Oppo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 20 Feb 2023 13:58:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Reno8T లాగా ఉన్న కొత్త ఫోన్‌ని టెస్ట్ చేస్తోన్న OPPO; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/oppo-testing-new-phone-launch-imminent-india/ Mon, 20 Feb 2023 13:53:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=5009   ఇటీవలె OPPO Reno8 T 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో సంస్థ రానున్న రోజుల్లో ఇదే ఫోన్ ని పోలి ఉన్న మరొక ఫోన్ ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉన్న ఈ ఫోన్ CPH2527 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుందని సమాచారం. అయితే, రోజులు […]

The post Reno8T లాగా ఉన్న కొత్త ఫోన్‌ని టెస్ట్ చేస్తోన్న OPPO; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • CPH2527 అనే మోడల్ నంబర్ తో ఉన్న కొత్త ఫోన్ ని టెస్ట్ చేస్తోన్న OPPO సంస్థ
  • OPPO Reno8 T 5G మాదిరి ఉన్న కొత్త ఫోన్ డిజైన్
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన OPPO Reno8 T 5G

 

ఇటీవలె OPPO Reno8 T 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో సంస్థ రానున్న రోజుల్లో ఇదే ఫోన్ ని పోలి ఉన్న మరొక ఫోన్ ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉన్న ఈ ఫోన్ CPH2527 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుందని సమాచారం. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ఒప్పో సంస్థ త్వరలోనే ఈ కొత్త హ్యాండ్సెట్ ని భారత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ పేరు, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ధర తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముందు ఈ డివైజ్ పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నిదానంగా ఇతర వివరాలు తెలియనున్నాయి.

OPPO Reno8 T 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

రెనో-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. ఈ హ్యాండ్సెట్ పంచ్-హోల్ కటౌట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై ఒప్పో గ్లో డిజైన్ ఉండటం వల్లన ఫోన్ కి మరింత ఆకర్షణ వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, కర్వ్డ్ ఎడ్జెస్ ని ఫోన్ కలిగి ఉంది.

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 40x micro-lens ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Reno8T లాగా ఉన్న కొత్త ఫోన్‌ని టెస్ట్ చేస్తోన్న OPPO; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
ఈ నెలలో Android 13 ఆధారిత ColorOS 13 అప్డేట్ పొందనున్న OPPO ఫోన్స్ ఇవే https://www.91mobiles.com/telugu/oppo-phones-to-receive-android-13-based-coloros-13-update/ Tue, 08 Nov 2022 14:57:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=3318 హైలైట్స్ నవంబర్ 9 నుంచి ColorOS 13 బీటా వర్షన్ అప్డేట్ అందుకోనున్న OPPO Reno6 Pro 5G, Reno5 Pro 5G మరియు ఇతర ఫోన్లు ఇప్పటికే అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటోన్న OPPO Reno8 Pro 5G, Reno8 5G, F21 Pro 5G తదితర ఫోన్లు స్మార్ట్ ఇంటర్‌కనెక్టివిటీ, ఆక్వామార్ఫిక్ డిజైన్ మరియు ఇతర ఫీచర్లతో వస్తోన్న ColorOS 13 చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు OPPO భారత్ లోని తన […]

The post ఈ నెలలో Android 13 ఆధారిత ColorOS 13 అప్డేట్ పొందనున్న OPPO ఫోన్స్ ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 9 నుంచి ColorOS 13 బీటా వర్షన్ అప్డేట్ అందుకోనున్న OPPO Reno6 Pro 5G, Reno5 Pro 5G మరియు ఇతర ఫోన్లు
  • ఇప్పటికే అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటోన్న OPPO Reno8 Pro 5G, Reno8 5G, F21 Pro 5G తదితర ఫోన్లు
  • స్మార్ట్ ఇంటర్‌కనెక్టివిటీ, ఆక్వామార్ఫిక్ డిజైన్ మరియు ఇతర ఫీచర్లతో వస్తోన్న ColorOS 13

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు OPPO భారత్ లోని తన ఫోన్లకు ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13 రోలౌట్ షెడ్యూల్ ని ప్రకటించింది. కలర్ఓఎస్ 13 బీటా వర్షన్ మరియు అఫీషియల్ వర్షన్ లకు సంబంధించిన అప్డేట్ ని ఈ నెలలో అందుకోనున్న ఫోన్ల జాబితాను వెలువరించింది. మరి ఆ ఫోన్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

ఈ నెలలో ColorOS 13 update ని పొందే OPPO ఫోన్లు ఇవే

నవంబర్ 9 నుంచి Reno6 Pro 5G, Reno5 Pro 5G, F19 Pro+ స్మార్ట్ ఫోన్స్ కి కలర్ఓఎస్ 13 బీటా వర్షన్ అప్డేట్ అందుబాటులోకి వస్తుందని ఒప్పో ప్రకటించింది. నవంబర్ 18 నుంచి OPPO A74 5G డివైజ్ అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటుందని కంపెనీ ప్రకటించింది.

ఇప్పటికే OPPO Reno8 Pro 5G, Reno8 5G, F21 Pro 5G, Reno7 Pro 5G, Reno7 5G, Reno6 5G, F21 Pro, K10 5G, K10, A96, A76 హ్యాండ్సెట్స్ కి ColorOS 13 అప్డేట్ రోలౌట్ మొదలైంది.

ColorOS 13 అఫీషియల్ వర్షన్ అప్డేట్ నవంబర్ 8 నుంచి Reno8 Pro 5G కి అందుబాటులో ఉంటుంది. ఇకపోతే నవంబర్ 18 నుంచి ఈ అప్డేట్ Reno8 5G, K10 5G స్మార్ట్ ఫోన్స్ కి అందుబాటులోకి వస్తుంది.

ColorOS 13 అప్డేట్ తో ఒప్పో స్మార్ట్ ఫోన్ యూజర్లు కొత్త యూఐ అనుభూతిని పొందనున్నారు. ఎన్నో కస్టమైజబుల్ ఆప్షన్స్ ని ఈ యూఐ లో ఒప్పో జత చేసింది. బ్రాండ్ న్యూ ఆక్వామార్ఫిక్ డిజైన్, డైనమిక్ కంప్యూటింగ్ ఇంజిన్, ఇకో-ఫ్రెండ్లీ ఆల్వేస్-ఆన్ డిస్ప్లే మరియు ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఈ అప్డేట్ తో వస్తున్నాయి.

OPPO ColorOS 13 ఫీచర్లు

ColorOS 13 తీసుకొచ్చిన స్మార్ట్ మల్టీ-డివైజ్ కనెక్షన్ ద్వారా ప్రొడక్టివిటీని మెరుగుపరచనుంది. ఈసారి అప్డేట్ లో ఒప్పో ఆక్వా-థీమ్డ్ డిజైన్ ని అందించింది. ఇది ఫ్లూయిడ్, వైబ్రంట్ లుక్ ని యూఐ కి అందించనుంది. సీ-లెవెల్ వద్ద సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో కలర్ మారే తీరుని స్పూర్తిగా తీసుకుని ఒప్పో ColorOS 13 లో సరికొత్త థీమ్ ప్యాలెట్ ని తీసుకొచ్చింది. సిస్టమ్ టెక్స్ట్ ని ఏ భాషలోనైనా చదవగలిగే కెపాసిటీని కొత్త సిస్టమ్ ఫాంట్ మెరుగుపరచనుంది.

డైనమిక్ కంప్యూటింగ్ ఇంజిన్ ColorOS 13 తో లాంచ్ అవుతోంది. దీన్ని ఒప్పో స్వయంగా డెవలప్ చేసింది. ఇది యూజర్ కి ఆల్‌రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ తో స్మూథ్ ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తుంది. ఈ డైనమిక్ ఇంజిన్ బ్యాటరీ లైఫ్ ని మరింత పెంచుతుంది. బ్యాగ్రౌండ్ లో ఎక్కువ యాప్స్ తెరచి ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ దెబ్బతినకుండా డైనమిక్ కంప్యూటింగ్ ఇంజిన్ చూసుకుంటుంది.

తాజా అప్డేట్, స్మార్ట్ ఫోన్ మరియు పీసీకి నడుమ.. స్మార్ట్ ఫోన్ మరియు ఒప్పో ప్యాడ్ ఎయిర్ కి మధ్య.. మల్టీ స్క్రీన్ కనెక్టివిటీని మరింత సులభతరం, సమర్థవంతం చేయనుంది. ఇంకా ఈ అప్డేట్ తో, హార్డ్‌వేర్ లిమిటేషన్స్ లేకుండా ఎన్నో ఫైల్ ఫార్మాట్స్ ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వీలవ్వనుంది.

ఆన్‌లైన్ మీటింగ్స్ సమయంలో స్థిరమైన కనెక్టివిటీ అందించేందుకు ఒప్పో యొక్క Meeting Assistant ఆటోమేటిక్ గా వైర్లెస్ డేటా ప్యాకేజెస్ ని మేనేజ్ చేయనుంది. అలాగే ఇది బ్యానర్ నోటిఫికేషన్స్ డిస్ట్రాక్షన్ ని తగ్గిస్తుంది. మీటింగ్ టైమ్ లో నోట్స్ తీసుకునేందుకు ఒక చిన్న పాప్-అప్ విండో రూపంలో ఒప్పో నోట్స్ షార్ట్ కట్ ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా మీటింగ్ అసిస్టెంట్ ద్వారా సాధ్యమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఈ నెలలో Android 13 ఆధారిత ColorOS 13 అప్డేట్ పొందనున్న OPPO ఫోన్స్ ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO ని కోర్టుకి లాగనున్న Nokia కంపెనీ, ఒప్పో ఫోన్లు రద్దయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/nokia-files-case-on-oppo-4g-5g-technology-scandal/ Mon, 17 Oct 2022 07:27:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2916 హైలైట్స్ ఒప్పో ని కోర్టుకి లాగనున్న నోకియా, ఆస్ట్రేలియాలో కేసు నమోదు గడువు ముగిసినా రెనివల్ చేయకుండా తమ టెక్నాలజీని వినియోగించుకుంటోందని నోకియా ఆరోపణలు అనుమతి లేకుండా నోకియా యొక్క 4జీ, 5జీ టెక్నాలజీని ఒప్పో వాడుకుంటోందని నోకియా వాదన పోటీలో ముందుండాలనే తపన ప్రతి రంగంలో ఉంటుంది. టెక్నాలజీ మార్కెట్, స్మార్ట్ ఫోన్ మార్కెట్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ తమ యూజర్ బేస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఈ […]

The post OPPO ని కోర్టుకి లాగనున్న Nokia కంపెనీ, ఒప్పో ఫోన్లు రద్దయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఒప్పో ని కోర్టుకి లాగనున్న నోకియా, ఆస్ట్రేలియాలో కేసు నమోదు
  • గడువు ముగిసినా రెనివల్ చేయకుండా తమ టెక్నాలజీని వినియోగించుకుంటోందని నోకియా ఆరోపణలు
  • అనుమతి లేకుండా నోకియా యొక్క 4జీ, 5జీ టెక్నాలజీని ఒప్పో వాడుకుంటోందని నోకియా వాదన

పోటీలో ముందుండాలనే తపన ప్రతి రంగంలో ఉంటుంది. టెక్నాలజీ మార్కెట్, స్మార్ట్ ఫోన్ మార్కెట్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ తమ యూజర్ బేస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఈ పోరులో, కొన్ని క్రైమ్స్ కూడా జరుగుతుంటాయి. ఇటువంటి స్కాండల్ లోనే చైనా కంపెనీ ఒప్పో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఫిన్‌ల్యాండ్ దేశానికి చెందిన మొబైల్ ఫోన్ బ్రాండ్ నోకియా, ఒప్పో ఆస్ట్రేలియా పై కేసు పెట్టింది. దీని కంటే ముందు నోకియా కంపెనీ వన్‌ప్లస్, ఒప్పో లను జర్మనీ లో ఓ కేసులో ఓడించింది. దీని తర్వాత ఆ దేశంలో ఒప్పో ప్రొడక్ట్స్ అమ్మకాలు నిలిచిపోయాయి.

OPPO పై కేసు పెట్టనున్న Nokia

నోకియా కంపెనీ, చైనీస్ బ్రాండ్ ఒప్పో పై కేసు ఫైల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కేసే ఆస్ట్రేలియాలో నమోదు కానుంది. ఈ కేసు నోకియా యొక్క సర్వీస్ ఎనేబుల్మెంట్ ప్లాట్ఫమ్ అతిక్రమణకు సంబంధించినది. నోకియా 4జీ మరియు 5జీ టెక్నాలజీలను కంపెనీ అనుమతి లేకుండా ఒప్పో సంస్థ వినియోగిస్తోందని సదరు కంపెనీ ఆరోపిస్తోంది. ఒప్పో ప్రస్తుతం నోకియా యొక్క టెక్నాలజీని తన స్మార్ట్ ఫోన్లలో వాడుతోంది. అయితే అనుమతి లేకుండా వాడుతోంది.

OPPO పై Nokia ఎందుకు కేసు పెట్టింది?

2018 లో వచ్చిన సమాచారాన్ని బట్టి, ఫిన్‌ల్యాండ్ కి చెందిన నోకియా మరియు చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో కి మధ్య ఒక లైసెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం, నోకియా అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఒప్పో తన ప్రోడక్ట్స్ లో వాడుకునే అవకాశం ఉంది. అయితే ఆ లైసెన్స్ గడువు 2021 తో ముగిసింది. కానీ, ఒప్పందాన్ని రిన్యూ చేసుకోకుండా ఒప్పో సంస్థ నోకియా టెక్నాలజీని వాడుకుంటోంది. దీంతో నోకియా కంపెనీ ఒప్పో పై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

జర్మనీలో బ్యాన్ అయిన OPPO స్మార్ట్ ఫోన్లు

ఆస్ట్రేలియా కంటే ముందు, నోకియా కంపెనీ ఒప్పో, వన్‌ప్లస్ పైన జర్మనీ లో కేసు పెట్టింది. అప్పుడు కోర్టు ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలది తప్పని తేల్చడంతో, నోకియా ఆ కేసులో గెలిచింది. దాంతో జర్మనీలో ఒప్పో మరియు వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు రద్దయ్యాయి. ఈ బ్యాన్ తో ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలకు పెద్ద దెబ్బ తగిలినట్లైంది. రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో కూడా ఒప్పో మొబైల్ ఫోన్లు బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఒప్పో, నోకియా సంస్థలు సమస్యను పరిష్కరించుకోవాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OPPO ని కోర్టుకి లాగనున్న Nokia కంపెనీ, ఒప్పో ఫోన్లు రద్దయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే ఏడాది నుంచి ఫోన్స్ తో చార్జర్ ఇవ్వమని తెలిపిన OPPO https://www.91mobiles.com/telugu/oppo-phones-no-charger-next-year/ Fri, 02 Sep 2022 12:42:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2070 హైలైట్స్: వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లలో చార్జర్ ఇవ్వబోమని స్పష్టం చేసిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో సెపరేట్ గా చార్జర్ ను విక్రయించనున్న ఒప్పో, ఫోన్ మార్చుకున్నప్పటికీ, యూజర్లు అదే చార్జర్ ని వాడుకునే అవకాశం ఏ సెగ్మెంట్ ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదో ఇంకా వెల్లడించని ఒప్పో ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ ఈవెంట్ లో ఒప్పో ఓవర్సీస్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ బిల్లీ జాంగ్ చార్జర్ కి సంబంధించి ఓ […]

The post వచ్చే ఏడాది నుంచి ఫోన్స్ తో చార్జర్ ఇవ్వమని తెలిపిన OPPO first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లలో చార్జర్ ఇవ్వబోమని స్పష్టం చేసిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో
  • సెపరేట్ గా చార్జర్ ను విక్రయించనున్న ఒప్పో, ఫోన్ మార్చుకున్నప్పటికీ, యూజర్లు అదే చార్జర్ ని వాడుకునే అవకాశం
  • ఏ సెగ్మెంట్ ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదో ఇంకా వెల్లడించని ఒప్పో

ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ ఈవెంట్ లో ఒప్పో ఓవర్సీస్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ బిల్లీ జాంగ్ చార్జర్ కి సంబంధించి ఓ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదని బిల్లీ తెలిపారు. అయితే ఏ సెగ్మెంట్ ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదో ఆయన చెప్పలేదు. ఆపిల్, శాంసంగ్ కంపెనీల తర్వాత గ్లోబల్ గా చార్జర్ ని బాక్స్ నుంచి తొలగించిన కంపెనీగా ఒప్పో నిలవబోతోంది. భవిష్యత్తులో ఇతర బ్రాండ్స్ కూడా ఇదే బాటలో పయనించే అవకాశముంది.

వూక్ టెక్నాలజీ ఒప్పో యొక్క చార్జింగ్ సొల్యూషన్. ఇక ఈ కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. దీంతో స్పీడ్ కి అనుగుణంగా కొత్త అడాప్టర్లను రూపొందించడం అవసరం. మరి ఈ చార్జర్ల తొలగింపు కేవలం ఎంట్రీ-లెవెల్ ఫోన్లకే పరిమితం అవుతుందా? లేక మిడ్-రేంజ్ ఫోన్లు, ఫ్లాగ్షిప్ ఫోన్లకు కూడా వర్తిస్తుందా అనేది చూడాలి.

బాక్స్ లో OPPO చార్జర్

వచ్చే ఏడాది నుంచి కొన్ని ప్రోడక్ట్స్ బాక్స్ లలో చార్జర్ ని తొలగించనున్నట్లు ఒప్పో తెలిపింది. అయితే ఏయే ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదోనన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఏదేమైనా కొన్ని ఫోన్లకు చార్జర్ మాత్రం వచ్చే ఏడాది నుంచి రాబోదన్నది స్పష్టమైంది. మరి ఒప్పో తీసుకున్న నిర్ణయంపై ఒప్పో బ్రాండ్ లవర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

“మేం వచ్చే ఏడాది నుంచి చాలా ప్రోడక్ట్స్ కి చార్జర్ ని ఇవ్వబోము. మా వద్ద అందుకు ఒక ప్లాన్ ఉంది. సూపర్ వూక్ చార్జర్స్ పొందడం అంత తేలికైన విషయం కాదు, కాబట్టి మేం బాక్స్ లో చార్జర్ ని అందించాం. అయితే, వ్యాపార కార్యాకలాపాలు విస్తృతం చేస్తున్నాం కాబట్టి, బాక్స్ నుంచి చార్జర్ ని తొలగించాలని నిర్ణయించాం. స్టోర్ల ద్వారా చార్జర్ ని కొనుక్కొని యూజర్లు వాడుకోవచ్చు. అలాగే తమ డివైజ్ లను అప్ గ్రేడ్ చేసుకున్నప్పటికీ, చార్జర్స్ ని వాడుకునే అవకాశం ఉంటుంది,” అని ఓ ప్రకటనలో కంపెనీ తెలిపింది.

ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీస్ విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఒప్పో కంపెనీ నుంచి తాజాగా వచ్చిన వార్త సంచలనమనే చెప్పాలి. ప్రస్తుతం శాంసంగ్ (45వాట్), ఆపిల్ (20వాట్) కంటే అత్యధిక ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ ని అందిస్తోంది ఒప్పో.

ఇటీవలె లాంచ్ అయిన రెనో 8, రెనో 8 ప్రో ఫోన్స్ 80 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. సమీప భవిష్యత్తులో ఈ ఫోన్లకు ఢోకా లేదని చెప్పాలి. ఇవి బాక్స్ లో చార్జర్ తో వస్తున్నాయి. ఒప్పో డివైజెస్ యూఎస్బీ పవర్ డెలివరీ కి కూడా సపోర్ట్ చేస్తాయి. అయితే వూక్ కంటే పవర్ లెవెల్ తక్కువ ఉంటుంది. కాబట్టి, యూజర్లు మార్కెట్ లో దొరికే థర్డ్-పార్టీ చార్జింగ్ అడాప్టర్లను వాడే అవకాశం ఉంది.

The post వచ్చే ఏడాది నుంచి ఫోన్స్ తో చార్జర్ ఇవ్వమని తెలిపిన OPPO first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ https://www.91mobiles.com/telugu/govt-of-india-clarity-on-chinese-smarphones-under-12k-ban/ Fri, 02 Sep 2022 05:42:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=2057 హైలైట్స్: రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె […]

The post రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం
  • భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి
  • ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం

రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె వార్తలు వచ్చాయి. ఈ సెగ్మెంట్ లో మంచి రాబడినే రాబడుతోన్న వివో, ఒప్పో, షావోమీ లపై ప్రభుత్వ నిర్ణయం సంకటంగా మారనుందని అంతా భావించారు. అయితే, భారత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. రూ.12,000 లోపు ధర కలిగిన ఫోన్లను బ్యాన్ చేసే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పింది. దీంతో చైనాకు చెందిన బ్రాండ్స్ కి ఉపశమనం లభించినట్లైంది.

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేశం యొక్క ఎలక్ట్రానిక్ ఎకో సిస్టెమ్ కి భారతీయ కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయన్నది వాస్తవమే కానీ, దానర్థం విదేశీ బ్రాండ్లను తొలగించి భారత కంపెనీలకు బాటలు వేయడం కాదని రాజీవ్ స్పష్టం చేశారు.

భారత్ లో రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లు రద్దు కావు

భారత్ లో అమ్ముడవుతోన్న రూ.12,000 లోపు ధర గల చైనా బ్రాండ్స్ ఫోన్ల బ్యాన్ పై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. “మేము లేవనెత్తిన ఇష్యూ విషయంలో ఎంతో పారదర్శకతతో వ్యవహరించాం. అదే విషయాన్ని చైనీస్ బ్రాండ్స్ కి స్పష్టం చేశాం. చైనా బ్రాండ్ల నుంచి మేం ఆశించేది ఏంటంటే వారు మరింత ఎగుమతులు పెంచుతారని. వారి సప్లై చైన్, ప్రత్యేకించి కంపోనెంట్స్ చైన్, ఎంతో పారదర్శకతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది,” అని చంద్రశేఖర్ అన్నారు.

రూ.12,000 సెగ్మెంట్ ఫోన్స్ విషయమై క్లారిటీ ఇస్తూ, “మా వద్ద అటువంటి ప్రపోజల్ లేదు. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.” రూ.12,000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్ ఫోన్స్ ని భారత్ బ్యాన్ చేయనుందని బ్లూంబర్గ్ ఓ కథనం వెలువరించాక ఈ రభస మొదలైంది. బ్యాన్ ద్వారా లావా, జియో, మైక్రోమ్యాక్స్ తదితర దేశీయ బ్రాండ్లకు ఊతమివ్వాలని భారత్ భావిస్తోందని బ్లూంబర్గ్ తన కథనంలో తెలిపింది. ఇక భారత్ లో రూ.12,000 సెగ్మెంట్ లో చైనీస్ బ్రాండ్స్ ఆదిపత్యం కొనసాగుతోన్న విషయం గమనించాలి.

ఫోన్స్ ని బ్యాన్ చేయడం లేదు కానీ, భారత ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఓ కన్నేసి ఉంటోంది. ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై రైడ్స్ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వీటి కదలికలను నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే ట్యాక్స్ ఎగవేతకు సంబంధించి పలు బ్రాండ్స్ పై ఈడీ కేసులు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ కంపెనీల దిగుమతులు, ఎగుమతులు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టింది. చైనాకు చెందిన యాప్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 2020 లో 50 చైనీస్ యాప్స్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ యాప్స్ టిక్ టాక్, పీయూబీజీ ఉన్నాయి.

The post రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన OPPO A77 ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a77-price-specs-revealed-before-launch/ Mon, 01 Aug 2022 07:36:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=1385 హైలైట్స్: ఆగస్టు మొదటి వారంలో ఒప్పో ఏ77 హ్యాండ్సెట్ ధర రూ.16,000 ఉండే అవకాశం మీడియాటెక్ హీలియో జీ35, 6.56-అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో ఒప్పో బ్రాండ్ నుంచి ఏ మరియు ఎఫ్ సిరీస్ ఫోన్లు వస్తుంటాయి. రెనో లైనప్ తర్వాత వీటికి డిమాండ్ ఉంటుంది. త్వరలోనే ఒప్పో నుంచి ఏ77 అనే స్మార్ట్ ఫోన్ […]

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A77 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు మొదటి వారంలో ఒప్పో ఏ77
  • హ్యాండ్సెట్ ధర రూ.16,000 ఉండే అవకాశం
  • మీడియాటెక్ హీలియో జీ35, 6.56-అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో ఒప్పో బ్రాండ్ నుంచి ఏ మరియు ఎఫ్ సిరీస్ ఫోన్లు వస్తుంటాయి. రెనో లైనప్ తర్వాత వీటికి డిమాండ్ ఉంటుంది. త్వరలోనే ఒప్పో నుంచి ఏ77 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ప్రముఖ లీక్‌స్టర్ ముకుల్ శర్మ ఒప్పో ఏ77 గురించి లాంచ్ టైమ్ లైన్, ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని విడుదల చేశాడు. లీక్ ని బట్టి, ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 11 ప్రో+, రియల్ మీ 9 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 తదితర ఫోన్లతో పోటీపడనుంది.

లీక్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, ఒప్పో ఏ77 ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ ను అమర్చారు. అంటే ఈ ఫోన్ లో 4జీ ఎల్టీఈ మాత్రమే ఉంటుంది. 5జీ ఉండదు.

భారత్ లో OPPO A77 లాంచ్ ఎప్పుడు?

ఆగస్టు మొదటి వారంలో ఒప్పో ఏ77 భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఫోన్ లాంచ్ కి సంబంధించిన అసలైన తేదీని వెల్లడి కానుంది. ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 11 ప్రో+, రియల్ మీ 9 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 తదితర ఫోన్లతో పోటీపడనుంది.

భారత్ లో OPPO A77 ప్రైస్, కలర్స్

ఒప్పో ఏ77 బేస్ వేరియంట్ ధర భారత్ లో రూ.16,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక టాప్-ఎండ్ మోడల్ కి కాస్త ఎక్కువ రేటు ఉండే అవకాశముంది. సన్‌సెట్ ఆరెంజ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

OPPO A77 స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ ముకుల్ చెబుతున్న దాన్ని బట్టి, ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ లో 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉండనుంది. ఇది ఎల్సీడీ 60హెర్ట్జ్ ప్యానెల్ అని తెలుస్తోంది. ఇక ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ ను అమర్చారు. 8జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీ ఎక్స్‌ప్యాన్షన్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అల్ట్రా-లీనియర్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇక కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో వెనుకాల రెండు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రధాన కెమెరా కాగా, మరొకటి 2ఎంపి మ్యాక్రో సెన్సర్. కెమెరాలో నైట్ ఫీచర్స్ ని అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో 8ఎంపి ఏఐ పోట్రెయిట్ లెన్స్ ను ముందు భాగంలో అందించారు. ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 11 ప్రో+, రియల్ మీ 9 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 తదితర ఫోన్లతో పోటీపడనుంది.

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A77 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
బెంగళూరులో కాలిపోయిన OPPO Reno2 స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/oppo-reno2-catches-fire-in-bangalore/ Tue, 26 Jul 2022 14:02:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=1269 హైలైట్స్: మంటలు చెలరేగినప్పుడు చార్జింగ్ లో లేని ఒప్పో రెనో2 పేలుడుకి ముందు వస్తున్న పొగలను ఫోటో తీసి ట్వీట్ చేసిన యూజర్ గతంలో ఎన్నోసార్లు వెలుగు చూసిన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్ళ ఉదంతాలు తాజాగా జరిగిన స్మార్ట్ ఫోన్ పేలుడు ఉదంతంలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ లో లేదు. అలాగే హెవీగా వాడకం కూడా లేదు. వరుసగా యూజర్ పెట్టిన ట్వీట్స్ ని బట్టి, పేలిన ఫోన్ 2019 లో లాంచ్ అయిన ఒప్పో […]

The post బెంగళూరులో కాలిపోయిన OPPO Reno2 స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మంటలు చెలరేగినప్పుడు చార్జింగ్ లో లేని ఒప్పో రెనో2
  • పేలుడుకి ముందు వస్తున్న పొగలను ఫోటో తీసి ట్వీట్ చేసిన యూజర్
  • గతంలో ఎన్నోసార్లు వెలుగు చూసిన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్ళ ఉదంతాలు

తాజాగా జరిగిన స్మార్ట్ ఫోన్ పేలుడు ఉదంతంలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ లో లేదు. అలాగే హెవీగా వాడకం కూడా లేదు. వరుసగా యూజర్ పెట్టిన ట్వీట్స్ ని బట్టి, పేలిన ఫోన్ 2019 లో లాంచ్ అయిన ఒప్పో రెనో2 అని అర్థమవుతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో 2022, జులై 6 న మంటలు చెలరేగాయి. తాను వాట్సాప్ వాడుతున్నప్పుడు, ఉన్నట్లుండి ఫోన్ నుంచి మంటలు వ్యాపించాయని, అప్పుడు ఫోన్ ఛార్జింగ్ లో కూడా లేదని, వంశీ అనే యూజర్ ట్వీట్స్ చేశాడు.

వివాదాస్పద ఫోన్ల జాబితాలో చేరిన OPPO Reno2

సదరు బాధితుడు ఒప్పో ఇండియా కస్టమర్ కేర్ తో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తో పాటు, ఫోన్ కి ఇమేజెస్ ని షేర్ చేశాడు. అయితే ఒప్పో ఇంత వరకు జరిగిన ఘటన పట్ల బాధ్యతను తీసుకోలేదని అతడు అన్నాడు.

“మీ డివైజ్ జెన్యూన్ గా కాలిపోలేదు, లేదా ఇంటర్నల్ గా పగిలిపోలేదు. కాబట్టి, మేము ఈ కేసుని బ్లాస్ట్ కేసుగా పరిగణించలేము. మరేదైనా ప్రశ్నలుంటే, మా సర్వీస్ సెంటర్ లో సంప్రదించగలరు,” అని ఒక స్టేట్మెంట్ లో ఒప్పో కేర్ ఇండియా స్పందించినట్లుగా ఉంది.

ఇప్పటి వరకు ఒప్పో ఇండియా జరిగిన ఘటనపై ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్, రెజుల్యూషన్ ను అందించలేదని, కేసు ఇంకా విచారణ నిమిత్తం ఓపెన్ గానే ఉన్నట్లు బాధితుడు తెలిపాడు.

స్మార్ట్ ఫోన్స్ నిప్పంటుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి ఫోన్ కూడా మంటలంటుకుంది. ఈ ఘటన ఇదే ఏడాది ఏప్రిల్ లో జరిగింది. చార్జింగ్ లో లేనప్పటికీ, ఫోన్ పేలిందని, ఘటనలో ఎవ్వరికి హాని జరగలేదని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక గతంలో వన్ ప్లస్ నార్డ్ 2 డివైజ్ ఎక్కువగా వేడెక్కడం, పేలడం వంటి ఉదంతాలు భారత్ లో వెలుగు చూశాయి. అప్పుడు ఘటనపై స్పందించిన వన్ ప్లస్ యాజమాన్యం, బాధితులకు కొత్త ఫోన్ తో పాటు, మెడికల్ కంపెన్సేషన్ ను అందించాయి. మరి తాజా ఘటన నేపథ్యంలో, ఒప్పో కూడా ఇదే విధంగా స్పందిస్తుందో లేదో చూడాలి. సరైన రీతిలో స్పందించకపోతే, ఒప్పో కంపెనీ యూజర్లలో వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఖాయం.

ఇక ఒప్పో రెనో2 గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 2019, ఆగస్టులో లాంచ్ అయ్యింది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730జి ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 48ఎంపి క్వాడ్ రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు రెనో2 లో ఉన్నాయి.

The post బెంగళూరులో కాలిపోయిన OPPO Reno2 స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
నేటి నుంచి OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ ప్రారంభం https://www.91mobiles.com/telugu/oppo-reno8-oppo-enco-x2-first-sale-in-india/ Mon, 25 Jul 2022 10:37:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=1203 హైలైట్స్: ఈమధ్యే ఒప్పో రెనో8 సిరీస్, ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్, ఒప్పో ప్యాడ్ ఎయిర్ లను భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో నేటి నుంచి భారత్ లో మొదలు కానున్న ఒప్పో రెనో8 5జీ, ఒప్పో ఎన్కో ఎక్స్2 ఫస్ట్ సేల్ ఈ డివైజెస్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఇటీవలె ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో, రెనో8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ రెండు […]

The post నేటి నుంచి OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఈమధ్యే ఒప్పో రెనో8 సిరీస్, ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్, ఒప్పో ప్యాడ్ ఎయిర్ లను భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో
  • నేటి నుంచి భారత్ లో మొదలు కానున్న ఒప్పో రెనో8 5జీ, ఒప్పో ఎన్కో ఎక్స్2 ఫస్ట్ సేల్
  • ఈ డివైజెస్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

ఇటీవలె ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో, రెనో8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ తో పాటు, ఒప్పో ఎన్కో ఎక్స్2, ఒప్పో ప్యాడ్ ఎయిర్ లను భారత్ లో లాంచ్ చేసింది ఒప్పో. ఇక నేటి నుంచి స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో8 5జీ, ఒప్పో ఎన్కో ఎక్స్2 ల యొక్క అమ్మకాలు మొదలయ్యాయి.

ఒప్పో రెనో8 5జీ ఫోన్లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, 80 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ లో 11ఎంఎం డైనమిక్ డ్రైవర్, యాక్టివ్ నాయిస్ క్యాన్సెలేషన్, 40 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లున్నాయి.

OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ వివరాలు, లాంచ్ ఆఫర్లు

ఫ్లిప్ కార్ట్ ద్వారా ఒప్పో రెనో8 5జీ, ఒప్పో ఎన్కో ఎక్స్2 లను నేటి నుంచి కొనుగోలు చేయవచ్చు. రెనో8 5జీ కొనాలనుకునే వారికి హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా 10 శాతం (రూ.3000) వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఒప్పో ఎన్కో ఎక్స్2 ట్రూలీ వైర్లెస్ స్టీరియో బ్లూటూత్ ఇయర్ బడ్స్ కొనాలనుకునే వారికి ఎంపిక చేయబడిన డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇక యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎన్కో ఎక్స్ 2 పై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందవచ్చు.

భారత్ లో OPPO Reno8 5G, OPPO Enco X2 ధర

ఇప్పుడు భారత్ లో ఈ డివైజెస్ ధర ఎంతో ఉందో చూద్దాం. ఒప్పో రెనో8 5జీ 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. ఇక ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ ధర రూ.10,999 గా ఉంది.

 

OPPO Reno8 5G స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో8 5జీ లో 6.4 అంగుళాల అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు రెనో8 5జీ లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఒప్పో రెనో8 5జీ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, మూడోది 2ఎంపి మ్యాక్రో కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 32ఎంపి కెమెరాను అందించారు. ఇక ఒప్పో రెనో8 5జీ షిమ్మర్ బ్యాక్, షిమ్మర్ గోల్డ్ అనే రెండు రంగుల్లో లభ్యం కానుంది.

 

OPPO Enco X2 స్పెసిఫికేషన్స్

ఇక ఒప్పో ఎన్కో ఎక్స్2 విషయానికి వస్తే, ఇందులో 11ఎంఎం డైనమిక్ డ్రైవర్, 6ఎంఎం ప్లేనర్ డయాఫ్రమ్ డ్రైవర్ ఉన్నాయి. టీడబ్ల్యూఎస్ లో డ్యూయల్ మైక్రోఫోన్స్, యాక్టివ్ నాయిస్ కాన్సెలేషన్, కాల్ నాయిస్ రిడక్షన్ కోసం ట్రిపుల్ మైక్రోఫోన్ సెటప్, డ్యూయల్ కనెక్షన్ ఫీచర్ (దీని ద్వారా రెండు డివైజెస్ మధ్య కనెక్టివిటీని తేలిగ్గా స్విచ్ అవ్వవచ్చు)

ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ లో ఉన్న 566ఎంఏహెచ్ బ్యాటరీ (కేస్), 40 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఇయర్ బడ్స్ ఒక్కో దాంట్లో 57ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ఇవి సింగిల్ ఛార్జ్ తో 9.5 గంటల వరకు పని చేస్తాయి.ఈ ఇయర్ బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు క్యూఐ వైర్లెస్ సపోర్ట్ తో వస్తున్నాయి.

The post నేటి నుంచి OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన OPPO Reno 8, OPPO Reno 8 Pro https://www.91mobiles.com/telugu/oppo-reno-8-series-launched-in-india-price-specs-availability/ Mon, 18 Jul 2022 15:09:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=1049 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1 ఈ ఫోన్స్ ప్రత్యేకతలు. ఒప్పో అధికార వెబ్ సైట్ ద్వారా జులై 19 నుంచి రెనో 8 ప్రో, జులై 25 నుంచి రెనో 8 ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో రెనో 8 సిరీస్ భారత్ లో […]

The post భారత్ లో లాంచ్ అయిన OPPO Reno 8, OPPO Reno 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో
  • మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1 ఈ ఫోన్స్ ప్రత్యేకతలు.
  • ఒప్పో అధికార వెబ్ సైట్ ద్వారా జులై 19 నుంచి రెనో 8 ప్రో, జులై 25 నుంచి రెనో 8 ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఒప్పో రెనో 8 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో 8, అలాగే ఒప్పో రెనో 8 ప్రో మోడల్స్ ఉంటాయి. చైనాలో రెనో 8 సిరీస్, రెనో 8ప్రో+ వేరియంట్ తో కలుపుకుని మే నెల్లో లాంచ్ అయ్యింది. ఇక ఒప్పో రెనో 8 ప్రో+, భారత్ లో రెనో 8 ప్రో గా లాంచ్ అయ్యింది. జులై 25 నుంచి ఒప్పో రెనో 8 ని ఒప్పో వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక రెనో 8 ప్రో జులై 19 నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఒప్పో రెనో 8 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1, మారిసిలికాన్ ఎక్స్ చిప్ వంటి ఫీచర్లున్నాయి. మరి భారత్ లో ఒప్పో రెనో 8 సిరీస్ యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్లను ఇక్కడ చూద్దాం.

భారత్ లో OPPO Reno 8 సిరీస్ ధర

ఒప్పో రెనో 8 షిమ్మర్ గోల్డ్, షిమ్మర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఒప్పో రెనో 8 ప్రో గ్లేజ్డ్ గ్రీన్, గ్లేజ్డ్ బ్లాక్ రంగుల్లో లభించనుంది. దీని ధర రూ.45,999 నుంచి మొదలవుతుంది. ఆసక్తి గల వారు, ఒప్పో వెబ్ సైట్ ద్వారా జులై 25 నుంచి రెనో 8 ని, జులై 19 నుంచి రెనో 8 ప్రో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

OPPO Reno 8 స్పెసిఫికేషన్స్

6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

రెనో 8 లో మారిసిలికాన్ ఎక్స్-పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ, 2ఎంపి బ్లాక్&వైట్, 2ఎంపి మ్యాక్రో) ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి (సోనీ ఐఎంఎక్స్709) ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. రెనో 8 ఫోన్ 28 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

OPPO Reno 8 Pro స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 8 ప్రో ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్-హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి ఐఎంఎక్స్766 ప్రైమరీ, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్, 2ఎంపి ఓవీ02బీ10 మ్యాక్రో లెన్స్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో ఫోన్ల యొక్క ఫీచర్లను బట్టి చూస్తుంటే, బ్యాటరీ, కెమెరా, విభాగంపై ఎక్కువగా ఫోకస్ చేసినట్ల కనిపిస్తోంది. ముఖ్యంగా మెయిన్ సెన్సర్స్ సోనీ కంపెనీ తయారు చేసినవి కావడం ఇక్కడ ప్లస్ పాయింట్. అలాగే మారిసిలికాన్ అనే సరికొత్త ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఈ ఫోన్లలో ఒప్పో అందిస్తోంది.

The post భారత్ లో లాంచ్ అయిన OPPO Reno 8, OPPO Reno 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Reno 8 సిరీస్ తో పాటు భారత్ లో లాంచ్ కానున్న OPPO Pad Air https://www.91mobiles.com/telugu/oppo-pad-air-india-launch-date-confirmed/ Fri, 15 Jul 2022 15:41:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=1022 హైలైట్స్: జులై 18 న లాంచ్ కానున్న ఒప్పో ప్యాడ్ ఎయిర్, రెనో 8 సిరీస్, ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ రెనో 8 సిరీస్ లో ఉండనున్న రెనో 8, రెనో 8 ప్రో మోడల్స్ ఒప్పో ప్యాడ్ ఎయిర్ తో పాటు లాంచ్ కానున్న ఒప్పో పెన్సిల్, స్మార్ట్ మాగ్నెటిక్ కీబోర్డ్ ఒప్పో ప్యాడ్ ఎయిర్, ఒప్పో రెనో 8 సిరీస్ మరియు ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ జులై 18 న భారత్ లో […]

The post Reno 8 సిరీస్ తో పాటు భారత్ లో లాంచ్ కానున్న OPPO Pad Air first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జులై 18 న లాంచ్ కానున్న ఒప్పో ప్యాడ్ ఎయిర్, రెనో 8 సిరీస్, ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్
  • రెనో 8 సిరీస్ లో ఉండనున్న రెనో 8, రెనో 8 ప్రో మోడల్స్
  • ఒప్పో ప్యాడ్ ఎయిర్ తో పాటు లాంచ్ కానున్న ఒప్పో పెన్సిల్, స్మార్ట్ మాగ్నెటిక్ కీబోర్డ్

ఒప్పో ప్యాడ్ ఎయిర్, ఒప్పో రెనో 8 సిరీస్ మరియు ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ జులై 18 న భారత్ లో లాంచ్ కానున్నాయి. ఇక ఒప్పో రెనో 8 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో 8 తో పాటు ఒప్పో రెనో 8 ప్రో మోడల్ ఉండనుంది. గతంలో, మేం ఎక్స్ క్లూజివ్ గా ఒప్పో ప్యాడ్ ఎయిర్ మరియు ఒప్పో రెనో 8 సిరీస్ కు సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఒప్పో కంపెనీ, భారత్ లో ఈ డివైజెస్ ను లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇకపోతే, ఒప్పో కంపెనీ నుంచి వస్తున్న మొట్టమొదటి ట్యాబ్లెట్ గా ఒప్పో ప్యాడ్ ఎయిర్ నిలవనుంది. ప్యాడ్ ఎయిర్ తో పాటు ఒప్పో పెన్సిల్, స్మార్ట్ మ్యాగ్నెటిక్ కీబోర్డ్ ని లాంచ్ చేయాలని ఒప్పో నిర్ణయించింది. మరి భారత్ లో లాంచ్ కానున్న ఒప్పో ప్యాడ్ ఎయిర్ నుంచి మనం ఏం ఆశించవచ్చో ఇక్కడ చూద్దాం.

OPPO Pad Air స్పెసిఫికేషన్స్

ఒప్పో ప్యాడ్ ఎయిర్ లో 10.36 అంగుళాల 2కే డిస్ప్లే ఉంది. ఇది 2000*1200 పిక్సెల్ రెజుల్యూషన్ కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ను ఇందులో అమర్చారు. 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ప్యాడ్ ఎయిర్, 18 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ డివైజ్ లో 4జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.

ఓసారి ఒప్పో ప్యాడ్ ఎయిర్ కెమెరా విభాగంపై కన్నేద్దాం. ప్యాడ్ ఎయిర్ లో 8ఎంపి రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5ఎంపి కెమెరా ఉంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ కలర్ ఓఎస్ 12 పై నడవనుంది. శబ్ధ విభాగం వైపు చూస్తే, ప్యాడ్ ఎయిర్ లో డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేసే నాలుగు స్పీకర్లున్నాయి.

OPPO Enco X2 ఫీచర్లు

ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ గతంలో వచ్చిన ఎన్కో ఎక్స్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ కి కొనసాగింపు వర్షన్. ఒప్పో ఎన్కో ఎక్స్2 ఏఎన్సీ సపోర్ట్ మరియు డాల్బీ అట్మాస్ బైనారల్ రికార్డింగ్ తో వస్తోంది. అలాగే నార్డిక్ ఆడియో దిగ్గజం డైనాడియో అభివృద్ధి పరిచిన నెక్ట్స్-జనరేషన్ సూపర్ డైనమిక్ బ్యాలన్స్ ఎన్హాన్స్డ్ ఇంజిన్ (SuperDBEE) ని ఎన్కో ఎక్స్2 బడ్స్ కలిగి ఉంది.

ఇక ఒప్పో రెనో 8 సిరీస్ కూడా ఒప్పో ప్యాడ్ ఎయిర్, ఒప్పో ఎన్కో ఎక్స్2 తో పాటు లాంచ్ కానుంది. ఒప్పో రెనో 8 సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలకై మేము ఇంతకు ముందు ప్రచురించిన కథనాన్ని చదవండి.

The post Reno 8 సిరీస్ తో పాటు భారత్ లో లాంచ్ కానున్న OPPO Pad Air first appeared on 91Mobiles Telugu.

]]>