లీకైన Xiaomi 15 లాంచ్ టైమ్‌లైన్

Highlights

  • త్వరలో Xiaomi 15 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
  • 6.36-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 15 ని లాంచ్ చేయనుంది. ఇది షావోమి 14 కి సక్సెసర్ గా వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షావోమి 15 యొక్క లాంచ్ టైమ్‌లైన్‌ని లీక్ చేసింది. ఓసారి Xiaomi 15 డివైజ్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Xiaomi 15 లాంచ్ టైమ్‌లైన్

Xiaomi 15 స్మార్ట్‌ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్‌స్టేషన్ లీక్ చేసింది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 2024 అక్టోబర్ నెలలో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది.

Xiaomi 15 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపారు. Xiaomi 15 లైనప్ లో బేస్ మోడల్ Xiaomi 15 తో పాటు, Xiaomi 15 Pro కూడా లాంచ్ కానుంది. ఈ రెండు ఫోన్లు గ్లోబల్‌గా 2025 ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో కూడిన ఫ్లాగ్షిప్‌ని ముందుగా షావోమి లాంచ్ చేస్తుందని, గతంలో మరొక టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ X ఖాతా ద్వారా తెలిపారు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ యొక్క అంటుటు స్కోర్ ఇటీవలె ఆన్‌లైన్ లో రివీల్ అయ్యాయి. లిస్టింగ్ ప్రకారం, 17,69,083 పాయింట్స్ ని ఈ చిప్ స్కోర్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఫ్లాగ్షిప్ చిప్సెట్ తో పోల్చితే ఈ స్కోర్ తక్కువగా ఉంది.

ఈ ప్రాసెసర్ లోని హై-పెర్ఫామెన్స్ కోర్స్ యొక్క స్పీడ్ రేంజ్ 3.6GHz మరియు 4.0GHz గా ఉంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2700 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 10,000 పాయింట్లు స్కోర్ చేసింది.

Xiaomi 15 డివైజ్ 6.36-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.