OnePlus: బీఐఎస్‌పై లిస్టైన Nord CE 4 Lite

Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2619
  • 6.67-ఇంచ్ 120Hz అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో Nord CE 4 Lite అనే డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. ఓసారి OnePlus Nord CE 4 Lite యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 Lite బీఐఎస్ లిస్టింగ్

టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus Nord CE 4 Lite ని బీఐఎస్ వెబ్‌సైట్ పై గుర్తించారు.

బీఐఎస్ పై OnePlus Nord CE 4 Lite డివైజ్ CPH2619 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OnePlus Nord CE 4 Lite డివైజ్ OPPO A3 కి రీబ్రాండ్ వర్షన్ గా మార్కెట్ లోకి వస్తోందని టిప్‌స్టర్ తెలిపారు.

OnePlus Nord CE 4 Lite స్పెసిఫికేషన్స్ (లీక్)

టిప్‌స్టర్ చౌదరి ద్వారా OnePlus Nord CE 4 Lite యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉంటుంది.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord CE 4 Lite ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ తో భారత్ లో లాంచ్ అవుతుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

OPPO A3 కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Nord CE 4 Lite లాంచ్ అవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో నార్డ్ సీఈ 4 లైట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.