Smartphone News In Telugu - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 15 Oct 2024 14:35:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/#respond Tue, 15 Oct 2024 14:35:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=14052 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌ని ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ మరియు హెవీ యూజర్ల కోసం తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, ఓఎల్ఈడీ స్క్రీన్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఓసారి ఈ […]

The post Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme P1 Speed 5G విడుదల
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌ని ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ మరియు హెవీ యూజర్ల కోసం తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, ఓఎల్ఈడీ స్క్రీన్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme P1 Speed 5G ధర మరియు లభ్యత

  • Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.20,999 గా పెట్టారు.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా అక్టోబర్ 20వ తేదీ నుంచి రియల్మీ పీ2 స్పీడ్ 5జీ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme P1 Speed 5G డిజైన్

Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ చూసేందుకు గత మోడల్ పీ1 మరియు పీ1 ప్రో మాదిరే ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ కార్నర్స్ ఉన్నాయి. ముందువైపు, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ బ్రష్డ్ బ్లూ మరియు టెక్షర్డ్ టైటానియమ్ కలర్స్ లో లభిస్తుంది.

Realme P1 Speed 5G డివైజ్ 161.7 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

Realme P1 Speed 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Speed 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ఈస్పోర్ట్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ లోకల్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1080*2400 ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 92.65% స్క్రీన్ టు బాడీ రేషియో, 16.7 మిలియన్ కలర్స్, రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Speed 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్సెట్ వాడారు. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. ఈ చిప్సెట్ అంటుటు స్కోర్ 7,50,000+ గా నమోదైనట్లు కంపెనీ చెబుతోంది.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 14జిబి వరకు డైనమిక్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి గరిష్టంగా 26జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme P1 Speed 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఎఫ్/1.8 అపర్చర్), ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Speed 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme P1 Speed 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Realme P1 Speed 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Speed 5G లో ఐపీ65 ప్రొటెక్షన్ ఉంది. దీని వల్లన నీరు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో జీటీ మోడ్ ఉంది.

The post Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/feed/ 0
Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/ https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/#respond Sun, 06 Oct 2024 15:04:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=13937 తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే వాల్యూ ఫర్ మనీ ఫోన్ల కోసం సగటు వినియోగదారుడు వెతుకుతుంటాడు. కొందరికీ, కెమెరా ఫోన్ పై ఇష్టముంటే, మరికొందరికి గేమింగ్ ఫోన్ కొనాలని ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో రూ.20,000 లోపు భారత్ లో లభిస్తోన్న బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు ఏవో తెలుసుకుందాం. మేం పలు బెంచ్ మార్క్ రిజల్ట్స్ ఆధారంగా అలాగే సొంతంగా కొన్ని టెస్టులను నిర్వహించి, ఏ ఫోన్ సత్తా ఏంటో తెలుసుకునే ప్రయత్నం […]

The post Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే వాల్యూ ఫర్ మనీ ఫోన్ల కోసం సగటు వినియోగదారుడు వెతుకుతుంటాడు. కొందరికీ, కెమెరా ఫోన్ పై ఇష్టముంటే, మరికొందరికి గేమింగ్ ఫోన్ కొనాలని ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో రూ.20,000 లోపు భారత్ లో లభిస్తోన్న బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు ఏవో తెలుసుకుందాం. మేం పలు బెంచ్ మార్క్ రిజల్ట్స్ ఆధారంగా అలాగే సొంతంగా కొన్ని టెస్టులను నిర్వహించి, ఏ ఫోన్ సత్తా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ వివరాలను మీకోసం అందిస్తున్నాం. ఓసారి పూర్తిగా చదివి తెలుసుకోండి.

రూ.20,000 లోపు ధరలో బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ధర
ఐకూ జెడ్ 9 మార్చి 12, 2024 రూ.19,999
రియల్మీ నార్జో 70 టర్బో సెప్టెంబర్ 9, 2024 రూ.16,999
వివో టీ3 మార్చి 21, 2024 రూ.19,999
ఐకూ జెడ్9ఎస్ ఆగస్టు 21, 2024 రూ.19,999
సీఎంఎఫ్ ఫోన్ 1 జులై 8, 2024 రూ.15,999

 

iQOO Z9

iQOO Z9 స్మార్ట్‌ఫోన్ భారత్ లో మార్చి 12వ తేదీన లాంచ్ అయ్యింది. లాంచ్ ధర రూ.19,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ సాలిడ్ బెంచ్‌మార్క్ స్కోర్స్ కలిగి ఉంది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,28,534
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,190
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,681
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,218

 

Realme Narzo 70 Turbo

Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ అయ్యింది. లాంచ్ ధర రూ.16,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. వివిధ బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్స్ పై నార్జో 70 టర్బో మంచి ప్రదర్శన కనబరిచింది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,26,959
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,052
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,969
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 14,895

 

Vivo T3

Vivo T3 స్మార్ట్‌ఫోన్ భారత్ లో మార్చి 21వ తేదీన రూ.19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. సాధారణ గేమింగ్ మరియు డే-టు-డే వాడకానికి ఈ ఫోన్ బాగా సరిపోతుంది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,15,922
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,177
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,646
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,423

 

iQOO Z9s

iQOO Z9s స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 21వ తేదీన రూ.19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఓసారి ఈ ఫోన్ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,02,922
గీక్‌బెంచ్ సింగిల్-కోర్ 1,044
గీక్‌బెంచ్ మల్టీ-కోర్ 3,011
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 10,918

 

CMF Phone 1

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ జులై 8వ తేదీన రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. రోజువారీ సాధారణ వాడకానికి, లైట్ గేమింగ్‌కి ఈ ఫోన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 6,42,187
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,015
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,867
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,598

 

The post Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/feed/ 0
Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/#respond Wed, 25 Sep 2024 08:45:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=13735 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ భారత్ లో విడుదలైంది. ఈ ఫోన్ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 16జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7300 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo […]

The post Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Vivo V40e విడుదల
  • డైమెన్సిటీ 7300 చిప్సెట్
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ భారత్ లో విడుదలైంది. ఈ ఫోన్ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 16జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7300 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40e ధర, లభ్యత

Vivo V40e స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.28,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.30,999 గా పెట్టారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికార వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్‌కి వస్తోంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ పై 10 శాతం డిస్కౌంట్ లేదా 10 శాతం ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు. అంతేకాదు, 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

Vivo V40e డిజైన్

Vivo V40e స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, ఆరా లైట్ ఉన్నాయి. ముందువైపు 3డీ కర్వ్డ్ డిజైన్ ఉంది. ఈ ఫోన్ 0.749 సెంటీమీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ రాయల్ బ్రాంజ్ మరియు మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo V40e స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40e లో 6.77-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ ట్రూ కలర్స్, 2392*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 93.3% స్క్రీన్ టు బాడీ రేషియో, 8,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

చిప్సెట్: Vivo V40e స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40e స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo V40e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ప్రొఫెషనల్ నైట్ పొట్రెయిట్ ఓఐఎస్+ఈఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఐ ఏఎఫ్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo V40e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo V40e స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/feed/ 0
OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/ https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/#respond Wed, 18 Sep 2024 05:59:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13563 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. OnePlus 13 డిజైన్ (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 […]

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 విడుదల
  • 6.82-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

OnePlus 13 డిజైన్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 స్మార్ట్‌ఫోన్ వివరాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

టిప్‌స్టర్ ప్రకారం, OnePlus 13 ఫోన్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, గ్రీన్ కలర్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది.

టిప్‌స్టర్ తన పోస్ట్ లో వన్‌ప్లస్ 13 యొక్క రెండర్ కూడా షేర్ చేశారు. దీన్ని గమనిస్తే, ఫోన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది.

యూనిక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. మధ్యలో వన్‌ప్లస్ లోగో ఉంది.

OnePlus 13 లాంచ్ టైమ్‌లైన్

కొన్ని రోజుల క్రితం, వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లూయీస్ లీ OnePlus 13 యొక్క లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేశారు. వచ్చే నెలలో వన్‌ప్లస్ 13 లాంచ్ అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తుందని అర్థమవుతోంది. ఎందుకంటే, ఈ చిప్సెట్ వచ్చే నెలలోనే లాంచ్ కానుంది.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే క్వాడ్ కర్వ్డ్ బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1440*3168 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఒ916టి హాప్టిక్ మోటర్ ను ఇందులో అందించనున్నారు

కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: OnePlus 13 డివైజ్ ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం.

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/feed/ 0
Moto G55 5G: డైమెన్సిటీ 7025 చిప్సెట్‌తో లాంచైన మోటో జీ55 5జీ https://www.91mobiles.com/telugu/moto-g55-5g-globally-launched-dimensity-7025-processor/ https://www.91mobiles.com/telugu/moto-g55-5g-globally-launched-dimensity-7025-processor/#respond Fri, 30 Aug 2024 11:32:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=13260 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్స్‌లో జీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Moto G55 5G, Moto G35 5G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Moto G55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ డివైజ్ […]

The post Moto G55 5G: డైమెన్సిటీ 7025 చిప్సెట్‌తో లాంచైన మోటో జీ55 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 6.5-ఇంచ్ FHD+ డిస్ప్లే
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్స్‌లో జీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Moto G55 5G, Moto G35 5G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Moto G55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G55 5G ధర, కలర్స్

Moto G55 5G స్మార్ట్‌ఫోన్ ధరను 249 యూరోలుగా పెట్టారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.23,000. ప్రస్తుతం ఇండియా లాంచ్, సేల్ వివరాలు ఇంకా తెలియదు. Moto G55 5G స్మార్ట్‌పఓన్ ఫారెస్ట్ గ్రే, ట్విలైట్ పర్పుల్ మరియు స్మోకీ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ ఉంటుంది.

Moto G55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G55 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, రౌండ్ ఎడ్జ్ ఫ్లాట్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G55 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: Moto G55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Moto G55 5G స్మార్ట్‌ఫోన్ 3 ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి 4జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ. ఏయే వేరియంట్స్ భారత్ లో లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు.

కెమెరా: Moto G55 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Moto G55 5G స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Moto G55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

  • Moto G35 స్మార్ట్‌ఫోన్ ధరను గ్లోబల్ మార్కెట్ లో 199 యూరోలు (సుమారు రూ.18,500) గా పెట్టారు. ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుంది. భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని సమాచారం. Moto G35 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

The post Moto G55 5G: డైమెన్సిటీ 7025 చిప్సెట్‌తో లాంచైన మోటో జీ55 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g55-5g-globally-launched-dimensity-7025-processor/feed/ 0
Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/#respond Thu, 29 Aug 2024 08:04:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=13234 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా? Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్ త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ […]

The post Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P2 Pro లాంచ్
  • బీఐఎస్ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ RMX3987

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా?

Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్

త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ కొత్త ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై RMX3987 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ Realme P2 Pro అని అంచనా వేస్తున్నారు.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

అయితే బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది.

Realme P2 Pro వివరాలు (అంచనా)

91మొబైల్స్ ఈ నెల ఆరంభంలో Realme P2 Pro కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.

Realme P2 Pro డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి మరియు 12జిబి + 512జిబి.

రిపోర్ట్ లో భాగంగా, Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ కమెలియన్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

భారత్ లో Realme P2 Pro ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme P1 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ టచ్ సపోర్ట్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.

రియర్ కెమెరా: Realme P1 Pro లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: Realme P1 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Pro లో ఐపీ65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/feed/ 0
Oppo A3 5G: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3 5జీ https://www.91mobiles.com/telugu/oppo-a3-5g-launched-india-mediatek-dimensity-6300-chipset/ https://www.91mobiles.com/telugu/oppo-a3-5g-launched-india-mediatek-dimensity-6300-chipset/#respond Mon, 19 Aug 2024 17:08:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13046 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా భారతీయ మార్కెట్ లో Oppo A3 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Oppo A3 5G ధర, లభ్యత, […]

The post Oppo A3 5G: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Oppo A3 5G లాంచ్
  • 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా
  • ప్రారంభ ధర రూ.15,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా భారతీయ మార్కెట్ లో Oppo A3 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Oppo A3 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ పై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఎస్బీఐ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ ఓషన్ బ్లూ మరియు నెబులా రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Oppo A3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Oppo A3 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Oppo A3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వినియోగించారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.

మెమొరీ: Oppo A3 5G డివైజ్ లో 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Oppo A3 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఎఫ్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Oppo A3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Oppo A3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ అందించారు.

ఇతర ఫీచర్లు: Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

బరువు, చుట్టుకొలత: Oppo A3 5G డివైజ్ 165.7 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 7.7 మి.మీ మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది.

The post Oppo A3 5G: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3-5g-launched-india-mediatek-dimensity-6300-chipset/feed/ 0
Samsung: గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌తో భారత్‌లో లాంచైన Galaxy M35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-launched-india-gorilla-glass-victus-plus/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-launched-india-gorilla-glass-victus-plus/#respond Wed, 17 Jul 2024 18:13:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12541 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి గెలాక్సీ ఎమ్35 5జీ యొక్క ధర, లభ్యత మరియు […]

The post Samsung: గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌తో భారత్‌లో లాంచైన Galaxy M35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Galaxy M35 5G లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి గెలాక్సీ ఎమ్35 5జీ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M35 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంది.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, మరియు పార్ట్నర్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, అన్ని వేరియంట్స్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, అన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్స్ కార్డ్స్ పై రూ.2,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ బ్లూ, డేబ్రేక్ బ్లూ మరియు థండర్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌ హెచ్డీ+ రెజుల్యూషన్, 2340*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Samsung Galaxy M35 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy M35 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, శాంసంగ్ వాలెట్ సపోర్ట్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Samsung Galaxy M35 5G డివైజ్ 162.3 మి.మీ పొడవు, 78.6 మి.మీ వెడల్పు, 9.1 మి.మీ మందం, 222 గ్రాముల బరువు ఉంటుంది.

The post Samsung: గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌తో భారత్‌లో లాంచైన Galaxy M35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-launched-india-gorilla-glass-victus-plus/feed/ 0
Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/#respond Thu, 27 Jun 2024 10:04:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=12248 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం. Vivo T3 Lite […]

The post Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo T3 Lite లాంచ్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • డైమెన్సిటీ 6300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite ధర

Vivo T3 Lite డివైజ్ రెండు మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Vivo T3 Lite యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.

Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ వైబ్రంట్ గ్రీన్ మరియు మెజెస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్స్ లావాదేవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మొదటి రోజు సేల్‌లో మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత బేస్ మోడల్ ధర రూ.9,999 కి, టాప్ మోడల్ ధర రూ.10,999 కి మారుతాయి.

జులై 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా డివైజ్ ను కొనుగోలుకి చేయవచ్చు.

Vivo T3 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Lite లో 6.56-ఇంచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo T3 Lite డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ సెన్సర్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo T3 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite లో ఐపీ64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/feed/ 0
iQOO Neo 9s Pro: ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లేతో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-launched-china-ltpo-oled-display/ Mon, 20 May 2024 16:15:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11631 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి నియో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. iQOO Neo 9s Pro పేరుతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. అందుబాటు ధర, అధిక ఫీచర్లు ఈ ఫోన్ సొంతమని చెప్పవచచు. ఐకూ నియో 9ఎస్ ప్రో ఫోన్ లో ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి డివైజ్ ధర […]

The post iQOO Neo 9s Pro: ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లేతో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో iQOO Neo 9s Pro లాంచ్
  • డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి నియో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. iQOO Neo 9s Pro పేరుతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. అందుబాటు ధర, అధిక ఫీచర్లు ఈ ఫోన్ సొంతమని చెప్పవచచు. ఐకూ నియో 9ఎస్ ప్రో ఫోన్ లో ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Neo 9s Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1260*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Neo 9s Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్, క్యూ1 గేమింగ్ చిప్, 6కే వీసీ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9s Pro లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: iQOO Neo 9s Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: iQOO Neo 9s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుంది.

ఓఎస్: iQOO Neo 9s Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: iQOO Neo 9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

iQOO Neo 9s Pro ధర

iQOO Neo 9s Pro డివైజ్ చైనాలో 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Neo 9s Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2999 యువాన్లు (సుమారు రూ.34,200) గా నిర్ణయించారు.

iQOO Neo 9s Pro 12జిబి + 512జిబి మోడల్ ధర 3299 యువాన్లు (సుమారు రూ.37,650) గా ఉంది.

iQOO Neo 9s Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3599 యువాన్లు (సుమారు రూ.41,100) గా ఉంది.

iQOO Neo 9s Pro 16జిబి + 1టిబి వేరియంట్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.45,700) గా ఉంది.

iQOO Neo 9s Pro డివైజ్ స్టార్ యావో వైట్, రెడ్ అండ్ వైట్ మిక్స్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Neo 9s Pro భారత మార్కెట్ లాంచ్ తేదీ ప్రకటన, ధర తదితర వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. స్పెసిఫికేషన్స్ చైనా వేరియంట్ మాదిరే ఉంటాయని చెప్పవచ్చు. ధర విషయానికి వస్తే, కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఐకూ ఫోన్లను భారత్ లో సరసమైన ధరల్లోనే కంపెనీ లాంచ్ చేస్తూ వస్తోంది.

The post iQOO Neo 9s Pro: ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లేతో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>