Samsung Galaxy A54 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 27 Mar 2024 08:55:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a-series-phones-price-drop-know-the-full-details/ Wed, 27 Mar 2024 08:47:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10841 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 5G ధర Samsung […]

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు
  • తగ్గిన Galaxy A15, A34 ధర
  • తగ్గిన Galaxy A35, A55, A54 ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర

Samsung Galaxy A15 మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1500 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది.

తగ్గింపు తర్వాత, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,499 గా ఉంది. దీని అసలు ధర రూ.17,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.19,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత దీని ధర రూ.17,999 కి చేరింది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.22,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.20,999 కే లభించనుంది.

Samsung Galaxy A34 5G ధర తగ్గింపు

Samsung Galaxy A34 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3,000 తగ్గించింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.27,499 గా ఉండగా, ప్రస్తుతం రూ.24,499 కే లభించనుంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు రూ.29,499 కాగా, కొత్త ధర రూ.26,499 గా ఉంది.

Samsung Galaxy A54 5G ధర తగ్గింపు

Samsung Galaxy A54 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.35,499 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ధర రూ.31,499 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు 37,499 గా ఉండగా, ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.33,499 కే లభిస్తోంది.

Samsung Galaxy A55 5G, Galaxy A35 5G ఫోన్ల ధర తగ్గింపు

శాంసంగ్ సంస్థ Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను రూ.3,000 తగ్గించింది. ఈ రెండు ఫోన్లు కూడా రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.30,999 గా ఉండగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.27,999 కే లభిస్తోంది.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.33,999 గా ఉండేది. ఇప్పుడు కొత్త ధర రూ.30,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.39,999 గా ఉండేది. ఇప్పుడు దీని కొత్త ధర రూ.36,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.42,999 గా ఉండేది. ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.39,999 గా ఉంది.

ఈ ఫోన్లపై ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అదనపు బోనస్ పొందవచ్చు.

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G; రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-vs-samsung-galaxy-f54-5g-which-is-the-best-phone/ Tue, 06 Jun 2023 16:39:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=6647 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంసంగ్ సంస్థ జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చైనా బ్రాండ్స్ ఆదిపత్యం ఉన్నప్పుడు, లేనప్పుడు.. అది ఏ సమయమైనా సరే, శాంసంగ్ కి ఉన్న బ్రాండ్ విలువ పడిపోలేదు. జనాల్లో శాంసంగ్ పట్ల ఆదరణ తగ్గలేదు. మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్, లో-ఎండ్ సెగ్మెంట్స్ లో రకరకాల ఫోన్లను సమయానుగుణంగా లాంచ్ చేస్తూ, శాంసంగ్ సంస్థ ఇతర కంపెనీలకు గట్టి […]

The post Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G; రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజాగా లాంచైన Samsung Galaxy F54 5G
  • కొన్ని రోజుల క్రితం లాంచైన Galaxy A54 5G
  • రెండు ఫోన్లకు యూజర్లలో మాంచి డిమాండ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంసంగ్ సంస్థ జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చైనా బ్రాండ్స్ ఆదిపత్యం ఉన్నప్పుడు, లేనప్పుడు.. అది ఏ సమయమైనా సరే, శాంసంగ్ కి ఉన్న బ్రాండ్ విలువ పడిపోలేదు. జనాల్లో శాంసంగ్ పట్ల ఆదరణ తగ్గలేదు. మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్, లో-ఎండ్ సెగ్మెంట్స్ లో రకరకాల ఫోన్లను సమయానుగుణంగా లాంచ్ చేస్తూ, శాంసంగ్ సంస్థ ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది.

మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ సంస్థ నుంచి రీసెంట్ గా Samsung Galaxy A54 5G, Samsung Galaxy F54 5G ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లకు యూజర్లలో చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా శాంసంగ్ సొంత చిప్సెట్స్ Exynos 1380 తో లాంచ్ అయ్యాయి.

ఈ ఆర్టికల్ లో రెండు ఫోన్లను పోల్చి, ఏది ఉత్తమమైనదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G

  • డిస్ప్లే: Samsung Galaxy A54 5G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 403 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. మరోవైపు Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి. పెద్ద డిస్ప్లే కావాలనుకునే వారికి Galaxy F54 5G ఉత్తమమైన ఎంపికని చెప్పవచ్చు. అయితే A54 5G లో పిక్సెల్ డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్లన పిక్చర్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. రెండు ఫోన్లు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి.
  • చిప్సెట్: Samsung Galaxy A54 5G మరియు Samsung Galaxy F54 5G ఫోన్లలో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ నే వాడారు. రెండు ఫోన్లు 8జిబి ర్యామ్ తో వస్తున్నాయి. పెర్ఫామెన్స్ విషయంలో రెండు ఫోన్లు ఒకే విధమైన ఔట్‌పుట్ ని ఇవ్వనున్నాయి.
  • కెమెరా విభాగం: Samsung Galaxy A54 5G లో 50ఎంపి + 12ఎంపి + 5ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మరోవైపు Samsung Galaxy F54 5G లో 108ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా విషయానికి వస్తే, F54 లో పెద్ద సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తుండటంతో ప్రాక్టికల్ గా దీని పెర్ఫామెన్స్ బాగుంటుందని అంచనా వేయవచ్చు. ఇక A54 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా పెర్ఫామెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇందులో 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. అదే F54 లో 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఇక్కడ దేని ప్రత్యేకత దానిదే అన్నట్లు ఉంది.
  • భారీ ప్రధాన కెమెరా కావాలనుకుంటే Galaxy F54 5G ని ఎంచుకోవడం ఉత్తమం. అన్నీ బ్యాలన్స్డ్ గా ఉండాలని భావిస్తే, Galaxy A54 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
  • ఫ్రంట్ కెమెరా: రెండు ఫోన్లలో కూడా 32ఎంపి ఫ్రంట్ కెమెరాని అందించారు. కాబట్టి ఇక్కడ పెద్దగా తేడాలు ఏమీ గమనించలేం.
  • బ్యాటరీ: Galaxy A54 5G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. మరోవైపు Galaxy F54 5G లో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే F54 కి వెళ్ళడం బెటర్. కానీ, 6.7-ఇంచ్ డిస్ప్లే కావడం వల్లన బ్యాటరీ వినియోగం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఇక చార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్నాయి.
  • స్టోరేజీ: Galaxy A54 డివైజ్ 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. మరోవైపు F54 5G డివైజ్ 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభ్యమవుతుంది. రెండు ఫోన్లలో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Galaxy A54 మరియు Galaxy F54 డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • డైమెన్షన్స్: Galaxy A54 158.2 మి.మీ పొడవు, 76.7 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 202 గ్రాముల ఉంటుంది. మరోవైపు, Galaxy F54 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల ఉంటుంది.
  • ఐపీ రేటింగ్: Galaxy A54 డివైజ్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. మరోవైపు Galaxy F54 వాటర్ ప్రూఫ్ కాదు.
  • Samsung Galaxy A54 5G డివైజ్ 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.38,999 గా ఉంది.
  • Samsung Galaxy F54 5G డివైజ్ 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.

The post Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G; రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్? first appeared on 91Mobiles Telugu.

]]>
50ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A54 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-launched-india-price-specs-availability/ Thu, 16 Mar 2023 06:52:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=5531 దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు నేడు భారత మార్కెట్ లో Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త ఫోన్లు ఇవే. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో Samsung Galaxy A54 5G లాంచైంది. భారత్ లో Samsung Galaxy A34 5G, A54 […]

The post 50ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని భారత్ లో లాంచ్ చేసిన కంపెనీ
  • ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్స్ Samsung Galaxy A34 5G, A54 5G
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన లాంచైన Samsung Galaxy A54 5G

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు నేడు భారత మార్కెట్ లో Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త ఫోన్లు ఇవే. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో Samsung Galaxy A54 5G లాంచైంది.

భారత్ లో Samsung Galaxy A34 5G, A54 5G స్మార్ట్ ఫోన్స్ ధరలు, సేల్ తేదీ, లభ్యత తదితర వివరాలు వెల్లడి కానున్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A54 5G ఇండియా లాంచ్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy A54 5G ధర, కలర్ ఆప్షన్స్

భారత్ లో Samsung Galaxy A54 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి+128జిబి యూనిట్ ధర రూ.38,999 గా ఉంది. రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. ఇది వద్దనుకుంటే, రూ.2500 శాంసంగ్ అప్‌గ్రేడ్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఫోన్ ఆసమ్ లైమ్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి+256జిబి వేరియంట్ ధరను రూ.40,999 గా నిర్ణయించారు. పైన చెప్పబడిన ఆఫర్లు దీనికి కూడా వర్తిస్తాయి.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్

  • 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy A54 5G డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. మెమొరీని మైక్రెఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A54 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-launched-globally-price-specs-availability/ Wed, 15 Mar 2023 11:34:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=5513 దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు నేడు గ్లోబల్ గా Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త ఫోన్లు ఇవే. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరాతో Samsung Galaxy A54 5G గ్లోబల్ గా లాంచైంది. భారత్ లో Samsung […]

The post 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని అఫీషియల్ గా అన్‌వీల్ చేసిన కంపెనీ
  • రేపు భారత్ లో లాంచ్ కాబోతున్న Samsung Galaxy A34 5G, A54 5G స్మార్ట్ ఫోన్స్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5జీ కనెక్టివిటీతో వచ్చిన Samsung Galaxy A54 5G

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు నేడు గ్లోబల్ గా Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త ఫోన్లు ఇవే. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరాతో Samsung Galaxy A54 5G గ్లోబల్ గా లాంచైంది.

భారత్ లో Samsung Galaxy A34 5G, A54 5G స్మార్ట్ ఫోన్స్ రేపు, అనగా మార్చి 16 న లాంచ్ అవుతున్నాయి. రేపు భారత మార్కెట్ లో ఈ ఫోన్ల ధరలు, సేల్ తేదీ, లభ్యత తదితర వివరాలు వెల్లడి కానున్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A54 5G గ్లోబల్ లాంచ్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A54 5G గ్లోబల్ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. Samsung Galaxy A54 5G ధర 449 యూరోలు (సుమారు రూ.44,853) తో ప్రారంభమవుతుంది. యూరప్ మరియు దక్షిణాసియా మార్కెట్స్ లో ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ మార్చి 16 న లాంచ్ కానుంది. అదే రోజున సేల్ వివరాలు తెలుస్తాయి. Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ఆసమ్ లైమ్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్

  • 6.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy A54 5G డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. మెమొరీని మైక్రెఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 16 న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G; వెబ్‌సైట్ లో లిస్ట్ అయిన డివైజెస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-galaxy-a54-india-launch-march-16/ Mon, 13 Mar 2023 14:26:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=5492 గెలాక్సీ ఏ-సిరీస్ లో మార్చి 16 న కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు శాంసంగ్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ లో లాంచ్ కాబోవు ఫోన్ల పేర్లను శాంసంగ్ వెల్లడించలేదు. అయితే రిటైల్ స్టోర్స్ ద్వారా 91మొబైల్స్ హిందీ కి అందిన సమాచారం ప్రకారాం, మార్చి 16 న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయని తెలిసింది. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై రెండు ఫోన్ల […]

The post మార్చి 16 న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G; వెబ్‌సైట్ లో లిస్ట్ అయిన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 16 న లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G
  • కంపెనీ వెబ్‌సైట్ పై దర్శనమిస్తోన్న రెండు ఫోన్ల సపోర్ట్ పేజీ
  • తాజాగా లీకైన Samsung Galaxy A34 5G, Galaxy A54 5G డివైజెస్ గ్లోబల్ ధరలు

గెలాక్సీ ఏ-సిరీస్ లో మార్చి 16 న కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు శాంసంగ్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ లో లాంచ్ కాబోవు ఫోన్ల పేర్లను శాంసంగ్ వెల్లడించలేదు. అయితే రిటైల్ స్టోర్స్ ద్వారా 91మొబైల్స్ హిందీ కి అందిన సమాచారం ప్రకారాం, మార్చి 16 న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయని తెలిసింది. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై రెండు ఫోన్ల యొక్క సపోర్ట్ పేజీ కూడా కనిపిస్తోంది.

Samsung Galaxy A34 5G, Galaxy A54 5G స్మార్ట్ ఫోన్లు భారత్ లో మార్చి 16 న లాంచ్ అవుతున్నాయి. రిటైల్ స్టోర్ ద్వారా మాకు టీజర్ పోస్టర్ అందింది. ఈ పోస్టర్ పై ఫోన్ల పేర్లు, ఇమేజెస్ కనిపిస్తున్నాయి. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ పై రెండు ఫోన్ల యొక్క సపోర్ట్ పేజెస్ కూడా దర్శనమిస్తున్నాయి.

శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై ఉన్న సపోర్ట్ పేజీలో రెండు ఫోన్ల ర్యామ్ వేరియంట్స్ వివరాలు తెలిసాయి. ఇందులో Samsung Galaxy A54 5G 8జిబి ర్యామ్ తో కనిపిస్తుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ ఆప్షన్స్ తో కనిపిస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా ఇవే వేరియంట్స్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A34 5G, Galaxy A54 5G ధరలు (లీక్డ్)

ఇండియా లాంచ్ తేదీ రివీల్ కాకముందే Samsung Galaxy A34 5G, Galaxy A54 5G డివైజెస్ గ్లోబల్ ధరలు లీక్ అయ్యాయి. స్నూపీటెక్ అనే టిప్‌స్టర్ ఈ రెండు ఫోన్ల యూరోపియన్ ధరలను రివీల్ చేశారు. లీక్ ప్రకారం, Samsung Galaxy A34 5G డివైజ్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 419 యూరోలు (సుమారు రూ.35,500) గా ఉంటుందని సమాచారం. Samsung Galaxy A54 5G 128జిబి వేరియంట్ ధర 519 యూరోలు (సుమారు రూ.45,400) గా ఉండనుందని తెలుస్తోంది. భారత్ లో ఈ ఫోన్ల ధరలు ఇంతకంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ డిస్ప్లే
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్
  • 48ఎంపి మెయిన్ కెమెరా
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా
  • 25వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

గతంలో 91మొబైల్స్ కి అందిన సమాచారం ప్రకారం, Samsung Galaxy A34 5G డివైజ్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో లెన్స్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, ఐపీ67 రేటింగ్, సైడ్ మౌంటెడ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది. ఇవి అంచనా వేయబడిన, లీకైన స్పెసిఫికేషన్స్ అని గమనించాలి.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ డిస్ప్లే
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A54 5G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A54 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని అంచనా. ఇంకా ఈ డివైజ్ ఐపీ67 రేటింగ్, డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ తో వస్తుందని భావిస్తున్నారు. లాంచ్ రోజున అసలైన సమాచారం బయటకు వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 16 న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G; వెబ్‌సైట్ లో లిస్ట్ అయిన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి నెలాఖరున భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A54, Galaxy A34? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-galaxy-a34-5g-india-launch-timeline/ Mon, 06 Mar 2023 06:23:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=5224 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె తన ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S23 ని లాంచ్ చేసింది. ఇప్పుడు Galaxy A-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ Samsung Galaxy A54, Galaxy A34 డివైజెస్ యొక్క ఇండియా లాంచ్ టైమ్ లైన్ ని తెలియజేస్తోంది. టిప్‌స్టర్ Debayan Roy ప్రకారం, Samsung Galaxy A54, Galaxy A34 ఫోన్లు భారత్ లో మార్చి […]

The post మార్చి నెలాఖరున భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A54, Galaxy A34? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • టిప్‌స్టర్ ద్వారా లీకైన Samsung Galaxy A54, Galaxy A34 ఇండియా లాంచ్ టైమ్ లైన్
  • మార్చి చివరి వారంలో Samsung Galaxy A54, Galaxy A34 భారత్ లో లాంచ్ అవుతాయని అంచనా
  • గ్లోబల్ మార్కెట్ లో మార్చి 15 న డివైజెస్ లాంచ్ అవుతాయని స్పష్టం చేసిన రీసెంట్ రిపోర్ట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె తన ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S23 ని లాంచ్ చేసింది. ఇప్పుడు Galaxy A-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ Samsung Galaxy A54, Galaxy A34 డివైజెస్ యొక్క ఇండియా లాంచ్ టైమ్ లైన్ ని తెలియజేస్తోంది.

టిప్‌స్టర్ Debayan Roy ప్రకారం, Samsung Galaxy A54, Galaxy A34 ఫోన్లు భారత్ లో మార్చి చివర్లో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. గ్లోబల్ లాంచ్ తర్వాత కొన్ని రోజులకు భారత్ లో Samsung డివైజెస్ లాంచ్ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగనుందని తాజా లీక్ ద్వారా స్పష్టమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A54, Galaxy A34 ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇవి లీకైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇస్తోన్న వివరాలు.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ డిస్ప్లే 2340*1080 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోందని సమాచారం. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 161 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి నెలాఖరున భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A54, Galaxy A34? first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 15 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-galaxy-a34-5g-global-launch-march-15th/ Thu, 02 Mar 2023 13:52:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5200 ఇటీవలె Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేసిన Samsung సంస్థ ఇప్పుడు మిడ్-రేంజ్ ఫోన్ల లాంచ్ పై దృష్టి పెట్టింది. త్వరలోనే శాంసంగ్ నుంచి Galaxy A54 5G మరియు Galaxy A34 5G ఫోన్లు రానున్నాయి. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. దీంతో వీటి లాంచ్ దగ్గర్లోనే ఉందని స్పష్టమైంది. శాంసంగ్ అయితే A54 5G డివైజ్ ని తన అధికార వెబ్ సైట్ లో […]

The post మార్చి 15 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో రెండు మిడ్-రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతున్న శాంసంగ్ సంస్థ
  • లాంచ్ కి ముందు లాంచ్ తేదీని రివీల్ చేసిన ప్రముఖ టిప్‌స్టర్
  • మార్చి 15 న గ్లోబల్ గా లాంచ్ కానున్న Galaxy A54 5G, Galaxy A34 5G

ఇటీవలె Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేసిన Samsung సంస్థ ఇప్పుడు మిడ్-రేంజ్ ఫోన్ల లాంచ్ పై దృష్టి పెట్టింది. త్వరలోనే శాంసంగ్ నుంచి Galaxy A54 5G మరియు Galaxy A34 5G ఫోన్లు రానున్నాయి. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. దీంతో వీటి లాంచ్ దగ్గర్లోనే ఉందని స్పష్టమైంది. శాంసంగ్ అయితే A54 5G డివైజ్ ని తన అధికార వెబ్ సైట్ లో పెట్టేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 8.4 రిపెయిరబులిటీ స్కోర్ ని సాధించింది. ఇది Galaxy S23 Ultra కంటే ఎక్కువ.

ఇక Galaxy A54 5G, Galaxy A34 5G లాంచ్ తేదీ తాజాగా రివీల్ అయ్యింది. నమ్మదగిన టిప్‌స్టర్ OnLeaks ఈ ఏ-సిరీస్ డివైజెస్ లాంచ్ తేదీని రివీల్ చేశారు. సరే, పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

రివీలైన Samsung Galaxy A54 5G, Galaxy A34 5G లాంచ్ తేదీ

2023 మార్చి 15 న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ గా లాంచ్ కానున్నాయని టిప్‌స్టర్ ఓ ట్వీట్ చేశారు. అయితే భారత్ లో కూడా అదే రోజున లాంచ్ అవుతాయా? లేదా అనే విషయాన్ని శాంసంగ్ ప్రకటించాల్సి ఉంది. మరోవైపు శాంసంగ్ సంస్థ Galaxy S23 FE ని తీసుకొచ్చేందుకు Galaxy A74 5G ని నిలిపివేసింది.

Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Samsung Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 161 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 15 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A34 5G, Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్) https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-galaxy-a54-specifications-revealed-before-launch/ Wed, 22 Feb 2023 13:04:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5057 రీసెంట్ గా శాంసంగ్ సంస్థ గ్లోబల్ గా Samsung Galaxy S23 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్లు Galaxy A34 5G, Galaxy A54 లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91mobiles Hindi సౌజన్యంతో ఒక లీక్ కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. లీక్ ప్రకారం, Galaxy A34 5G, Galaxy A54 5G స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫస్ట్ లుక్ బయటకు వచ్చాయి. Samsung […]

The post Samsung Galaxy A34 5G, Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G
  • లాంచ్ కి ముందు రివీలైన డిజైన్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్
  • ఎగ్జినోస్ 1380 తో వస్తోన్న Galaxy A54, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వస్తోన్న Galaxy A34

రీసెంట్ గా శాంసంగ్ సంస్థ గ్లోబల్ గా Samsung Galaxy S23 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్లు Galaxy A34 5G, Galaxy A54 లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91mobiles Hindi సౌజన్యంతో ఒక లీక్ కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. లీక్ ప్రకారం, Galaxy A34 5G, Galaxy A54 5G స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫస్ట్ లుక్ బయటకు వచ్చాయి.

Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Samsung Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)