POCO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6

Highlights

  • త్వరలో POCO F6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్
  • మోడల్ నంబర్ 24069PC12G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro అనే రెండు మోడల్స్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా బేస్ మోడల్ POCO F6 థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

POCO F6 ఎన్బీటీసీ లిస్టింగ్

POCO F6 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీపై 24069PC12G మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. జీ అనే అక్షరం గ్లోబల్ వేరియంట్ ని సూచిస్తుంది. POCO F6 పేరు కూడా ఎన్బీటీసీ ద్వారా ఖరారైంది.

అయితే ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా POCO F6 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. అయితే లిస్టింగ్ తో డివైజ్ లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది.

POCO F6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: POCO F6 లో ఉండే స్క్రీన్ సైజ్ ఇంకా తెలియలేదు. కానీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో ఈ డిస్ప్లే వస్తున్నట్లు సమాచారం.

ప్రాసెసర్: POCO F6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 డివైజ్ 12జిబి వరకు ర్యామ్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో రానుంది.

ఓఎస్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

కెమెరా: POCO F6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోని ఐఎంఎక్స్920 మెయిన్ సెన్సర్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.