List - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 16:35:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/ https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/#respond Tue, 08 Oct 2024 16:35:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13990 ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం. Best camera phones […]

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

Best camera phones (రూ.25,000 లోపు)

స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర
ఐకూ జెడ్9ఎస్ ప్రో రూ.24,999
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రూ.24,999
నథింగ్ ఫోన్ (2ఏ) రూ.23,999
రెడ్మీ నోట్ 13 ప్రో రూ.23,999

 

iQOO Z9s Pro

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో కెమెరా పెర్ఫామెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫోకస్ ఫాస్ట్‌గా, షట్టర్ స్పీడ్స్ బాగున్నాయి.

అయితే లో-లైట్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికీ, వైబ్రంట్, డీటెయిల్డ్ ఇమేజెస్, అద్భుతమైన డైనమిక్ రేంజ్ ను ఈ ఫోన్ డెలివర్ చేస్తోంది. అల్ట్రావైడ్ లెన్స్ విషయానికి వస్తే, వివిడ్, హై-కాంట్రాస్ట్ షాట్స్ ను బాగా క్యాప్చర్ అవుతున్నాయి. పొట్రెయిట్స్ షార్ప్‌గా, స్కిన్ టోన్స్ ఆక్యురేట్ గా ఉన్నాయి. బొకే ఎఫెక్ట్ మాత్రం నేచురల్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ లో-లైట్ ఇష్యూస్
అద్భుతమైన అల్ట్రావైడ్ లెన్స్ పనితనం అసహజమైన బొకే ఎఫెక్ట్
సాలిడ్ పొట్రెయిట్ మోడ్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఇంప్రెస్సివ్ షాట్స్ డెలివర్ చేస్తోంది. అయితే కలర్స్ కాస్త బూస్ట్ చేస్తోంది. ఆకాశాన్ని ఎక్కువ నీలంగా, గడ్డిని మరింత పచ్చగా చేస్తోంది.

పొట్రెయిట్, నైట్ మోడ్స్ విషయంలో ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంది. డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తోంది. అయితే, ల్యాండ్‌స్కేప్ సెల్ఫీస్ విషయంలో బగ్ వల్లన, క్యాషెస్ లేదా బొకే ఎఫెక్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్, సరైన స్కిన్ టోన్స్ అందిస్తోంది.

బాగున్నవి బాగాలేనివి
కలర్‌ఫుల్, వైబ్రంట్ ఇమేజెస్ కలర్ బూస్టింగ్
పొట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన ఎడ్జ్ డిటెక్షన్ అసహజమైన బొకే ఎఫెక్ట్
మంచి సెల్ఫీ కెమెరా ల్యాండ్‌స్కేప్ సెల్ఫీ మోడ్‌లో బగ్
మంచి లో-లైట్ పెర్ఫామెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్ లో నార్డ్ సీఈ4 పనితీరు బాగుంది. సరైన వైట్ బ్యాలన్స్, సహజ రంగులు ఇమేజెస్ లో బాగున్నాయి.

కెమెరా డీసెంట్ డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేసింది. అయితే డార్క్ బ్లూ టోన్స్ మరియు పొట్రెయిట్ షాట్స్ లోని ఫేషియల్ డీటెయిల్స్ విషయాల్లో కెమెరా కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. పొట్రెయిట్ మోడ్ రిచ్ బొకే ఎఫెక్ట్, ఎడ్జ్ డిటెక్షన్ అందిస్తోంది. అయితే, హై-రెజ్ మోడ్ యొక్క కలర్ కన్సిస్టెన్సీ సరిగ్గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
నేచురల్ కలర్ ప్రొడక్షన్ అల్ట్రావైడ్ షాట్స్ లో సాఫ్ట్ డైనమిక్ రేంజ్
క్రిస్ప్ డీటెయిల్స్ కోసం హై-రెజ్ మోడ్ ఫేషియల్ డీటెయిల్స్ సాఫ్ట్ అవ్వడం
పొట్రెయిట్ మోడ్‌లో యాక్యురేట్ ఫేస్ డిటెక్షన్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ చార్జింగ్

Nothing Phone (2a)

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలు పిక్సెల్-బైనింగ్ ద్వారా 12.5ఎంపి ఇమేజెస్‌ను బైడీఫాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. డే-లైట్ లో షార్ప్, డీటెయిల్డ్ షాట్స్ మంచి డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ తో వస్తున్నాయి.

కలర్స్ పూర్తిగా నేచురల్ గా లేవు. అవి వైబ్రంట్ మరియు పంచీగా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ డీసెంట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాస్త వార్మ్ టోన్స్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరాతో పోల్చితే తక్కువ క్వాలిటీ గల ఇమేజెస్‌ను అల్ట్రావైడ్ అందిస్తోంది. లో-లైట్ కండీషన్స్ లో కెమెరాలు ఆటోమేటిక్ గా నైట్ మోడ్‌కి స్విచ్ అవుతున్నాయి. నైట్ మోడ్ లో ఎక్స్‌పోజర్ మెరుగ్గా, షార్ప్‌నెస్, నాయిస్ తక్కువగా ఉన్నాయి. డేలైట్ లో ఫ్రంట్ కెమెరా స్టన్నింగ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇండోర్ కండీషన్స్ (లోలైట్) లో కెమెరా పనితీరు నాసీరకంగా ఉంది.

బాగున్నవి బాగాలేనివి
అద్భుతమైన డేలైట్ పనితీరు ఎక్కువ వైబ్రంట్‌గా కనిపిస్తోన్న కలర్స్
ఎఫెక్టివ్ నైట్ మోడ్ బాగాలేని లో-లైట్ సెల్ఫీ పెర్ఫామెన్స్
మంచి డే-లైట్ సెల్ఫీస్ యావరేజీ క్వాలిటీ అల్ట్రావైడ్ లెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Redmi Note 13 Pro

Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాతో తీసిన ఫోటోలు వైబ్రంట్ గా ఉన్నాయి. అయితే కాస్త ఆరెంజ్ వంటి కలర్ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్, డైనమిక్ రేంజ్ బాగున్నాయి.

అయితే, లో-లైట్ కండీషన్స్ లో కలర్ కన్సిస్టెన్సీ బాగాలేదు. ఇమేజెస్ లో ఓవర్‌ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఉన్నాయి. అల్ట్రావైడ్ లెన్స్ కలర్ బ్యాలన్స్, ప్రైమరీ కెమెరాకు దాదాపు సమానంగా ఉంది. అయితే డీటెయిల్స్ బాగాలేవు. పొట్రెయిట్ షాట్స్ విషయంలో ఫోకస్ సమస్యగా ఉంది. ఫ్రంట్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్స్ లో బాగుంది. పొట్రెయిట్ మోడ్‌లో స్కిన్ టోన్ డిటెక్షన్ పర్ఫెక్ట్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ సరిగ్గాలేని లో-లైట్ పనితీరు
ఏఐ ఎడిటింగ్ టూల్స్ సరిగ్గాలేని స్కిన్ టోన్ డిటెక్షన్
మంచి డేలైట్ సెల్ఫీస్ అల్ట్రావైడ్ షాట్స్ లో డీటెయిల్స్ బాగా లేవు

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ చార్జింగ్

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/feed/ 0
Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/ https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/#respond Sun, 06 Oct 2024 15:04:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=13937 తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే వాల్యూ ఫర్ మనీ ఫోన్ల కోసం సగటు వినియోగదారుడు వెతుకుతుంటాడు. కొందరికీ, కెమెరా ఫోన్ పై ఇష్టముంటే, మరికొందరికి గేమింగ్ ఫోన్ కొనాలని ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో రూ.20,000 లోపు భారత్ లో లభిస్తోన్న బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు ఏవో తెలుసుకుందాం. మేం పలు బెంచ్ మార్క్ రిజల్ట్స్ ఆధారంగా అలాగే సొంతంగా కొన్ని టెస్టులను నిర్వహించి, ఏ ఫోన్ సత్తా ఏంటో తెలుసుకునే ప్రయత్నం […]

The post Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే వాల్యూ ఫర్ మనీ ఫోన్ల కోసం సగటు వినియోగదారుడు వెతుకుతుంటాడు. కొందరికీ, కెమెరా ఫోన్ పై ఇష్టముంటే, మరికొందరికి గేమింగ్ ఫోన్ కొనాలని ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో రూ.20,000 లోపు భారత్ లో లభిస్తోన్న బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు ఏవో తెలుసుకుందాం. మేం పలు బెంచ్ మార్క్ రిజల్ట్స్ ఆధారంగా అలాగే సొంతంగా కొన్ని టెస్టులను నిర్వహించి, ఏ ఫోన్ సత్తా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ వివరాలను మీకోసం అందిస్తున్నాం. ఓసారి పూర్తిగా చదివి తెలుసుకోండి.

రూ.20,000 లోపు ధరలో బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ధర
ఐకూ జెడ్ 9 మార్చి 12, 2024 రూ.19,999
రియల్మీ నార్జో 70 టర్బో సెప్టెంబర్ 9, 2024 రూ.16,999
వివో టీ3 మార్చి 21, 2024 రూ.19,999
ఐకూ జెడ్9ఎస్ ఆగస్టు 21, 2024 రూ.19,999
సీఎంఎఫ్ ఫోన్ 1 జులై 8, 2024 రూ.15,999

 

iQOO Z9

iQOO Z9 స్మార్ట్‌ఫోన్ భారత్ లో మార్చి 12వ తేదీన లాంచ్ అయ్యింది. లాంచ్ ధర రూ.19,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ సాలిడ్ బెంచ్‌మార్క్ స్కోర్స్ కలిగి ఉంది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,28,534
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,190
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,681
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,218

 

Realme Narzo 70 Turbo

Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ అయ్యింది. లాంచ్ ధర రూ.16,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. వివిధ బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్స్ పై నార్జో 70 టర్బో మంచి ప్రదర్శన కనబరిచింది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,26,959
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,052
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,969
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 14,895

 

Vivo T3

Vivo T3 స్మార్ట్‌ఫోన్ భారత్ లో మార్చి 21వ తేదీన రూ.19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. సాధారణ గేమింగ్ మరియు డే-టు-డే వాడకానికి ఈ ఫోన్ బాగా సరిపోతుంది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,15,922
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,177
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,646
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,423

 

iQOO Z9s

iQOO Z9s స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 21వ తేదీన రూ.19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఓసారి ఈ ఫోన్ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,02,922
గీక్‌బెంచ్ సింగిల్-కోర్ 1,044
గీక్‌బెంచ్ మల్టీ-కోర్ 3,011
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 10,918

 

CMF Phone 1

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ జులై 8వ తేదీన రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. రోజువారీ సాధారణ వాడకానికి, లైట్ గేమింగ్‌కి ఈ ఫోన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 6,42,187
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,015
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,867
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,598

 

The post Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/feed/ 0
Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/#respond Mon, 30 Sep 2024 14:21:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13845 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.25,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

ఫోన్ చార్జింగ్ స్పీడ్ చార్జింగ్ టైమ్
రియల్మీ 13+ 80 వాట్ 31 నిమిషాలు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 100 వాట్ 35 నిమిషాలు
రియల్మీ పీ2 ప్రో 80 వాట్ 31 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ 36 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 68 వాట్ 37 నిమిషాలు

 

Realme 13+

Realme 13+ రూ.25,000 లోపు ధరలో లభిస్తోన్న ఒక బెస్ట్-పెర్ఫామింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జర్ తో పాటు వస్తోన్న ఈ ఫోన్ 20 శాతం నుంచి పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం 31 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ 10 గంటల స్కోరు చేసింది.

Realme 13+ లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.22,999, 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 గా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

OnePlus Nord CE4

OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాలు సమయం పట్టింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల స్కోర్ చేసింది.

OnePlus Nord CE4 లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

Realme P2 Pro

Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.25,000 లోపు ధర శ్రేణిలో ఉన్న ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 10 గంటల స్కోర్ చేసింది.

Realme P2 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Realme P2 Pro 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 54 నిమిషాల సమయం పట్టింది. అయితే, చార్జ్ బూస్ట్ ఫీచర్ ఉపయోగిస్తే, 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 9 గంటల 53 నిమిషాలు స్కోర్ చేసింది.

Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 మరియు 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉన్నాయి.

Motorola Edge 50 Neo

Motorola Edge 50 Neo లో 4310 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 37 నిమిషాలు సమయం పట్టింది.

Motorola Edge 50 Neo లో 6.4-ఇంచ్ 1.2కే 120 హెర్ట్జ్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ 8జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999, 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/feed/ 0
Best gaming phones: రూ.15,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (సెప్టెంబర్ 2024) https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-15000-september-2024/ https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-15000-september-2024/#respond Wed, 11 Sep 2024 15:00:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=13445 గేమ్స్ ఆడాలని ఎక్కువగా ఇష్టపడే వారికి ఒక చక్కటి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటాం. ఇక రూ.15,000 బడ్జెట్ అనేది డీసెంట్ గేమింగ్ అనుభూతిని అందించే సెగ్మెంట్ గా ఉంది. మోస్తరు బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనాలని అనుకునే వారికి రూ.15,000 లోపు భారత్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్ల జాబితాను 91mobiles టీమ్ కొన్ని టెస్టులు జరిపి […]

The post Best gaming phones: రూ.15,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (సెప్టెంబర్ 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

గేమ్స్ ఆడాలని ఎక్కువగా ఇష్టపడే వారికి ఒక చక్కటి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటాం. ఇక రూ.15,000 బడ్జెట్ అనేది డీసెంట్ గేమింగ్ అనుభూతిని అందించే సెగ్మెంట్ గా ఉంది. మోస్తరు బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనాలని అనుకునే వారికి రూ.15,000 లోపు భారత్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్ల జాబితాను 91mobiles టీమ్ కొన్ని టెస్టులు జరిపి తయారు చేసింది. ఓసారి ఆ లిస్ట్ తెలుసుకుందాం.

రూ.15,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ధర
ఐకూ జెడ్9ఎక్స్ మే 16, 2024 రూ.12,999
వివో టీ3ఎక్స్ ఏప్రిల్ 17, 2024 రూ.13,499
మోటో జీ64 ఏప్రిల్ 16, 2024 రూ.14,999
మోటో జీ45 ఆగస్టు 21, 2024 రూ.10,999
రెడ్మీ 13 జులై 9, 2024 రూ.13,999

 

iQOO Z9x

iQOO Z9x ప్రారంభ ధర భారత్ లో రూ.12,999 గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఇందులో వాడారు. ఈ డివైజ్ యొక్క అంటుటు, గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్స్ సెగ్మెంట్ బెస్ట్ గా ఉన్నాయి. క్యాజువల్ గేమింగ్‌ను ఈ ఫోన్ బాగా హ్యాండిల్ చేయగలదు. ఈ ఫోన్ లో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ గేమ్‌లను హై అండ్ హెచ్డీ రెజుల్యూషన్స్ లో ఆడవచ్చు.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హెచ్డీ
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 40
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 30.9
గేమింగ్ తర్వాత టెంపరేచర్ 36.2
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 5 శాతం

Vivo T3x

Vivo T3x స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. ధర రూ.13,999. ఈ ఫోన్ యొక్క అంటుటు స్కోరు 5,49,494 గా ఉంది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 940 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2767 పాయింట్లు స్కోరు చేసింది. ఈ ఫోన్ బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 లాంటి గేమ్‌లను స్మూథ్ గా హ్యాండిల్ చేస్తుంది. అయితే మినిమల్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి. ఓవర్ హీటింగ్ మాత్రం లేదు.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హెచ్డీ
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 60
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 29.3
గేమింగ్ తర్వాత టెంపరేచర్ 33.3
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 6 శాతం

 

30 నిమిషాల పాటు ఈ ఫోన్ లో గేమ్ ఆడగా, టెంపరేచర్ 29.3 డిగ్రీల నుంచి 33.3 డిగ్రీలకు పెరిగింది. బ్యాటరీ 6 శాతం ఖర్చయ్యింది. ఓవరాల్ గా వివో టీ3ఎక్స్ డీసెంట్ టెంపరేచర్‌తో, తక్కువ బ్యాటరీని ఖర్చు చేసింది.

Moto G64

Moto G64 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. గీక్‌బెంచ్ మరియు అంటుటు ప్లాట్ఫామ్స్ పై డీసెంట్ గా స్కోర్ చేసింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను ఈ ఫోన్ పర్వాలేదనిపించేలా హ్యాండిల్ చేసింది. అయితే గొప్పగా మాత్రం లేదని చెప్పవచ్చు.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హెచ్డీ
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 60
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 31.1
గేమింగ్ తర్వాత టెంపరేచర్ 36.4
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 6 శాతం

 

మోటో జీ64 స్మార్ట్‌ఫోన్‌లో 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక టెంపరేచర్ 31.1 డిగ్రీల నుంచి 36.4 డిగ్రీలకు పెరిగింది. బ్యాటరీ 6 శాతం ఖర్చయ్యింది. ఓవరాల్‌గా ఈ ఫోన్ టెంపరేచర్‌ను బాగానే మెంటైన్ చేసింది. అలాగే తక్కువ బ్యాటరీని వాడుకుంది.

Moto G45

Moto G45 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ అందించారు. అంటుటు స్కోర్ 4,49,055 గా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 929 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2,159 పాయింట్లు స్కోర్ చేసింది. స్మూథ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మోటో జీ45 లో పొందవచ్చు.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హెచ్డీ
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ అల్ట్రా
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 29.1
గేమింగ్ తర్వాత టెంపరేచర్ 31.6
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 7 శాతం

 

టెస్టింగ్ సమయంలో, మోటో జీ45 యొక్క టెంపరేచర్ 29.1 డిగ్రీల నుంచి 31.6 డిగ్రీల వరకు పెరిగింది. బ్యాటరీ 7 శాతం ఖర్చయ్యింది. ఓవరాల్‌గా ఈ ఫోన్ టెంపరేచర్‌ను బాగానే హ్యాండిల్ చేసింది. అలాగే గేమింగ్ టైమ్ లో బ్యాటరీ వాడకం కూడా రీజనబుల్‌గా ఉంది.

Redmi 13

Redmi 13 స్మార్ట్‌ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ అందించారు. ఈ ఫోన్ ధర రూ.13,999 గా ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. గీక్‌బెంచ్ 6 మరియు అంటుటు ప్లాట్ఫామ్స్ పై స్కోర్లు బాగానే ఉన్నాయి. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ గేమ్‌లు బాగానే హ్యాండిల్ చేయగలదు.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హెచ్డీ
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ హై
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 29.7
గేమింగ్ తర్వాత టెంపరేచర్ 37.8
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 8 శాతం

 

రెడ్మీ 13 లో 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, టెంపరేచర్ 29.7 డిగ్రీల నుంచి 37.8 డిగ్రీలకు పెరిగింది. బ్యాటరీ 8 శాతం ఖర్చయ్యింది. గేమింగ్ తర్వాత, టెంపరేచర్ మరియు బ్యాటరీ డ్రాప్ అనేవి కాస్త కంగారు పెట్టేలా ఉన్నాయి.

The post Best gaming phones: రూ.15,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (సెప్టెంబర్ 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-15000-september-2024/feed/ 0
Upcoming Phones: సెప్టెంబర్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/upcoming-phones-list-september-2024/ https://www.91mobiles.com/telugu/upcoming-phones-list-september-2024/#respond Thu, 29 Aug 2024 15:46:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=13249 ఆగస్టు నెల చివరికి వచ్చింది. ఈ నెలలో పలు స్మార్ట్‌ఫోన్లను యూజర్లను పలకరించాయి. ఇప్పుడు రాబోయే కొత్త నెల సెప్టెంబర్ పై అందరి చూపు ఉంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఆపిల్ సహా మరెన్నో బ్రాండ్స్ ఉన్నాయి. Apple విషయానికి వస్తే, తన iPhone 16 సిరీస్ ను వచ్చే నెల లాంచ్ చేయబోతోంది. మరి, సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోయే ఫోన్ల జాబితాను తెలుసుకుందామా? సెప్టెంబర్ […]

The post Upcoming Phones: సెప్టెంబర్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>

ఆగస్టు నెల చివరికి వచ్చింది. ఈ నెలలో పలు స్మార్ట్‌ఫోన్లను యూజర్లను పలకరించాయి. ఇప్పుడు రాబోయే కొత్త నెల సెప్టెంబర్ పై అందరి చూపు ఉంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఆపిల్ సహా మరెన్నో బ్రాండ్స్ ఉన్నాయి. Apple విషయానికి వస్తే, తన iPhone 16 సిరీస్ ను వచ్చే నెల లాంచ్ చేయబోతోంది. మరి, సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోయే ఫోన్ల జాబితాను తెలుసుకుందామా?

సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

Infinix Hot 50 5G

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో సెప్టెంబర్ 5వ తేదీన లాంచ్ అవుతోంది. దీని ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా. సెగ్మెంట్ లో అత్యంత సన్నని 5జీ ఫోన్ ఇదేనని ఇన్ఫినిక్స్ కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి.

iPhone 16 / 16 Plus

iPhone 16 సిరీస్ సెప్టెంబర్ 9న లాంచ్ అవుతోంది. లైనప్ లో ఏయే ఫోన్లు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. అయితే 4 ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. బేస్ వేరియంట్ iPhone 16 ధర రూ.79,999, iPhone 16 ప్లస్ ధర రూ.89,999 గా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లలో బయోనిక్ ఏ18 చిప్ ఉంటుంది. ఈ ఫోన్లు వరుసగా 6.1-ఇంచ్ మరియు 6.7-ఇంచ్ డిస్ప్లేస్ తో రానున్నాయి.

iPhone 16 Pro / 16 Pro Max

iPhone 16 Pro, iPhone 16 Pro Max కూడా సెప్టెంబర్ 9న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. iPhone 16 Pro ధర రూ.1,19,900, iPhone 16 Pro Max ధర రూ.1,49,900 గా ఉంటాయని సమాచారం. ఈ ఫోన్లలో బయోనిక్ ఏ18 ప్రో చిప్ ఉంటుంది. ఇంకా 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, టైటానియమ్ డిజైన్ ఉంటాయి. ప్రో వేరియంట్ లో 6.3-ఇంచ్ డిస్ప్లే, ప్రో మ్యాక్స్ లో 6.9-ఇంచ్ డిస్ప్లే ఉంటుంది.

Motorola Razr 50

Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ భారత్ లో సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. త్వరలో తేదీ వెల్లడవుతుంది. ఈ ఫోన్ ధర రూ.65,000 గా ఉంటుందని అంచనా. ఈ ఫోన్ 3.6-ఇంచ్ ఎక్స్‌టర్నల్ డిస్ప్లేతో వస్తోంది.

Realme Narzo 70 Turbo 5G

Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌పోన్ భారత్‌లో సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇప్పటికే ఈ ఫోన్ రియల్మీ అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది.

Realme P2 / Realme P2 Pro

రియల్మీ సంస్థ త్వరలో రియల్మీ పీ2 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme P2 మరియు Realme P2 Pro అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. Realme P2 ధర రూ.15,999, Realme P2 Pro ధర రూ.19,499 ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లు సెప్టెంబర్ నెలలోనే లాంచ్ అవుతాయని తెలుస్తోంది. ఈ ఫోన్లు 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావొచ్చు.

Vivo T3 Ultra

Vivo T3 Ultra సెప్టెంబర్ నెలాఖరులో లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 12జిబి ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఓఐఎస్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే కచ్చితమైన తేదీ వివరాలు వెల్లడవుతాయి.

The post Upcoming Phones: సెప్టెంబర్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/upcoming-phones-list-september-2024/feed/ 0
Best gaming phones: రూ.25,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-25000-india-august-2024/ https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-25000-india-august-2024/#respond Sun, 18 Aug 2024 18:28:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13041 గేమ్స్ ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడే వారికి ఒక చక్కటి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటాం. ఇక రూ.25,000 బడ్జెట్ అనేది డీసెంట్ గేమింగ్ అనుభూతిని అందించే బాగా డిమాండ్ ఉన్న సెగ్మెంట్ గా ఉంది. మోస్తరు బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనాలని అనుకునే వారికి ఈ ప్రైస్ రేంజ్ బెటర్ ఆప్షన్. రూ.25,000 లోపు భారత్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ […]

The post Best gaming phones: రూ.25,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

గేమ్స్ ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడే వారికి ఒక చక్కటి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటాం. ఇక రూ.25,000 బడ్జెట్ అనేది డీసెంట్ గేమింగ్ అనుభూతిని అందించే బాగా డిమాండ్ ఉన్న సెగ్మెంట్ గా ఉంది. మోస్తరు బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనాలని అనుకునే వారికి ఈ ప్రైస్ రేంజ్ బెటర్ ఆప్షన్. రూ.25,000 లోపు భారత్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్ల జాబితాను 91mobiles టీమ్ కొన్ని టెస్టులు జరిపి తయారు చేసింది. ఓసారి ఆ లిస్ట్ తెలుసుకుందాం.

రూ.25,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ పేరు లాంచ్ తేదీ ధర
Infinix GT 20 Pro మే 21, 2024 రూ.24,999
OnePlus Nord CE 4 ఏప్రిల్ 1, 2024 రూ.24,999
Nothing Phone (2a) మార్చి 5, 2024 రూ.23,999
Motorola Edge 50 Fusion మే 16, 2024 రూ.22,999
Realme P1 Pro ఆగస్టు 15, 2024 రూ.21,999

 

Infinix GT 20 Pro

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ ఈ సెగ్మెంట్ లో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ లో వీసీ కూలింగ్ టెక్నాలజీని అందించారు. Infinix GT 20 Pro యొక్క అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 9,36,985 గా ఉంది. ఈ సెగ్మెంట్ లో ఇదే హయ్యస్ట్ స్కోర్. ఇక గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3384 పాయింట్లు స్కోర్ చేసింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్షిన్ ఇంపాక్ట్ వంటి గేమ్స్‌ను ఈ ఫోన్ స్మూథ్ గా హ్యాండిల్ చేయగలదు.

గేమింగ్ కు ముందు Infinix GT 20 Pro యొక్క టెంపరేచర్ 29.1 గా ఉంది. 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, టెంపరేచర్ 32.2 కు చేరింది. బ్యాటరీ కేవలం 7 శాతం ఖర్చయ్యింది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అల్ట్రా హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ అల్ట్రా
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 29.1
30 నిమిషాలు గేమ్ ఆడాక 32.2
బ్యాటరీ డ్రాప్ శాతం 7%

 

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ 8,19,347 అంటుటు స్కోర్ నమోదు చేసింది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1138 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2950 పాయింట్లు స్కోర్ చేసింది. OnePlus Nord CE 4 డివైజ్ బీజీఎంఐ గేమ్‌ను మ్యాగ్జిమమ్ గ్రాఫిక్స్ మరియు ఫ్రేమ్ రేట్ సెట్టింగ్స్ లో ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

OnePlus Nord CE 4 డివైజ్ 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, టెంపరేచర్ 38.5 కు చేరుకుంది. అంతకు ముందు 30.4 గా ఉంది. బ్యాటరీ 7 శాతం డ్రాప్ అయ్యింది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అల్ట్రా హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 60
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 30.4
గేమ్ ఆడాక టెంపరేచర్ 38.5
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 7 శాతం

Nothing Phone (2a)

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ.23,999 గా ఉంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అంటుటు పై ఈ ఫోన్ 7,07,480 పాయింట్ల స్కోర్ నమోదు చేసింది. గీక్‌బెంచ్ పై ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1068 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2454 పాయింట్లు స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, Nothing Phone (2a) ఫోన్ యొక్క టెంపరేచర్ 29.8 నుంచి 37.8 కి పెరిగింది. అయితే, బ్యాటరీ 10 శాతం ఖర్చయ్యింది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ అల్ట్రా
గేమింగ్ కు ముందు టెంపరేచర్ 29.8
గేమింగ్ తర్వాత టెంపరేచర్ 37.8
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 10 శాతం

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీతో వచ్చింది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ యొక్క అంటుటు స్కోర్ 6,20,648 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2945 పాయింట్లు నమోదు చేసింది. అల్ట్రా హెచ్డీఆర్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ + 60 ఫ్రేమ్ రేట్ తో బీజీఎంఐ గేమ్‌ని ఈ ఫోన్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, Motorola Edge 50 Fusion డివైజ్ టెంపరేచర్ 34.3 వరకు పెరిగింది. అంతకు ముందు ఇది 26.8 గా ఉంది. బ్యాటరీ డ్రాప్ 9 శాతంగా ఉంది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అల్ట్రా హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 60
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 26.8
30నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 34.3
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 9%

Realme P1 Pro

Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ 5,92,957 అంటుటు స్కోర్ నమోదు చేసింది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 929 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2680 పాయింట్లు సాధించింది. 91మొబైల్స్ జరిపిన టెస్టింగ్ లో ఈ డివైజ్ గేమింగ్ విషయంలో మంచి పెర్ఫామెన్స్ కనబరిచింది.

గేమింగ్‌కు ముందు Realme P1 Pro యొక్క టెంపరేచర్ 31.5 గా ఉంది. 30 నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 37.6 కు పెరిగింది. బ్యాటరీ 9 శాతం డ్రాప్ అయ్యింది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అల్ట్రా హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 60
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 31.5
30నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 37.6
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 9%

The post Best gaming phones: రూ.25,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-25000-india-august-2024/feed/ 0
Best Fast Charging Phones: రూ.30,000 లోపు 5 బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) https://www.91mobiles.com/telugu/5-best-fast-charging-phones-under-rs-30000-august-2024/ https://www.91mobiles.com/telugu/5-best-fast-charging-phones-under-rs-30000-august-2024/#respond Wed, 14 Aug 2024 18:26:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=13008 కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేముందు ప్రధానంగా యూజర్లు ఆలోచించే స్పెసిఫికేషన్స్ లో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఒకటి. ఎంత త్వరగా ఫోన్ చార్జ్ అయితే అంత హ్యాపీ కదా. ఇప్పుడు ఫోన్ గంటల తరబడి చార్జ్ అవుతుంటే వెయిట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. పరిస్థితులు అలా మారిపోయాయి. అందుకే ఎక్కువ చార్జింగ్ స్పీడ్ ఉండే ఫోన్లను ఎంపిక చేసుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తుంటారు. మరి మీ బడ్జెట్ రూ.30,000 లోపు అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ బడ్జెట్ […]

The post Best Fast Charging Phones: రూ.30,000 లోపు 5 బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేముందు ప్రధానంగా యూజర్లు ఆలోచించే స్పెసిఫికేషన్స్ లో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఒకటి. ఎంత త్వరగా ఫోన్ చార్జ్ అయితే అంత హ్యాపీ కదా. ఇప్పుడు ఫోన్ గంటల తరబడి చార్జ్ అవుతుంటే వెయిట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. పరిస్థితులు అలా మారిపోయాయి. అందుకే ఎక్కువ చార్జింగ్ స్పీడ్ ఉండే ఫోన్లను ఎంపిక చేసుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తుంటారు. మరి మీ బడ్జెట్ రూ.30,000 లోపు అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ బడ్జెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

5 ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్లు (రూ.30,000 లోపు ధరలో)

స్మార్ట్‌ఫోన్ పేరు చార్జింగ్ స్పీడ్ చార్జింగ్ టైమ్ (20%-100%)
వన్‌ప్లస్ నార్డ్ 4 100 వాట్స్ 24 నిమిషాలు
పోకో ఎఫ్6 90 వాట్స్ 32 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 68 వాట్స్ 40 నిమిషాలు
ఒప్పో ఎఫ్27 ప్రో+ 67 వాట్స్ 48 నిమిషాలు
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 50 వాట్స్ 51 నిమిషాలు

 

91మొబైల్స్ జరిపిన టెస్టులను అనుసరించి పైన టేబుల్ లో డేటాను అందించడం జరిగింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో వచ్చిన ఫలితాలను క్రింద టేబుల్ లో అందిస్తున్నాం. ఓసారి చూడండి.

స్మార్ట్‌ఫోన్ల యొక్క బ్యాటరీ కెపాసిటీ

స్మార్ట్‌ఫోన్ పేరు బ్యాటరీ కెపాసిటీ పీసీమార్క్ స్కోరు బ్యాటరీ డ్రాప్ (యూట్యూబ్ 30 నిమిషాలు)
వన్‌ప్లస్ నార్డ్ 4 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ 16 గంటల 58 నిమిషాలు 5 శాతం
పోకో ఎఫ్6 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 11 గంటల 42 నిమిషాలు 4 శాతం
మోటోరోలా ఎడ్జ్ 50 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10 గంటల 59 నిమిషాలు 5 శాతం
ఒప్పో ఎఫ్27 ప్రో+ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10 గంటల 46 నిమిషాలు 4 శాతం
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 14 గంటల 34 నిమిషాలు 4 శాతం

The post Best Fast Charging Phones: రూ.30,000 లోపు 5 బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/5-best-fast-charging-phones-under-rs-30000-august-2024/feed/ 0
OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/#respond Sun, 11 Aug 2024 18:28:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=12934 స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను సదరు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు […]

The post OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను సదరు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు వారి అవసరానికి అనుగుణంగా ఫోన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఈ ఆర్టికల్ లో OnePlus Nord 4 మరియు Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్లలో ఎందులో ఉత్తమమైన కెమెరా ఉందో తెలుసుకుందాం.

OnePlus Nord 4 మరియు Motorola Edge 50 Pro కెమెరా స్పెసిఫికేషన్స్

సబ్జెక్ట్ పై డిఫాల్ట్ ఆటో‌ఫోకస్ తో రెండు ఫోన్ల యొక్క పాయింట్-అండ్-షూట్ సామర్థ్యాన్ని మేం టెస్ట్ చేశాం. OnePlus Nord 4 లో టెలీఫోటో లెన్స్ లేదు. అందుకోసమే మేం, జూమ్ కేపబులిటీస్‌ను పోల్చి చూడలేదు. సరే, ఓసారి Nord 4 మరియు Edge 50 Pro ఫోన్ల యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord 4

ప్రైమరీ సెన్సర్: 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ సెన్సర్, ఈఐఎస్ + ఓఐఎస్

సెకండరీ సెన్సర్: 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 112-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ

టెలీఫోటో సెన్సర్: ఇందులో లేదు

ఫ్రంట్ కెమెరా: 16ఎంపి సెన్సర్, ఎఫ్/2.4 అపర్చర్

Motorola Edge 50 Pro

ప్రైమరీ సెన్సర్: 50ఎంపి సెన్సర్, ఎఫ్/1.4 అపర్చర్, ఓఐఎస్

సెకండరీ సెన్సర్: 13ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ

టెలీఫోటో సెన్సర్: 10ఎంపి 2ఎక్స్ సెన్సర్, ఓఐఎస్

ఫ్రంట్ కెమెరా: 50ఎంపి శాంసంగ్ సెన్సర్, ఎఫ్/1.9 అపర్చర్

OnePlus Nord 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇందులో క్వాల్కమ్ స్పెక్ట్రా 18-బిట్ ట్రిపుల్ కాగ్నిటివ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ఐఎస్‌పీ) ఉంది. Motorola Edge 50 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇందులో క్వాల్కమ్ స్పెక్ట్రా 12-బిట్ ట్రిపుల్ ఐఎస్‌పీ ఉంది. టెక్నికల్‌గా వన్‌ప్లస్ నార్డ్ 4 లో హయ్యర్ బిట్ రేట్ సపోర్ట్ ఉంది. దీన్ని బట్టి ఈ ఫోన్ బాగా పెర్ఫామ్ చేయాలి. మరింకెందుకు ఆలస్యం, రియల్ లైఫ్ యూసేజ్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి కెమెరా కంపారిజన్ లోకి వెళదాం పదండి.

డేలైట్

ఈ రెండు ఫోన్లు కూడా 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చాయి. వన్‌ప్లస్ నార్డ్ 4 లోని అపర్చర్ ఫౌంటెయిన్ వెనకాల నేచురల్ డెప్త్ క్రియేట్ చేసింది. ఈ చిన్నదైన అపర్చర్ తక్కువ లైట్‌ను క్యాప్చర్ చేసింది. దీంతో మోటో‌ ఇమేజ్‌తో పోల్చితే, గ్రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి.

Motorola Edge 50 Pro లో సోషల్ మీడియాలో షేర్ చేయదగిన క్వాలిటీ, వైబ్రన్సీతో కూడిన అవుట్‌పుట్ వస్తోంది. మరోవైపు, OnePlus Nord 4 కూల్ కలర్స్ తో డల్ ఇమేజెస్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. రెండు ఫోన్లలో తీసిన ఫోటోలు కలర్ విషయంలో తేడాగా ఉన్నాయి. కానీ, నార్డ్ 4 రిజల్ట్స్ రియాల్టీకి దగ్గరగా ఉన్నాయి. హెచ్డీఆర్ ప్రాసెసింగ్, డీటెయిల్స్ విషయాల్లో Motorola Edge 50 Pro బాగా పెర్ఫామ్ చేసింది. Nord 4 విషయానికి వస్తే, హైలైట్స్ ను సరిగ్గా మేనేజ్ చేసింది. డీటెయిల్స్ అనేవి ఎక్కు షార్ప్‌నెస్ తో చూపబడ్డాయి.

విజేత: Motorola Edge 50 Pro

అల్ట్రావైడ్

OnePlus Nord 4 లో 8ఎంపి సోని అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు. ఇది 112-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉంది. అంటే, ఇది ఇమేజ్ మధ్యలో ఎక్కువ డీటెయిల్స్‌ చూపిస్తుంది. ప్రైమరీ లెన్స్ మరియు అల్ట్రావైడ్ లెన్స్‌ల మధ్య కలర్ కన్సిస్టెన్సీ బాగుంది.

Motorola Edge 50 Pro లో 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు. ఇది ఇమేజ్ లో అన్నిచోట్టా ఎక్కువ డీటెయిల్స్‌ను చూపిస్తుంది. ఈ సెన్సర్ తో తీసిన ఇమేజెస్ ఓవర్‌శాచురేటెడ్ గా ఉండి, నాయిస్ ను కలిగి ఉన్నాయి. ఇంకా ఈ ఇమేజెస్ లో విచిత్రంగా బ్లూ టింట్ కూడా కనిపిస్తోంది.

విజేత: సమానం

పొట్రెయిట్

Motorola Edge 50 Pro పొట్రెయిట్స్ విషయంలో కూడా మరోసారి ఓవర్‌శాచురేషన్ సమస్య వల్లన ఇబ్బంది పడింది. ఎక్కువ కాంట్రాస్ట్ అనేది ఇమేజెస్ లో మనం గమనించవచ్చు. అయితే బొకే ఎఫెక్ట్ నేచురల్ గా ప్రొడ్యూస్ చేసింది. సబ్జెక్ట్ లోని డీటెయిల్స్ చూపించడంలో మరియు ఎడ్జ్-కటౌట్ విషయంలో సెన్సర్ బాగా పని చేసింది.

పొట్రెయిట్స్ విషయంలో OnePlus Nord 4 బ్యాలన్స్డ్ గా ఉంది. శాచురేషన్ మరియు హెచ్డీఆర్ విషయాల్లో పెర్ఫామెన్స్ బాగుంది. కానీ, కాంట్రాస్ట్ మరియు డీపర్ బ్లాక్స్ లోపించాయి. అయితే వీటిని కొన్ని ఎడిట్స్ తో సెట్ చేసుకోవచ్చు. అయితే వన్‌ప్లస్ తన ఇమేజెస్ కు స్కిన్ స్మూథెనింగ్ ని అప్లై చేసినట్లు అనిపిస్తోంది.

విజేత: OnePlus Nord 4

సెల్ఫీ

వన్‌ప్లస్ నార్డ్ 4 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. వైబ్రంట్ కలర్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేయదగిన ఇమేజెస్‌ను ఇది అందిస్తోంది. అయితే కొంచెం వార్మ్ కలర్ గుర్తించడం జరిగింది. స్కిన్ కలర్ మరియు కలర్ కన్సిస్టెన్సీ కాస్త మెరుగవ్వాలి.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది పెద్ద సెన్సర్ కాబట్టి, నార్డ్ 4 లో ఇచ్చిన 16ఎంపి కంటే బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది. డీటెయిలింగ్ మరియు కాంట్రాస్ట్, స్కిన్ టోన్ విషయాల్లో ఎడ్జ్ 50 ప్రో ద్వారా తీసిన సెల్ఫీలు బెటర్ గా ఉన్నాయి.

విజేత: Motorola Edge 50 Pro

లో లైట్

నైట్ మోడ్ లేకుండా లో-లైట్ కండీషన్స్ లో, వన్‌ప్లస్ నార్డ్ 4 బెటర్ గా పెర్ఫామ్ చేసింది. హెచ్డీఆర్, ఎక్స్‌పోజర్, కలర్ ఆక్యురెసీ వంటి విషయాల్లో మెరుగ్గా ఉంది. లైట్ సోర్సెస్ ను కూడా బాగా వాడుకుంది.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీటెయిల్డ్ ఇమేజెస్ ను అందించింది. అలాగే ఇమేజెస్ లోని టెక్స్ట్ పార్ట్స్ షార్ప్ గా ఉన్నాయి. అయితే కాంట్రాస్ట్ ఎక్కువ కావడం, ప్రాసెసింగ్ నాసీరకంగా ఉండటంతో నాణ్యమైన ఇమేజ్ రాలేదు. నార్డ్ 4 తో పోల్చితే, ఈ విషయంలో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ప్రభావం చూపలేకపోయింది.

విజేత: OnePlus Nord 4

నైట్ మోడ్

నైట్ మోడ్ లో వన్‌ప్లస్ నార్డ్ 4 తో తీసిన ఇమేజ్ చూడటానికి సాధారణ ఫోటో మాదిరే ఉంది. కానీ, కాస్త బ్రైట్నెస్ పెరిగింది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజ్ లో నైట్ మోడ్ ఇమేజ్ ని గమనిస్తే, కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంది. రెడ్ నియాన్ సైన్స్, బ్యాక్‌లిట్ మెను బోర్డ్స్ వంటివి బాగానే కనిపిస్తున్నాయి. ఎక్స్‌పోజర్ బాగానే బ్యాలన్స్ అయ్యింది. లైట్ సోర్సెస్ చుట్టూ ఉన్న బ్లూమ్ నార్డ్ 4 కంటే బెటర్ గా ఉంది. అలాగే బిల్డింగ్ ప్యానెల్ పైన గ్రేడియంట్ కూడా సమతూకంతో ఉంది.

విజేత: Motorola Edge 50 Pro

సెల్ఫీ లో-లైట్ (ఫ్లాష్ తో)

రెండు ఫోన్లు కూడా సబ్జెక్ట్‌ పైన లైట్‌ని బాగానే ప్రసరింపజేస్తున్నాయి. చాలా తక్కువ కాంతి ఉన్న సమయాల్లో స్క్రీన్ ఫ్లాష్ తో తీసే ఫోటోలను రెండు ఫోన్లు కూడా బాగానే హ్యాండిల్ చేశాయి. కలర్ విషయానికి వస్తే, టీ-షర్ట్ కలర్ మోటో ఎడ్జ్ 50 ప్రో లో రియాల్టీకి దగ్గరగా ఉంది. టీ-షర్ట్ మరియు షెల్ఫ్ పైన బాక్స్‌ లోని రెడ్ కలర్ ని నార్డ్ 4 బూస్ట్ చేసింది.

వన్‌ప్లస్ నార్డ్ 4 తో తీసిన ఇమేజ్‌ను గమనిస్తే, స్కిన్ టోన్ బ్రైట్ గా ఉంది. మోటో ఎడ్జ్ 50 ప్రో తో తీసిన ఫోటోలు వైడ్ గా ఉండి, సాఫ్ట్ గా ఉన్నాయి. అలాగే కాస్త నాయిస్ కూడా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ ను మోటో ఎడ్జ్ 50 ప్రో బాగా హ్యాండిల్ చేసింది.

రెండింట్లో దేన్ని ఎంచుకోవాలనేది, మీరు ప్రిఫర్ చేసే ఇమేజ్ ను బట్టి ఉంటుంది. బ్రైట్ గా, డీటెయిల్డ్ గా ఉండాలంటే, నార్డ్ 4 బెటర్. సెల్ఫీలో ఎక్కువ మెంబర్స్ తో పాటు, కలర్ యాక్యురెసీ, లైట్ కంట్రోల్ వంటివి మీకు ముఖ్యమైతే, మోటో ఎడ్జ్ 50 ఫ్రో బెటర్.

విజేత: సమానం

ఏది బెటర్?

రెండు ఫోన్లు కూడా ఫోటోగ్రఫీ విషయంలో సమానమైన పనితీరును కనబరిచాయి. అయితే, కొంచెం తేడాతో Motorola Edge 50 Pro విజయం సాధించింది. డే-లైట్ షాట్స్, సెల్ఫీ, నైట్ మోడ్ వంటి విషయాల్లో మోటో ఎడ్జ్ 50 ప్రో బాగా పెర్ఫామ్ చేసింది. దీన్ని బట్టి, ఈ సెగ్మెంట్ లో ఎడ్జ్ 50 ప్రో బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పలేం. ఎందుకంటే, ఓవర్-శాచ్యురేషన్ సమస్య, లో-లైట్ పెర్ఫామెన్స్ వంటి వాటిని మోటోరోలా మెరుగుపరచాల్సి ఉంది. ఇక కాంట్రాస్ట్, డీపర్ బ్లాక్స్ ఏరియాల్లో వన్‌ప్లస్ నార్డ్ 4 ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది.

The post OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/feed/ 0
Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/#respond Wed, 07 Aug 2024 18:24:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=12877 ఇటీవలె భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 మరియు Nothing Phone (2a) Plus ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు కూడా యూజర్లకు నచ్చే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇక ఈ డివైజెస్ 8జిబి ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 గా ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మరి రెండింట్లో ఏది ఉత్తమమైన పవర్ బ్యాకప్ ఇస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మేం, […]

The post Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

ఇటీవలె భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 మరియు Nothing Phone (2a) Plus ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు కూడా యూజర్లకు నచ్చే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇక ఈ డివైజెస్ 8జిబి ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 గా ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మరి రెండింట్లో ఏది ఉత్తమమైన పవర్ బ్యాకప్ ఇస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మేం, ఈ రెండు ఫోన్లను పీసీమార్క్ బ్యాటరీ బెంచ్‌మార్క్ వినియోగించి పరీక్షలు జరిపాం. అలాగే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ టెస్ట్‌లు కూడా చేసి బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో పరిశీలించాం. ఆ వివరాలు మీకోసం అందిస్తున్నాం.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ రెండు ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా 20 శాతానికి పడిపోయే దాకా చేయడం జరిగింది. మోటో ఎడ్జ్ 50 మరియు నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్లను 100 శాతం బ్యాటరీతో, 50 శాతం వాల్యూమ్ మరియు బ్రైట్నెస్ లెవెల్స్ తో టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ లో Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ 10 గంటల 50 నిమిషాల స్కోర్ చేయగా, Nothing Phone 2a Plus 14 గంటల 34 నిమిషాల స్కోర్ చేసింది.

విజేత: Nothing Phone (2a) Plus

వీడియో స్ట్రీమింగ్

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 యొక్క బ్యాటరీ 30 నిమిషాల తర్వాత 5 శాతం ఖర్చయ్యింది. టెస్టింగ్ సమయంలో మ్యాగ్జిమమ్ సపోర్టెడ్ రెజుల్యూషన్, 50 శాతం బ్రైట్నెస్, 50 శాతం వాల్యూమ్ లెవెల్స్ ఉన్నాయి. ఇవే సెట్టింగ్స్ తో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ చేయగా, 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. దీన్ని 200mAh అని చెప్పవచ్చు. మరోవైపు మోటో ఎడ్జ్ 50 లో ఇది 250mAh గా ఉంది.

విజేత: Nothing Phone (2a) Plus

గేమింగ్

గేమింగ్ టెస్ట్ లో కూడా Nothing Phone (2a) Plus, Moto Edge 50 కంటే ఉత్తమమైన బ్యాటరీ పనితీరును కనబర్చింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ మరియు రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను ప్రతీ ఒక్క దాన్ని 30 నిమిషాల చొప్పున ఆడితే నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో 19 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 50 లో 26 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.

విజేత: Nothing Phone (2a) Plus

చార్జింగ్ స్పీడ్స్

చార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, Motorola Edge 50 తన 68W ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ బాక్స్ లో అందించిన చార్జర్ తో రెగ్యులర్ మోడ్‌లో చార్జ్ చేసినప్పుడు, 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 40 నిమిషాల సమయం పట్టింది. అదే, చార్జ్ బూస్ట్ మోడ్‌లో 30 నిమిషాల సమయం పట్టింది.

మరోవైపు, Nothing Phone (2a) Plus 50 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. కానీ, బాక్స్ లో చార్జర్ తో రావడంలేదు. కంపాటిబుల్ థర్డ్-పార్టీ పీడీ చార్జర్ తో జరిపిన టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Motorola Edge 50

ఏది బెస్ట్?

Nothing Phone (2a) Plus మెరుగైన బ్యాటరీ పనితీరుతో Motorola Edge 50 తో పోల్చితే.. బెంచ్‌మార్క్ టెస్ట్‌లు, గేమింగ్ మరియు స్ట్రీమింగ్ విషయాల్లో మేటిగా నిలిచింది. అయితే, Motorola Edge 50 ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్, బాక్స్ లో చార్జర్.. వంటి విషయాల్లో ముందు వరుసలో ఉంది. మీ అవసరానికి అనుగుణంగా రెండు ఫోన్లలో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

The post Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/feed/ 0
Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/#respond Tue, 06 Aug 2024 18:29:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12854 నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో OPPO A3x అనే మరొక ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ కి ఒప్పో ఏ3ఎక్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి ఏది […]

The post Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో OPPO A3x అనే మరొక ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ కి ఒప్పో ఏ3ఎక్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకుందాం.

Infinix Note 40X vs OPPO A3x: డిజైన్

Infinix Note 40X ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమ వైపున బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో, స్క్వేర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది.

OPPO A3x డివైజ్ ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. బ్లాక్, వైట్ మరియు పర్పుల్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ డివైజ్ మిలిటరీ గ్రేడ్ MIL-STD 810H సర్టిఫికేషన్ తో వచ్చింది. ఫ్రంట్ లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది.

Infinix Note 40X vs OPPO A3x: డిస్ప్లే

Infinix Note 40X డివైజ్ లో OPPO A3x కంటే మెరుగైన మరియు భారీ డిస్ప్లే ఉంది. రెండు ఫోన్లు కూడా ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. అయితే, Infinix Note 40X లో ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ ఉండగా, OPPO A3x లో హెచ్డీ+ స్క్రీన్ ఉంది. నోట్ 40ఎక్స్ లో ఉన్న హయ్యర్ రెజుల్యూషన్, ఒప్పో ఏ3ఎక్స్ కంటే మెరుగైన, స్పష్టమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Infinix Note 40X vs OPPO A3x: పెర్ఫామెన్స్

రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు. ఈ ప్రాసెసర్ పెర్ఫామెన్స్ పర్వాలేదనిపించేలా ఉంటుంది. కాబట్టి, రెండు ఫోన్ల యొక్క పనితీరు ఒకే విధంగా ఉంటుందని అంచనా వేయవచ్చు.

అయితే Infinix Note 40X 8జిబి మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు OPPO A3x 4జిబి ర్యామ్ ని మాత్రమే ఆఫర్ చేస్తుంది. సాధారణ వాడకానికి కూడా 4జిబి ర్యామ్ సరిపోదు. మల్టీ టాస్కింగ్ లేదా యాప్స్ నడుమ మారేందుకు, యాప్స్ లోడ్ అయ్యేందుకు ఈ ర్యామ్ పవర్ సరిపోదు.

ఇదిలా ఉంచితే, రెండు ఫోన్లో స్టోరేజీని పెంచుకునే వీలుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. OPPO A3x 128జిబి స్టోరేజీతో వచ్చింది.

Infinix Note 40X vs OPPO A3x: కెమెరాలు

Infinix Note 40X లో ఒప్పో ఏ3ఎక్స్ తో పోల్చితే ఉత్తమమైన కెమెరా సెటప్ ఉంది. ఒప్పో ఏ3ఎక్స్ లో 8ఎంపి రియర్ కెమెరాను అందించారు. మరోవైపు నోట్ 40ఎక్స్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

ముందువైపు, Infinix Note 40X లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. OPPO A3x లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంది. Infinix Note 40X లో ఏఐ కెమెరా, ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Infinix Note 40X vs OPPO A3x: బ్యాటరీ, చార్జింగ్

బ్యాటరీ మరియు చార్జింగ్ విభాగంలో ఒప్పో ఏ3ఎక్స్ దే పైచేయి. ఈ ఫోన్ లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. అలాగే 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. మరోవైపు Infinix Note 40X లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

రెండు ఫోన్ల మధ్య 100ఎంఏహెచ్ బ్యాటరీ పెద్ద తేడా కాదని చెప్పవచ్చు. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ ఒప్పో ఏ3ఎక్స్ ను త్వరగా చార్జ్ చేయగలదు. నోట్ 40ఎక్స్ లో అందించిన 18 వాట్ ఫాస్ట్ చార్జర్ నెమ్మదిగా చార్జ్ చేస్తుంది.

Infinix Note 40X vs OPPO A3x: సాఫ్ట్‌వేర్

ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ మరియు ఒప్పో ఏ3ఎక్స్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. ఒప్పో ఏ3ఎక్స్ కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఏది బెటర్?

ఓవరాల్‌గా, స్పెసిఫికేషన్స్ ప్రకారం చూస్తే.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు డీసెంట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. అలాగే రెండు ఫోన్లలో ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. కాబట్టి, రెండింట్లో దేన్ని ఎంపిక చేసుకోవాలనేది యూజర్ వ్యక్తిగత నిర్ణయం.

మీకు గనుక, స్పష్టమైన డిస్ప్లే, ఎక్కువ ర్యామ్ కావాలంటే.. Infinix Note 40X ఎంచుకోండి. మీకు బ్యాటరీ లైఫ్ మరియు చార్జింగ్ స్పీడ్ ముఖ్యమైతే OPPO A3x ప్రయత్నించవచ్చు.

 

The post Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/feed/ 0