Realme GT 5 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 07 Dec 2023 16:33:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 8 Gen 3 చిప్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Realme GT 5 Pro https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-launched-china-price-specs-availability/ Thu, 07 Dec 2023 16:33:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=9188 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనీస్ మార్కెట్ లో Realme GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, ఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సర్ వంటి స్పెసిఫికేషన్స్ Realme GT 5 Pro లో ఉన్నాయి. ప్రస్తుతం Realme GT 5 Pro డివైజ్ ని చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ జేడీ.కామ్ మరియు టీమాల్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ కి […]

The post Snapdragon 8 Gen 3 చిప్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Realme GT 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Realme GT 5 Pro
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Realme GT 5 Pro ప్రారంభ ధర 3,399 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనీస్ మార్కెట్ లో Realme GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, ఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సర్ వంటి స్పెసిఫికేషన్స్ Realme GT 5 Pro లో ఉన్నాయి. ప్రస్తుతం Realme GT 5 Pro డివైజ్ ని చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ జేడీ.కామ్ మరియు టీమాల్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంటాయి.

Realme GT 5 Pro ధర, లభ్యత

  • Realme GT 5 Pro డివైజ్ యొక్క ప్రీ-ఆర్డర్స్ చైనాలో డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతాయి.
  • Realme GT 5 Pro డివైజ్ ఆరెంజ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Realme GT 5 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,399 యువాన్లు (సుమారు రూ.39,800) గా ఉంది. ప్రీ-ఆర్డర్ చేసే వారికి 3,298 యువాన్లు (సుమారు రూ.38,670) కి లభించనుంది.
  • Realme GT 5 Pro 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.43,379) గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ డివైజ్ 3,598 యువాన్ల (సుమారు రూ.42,194) కి లభించనుంది.
  • Realme GT 5 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,800) గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ ని 3,898 యువాన్ల (సుమారు రూ.45,700) కి సొంతం చేసుకోవచ్చు.
  • Realme GT 5 Pro టాప్ మోడల్ 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ధర 4,299 యువాన్లు (సుమారు రూ.50,400) గా ఉంది. ప్రీ-ఆర్డర్ చేసుకునే వారు ఈ ఫోన్ ని 4,198 యువాన్ల (సుమారు రూ.49,000) కి సొంతం చేసుకోవచ్చు.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ ఓఎల్ఈడీ డిస్ప్లే, కర్వ్డ్ కార్నర్స్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 808 ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్890 పెరిస్కోప్ టెలీఫోటో 3x లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme GT 5 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ 3.2 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Realme GT 5 Pro డివైజ్ 161.72 మి.మీ పొడవు, 75.06 మి.మీ వెడల్పు, 9.23 మి.మీ మందం, 218 గ్రాముల బరువు ఉంటుంది. గ్లాస్ వేరియంట్ 224 గ్రాముల బరువు ఉంటుంది.

The post Snapdragon 8 Gen 3 చిప్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Realme GT 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 3 చిప్, పెరిస్కోప్ సెన్సర్‌తో వస్తోన్న Realme GT 5 Pro; లాంచ్ తేదీ ఖరారు! https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-featuring-periscope-lens-snapdragon-8-gen-3-chip-launch-date-revealed/ Fri, 24 Nov 2023 10:44:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=8955 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme GT 5 Pro ని లాంచ్ చేయనుంది. Realme GT 5 Pro డివైజ్ పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న రియల్మీ యొక్క మొదటి ఫోన్. రీసెంట్ గా రియల్మీ సంస్థ చైనాలో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో సదరు సంస్థ Realme GT 5 Pro డివైజ్ కలిగి ఉన్న పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్ విశేషాలను పంచుకుంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. మిడ్-రేంజ్ […]

The post Snapdragon 8 Gen 3 చిప్, పెరిస్కోప్ సెన్సర్‌తో వస్తోన్న Realme GT 5 Pro; లాంచ్ తేదీ ఖరారు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT 5 Pro
  • Realme GT 5 Pro లాంచ్ తేదీ ఖరారు
  • డిసెంబర్ 7న లాంచ్ అవుతోన్న GT 5 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme GT 5 Pro ని లాంచ్ చేయనుంది. Realme GT 5 Pro డివైజ్ పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న రియల్మీ యొక్క మొదటి ఫోన్. రీసెంట్ గా రియల్మీ సంస్థ చైనాలో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో సదరు సంస్థ Realme GT 5 Pro డివైజ్ కలిగి ఉన్న పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్ విశేషాలను పంచుకుంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

మిడ్-రేంజ్ బడ్జెట్ లో వస్తోన్న Realme GT 5 Pro డివైజ్ పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నట్లు రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఇకపోతే ఇప్పటికే Realme GT 5 Pro డివైజ్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ సైట్ లో లిస్ట్ అయ్యింది. 3సీ లిస్టింగ్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు తెలిసాయి. ఇక గీక్‌బెంచ్ ద్వారా Realme GT 5 Pro డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో రానున్నట్లు తెలిసింది. తాజాగా రియల్మీ సంస్థ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో పై కొత్త టీజర్ షేర్ చేసింది. దీని ద్వారా లాంచ్ తేదీ రివీల్ అయ్యింది.

Realme GT 5 Pro లాంచ్ తేదీ

Realme GT 5 Pro డివైజ్ చైనాలో డిసెంబర్ 7 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతోంది. పెరిస్కోప్ సెన్సర్ తో Realme GT 5 Pro డివైజ్ వస్తున్నట్లు రియల్మీ కన్ఫర్మ్ చేసింది. పెరిస్కోప్ లెన్స్ జూమ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రానున్న రోజుల్లో జేడి.కామ్ ఈ ఫోన్ ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశం ఉండవచ్చు.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ వాడనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 Pro డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Realme GT 5 Pro లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్ల్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో రానుంది.
  • సెక్యూరిటీ: Realme GT 5 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించనున్నారు.
  • సాఫ్ట్‌వేర్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Snapdragon 8 Gen 3 చిప్, పెరిస్కోప్ సెన్సర్‌తో వస్తోన్న Realme GT 5 Pro; లాంచ్ తేదీ ఖరారు! first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై లిస్టైన Realme GT 5 Pro; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-geekbench-listing-key-specs/ Thu, 16 Nov 2023 06:36:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=8851 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా Realme GT 5 Pro బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో Realme GT 5 Pro యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి Realme […]

The post Geekbench పై లిస్టైన Realme GT 5 Pro; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT 5 Pro
  • గీక్ బెంచ్ పై లిస్టైన డివైజ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా Realme GT 5 Pro బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో Realme GT 5 Pro యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ మరియు గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 5 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

  • మైస్మార్ట్‌ప్రైస్ Realme GT 5 Pro యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ స్క్రీన్‌షాట్ ని తన కథనం ద్వారా పంచుకుంది.
  • దాని ప్రకారం, Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • అయితే ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే Realme GT 5 Pro డివైజ్ RMX3888 అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ పై లిస్టైంది.
  • Realme GT 5 Pro గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1229 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4699 పాయింట్లు నమోదు చేసింది.
  • రీసెంట్ గా లిస్టైన ఇతర అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్లతో పోల్చితే ఈ గీక్‌బెంచ్ స్కోర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Realme GT 5 Pro లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని లైవైటీ-టీ808 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఒమ్నివిజన్ ఒవి0810 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • సాఫ్ట్‌వేర్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Geekbench పై లిస్టైన Realme GT 5 Pro; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme GT 5 Pro ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-price-design-specs-leaked-before-launch/ Thu, 09 Nov 2023 13:08:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8778 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే GT సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 5 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. కంపెనీ ఇప్పటికే కీలక స్పెసిఫికేషన్స్ ని కన్ఫర్మ్ చేసింది. అలాగే గత కొన్ని రోజుల నుంచి డివైజ్ కి సంబంధించిన వార్తలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజా సమాచారాన్ని గమనించినట్లయితే, Realme GT 5 Pro యొక్క స్పెసిఫికేషన్, ధర, లైవ్ ఇమేజ్ బయటకు […]

The post లీకైన Realme GT 5 Pro ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT 5 Pro
  • తాజాగా లీకైన డిజైన్, ధర
  • 6.78-ఇంచ్ బీఓఈ స్క్రీన్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే GT సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 5 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. కంపెనీ ఇప్పటికే కీలక స్పెసిఫికేషన్స్ ని కన్ఫర్మ్ చేసింది. అలాగే గత కొన్ని రోజుల నుంచి డివైజ్ కి సంబంధించిన వార్తలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజా సమాచారాన్ని గమనించినట్లయితే, Realme GT 5 Pro యొక్క స్పెసిఫికేషన్, ధర, లైవ్ ఇమేజ్ బయటకు వచ్చాయి. దీంతో మరిన్ని విషయాలు రివీల్ అయ్యాయి.

Realme GT 5 Pro డిజైన్ (లీక్)

  • చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై ఒక యూజర్ Realme GT 5 Pro యొక్క ఇమేజ్ ని షేర్ చేశారు.
  • Realme GT 5 Pro ఇమేజ్ ని చూస్తే, తెలుపు రంగు వేరియంట్ రివీల్ అయినట్లు తెలుస్తోంది.
  • స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా కటౌట్ కనిపిస్తోంది.
  • ట్రిపుల్ కెమెరా సెటప్ , ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ బీఓఈ స్క్రీన్ ఉంటుంది. ఇది 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంటుంది.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడినట్లు సమాచారం.
  • మెమొరీ: Realme GT 5 Pro డివైజ్ 1టిబి వరకు స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
  • కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Realme GT 5 Pro ధర (లీక్)

  • లీకైన సమాచారాన్ని బట్టి, Realme GT 5 Pro 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,999 (సుమారు రూ.34,200) ఉండే అవకాశం ఉంది.
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,299 (సుమారు రూ.37,700) ఉంటుందని అంచనా.
  • 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర CNY 3,699 (సుమారు రూ.42,200) గా ఉండే అవకాశం ఉంది.

The post లీకైన Realme GT 5 Pro ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme GT 5 Pro కెమెరా స్పెసిఫికేషన్స్; Sony-LYTIA సెన్సర్‌తో వచ్చే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-camera-specs-leaked-sony-lytia-sensor-expected/ Fri, 03 Nov 2023 06:13:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=8676 Realme GT 5 Pro స్మార్ట్ పోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు చాలా వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అవుతూ వస్తున్నాయి. తాజాగా రియర్ కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme GT 5 Pro లో సోని ఎల్‌వైటీఏ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తున్నట్లు ఇదివరకే కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా కంపెనీ […]

The post లీకైన Realme GT 5 Pro కెమెరా స్పెసిఫికేషన్స్; Sony-LYTIA సెన్సర్‌తో వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజాగా లీకైన Realme GT 5 Pro రియర్ కెమెరా స్పెక్స్
  • ఈ ఏడాది ఆఖర్లో డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఫోన్

Realme GT 5 Pro స్మార్ట్ పోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు చాలా వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అవుతూ వస్తున్నాయి. తాజాగా రియర్ కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme GT 5 Pro లో సోని ఎల్‌వైటీఏ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తున్నట్లు ఇదివరకే కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా కంపెనీ ఒక ప్రో అని రాసి ఉన్న టీజర్ ఇమేజ్ నెట్టింట్లో వదిలింది. దీంతో త్వరలోనే Realme GT 5 Pro లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

నవంబర్ ఆఖర్లో Realme GT 5 Pro డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. లేదా డిసెంబర్ ఆరంభంలో ఈ డివైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పటివరకు Realme GT 5 Pro గురించి తెలిసిన వివరాలను తెలుసుకుందాం.

లీకైన Realme GT 5 Pro కెమెరా స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 5 Pro యొక్క రియర్ కెమెరా స్పెసిఫికేషన్స్ చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై షేర్ చేసింది. పోస్ట్ ప్రకారం, Realme GT 5 Pro డివైజ్ Sony Lytia LYT808 సెన్సర్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే కెమెరా సెన్సర్ తో OnePlus 12 కూడా మార్కెట్ లోకి వస్తోంది.

ఇంకా Realme GT 5 Pro లో 8ఎంపి ఒమ్నివిజన్ ఒవివో8డి10 అల్ట్రావైడ్ లెన్స్, ఒక ఐఎంఎక్స్890 పెరిస్కోప్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. గతంలో TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన కెమెరా స్పెసిఫికేషన్స్ ప్రకారం, Realme GT 5 Pro లో 50ఎంపి ప్రైమరీ లెన్స్, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. ఇక 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్, అడ్రెనో 750 జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: Realme GT 5 Pro డివైజ్ 12జిబి/16జిబి/24జిబి ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుందని అంచనా.
  • సాఫ్ట్‌వేర్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme GT 5 Pro లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme GT 5 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • చుట్టు కొలత, బరువు: Realme GT 5 Pro డివైజ్ 161.6 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 9.2 మి.మీ మందం, 220 గ్రాముల బరువు ఉంటుంది.

The post లీకైన Realme GT 5 Pro కెమెరా స్పెసిఫికేషన్స్; Sony-LYTIA సెన్సర్‌తో వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Realme GT 5 Pro డిజైన్; కన్ఫర్మ్ అయిన టెలీఫోటో సెన్సర్! https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-design-leak-telephoto-sensor-confirmed/ Thu, 26 Oct 2023 13:15:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=8535 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం. ఇంకా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ మార్కెటింగ్ పేరుని కంపెనీ వెల్లడించలేదు. కానీ, Realme GT 5 Pro అని అంతా భావిస్తున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఈ ఫోన్ ఇమేజెస్ ప్రత్యక్షమయ్యాయి. సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA ద్వారా Realme GT 5 Pro యొక్క […]

The post రివీలైన Realme GT 5 Pro డిజైన్; కన్ఫర్మ్ అయిన టెలీఫోటో సెన్సర్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • TENAA ఇమేజెస్ ద్వారా రివీలైన Realme GT 5 Pro డిజైన్
  • టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు ఖరారు
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని అంచనా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం. ఇంకా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ మార్కెటింగ్ పేరుని కంపెనీ వెల్లడించలేదు. కానీ, Realme GT 5 Pro అని అంతా భావిస్తున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఈ ఫోన్ ఇమేజెస్ ప్రత్యక్షమయ్యాయి. సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA ద్వారా Realme GT 5 Pro యొక్క ఇమేజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఇమేజెస్ తో టెలీఫోటో సెన్సర్ ని రియల్మీ తన అప్‌కమింగ్ ఫోన్ లో తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Realme GT 5 Pro డిజైన్

  • Realme GT 5 Pro ఇమేజెస్ ద్వారా ఫోన్ లో సెంటర్-పంచ్ హోల్ కటౌట్ ఉన్నట్లు తెలుస్తోంది. కర్వ్డ్ ఎడ్జెస్, సన్నని బెజెల్స్ కనిపిస్తున్నాయి.
  • Realme GT 5 Pro డివైజ్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. సైడ్ ఫ్రేమ్ మెటల్ తో తయారైనట్లు తెలుస్తోంది.
  • బ్యాక్ ప్యానెల్ తెలుపు రంగులో కనిపిస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • Realme GT 5 Pro లో బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో నాలుగు కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT 5 Pro లో 1.5కే బీఓఈ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించినట్లు తెలుస్తోంది.
  • మెమొరీ: Realme GT 5 Pro లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme GT 5 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్966 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి ఓవీ64బి ఓఐఎస్ 3x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post రివీలైన Realme GT 5 Pro డిజైన్; కన్ఫర్మ్ అయిన టెలీఫోటో సెన్సర్! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Realme 12 Pro+ రెండర్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-render-leaked-before-launch/ Thu, 28 Sep 2023 08:18:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=8195 ప్రముఖ టెక్ బ్రాండ్ Realme త్వరలోనే తన కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించి ఒక పిక్ రివీల్ అయ్యింది. అయితే ఆ పిక్ లో కనిపిస్తోన్న డివైజ్ Realme 12 Pro+ లేదా Realme GT 5 Pro ఫోన్లలో ఏదో ఒకటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా రియల్మీ కూడా ఒక కొత్త ఫోన్ ని సోషల్ మీడియాలో టీజ్ చేసింది. దాని మాదిరే ఇప్పుడు లీకైన […]

The post రివీలైన Realme 12 Pro+ రెండర్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రివీలైన రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్ పిక్
  • పిక్‌లో ఉన్న ఫోన్ Realme 12 Pro+ అని అంచనా
  • పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Realme త్వరలోనే తన కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించి ఒక పిక్ రివీల్ అయ్యింది. అయితే ఆ పిక్ లో కనిపిస్తోన్న డివైజ్ Realme 12 Pro+ లేదా Realme GT 5 Pro ఫోన్లలో ఏదో ఒకటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా రియల్మీ కూడా ఒక కొత్త ఫోన్ ని సోషల్ మీడియాలో టీజ్ చేసింది. దాని మాదిరే ఇప్పుడు లీకైన పిక్ ఉంది. సరే, ఓసారి లీకైన రెండర్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ రెండర్ (లీక్)

  • రియల్మీ నుంచి రాబోవు కొత్త ఫోన్ యొక్క రెండర్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై ప్రత్యక్షమైంది.
  • ఈ పిక్ లో ఉన్న ఫోన్ Realme GT 5 Pro అని కొందరు భావిస్తున్నారు. కానీ రీసెంట్ గా లాంచైన Realme GT 5 తో పోల్చితే డిజైన్ కాస్త వేరుగా ఉంది.
  • అయితే భారత్ కి చెందిన టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్, ఈ ఫోన్ Realme 12 Pro+ అంటూ ఓ పోస్ట్ చేశారు.
  • రెండర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, రెండు సర్క్యులర్ కెమెరాలు, ఒక రెక్టాంగ్యులర్ షేప్ లో ఉన్న లెన్స్ ఉన్నాయి. వీటితోపాటు మ్యాక్స్ కెన్ జూమ్ అని రాసి ఉంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ కి కింద రియల్మీ బ్రాండింగ్ ఉంది.
  • డివైజ్ కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా డివైజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.
  • మరి ఈ ఫోన్ Realme 12 Pro+ లేదా Realme GT 5 Pro లలో ఏ పేరుతో పిలుస్తారో చూడాలి. త్వరలోనే రియల్మీ నుంచి దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.

Realme 12 Pro+ కెమెరా స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • రియల్మీ కంపెనీ యొక్క గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై రీసెంట్ గా ఒక కొత్త ఫోన్ కి సంబంధించిన సమాచారం రివీల్ అయ్యింది.
  • పోస్ట్ లో డివైజ్ యొక్క పేరుని పేర్కొనలేదు. దీంతో ఆ సమయంలో ఈ ఫోన్ ని Realme GT 5 Pro అని అనుకున్నారు. ఇప్పుడు Realme 12 Pro+ అని చెబుతున్నారు.
  • మొబైల్ బ్యాక్ సైడ్ లో మ్యాక్స్ జూమ్ లెన్స్ గురించి పోస్ట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంటే, స్మార్ట్‌ఫోన్ లో పెరిస్కోప్ లెన్స్ అందిస్తున్నట్లు అర్థమవుతోంది.
  • దీంతో పాటు లైట్ విల్ షైన్ ఆన్ రియల్మీ, జస్ట్ వెయిట్ అని రాసి ఉంది.
  • ఈ రియల్మీ కొత్త ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ డివైజ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post రివీలైన Realme 12 Pro+ రెండర్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-specs-leaked-before-launch/ Thu, 07 Sep 2023 05:52:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=7894 ఎన్నో రూమర్లు, లీక్స్ తర్వాత Realme సంస్థ చైనాలో Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుందని కంపెనీ టీజ్ చేస్తోంది. ఇదిలా ఉండగా, రియల్మీ సంస్థ మరోవైపు Realme GT 5 Pro పై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ రానున్న కొన్ని నెలల్లో చైనాలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా టిప్‌స్టర్ రివీల్ చేసి సమాచారం ఎంటో […]

The post లీకైన Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Realme GT 5 Pro
  • వన్‌ప్లస్ 12 మాదిరి స్పెసిఫికేషన్స్ కలిగి ఉండనున్న డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో వస్తోన్న హ్యాండ్సెట్

ఎన్నో రూమర్లు, లీక్స్ తర్వాత Realme సంస్థ చైనాలో Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుందని కంపెనీ టీజ్ చేస్తోంది. ఇదిలా ఉండగా, రియల్మీ సంస్థ మరోవైపు Realme GT 5 Pro పై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ రానున్న కొన్ని నెలల్లో చైనాలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా టిప్‌స్టర్ రివీల్ చేసి సమాచారం ఎంటో తెలుసుకుందాం పదండి.

2023 ద్వితీయార్థంలో Realme తన GT సిరీస్ ని లాంచ్ చేస్తానని తెలిపింది. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 5 Pro యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. వాటిని బట్టి, ఈ రియల్మీ ఫోన్‌కి OnePlus 12 తో పోలికలు ఉన్నాయనిపిస్తోంది. అయితే ఇరు సంస్థలు కూడా తమ ఫోన్లకు విభిన్నమైన డిజైన్ ఇవ్వడం ఖాయం. ఇప్పుడు లీకైన Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Realme GT 5 Pro డివైజ్ లో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీడబ్ల్యూఎమ్ డీసీ డిమ్మింగ్, మెటల్ ఫ్రేమ్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 Pro లో 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోని ఐఎంఎక్స్9 సిరీస్ ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఓవీ64బి పెరిస్కోప్ లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) ఉంటాయి.
  • ఓఎస్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

The post లీకైన Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌, పెరిస్కోప్ కెమెరాతో వస్తోన్న Realme GT 5 Pro https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-to-feature-periscope-camera-8-gen-3-chip/ Wed, 02 Aug 2023 14:35:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=7439 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే Realme GT 5 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా Realme GT 5 మరియు Realme GT 5 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Realme GT 5 Pro గురించి లీక్ ద్వారా ప్రాసెసర్, కెమెరా సమాచారం బయటకు వచ్చింది. తొలుత Realme GT 5 Pro డివైజ్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో […]

The post స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌, పెరిస్కోప్ కెమెరాతో వస్తోన్న Realme GT 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • GT 5 ఫ్లాగ్షిప్ సిరీస్‌లో రానున్న రెండు ఫోన్లు
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్
  • ఒమ్నివిజన్ ఓవీ64బి 64ఎంపి కెమెరాతో వస్తోన్న Realme GT 5 Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే Realme GT 5 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా Realme GT 5 మరియు Realme GT 5 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Realme GT 5 Pro గురించి లీక్ ద్వారా ప్రాసెసర్, కెమెరా సమాచారం బయటకు వచ్చింది. తొలుత Realme GT 5 Pro డివైజ్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ డివైజ్ ప్రవేశించనుంది.

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 5 Pro డివైజ్ కి సంబంధించిన సమాచారాన్ని మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.

Realme GT 5 Pro లాంచ్ టైమ్‌లైన్

Realme GT 5 Pro, Realme GT 5 డివైజెస్ వేర్వేరు సమయంలో లాంచ్ చేయబడనున్నాయని సమాచారం. లాంచ్ టైమ్‌లైన్ గురించి మాట్లాడితే, Realme GT 5 ఆగస్టులో ఎంట్రీ ఇవ్వనుంది. మరోవైపు Realme GT 5 Pro డివైజ్ నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో లాంచ్ అవ్వనుంది.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చిప్సెట్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాసెసర్ ఇంకా లాంచ్ కాలేదు. అక్టోబర్ లో అఫీషియల్ గా ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని క్వాల్కమ్ సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉంది.
  • కెమెరా: Realme GT 5 Pro డివైజ్ పెరిస్కోప్ కెమెరాతో రానుందని సమాచారం. ఇంకా ఇది 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఆప్షన్ ని కలిగి ఉంటుందట. మెయిన్ కెమెరా 64ఎంపి ఒమ్నివిజన్ ఓవీ64బి సెన్సర్ అని తెలుస్తోంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. అయితే సోని ఐఎంఎక్స్ సెన్సర్ కూడా ఉండే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ సపోర్ట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme GT 5 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది. ఇది ఎక్స్-యాక్సిస్ ఆప్టిక్ మోటర్ తో వస్తోంది.
  • స్టోరేజీ: Realme GT 5 లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme GT 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ కాంబినేషన్ లో మరొక వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
  • ఓఎస్: Realme GT 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme GT 5 లో ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌, పెరిస్కోప్ కెమెరాతో వస్తోన్న Realme GT 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>