Google Play Console - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Aug 2024 16:08:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A06: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-google-play-console/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-google-play-console/#respond Fri, 09 Aug 2024 16:08:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=12921 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy A06 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ […]

The post Samsung Galaxy A06: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A06 లాంచ్
  • మోడల్ నంబర్ SM-A065F
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్, హెచ్డీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy A06 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై SM-A065F అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

గూగుల్ ప్లే కన్సోల్ పై Samsung Galaxy A06 పేరు స్పష్టంగా పేర్కొనబడి ఉంది. ఇది గత మోడల్ ఏ05 మాదిరి 4జీ ఫోన్.

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A06 డివైజ్ లో 4జిబి ర్యామ్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 300డీపీఐ ఉండనున్నాయి.

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, వన్‌యూఐ కోర్ కస్టమ్ స్కిన్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ పై Samsung Galaxy A06 యొక్క ఇమేజెస్ కూడా కనిపించాయి. వాటిని గమనిస్తే, ఈ ఫోన్ యు-షేప్డ్ వాటర్‌డ్రాప్ నాచ్, బ్లాక్ మరియు సిల్వర్ కలర్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A06: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-google-play-console/feed/ 0
Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/#respond Mon, 22 Jul 2024 11:41:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=12612 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Zero 40 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ తో పాటు, టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీనికంటే ముందే 5జీ మోడల్ కూడా ఈ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. Infinix […]

The post Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Zero 40 4G లాంచ్
  • మోడల్ నంబర్ X6860
  • హీలియో జీ99 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Zero 40 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ తో పాటు, టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీనికంటే ముందే 5జీ మోడల్ కూడా ఈ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

Infinix Zero 40 4G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Zero 40 4G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై X6860 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

క్రింద ఇమేజ్ లో Infinix Zero 40 4G పేరుని మీరు గమనించవచ్చు. సర్టిఫికేషన్ ప్రకారం, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి జీ57 జీపీయూ తో ఈ ఫోన్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఇంకా Infinix Zero 40 4G డివైజ్ 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 480 పిక్సెల్ డెన్సిటీ తో లిస్ట్ అయ్యింది.

అలాగే గూగుల్ ప్లే కన్సోల్ పై ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

Infinix Zero 40 4G టీయూవీ లిస్టింగ్

Infinix Zero 40 4G డివైజ్ టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై X6860 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే ఫోన్ పేరును ఈ లిస్టింగ్ పై పేర్కొనలేదు.

Infinix Zero 40 4G డివైజ్ 4,900 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టీయూవీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 30 4G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Zero 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.

మెమొరీ: Infinix Zero 30 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Infinix Zero 30 4G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Infinix Zero 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/feed/ 0
Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-13-5g-google-play-console-listing-details/ Thu, 06 Jun 2024 05:44:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11936 Xiaomi సబ్-బ్రాండ్ Redmi ఇటీవలె గ్లోబల్ మార్కెట్ లో Redmi 13 4G ని లాంచ్ చేసింది. ఇప్పుడు 5జీ వేరియంట్ Redmi 13 5G ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో సదరు కంపెనీ ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఈ 5జీ మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ […]

The post Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 13 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
  • మోడల్ నంబర్ 2406ERN9CC

Xiaomi సబ్-బ్రాండ్ Redmi ఇటీవలె గ్లోబల్ మార్కెట్ లో Redmi 13 4G ని లాంచ్ చేసింది. ఇప్పుడు 5జీ వేరియంట్ Redmi 13 5G ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో సదరు కంపెనీ ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఈ 5జీ మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Redmi 13 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై 2406ERN9CC అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ లోని C అక్షరం చైనా వేరియంట్ ను సూచిస్తోంది. 2406 నంబర్లు జూన్ నెలలో ఫోన్ లాంచ్ ఉంటుందని తెలియజేస్తోంది.

Redmi 13 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఇంకా అడ్రెనో 612 జీపీయూ లిస్టింగ్ పై కనిపించింది.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 440 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్, 6జిబి ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది.

గతంలో Redmi 13 5G డివైజ్ 3సీ సర్టిఫికేషన్ సైట్ పై కూడా కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా పంచ్ హోల్ కటౌట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రివీల్ అయ్యాయి.

Redmi 13 5G లాంచ్ వివరాలను షావోమి ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Redmi 13 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ (1800*2400 పిక్సెల్స్), ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 396పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 13 4G లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Redmi 13 4G డివైజ్ 6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: Redmi 13 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi 13 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 13 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi 13 4G లో ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్కేడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Redmi 13 4G లో 168.6 మి.మీ పొడవు, 76.28 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం, 198.5 గ్రాముల బరువు ఉంటుంది.

The post Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-google-play-console-listing-details/ Wed, 05 Jun 2024 14:29:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=11927 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి POCO M6 Plus 5G యొక్క గూగుల్ ప్లే కన్సోల్ […]

The post POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO M6 Plus 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
  • మోడల్ నంబర్ 24065PC95I

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి POCO M6 Plus 5G యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

POCO M6 Plus 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై 24065PC95I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ డివైజ్ బ్రీజ్ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. మోడల్ నంబర్ లోని మొదటి అంకెలు 2406 ను గమనిస్తే, ఈ నెలలోనే ఫోన్ లాంచ్ అవ్వనుందని అర్థమవుతోంది.

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ లిస్టింగ్ పై 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 440పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ SM4450 ప్రాసెసర్, అడ్రెనో 613 జీపీయూ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అంటే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుందని చెప్పవచ్చు.

చైనా మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Note 13R కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Plus 5G భారత్ లో ప్రవేశించనుందని సమాచారం. రెడ్మీ నోట్ 13ఆర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్, అడ్రెనో 613 జీపీయూ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది.

Redmi Note 13R స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13R 5G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2460*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13R 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3GHz.

మెమొరీ: Redmi Note 13R 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13R 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi Note 13R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 13R 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

The post POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy M35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-google-play-console-details/ Wed, 15 May 2024 06:14:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11543 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ తో పాటు ఇతర వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy M35 5G డిజైన్ (లీక్) Samsung […]

The post Samsung Galaxy M35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M35 5G లాంచ్
  • శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్‌
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ తో పాటు ఇతర వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M35 5G డిజైన్ (లీక్)

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఇమేజ్ తో సహా లిస్ట్ అయ్యింది. ఇమేజ్‌ని గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై 3 కెమెరాలు ఉన్నాయి. వాల్యూమ్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉంది. ఫోన్ ముందువైపున సెంటర్ పంచ్ హోల్ కటౌట్, కాస్త మందపాటి బెజెల్స్ కనిపిస్తున్నాయి.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ సపోర్ట్ పేజీపై SM-M356B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy M35 5G ఎగ్జినోస్ 1380 చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M35 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M35 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా.

ఓఎస్: Samsung Galaxy M35 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవ్వనుంది.

ఇటీవలె లాంచైన Samsung Galaxy A35 5G కి రీబ్రాండ్ వర్షన్‌గా Samsung Galaxy M35 5G మార్కెట్ లోకి రాబోతోంది. Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ పంచ్ హోల్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2340*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G పూర్తి స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung Galaxy M35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Vivo Y36s https://www.91mobiles.com/telugu/vivo-y36-5g-listed-on-google-play-console/ Tue, 30 Apr 2024 16:02:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11276 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా వివో వై18ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. మరోవైపు, వై-సిరీస్ లో మరొక డివైజ్ ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y36s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్‌కి సంబంధించిన ఎన్నో వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Vivo Y36s గూగుల్ ప్లే […]

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Vivo Y36s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y36s లాంచ్
  • మోడల్ నంబర్ PD2318
  • డైమెన్సిటీ 700 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా వివో వై18ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. మరోవైపు, వై-సిరీస్ లో మరొక డివైజ్ ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y36s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్‌కి సంబంధించిన ఎన్నో వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo Y36s గూగుల్ ప్లే కన్సోల్ వివరాలు

Vivo Y36s డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై PD2318 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ పై Vivo Y36s 6జిబి ర్యామ్ తో కనిపించింది. దీంతో పాటు మరొక వేరియంట్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

సర్టిఫికేషన్ లిస్టింగ్ పై MediaTek MT6833 అనే చిప్సెట్ కనిపించింది. ఇది డైమెన్సిటీ 700 చిప్‌ యొక్క కోడ్ నేమ్ అని తెలుస్తోంది.

Vivo Y36s లో గ్రాఫిక్స్ కోసం ARM Mali G57 GPU వాడినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y36s స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ద్వారా 720*1612 రెజుల్యూషన్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ ఫీచర్స్ రివీల్ అయ్యాయి.

Vivo Y36 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y36 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్ హోల్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y36 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo Y36 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Vivo Y36 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y36 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y36 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y36 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Vivo Y36s first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy F55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-listed-on-google-play-console/ Sun, 21 Apr 2024 18:26:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=11199 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గెలాక్సీ ఎమ్55 కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Samsung Galaxy […]

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy F55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Galaxy F55 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 8జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గెలాక్సీ ఎమ్55 కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G గూగుల్ ప్లే లిస్టింగ్

Samsung Galaxy F55 5G గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన విషయాన్ని తొలుత 91mobiles గుర్తించింది. ఈ ఫోన్ Galaxy M55 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. SM7450 మోడల్ నంబర్ తో ఓ చిప్సెట్ లిస్టింగ్ పై కనిపించింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ కి సంబంధించిందని అర్థమవుతోంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

గెలాక్సీ ఎమ్55 డివైజ్ గెలాక్సీ సీ55 గా కూడా రీబ్రాండ్ అవ్వనుందని సమాచారం. ఇదే ఫోన్ చైనాలో గెలాక్సీ వై55 అనే పేరుతో కూడా లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

లిస్టింగ్ ప్రకారం, ఈ అన్ని మోడల్స్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 8జిబి ర్యామ్, వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఉంటాయని తెలుస్తోంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy F55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy F55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo X100s https://www.91mobiles.com/telugu/vivo-x100s-listed-on-google-play-console/ Wed, 27 Mar 2024 05:20:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=10833 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని రోజుల క్రితం X100, X100 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ డివైజెస్ భారత్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు X-సిరీస్ లైనప్ లో మరొక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో వివో ఉంది. Vivo X100s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Vivo X100s గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఎన్నో ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. […]

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X100s లాంచ్
  • డైమెన్సిటీ 9300 చిప్సెట్
  • మోడల్ నంబర్ Vivo PD2309

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని రోజుల క్రితం X100, X100 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ డివైజెస్ భారత్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు X-సిరీస్ లైనప్ లో మరొక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో వివో ఉంది. Vivo X100s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Vivo X100s గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఎన్నో ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Vivo X100s గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

గూగుల్ ప్లే కన్సోల్ పై Vivo X100s స్మార్ట్‌ఫోన్ Vivo PD2309 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo X100s డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.

Vivo X100s డివైజ్ 16జిబి ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.

ఇంకా Vivo X100s లో మాలి-జీ720 జీపీయూ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 1260*2800 పిక్సెల్ రెజుల్యూషన్, 560డీపీఐ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలిసింది.

Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా + 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3x లెన్స్ + 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. Vivo X100 Pro లో 50ఎంపి 1-ఇంచ్ కెమెరా + 50ఎంపి 4.3x పెరిస్కోప్ + 50ఎంపి అల్ట్రావైడ్ ఉన్నాయి. ప్రో మోడల్ లో 8కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. Vivo X100 Pro లో 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి.
  • కనెక్టివిటీ: ఈ ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo Y18 https://www.91mobiles.com/telugu/vivo-y18-listed-on-google-play-console/ Thu, 14 Mar 2024 18:18:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=10694 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం Vivo Y18e బీఐఎస్ పై V2350 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో Vivo Y18 యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ […]

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo Y18 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y18 లాంచ్
  • గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన డివైజ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2350

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం Vivo Y18e బీఐఎస్ పై V2350 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో Vivo Y18 యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y18 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై V2333 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Vivo Y18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ 6జిబి ర్యామ్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది. వివో వై03 వంటి డిజైన్ తో Vivo Y18 ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది.

Vivo Y03 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y03 డివైజ్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 70% ఎన్టీఎస్‌సీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y03 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y03 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, క్యూవీజీఏ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.
  • సెక్యూరిటీ: Vivo Y03 లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, సాఫ్ట్‌వేర్ బేస్డ్ ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y03 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo Y18 first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-listed-on-google-play-console/ Fri, 16 Feb 2024 18:27:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10310 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈసారి ఫోన్ డిజైన్ తో పాటు డిస్ప్లే, మెమొరీ, సాఫ్ట్‌వేర్ వివరాలు కూడా లిస్టింగ్ ద్వారా తెలిసాయి. గూగుల్ ప్లే కన్సోల్ కంటే ముందు ఇతర సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ మరియు బెంచ్‌మార్క్ సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. అంతేకాదు, Samsung […]

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A35 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన డివైజ్
  • రివీలైన డిజైన్, డిస్ప్లే, ప్రాసెసర్ వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈసారి ఫోన్ డిజైన్ తో పాటు డిస్ప్లే, మెమొరీ, సాఫ్ట్‌వేర్ వివరాలు కూడా లిస్టింగ్ ద్వారా తెలిసాయి. గూగుల్ ప్లే కన్సోల్ కంటే ముందు ఇతర సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ మరియు బెంచ్‌మార్క్ సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. అంతేకాదు, Samsung Galaxy A35 5G డివైజ్ శాంసంగ్ అధికార వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

  • Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై SM-A356E అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యిందని MySmartPrice తన కథనం ద్వారా తెలిపింది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ని గమనిస్తే, ఫోన్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై 3 కెమెరా సెన్సర్స్ పైన ఎడమవైపున నిలువుగా కనిపిస్తున్నాయి.
  • Samsung Galaxy A35 5G డివైజ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ68 జీపీయూ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Samsung Galaxy A35 5G హ్యాండ్సెట్ 6జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ వంటి స్పెసిఫికేషన్స్ తో కనిపించింది.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ర్యామ్ మరియు స్టోరేజీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>