
మీరు ఫోటోను PDF (పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్)కి మార్చాలనుకుంటున్నారా? ఇది చాలా సులభం. మీరు ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ మరియు మాక్ డివైజెస్ లో ఫోటోలను సులభంగా PDFకి మార్చవచ్చు. ఫోటోను PDFకి మార్చడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఇమేజ్‌లో కాకుండా PDF ఫార్మాట్‌లో విషయాలను చదవడం సులభం. అంతేకాదు, PDF ఫైల్ యొక్క అసలు నాణ్యత అలాగే ఉంటుంది. ఫోటోను PDFకి ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం.
ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫోటోని పీడీఎఫ్ గా మార్చడం ఎలా?
మీరు గనుక ఆండ్రాయిడ్ డివైజ్ లో జెపిజి లేదా పిఎన్‌జి ఫోటోని పీడీఎఫ్ గా మార్చాలనుకుంటే, ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- స్టెప్ 1: ఆండ్రాయిడ్ డివైజ్ లో గ్యాలరీ యాప్ ఓపెన్ చేయండి.
- స్టెప్ 2: ఇప్పుడు మీరు పీడీఎఫ్ గా మార్చాలనుకుంటున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి.
- స్టెప్ 3: దీని తర్వాత మీరు మూడు చుక్కల ఐకన్ పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 4: ఇప్పుడు మెనూ క్రింద మీకు ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది.
- స్టెప్ 5: ఇప్పుడు మీకు సేవ్ యాజ్ పీడీఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీకు డౌన్‌లోడ్ పీడీఎఫ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- స్టెప్ 6: ఇప్పుడు మీరు ఫైల్ ని సేవ్ చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి లొకేషన్ ఎంచుకోవాలి. ఫోటో నుంచి పీడీఎఫ్ కి కన్వర్ట్ కాబడిన ఫైల్ ని సేవ్ చేయడానికి మీకు ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏదైనా ఒకదానిని ఎంచుకుని క్రింద కనిపించే సేవ్ బటన్ ని నొక్కండి.
ఐఫోన్ లో ఫోటోని పీడీఎఫ్ గా మార్చడం ఎలా?
ఆండ్రాయిడ్ డివైజెస్ లో మాదిరిగానే, ఐఫోన్ లో కూడా ఫోటోలను పీడీఎఫ్ గా మార్చడం తేలికే. అందుకోసం మీరు ఈ క్రింద కనిపిస్తున్న స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
- స్టెప్ 1: తొలుత మీరు ఐఫోన్ లో ఫోటోస్ యాప్ కి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏ ఫోటోనైతే పీడీఎఫ్ గా మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
- స్టెప్ 2: ఇప్పుడు మీరు షేర్ బటన్ పై క్లిక్ చేయండి. ట్యాప్ చేశాక, ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: ఒక్కసారి మీరు ప్రింట్ పై క్లిక్ చేయగానే, ఫోటో పీడీఎఫ్ కి కన్వర్ట్ అయిపోతుంది.
- స్టెప్ 4: ఇప్పుడు మీకు పైన కుడివైపున షేర్ బటన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఆ పీడీఎఫ్ ఫైల్ ని మీ ఐఫోన్ లో సేవ్ టు ఫైల్స్ పై ట్యాప్ చేసి సేవ్ చేసుకోవచ్చు.
విండోస్ లో JPG, GIF, PNG ఫోటోలను PDF కి కన్వర్ట్ చేయడం ఎలా?
విండోస్ ల్యాప్ టాప్ మరియు డెస్క్‌టాప్ లో మీరు జెపిజి, జిఐఎఫ్, పిఎన్‌జి ఫోటోలను జిఫ్ఫీలో పీడీఎఫ్ గా కన్వర్ట్ చేయవచ్చు. ఆ విధానం ఎంతో తేలికే. క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి.
- స్టెప్ 1: విండోస్ కంప్యూటర్ లో ఫోటోలను పీడీఎఫ్ గా మార్చాలనుకుంటే, మీరు తొలుత పీడీఎఫ్ గా మార్చాలనుకుంటోన్న ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి.
- స్టెప్ 2: ఇప్పుడు మీరు ఆ ఫోటోని విండోస్ పిక్చర్స్ యాప్ లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు మూడు చుక్కల మెను టాప్ లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- స్టెప్ 3: ఇక్కడ మీకు టాప్ లో ప్రింటర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ పై క్లిక్ చేయండి.
- స్టెప్ 4: ఇప్పుడు మీరు బాటమ్ లో కనిపించే ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత ఫోటో, పీడీఎఫ్ కి కన్వర్ట్ అవుతుంది. ఆ పీడీఎఫ్ ని సేవ్ చేసేందుకు లొకేషన్ ని ఎంచుకోండి. మీరు కావాలనుకుంటే, ఆ పీడీఎఫ్ ఫైల్ ని మీ డెస్క్‌టాప్ పై కూడా సేవ్ చేయవచ్చు.
Source: 91mobiles Hindi










