటే ఏమిటి?

UFCS అంటే ‘యూనివర్శల్ ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్’. విభిన్న బ్రాండ్స్ కి చెందిన పలు రకాల డివైజెస్ కి సపోర్ట్ చేసే యాక్ససరీలను తయారు చేసే విధానమే ఈ UFCS. ఇప్పటికే చైనా కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అసోసియేషన్ 11 ఫాస్ట్ చార్జింగ్ సర్టిఫికేషన్స్ యొక్క మొదటి బ్యాచ్ ని రిలీజ్ చేసింది. కన్సార్టియమ్ మెంబర్స్ సర్టిఫికేషన్స్ కి ఆమోదం తెలిపారు.

ప్రస్తుతం కొత్త స్టాండర్డ్ ఐదు మేజర్ చార్జింగ్ టెక్నాలజీ లను ప్రమోట్ చేయనుంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్స్ ని ఇంప్రూవ్ చేయనుంది. తద్వారా పలు రకాల అప్లికేషన్స్ కి సపోర్ట్ ఇచ్చే విధంగా మార్పు చెందనుంది. ఆ విధంగా ఒకే రకమైన ఏకీకృత విధానాన్ని ఇండస్ట్రీ స్థాయిలో వాలిడ్ అయ్యేలా చేయడమే ప్రథమ లక్ష్యం. త్వరలోనే యూసీఎస్ స్టాండర్డ్ ని అన్ని బ్రాండ్స్ అడాప్ట్ చేసుకునేలా ప్రమోట్ చేయనున్నారు. ఈ యూఎఫ్‌సీఎస్ స్టాండర్డ్ కోసం హువావే, ఒప్పో, వివో, షావోమీ కలిసి పని చేస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లీకైన OPPO Reno 9 సిరీస్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>