Samsung - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 18 Jan 2024 07:44:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung: 200MP కెమెరా, అడ్వాన్స్డ్ AI తో లాంచైన Samsung Galaxy S24 Ultra https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-launched-with-200mp-camera-advanced-ai/ Thu, 18 Jan 2024 04:19:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=9777 అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న Samsung Galaxy S24 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 Ultra గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం మరియు 200ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, […]

The post Samsung: 200MP కెమెరా, అడ్వాన్స్డ్ AI తో లాంచైన Samsung Galaxy S24 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో వచ్చిన S24, S24 Plus, S24 Ultra
  • Samsung Galaxy S24 Ultra ధర 1299 డాలర్లు

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న Samsung Galaxy S24 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 Ultra గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం మరియు 200ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy S24 Ultra ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S24 Ultra ధర

  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.1,29,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.1,39,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,59,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra డివైజ్ టైటానియమ్ గ్రే, టైటానియమ్ వయొలెట్, టైటానియమ్ బ్లాక్, టైటానియమ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy S24 Ultra లో 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, విజన్ బూస్టర్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్సెట్ మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ ఉపయోగించారు.
  • ఓఎస్: Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 7 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ని ఈ ఫోన్ పొందనుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 ఫీచర్ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24 Ultra లో 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Samsung: 200MP కెమెరా, అడ్వాన్స్డ్ AI తో లాంచైన Samsung Galaxy S24 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung బిగ్ హాలిడే సేల్: Galaxy S22, Z Fold 4, Z Flip 4 తదితర ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-series-s-series-discount-sale/ Wed, 21 Dec 2022 13:42:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=4115 హైలైట్స్ Big Holiday Sale తో వచ్చిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung ఎస్-సిరీస్, జెడ్-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ సంస్థ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, ఫ్లిప్ 4, ఎస్22 పై యూజర్లకు లభించనున్న డిస్కౌంట్ ఫోల్డ్ 4 పై రూ.8,000 రిబేట్ మరియు రూ.8,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్, ఫ్లిప్ 4 పై రూ.7000 రిబేట్, రూ.7000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ మీరు గనుక Samsung ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు కొనాలని భావిస్తుంటే ఇదే […]

The post Samsung బిగ్ హాలిడే సేల్: Galaxy S22, Z Fold 4, Z Flip 4 తదితర ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Big Holiday Sale తో వచ్చిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung
  • ఎస్-సిరీస్, జెడ్-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ సంస్థ
  • గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, ఫ్లిప్ 4, ఎస్22 పై యూజర్లకు లభించనున్న డిస్కౌంట్
  • ఫోల్డ్ 4 పై రూ.8,000 రిబేట్ మరియు రూ.8,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్, ఫ్లిప్ 4 పై రూ.7000 రిబేట్, రూ.7000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్

మీరు గనుక Samsung ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు కొనాలని భావిస్తుంటే ఇదే సరైన తరుణం. శాంసంగ్ కంపెనీ ప్రైస్ డిస్కౌంట్స్, రిఫండ్ ఇన్సెన్టివ్స్ ని ప్రకటించింది. ఫ్లాగ్షిప్ కొనుగోలుదారులకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ ఎస్ 22 సిరీస్ పై డిస్కౌంట్స్ లభించనున్నాయి.

Samsung ఫోల్డబుల్ ఫోన్లపై డిస్కౌంట్

Samsung Galaxy Z Fold 4 పై రూ.8,000 రిబేట్, రూ.8,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ కలిపి మొత్తం 16,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.1,46,999 కే లభించనుంది. ఇక Galaxy Z Flip 4 పై రూ.7,000 రిబేట్, రూ.7,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ కలిపి మొత్తం రూ.14,000 డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ ని రూ.82.999 కే కొనుగోలు చేయవచ్చు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్లను కొనుగోలు చేసేవారు గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 46ఎంఎం స్మార్ట్ వాచ్ ని రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కామ్, రిటైల్ షాప్స్ లలో ఈ ఫోన్లను డిస్కౌంట్ పై కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ డిసెంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ పొందాలంటే మీ పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టకోండి.

Galaxy Z Fold 3 పై రూ.20,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో దీని ధర రూ.59,999 కి చేరింది. ఇప్పుడు ఇదే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లలో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తున్న వారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు.

Galaxy ఎస్-సిరీస్ డీల్స్

సేల్ సందర్భంగా, గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లపై కూడా డిస్కౌంట్ లభించనుంది. Samsung Galaxy S22 Ultra ఫోన్ పై రూ.5,000 రిబేట్ మరియు రూ.7,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ లభిస్తుంది. దీంతో మొత్తం రూ.12,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ని రూ.1,02,999 కే సొంతం చేసుకోవచ్చు. ఎస్22 అల్ట్రా కొనుగోలుదారులు గెలాక్సీ వాచ్4 46ఎంఎం స్మార్ట్ వాచ్ ని రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు.

Galaxy S22, Galaxy S22 ఫోన్లు రూ.59,999 మరియు రూ.54,999 ధరల్లో లభ్యం కానున్నాయి. అలాగే ఈ ఫోన్ల కొనుగోలుదారులు గెలాక్సీ బడ్స్ 2 ని రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే Galaxy S21 FE ని రూ.39,999 కి, Galaxy S20 FE 5G ని రూ.32,999 కి సొంతం చేసుకోవచ్చు. అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ మరియు క్విక్ క్యాష్ బ్యాక్ కూడా వీటికి వర్తిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Samsung బిగ్ హాలిడే సేల్: Galaxy S22, Z Fold 4, Z Flip 4 తదితర ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
2022 నవంబర్ కల్లా అన్ని Samsung 5G ఫోన్లకు 5జీ సపోర్ట్; స్పష్టం చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/samsung-5g-phones-to-get-5g-ota-update-november-2022/ Wed, 12 Oct 2022 12:56:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2885 హైలైట్స్ 2022 నవంబర్ నెలలో అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ కి 5జీ ఓటీఏ అప్డేట్ వెళ్తుందని ప్రకటించిన Samsung కంపెనీ ఎయిర్టెల్ 5జీ ప్లస్ కంపాటిబులిటీ కలిగిన 9 శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ లేటెస్ట్ అప్డేట్ తో శాంసంగ్ డివైజెస్ లో ఎనేబుల్ కానున్న 5జీ సేవలు 2022 నవంబర్ కల్లా అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ కి ఓటీఏ ద్వారా అప్డేట్ వెళ్తుందని శాంసంగ్ బుధవారం నాడు ప్రకటించింది. దీంతో త్వరలోనే శాంసంగ్ ఫోన్ […]

The post 2022 నవంబర్ కల్లా అన్ని Samsung 5G ఫోన్లకు 5జీ సపోర్ట్; స్పష్టం చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2022 నవంబర్ నెలలో అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ కి 5జీ ఓటీఏ అప్డేట్ వెళ్తుందని ప్రకటించిన Samsung కంపెనీ
  • ఎయిర్టెల్ 5జీ ప్లస్ కంపాటిబులిటీ కలిగిన 9 శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్
  • లేటెస్ట్ అప్డేట్ తో శాంసంగ్ డివైజెస్ లో ఎనేబుల్ కానున్న 5జీ సేవలు

2022 నవంబర్ కల్లా అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ కి ఓటీఏ ద్వారా అప్డేట్ వెళ్తుందని శాంసంగ్ బుధవారం నాడు ప్రకటించింది. దీంతో త్వరలోనే శాంసంగ్ ఫోన్ యూజర్లు 5జీ సేవలను పొందనున్నారు. శాంసంగ్ బ్రాండ్ కి చెందిన ఎన్నో 5జీ డివైజెస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేవలం 9 హ్యాండ్సెట్స్ మాత్రమే ఎయిర్టెల్ 5జీ ప్లస్ కంపాటిబులిటీ కలిగి ఉన్నాయి.

Samsung Galaxy Z Flip 4, Samsung Galaxy Z Fold 4, Samsung Galaxy S22 Ultra, Samsung Galaxy S22, Samsung Galaxy S22+, Samsung Galaxy S21 FE, Samsung Galaxy A53 5G, Samsung Galaxy A33 5G యూజర్లు ఎయిర్టెల్ 5జీ ప్రయోజనం పొందనున్నారు.

భారత్ లో 5G సేవలు

భారతీయ టెలీకామ్ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రీసెంట్ గా భారత్ లో 5జీ సేవలను ప్రకటించాయి. ఇప్పటికే 5జీ రోలౌట్ మొదలైంది. కొన్ని నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే 5జీ హ్యాండ్సెట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, 5జీ నెట్వర్క్ ఉన్న నగరాల్లో యూజర్లు 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. దీనికి కారణం, కొన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సంబంధిత ఫోన్లలో 5జీ సేవలను ఎనేబుల్ చేయకపోవడమే. అయితే సాఫ్ట్‌వేర్ అప్డేట్ తో ఈ సమస్యను ఫిక్స్ చేయబోతున్నారు.

ఇక ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలు ప్రస్తుతం భారత్ లోని 8 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అవి: హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి. ఎయిర్టెల్ 4జీ తో పోల్చితే, ఎయిర్టెల్ 5జీ 30 రెట్లు అధిక స్పీడ్స్ ని అందిస్తుంది. మరోవైపు, జియో ట్రూ 5జీ సర్వీస్ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలను లాంచ్ చేస్తామని జియో, ఎయిర్టెల్, వీఐ హామీ ఇచ్చాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1 న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను లాంచ్ చేశారు. అదే రోజున ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ కూడా 5జీ సేవలను లాంచ్ చేసింది. తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్ జియో 5జీ సర్వీసెస్ లాంచ్ చేసింది.

5జీ సేవలు దేశంలో లాంచ్ అవ్వగానే, పలు ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ ని ప్రారంభిస్తామని ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థలు తెలిపాయి. సంబంధిత నగరాల్లో 5జీ సేవలు మొదలైనా, యూజర్లు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లపై 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. ఎందుకంటే, వారికి 5జీ సపోర్ట్ కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇంకా రోలౌట్ కాలేదు. మీ వద్ద 5జీ ఫోన్ ఉన్నప్పటికీ, ఫోన్ తయారీదారు నుంచి వచ్చే ఓటీఏ అప్డేట్ ద్వారా మాత్రమే 5జీ కనెక్టివిటీ ఎనేబుల్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 2022 నవంబర్ కల్లా అన్ని Samsung 5G ఫోన్లకు 5జీ సపోర్ట్; స్పష్టం చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం https://www.91mobiles.com/telugu/indian-govt-asks-apple-samsung-to-release-5g-updates-immediately/ Wed, 12 Oct 2022 05:30:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2869 హైలైట్స్ 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్ భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, […]

The post 5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం
  • ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు
  • భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్

భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, ఈ రెండు కంపెనీల 5జీ డివైజెస్ కి 5జీ సపోర్ట్ అప్డేట్స్ రాలేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. త్వరగా దేశంలో ఉన్న 5జీ కంపాటిబుల్ డివైజెస్ కి 5జీ అప్డేట్స్ విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్ లకు తెలిపింది.

5జీ సేవలు దేశంలో లాంచ్ అవ్వగానే, పలు ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ ని ప్రారంభిస్తామని ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థలు తెలిపాయి. సంబంధిత నగరాల్లో 5జీ సేవలు మొదలైనా, యూజర్లు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లపై 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. ఎందుకంటే, వారికి 5జీ సపోర్ట్ కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇంకా రోలౌట్ కాలేదు. మీ వద్ద 5జీ ఫోన్ ఉన్నప్పటికీ, ఫోన్ తయారీదారు నుంచి వచ్చే ఓటీఏ అప్డేట్ ద్వారా మాత్రమే 5జీ కనెక్టివిటీ ఎనేబుల్ అవుతుంది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన iPhone 14 లో కూడా లేని 5జీ

ఐఫోన్ 12 నుంచి ఐఫోన్ 14 సిరీస్ వరకు ఆపిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ని పంపించాలని, ఎయిర్టెల్ వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఐఫోన్స్ కి 5జీ అప్డేట్స్ ఇచ్చేందుకు ఆపిల్ సంస్థ చాలా సమయం తీసుకుంటోందని రైటర్స్ తో ఓ అధికారి అన్నారు. మరోవైపు శాంసంగ్ కూడా ఎన్నో స్మార్ట్ ఫోన్స్ కి ఇంకా 5జీ రోలౌట్ పంపలేదు. ఇదిలా ఉంటే, చైనా కంపెనీలైన షావోమీ, వివో లకు చెందిన 36 కి పైగా ఫోన్లకు 5జీ అప్డేట్స్ వచ్చాయి. ఆ ఫోన్లు ఎయిర్టెల్ 5జీ సేవలను వాడుకునేందుకు రెడీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో భారతీయ టెలీకామ్, ఐటీ విభాగాలకు చెందిన అధికారులు బుధవారం నాడు సమావేశమై, 5జీ అడాప్షన్ ని త్వరగా పూర్తయ్యే విషయమై చర్చలు చేయనున్నారని రైటర్స్ తన కథనంలో పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం, ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్, వివో, షావోమీ సంస్థల నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో భాగం కానున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1 న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను లాంచ్ చేశారు. అదే రోజున ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ కూడా 5జీ సేవలను లాంచ్ చేసింది. తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్ జియో 5జీ సర్వీసెస్ లాంచ్ చేసింది.

The post 5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో Samsung ని వెనక్కి నెట్టేసిన Realme https://www.91mobiles.com/telugu/realme-beats-samsung-smartphones-shipments-june-quarter-report/ Wed, 10 Aug 2022 14:22:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=1620 హైలైట్స్: జూన్ త్రైమాసికంలో 6.1 మిలియన్ ఫోన్లని అమ్మిన రియల్ మీ, 23శాతం YoY (Year-Over-Year) వృద్ధి రేటు నమోదు 2.7 శాతం వైఓవై గ్రోత్ ని నమోదు చేసినప్పటికీ 4 వ స్థానానికే పరిమితమైన శాంసంగ్ మూడో త్రైమాసికంలో కూడా ప్రభావం చూపిన భారత్ లో నెలకొన్న స్మార్ట్ ఫోన్ గిరాకీ లేమి భారతదేశపు రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా రియల్ మీ అవతరించింది. దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కుంటున్నప్పటికీ, రియల్ […]

The post భారత్ లో Samsung ని వెనక్కి నెట్టేసిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జూన్ త్రైమాసికంలో 6.1 మిలియన్ ఫోన్లని అమ్మిన రియల్ మీ, 23శాతం YoY (Year-Over-Year) వృద్ధి రేటు నమోదు
  • 2.7 శాతం వైఓవై గ్రోత్ ని నమోదు చేసినప్పటికీ 4 వ స్థానానికే పరిమితమైన శాంసంగ్
  • మూడో త్రైమాసికంలో కూడా ప్రభావం చూపిన భారత్ లో నెలకొన్న స్మార్ట్ ఫోన్ గిరాకీ లేమి

భారతదేశపు రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా రియల్ మీ అవతరించింది. దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కుంటున్నప్పటికీ, రియల్ మీ దూసుకెళ్తుండటం విశేషం. జూన్ త్రైమాసికం లో కూడా భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఆశావాహంగా కనిపించలేదు. మార్కెట్ పై తీవ్ర ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ వెలువరించిన తాజా నివేదికను బట్టి ఇది స్పష్టమవుతోంది. 2.9 ఇయర్ ఓవర్ ఇయర్ వృద్ధిని రేటుని నమోదు చేసినప్పటికీ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి 5 శాతం దిగజారింది.

భారత్ లో Smartphone తయారీదారుల వృద్ధి రేటు

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారులు రియల్ మీ, వివో మార్కెట్ క్షీణతతో సంబంధం లేకుండా వృద్ధిని సాధించాయి. 2022 రెండో త్రైమాసికంలో 6.1 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ అమ్మిన రియల్ మీ సంస్థ 23.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు 5.9 మిలియన్ డివైజెస్ అమ్మి వివో 17.4 శాతం ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ ని సాధించింది. దీంతో రియల్ మీ భారత్ లో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ విక్రయదారుగా నిలిచింది. యథావిధిగా మరో చైనా కంపెనీ షావోమీ భారత్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మొదటి స్థానానికి, రెండో స్థానానికి అంతరం చాలా తక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం.

ఐడీసీ ప్రకారం, 2022 రెండో త్రైమాసికంలో షావోమీ అమ్మకాలు 28.2 శాతానికి తగ్గి, 7.1 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యాయి. రెండేళ్ళ క్రితం, అంటే 2020 రెండో త్రైమాసికంలో షావోమీ, రియల్ మీ కంటే మూడింతలు ఎక్కువగా ఫోన్లను విక్రయించింది. ఇక అప్పట్లో షావోమీ, రియల్ మీ కంపెనీలకు మధ్య అంతరం 20 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం 3 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఈ గణాంకాలు భారత్ లో రియల్ మీ యొక్క బలమైన వృద్ధిని తెలియజేస్తున్నాయి.

ఆశ్చర్యకరంగా కొరియన్ స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో నాల్గవ స్థానానికి పడిపోయింది. 2.7 శాతం మేర ఫోన్ల అమ్మకాలు పెరిగినప్పటికీ, రియల్ మీ, వివో వృద్ధి ముందు శాంసంగ్ తాళలేకపోయింది. ఐడీసీ నివేదిక ప్రకారం, శాంసంగ్ యొక్క హయ్యస్ట్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ రూ.20,000 గా ఉంది. ఇక భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ప్రస్తుత త్రైమాసికం యొక్క యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ రూ.16,800 గా ఉంది. దీంతో బడ్జెట్ సెగ్మెంట్లో శాంసంగ్ మరిన్ని నాణ్యమైన, ఫీచర్ రిచ్ ఫోన్లను లాంచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థమవుతోంది.

మరో దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఒప్పో ర్యాంకింగ్స్ లో 5 వ స్థానానికి పరిమితమైంది. 2.3 శాతం వృద్ధిని నమోదు చేసిన ఒప్పో కంపెనీ, జూన్ త్రైమాసికంలో 4 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ ని అమ్మింది.

The post భారత్ లో Samsung ని వెనక్కి నెట్టేసిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A04s: ఫ్యాక్టరీ నుంచి లీకైన పిక్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04s-images-leaked-from-factory-noida/ Thu, 28 Jul 2022 09:13:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=1321 హైలైట్స్: ఫ్యాక్టరీ నుంచి లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్ లైవ్ ఇమేజెస్, రివీల్ అయిన పూర్తి డిజైన్ ఎస్ఎమ్-ఏ047 మోడల్ నంబర్ ను కలిగిన హ్యాండ్సెట్, కనిపిస్తోన్న ప్లాస్టిక్ బాడీ ఎగ్జినోస్ 850 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ త్వరలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ04ఎస్ తో వస్తోంది. […]

The post Samsung Galaxy A04s: ఫ్యాక్టరీ నుంచి లీకైన పిక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఫ్యాక్టరీ నుంచి లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్ లైవ్ ఇమేజెస్, రివీల్ అయిన పూర్తి డిజైన్
  • ఎస్ఎమ్-ఏ047 మోడల్ నంబర్ ను కలిగిన హ్యాండ్సెట్, కనిపిస్తోన్న ప్లాస్టిక్ బాడీ
  • ఎగ్జినోస్ 850 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ త్వరలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ04ఎస్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ కన్ఫర్మ్ కాలేదు. శాంసంగ్ ఏ03ఎస్ ఫోన్ కి సక్సెసర్ గా ఏ04ఎస్ వస్తోంది. గ్రేటర్ నొయిడా ఫ్యాక్టరీ లో ఈ ఫోన్ యొక్క ఉత్పత్తి మొదలైనట్లు సమాచారం. ఇప్పుడు, 91మొబైల్స్ హిందీ ఎక్స్ క్లూజివ్ గా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లైవ్ ఇమేజెస్ ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ పిక్స్ ద్వారా మనకు ఫోన్ యొక్క ఫుల్ డిజైన్ ఏంటో తెలిసిపోయింది.

శాంసంగ్ ఏ04ఎస్ పూర్తి ప్లాస్టిక్ బాడీతో వస్తోంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి, ప్లాస్టిక్ బాడీతో ఉండటం ఊహించదగిన విషయమే. ఇక ఈ ఫోన్ ధరను తగ్గించడానికి ఇందులో ఎగ్జినోస్ చిప్సెట్ ను వాడారు.

Samsung Galaxy A04s డిజైన్

 

శాంసంగ్ నుంచి వచ్చిన ఎన్నో బడ్జెట్ ఫోన్ మాదిరే గెలాక్సీ ఏ04ఎస్ కూడా ఉంది. సైడ్ ప్యానెల్స్ కాస్త కర్వ్డ్ గా ఉండి క్యాండీ బార్ డిజైన్ ను తలపిస్తోంది. పాలీకార్బొనేట్ బ్యాక్ బాడీపై టెక్చర్డ్ ప్యాటెర్న్ ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ కుడివైపున ఉన్నాయి. ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశముంది. ముందువైపున సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరాస్, ఎల్ఈడీ ఫ్లాష్ రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లో 3.5ఎంఎం జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, బాటమ్ లో స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.

Samsung Galaxy A04s లాంచ్ టైమ్ లైన్

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఉత్పత్తి తొలి దశలో ఉంది. మరో రెండు నెలల్లో ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది. లాంచ్ కి ముందు పలు విభిన్న పరీక్షలు జరపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ చివరి వారంలో ఫోన్ లాంచ్ అవుతుందని మేం అంచనా వేస్తున్నాం. ఈ ఫోన్ 5జీ వేరియంట్ లో కూడా లభ్యం కానుందని సమాచారం. దేశంలో 5జీ సేవలు లాంచ్ అయ్యాక, ఈ మోడల్ ని లాంచ్ చేస్తే బెటర్. ఎందుకంటే అప్పటికి దేశంలో 5జీ సేవలు రన్ అవుతుంటాయి కాబట్టి, బడ్జెట్ లో వచ్చే 5జీ ఫోన్ కొనాలని చూసే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కనీసం ప్రధాన నగరాలకు 5జీ సేవలు విస్తరించాక, ఈ ఫోన్ లాంచ్ అయితే మంచిది.

Samsung Galaxy A04s స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లో ఎగ్జినోస్ 850 చిప్సెట్ ను అమర్చారు. 3జిబి ర్యామ్ వేరియంట్ తో పాటు ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశముంది. ఆండ్రాయిడ్ 12, 13ఎంపి మెయిన్ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉంటాయి. 15 వాట్ అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేసే అవకాశముంది.

The post Samsung Galaxy A04s: ఫ్యాక్టరీ నుంచి లీకైన పిక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో మొదలైన Samsung Galaxy A04s ప్రొడక్షన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04s-production-begins-in-noida-plant/ Tue, 26 Jul 2022 11:42:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=1258 హైలైట్స్: భారత్ లో గెలాక్సీ ఏ04ఎస్ ఉత్పాదనను మొదలుపెట్టిన శాంసంగ్ 4జీ మరియు 5జీ వర్షన్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లాంచ్ అయ్యే అవకాశం ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్, త్వరలోనే గెలాక్సీ ఏ04ఎస్ బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఇదివరకు మేం ప్రచురించడం జరిగింది. తాజాగా తెలియవస్తున్నదేంటంటే, 91మొబైల్స్ హిందీ కథనం […]

The post భారత్ లో మొదలైన Samsung Galaxy A04s ప్రొడక్షన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో గెలాక్సీ ఏ04ఎస్ ఉత్పాదనను మొదలుపెట్టిన శాంసంగ్
  • 4జీ మరియు 5జీ వర్షన్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్
  • సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్, త్వరలోనే గెలాక్సీ ఏ04ఎస్ బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఇదివరకు మేం ప్రచురించడం జరిగింది. తాజాగా తెలియవస్తున్నదేంటంటే, 91మొబైల్స్ హిందీ కథనం ప్రకారం, ఈ ఫోన్ ఉత్పాదన శాంసంగ్ యొక్క నొయిడా ప్లాంట్ లో మొదలైనట్లు సమాచారం. 4జీ, 5జీ వర్షన్స్ లో లభించనున్న ఈ ఫోన్ రాబోవు రెండు నెలల్లో లాంచ్ కానుంది. బహుశా సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. పండుగ సీజన్ కు ముందే లాంచ్ ఉండనుందని అంచనా.

Samsung Galaxy A04s డిజైన్

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ డిజైన్ విషయానికి వస్తే, కొన్ని రోజుల క్రితం ఫోన్ యొక్క రెండర్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో మనకు కొంత సమాచారం దొరికినట్లైంది. ఫోన్ వెనకాల మూడు కెమెరాలను అమర్చినట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, 3.5ఎంఎం ఆడియో జాక్, లౌడ్ స్పీకర్ గ్రిల్ బాటమ్ ప్యానెల్ లో ఉన్నాయి. ఇక పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ సైడ్ ప్యానెల్ పై ఉన్నాయి. ఇక పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ లా కూడా పని చేయనుంది.

Samsung Galaxy A04s స్పెసిఫికేషన్స్

ఇప్పటి వరకు మనకు ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కి సంబంధించి వివరాలు ఏమీ తెలియలేదు. అయితే ఫోన్ పలు సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. దీంతో ఆ లిస్టింగ్స్ ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ గురించి కొంత సమాచారం తెలిసింది. ఈ డివైజ్ లో ఎగ్జినోస్ 850 చిప్సెట్ ను అమర్చినట్లు మనకు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా గతంలోనే స్పష్టమైంది. ఇది కాకుండా, మరో విషయం ఏంటంటే, కనీసం ఒక 3జిబి ర్యామ్ వేరియంట్ వస్తుందని అంచనా. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. తాజాగా బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి, ఫోన్లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం.

ఎఫ్సీసీ ఫైలింగ్ అనే యూఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ ద్వారా ఫోన్ యొక్క ఛార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఎఫ్సీసీ డేటా ఆధారంగా ఫోన్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుందని తెలుస్తున్నప్పటికీ, భారత వేరియంట్ మాత్రం బాక్స్ లో 15 వాట్ ఛార్జర్ నే కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఎమ్ మరియ ఏ సిరీస్ ఫోన్లకు కూడా ఇదే విధంగా 15 వాట్ ఛార్జర్ వస్తోంది. గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మాకు తెలియగానే, మిమ్మల్ని అప్డేట్ చేస్తాం. అంతవరకు తాజా టెక్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి 91మొబైల్స్ తెలుగు.

The post భారత్ లో మొదలైన Samsung Galaxy A04s ప్రొడక్షన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy Z Flip 4 ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-flip-4-europe-price-leaked/ Thu, 21 Jul 2022 13:40:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=1151 హైలైట్స్: లాంచ్ కి ముందు లీకైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 యూరప్ మార్కెట్ ధర 128జిబి మోడల్ ధర 1080 యూరోలు (దాదాపు రూ.87,900). 512జిబి మోడల్ ధర 1280 యూరోలు (దాదాపు రూ.1,04,200) ఆగస్టు 10 న లాంచ్ అవుతోన్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఆగస్టు 10 న అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానున్నాయి. […]

The post లీకైన Samsung Galaxy Z Flip 4 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు లీకైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 యూరప్ మార్కెట్ ధర
  • 128జిబి మోడల్ ధర 1080 యూరోలు (దాదాపు రూ.87,900). 512జిబి మోడల్ ధర 1280 యూరోలు (దాదాపు రూ.1,04,200)
  • ఆగస్టు 10 న లాంచ్ అవుతోన్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఆగస్టు 10 న అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానున్నాయి. గతేడాది వచ్చిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, జెడ్ ఫోల్డ్ 3 ఫోన్లకు సక్సెసర్స్ గా ఈ ఫోన్స్ వస్తున్నాయి. రాబోవు ఈ మడత ఫోన్లకు సంబంధించి ఎన్నో వార్తలు, రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రైస్ బాబా వెబ్ సైట్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 యురోపియన్ మార్కెట్ ధరను లీక్ స్టర్ సుదాన్శు సౌజన్యంతో ప్రకటించింది. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ధర, జెడ్ ఫ్లిప్ 3 ధర మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy Z Flip 4 ధర (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 128జిబి వేరియంట్ ధరను 1080 యూరోలుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దీని ధర రూ.87,900. ఇక 256జిబి వేరియంట్ ధర 1160 యూరోలు (రూ.94,400) గా ఉండనుంది. 512జిబి వేరియంట్ ధర 1280 యూరోలు (రూ.1,04,200) గా ఉంటుందని సమాచారం. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర వేరుగా ఉండే అవకాశముంది. మరి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూద్దాం రండి.

Samsung Galaxy Z Flip 4 స్పెసిఫికేషన్స్ (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది మధ్యలోకి ఫోల్డ్ అవుతుంది. ఇక ఫోల్డ్ అయ్యాక మనకు 1.9 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్ప్లే కనిపిస్తుంది. మెయిన్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండి, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ని కలిగి ఉండనుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 512జిబి వరకు స్టోరేజీ, 12జిబి వరకు ర్యామ్ ఈ ఫోన్లో ఉంటాయి. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 12ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, ఇక మూడోది 10ఎంపి టెలీఫోటో లెన్స్ (3X జూమ్). 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.

The post లీకైన Samsung Galaxy Z Flip 4 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టు 10 న జరగనున్న శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2022 ఈవెంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-2022-date-confirmed/ Wed, 20 Jul 2022 16:36:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=1122 హైలైట్స్: 2022, ఆగస్టు 10 న జరగనున్న తదుపరి గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ ఈవెంట్ సందర్భంగా లాంచ్ కానున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ వాచ్ 5 సిరీస్, గెలాక్సీ బడ్స్ 2 ప్రో ఫోల్డబుల్ ఫోన్ తో కూడిన ప్రమోషనల్ వీడియోనను పోస్ట్ చేసిన శాంసంగ్ కొన్ని నెలల పాటు వచ్చిన లీకులు, రూమర్ల తర్వాత, శాంసంగ్ ఎట్టకేలకు తదుపరి గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ తేదీని […]

The post ఆగస్టు 10 న జరగనున్న శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2022 ఈవెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2022, ఆగస్టు 10 న జరగనున్న తదుపరి గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్
  • ఈవెంట్ సందర్భంగా లాంచ్ కానున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ వాచ్ 5 సిరీస్, గెలాక్సీ బడ్స్ 2 ప్రో
  • ఫోల్డబుల్ ఫోన్ తో కూడిన ప్రమోషనల్ వీడియోనను పోస్ట్ చేసిన శాంసంగ్

కొన్ని నెలల పాటు వచ్చిన లీకులు, రూమర్ల తర్వాత, శాంసంగ్ ఎట్టకేలకు తదుపరి గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ తేదీని ప్రకటించింది. 2022, ఆగస్టు 10 న ఈవెంట్ జరగనుంది. అయితే ఇది ఆన్-లైన్ ఈవెంట్ అని తెలుస్తోంది. ఎందుకంటే, ఈవెంట్ కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో గాని, ప్రమోషనల్ పోస్టర్ లో గాని ఆఫ్ లైన్ వేదిక వివరాలను పేర్కొనలేదు. ఈ ఈవెంట్ ను శాంసంగ్.కామ్ పై ఉదయం 9 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఈవెంట్ లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్ (స్టాండర్డ్ వర్షన్ మరియు ప్రో వర్షన్), శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ని లాంచ్ చేసే అవకాశముంది.

ఆగస్టు 10 న జరగనున్న Samsung Galaxy Unpacked Event

పైన ప్రమోషనల్ వీడియోలో చూపిన విధంగా, తదుపరి గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2022 ఈవెంట్ 2022, ఆగస్టు 10 న జరగబోతున్నట్లు స్పష్టమైంది. వీడియోలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లిలాక్ కలర్ లో కనిపిస్తోంది. విభిన్న రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది.

Samsung Galaxy Z Fold 4 స్పెసిఫికేషన్స్ (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో 7.6 అంగుళాల అమోలెడ్ 2కే డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.2 అంగుళాల హెచ్డీ+ కవర్ డిస్ప్లే, 10ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉండనున్నాయి.

ఇప్పుడు బ్యాటరీ వివరాలు చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో 4,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుంది. 15 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 కి శక్తిని అందించనుంది. అలాగే ఈ ఫోన్ లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఇక ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

ఈవెంట్ లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్ (స్టాండర్డ్ వర్షన్ మరియు ప్రో వర్షన్), శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ని లాంచ్ చేసే అవకాశముంది. అయితే వీటిలో ఏవేవి కచ్చితంగా లాంచ్ అవుతాయో చెప్పలేం. ఇప్పటికైతే, అందుతోన్న సమాచారాన్ని బట్టి శాంసంగ్ కంపెనీ పైన పేర్కొన్న అన్ని ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఈవెంట్ రోజున మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది. దాంతో పాటు రానున్న రోజుల్లో ఈవెంట్ కు సంబంధించి శాంసంగ్ ఏమైనా హైలైట్స్ ను టీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే శాంసంగ్ నుంచి మరిన్ని ఆసక్తికర విషయాలను మనం ఆశించవచ్చన్న మాట. రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూద్దాం. ఏ విధంగా చూసినా, శాంసంగ్ బ్రాండ్ లవర్స్ కి మాత్రం ఆగస్టు 10 ఒక పండుగ రోజు కానుంది.

The post ఆగస్టు 10 న జరగనున్న శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2022 ఈవెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-to-feature-an-unknown-200-mp-isocell-sensor/ Tue, 19 Jul 2022 18:47:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=1090 హైలైట్స్: నెట్టింట్లో ప్రత్యక్షమైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా కెమెరా వివరాలు 200ఎంపి కెమెరాతో రానున్న ఎస్ 23 ఐసోసెల్ హెచ్పీ1, ఐసోసెల్ హెచ్పీ3 తర్వాత శాంసంగ్ నుంచి వస్తోన్న మూడో సెన్సర్ 200ఎంపి ఎగ్జినోస్ చిప్సెట్స్ తో పాటు, స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సర్ లను తయారు చేసే శాంసంగ్ యొక్క సెమీ కండక్టర్ డివిజన్ తాజాగా 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ3 సెన్సర్ ను లాంచ్ చేసింది. ఇది 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ1 యొక్క […]

The post 200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా కెమెరా వివరాలు
  • 200ఎంపి కెమెరాతో రానున్న ఎస్ 23
  • ఐసోసెల్ హెచ్పీ1, ఐసోసెల్ హెచ్పీ3 తర్వాత శాంసంగ్ నుంచి వస్తోన్న మూడో సెన్సర్ 200ఎంపి

ఎగ్జినోస్ చిప్సెట్స్ తో పాటు, స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సర్ లను తయారు చేసే శాంసంగ్ యొక్క సెమీ కండక్టర్ డివిజన్ తాజాగా 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ3 సెన్సర్ ను లాంచ్ చేసింది. ఇది 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ1 యొక్క ర్యాంప్ అప్ వర్షన్. రీసెంట్ గా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ కి సంబంధించిన 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ 1 సెన్సర్ ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు తాజా లీక్ ని బట్టి, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా సరికొత్త 200ఎంపి లెన్స్ తో రానున్నట్లు అర్థమవుతోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా తన ఫోటోగ్రఫీ పనితనానికి సర్వత్రా ప్రశంసలు అందుకుంది. మరింత మెరుగైన కెమెరా పనితనాన్ని ప్రదర్శించే హ్యాండ్సెట్ ను తీసుకురావడం ప్రస్తుతం శాంసంగ్ ముందున్న సవాలు. తాజాగా బయటకు వచ్చిన లీక్ ను బట్టి, ఎస్23 అల్ట్రా కు ఆ సత్తా ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో, ఓ లీక్ తెలిపిన దాన్ని బట్టి, ఎస్23 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 40ఎంపి సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుందని అనుకున్నారు.

Samsung Galaxy S23 Ultra 200ఎంపి కెమెరా

ఐస్ యూనివర్స్ ద్వారా గెలాక్సీ ఎస్23 అల్ట్రా యొక్క 200ఎంపి కెమెరా లైమ్ లైట్ లోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 200 ఎంపి గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లీక్ స్టర్ ఒక కీలకమైన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఐసోసెల్ హెచ్పీ1, ఐసోసెల్ హెచ్పీ3 అనే రెండు 200ఎంపి సెన్సర్లు మాత్రమే ఉన్నాయి. హెచ్పీ3 సెన్సర్ మోటోరోలా ఎడ్జ్30 అల్ట్రా ఫోన్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. హెచ్పీ3 మిడ్ రేంజ్ సెన్సర్. ఇది రానున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో మనకు కనిపించనుంది. షావోమీ 12టీ ప్రో కూడా 200ఎంపి కెమెరా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక హెచ్పీ1 సెన్సర్ లేదా హెచ్పీ3 సెన్సర్ లలో ఏ ఒక్కటీ కూడా గెలాక్సీ ఎస్23 అల్ట్రా లో ఉండదని లీక్ స్టర్ అంచనా. అంటే ఇంకా అనౌన్స్ కాని కొత్త సెన్సర్ తో గెలాక్సీ ఎస్23 అల్ట్రా రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ సెన్సర్ కెమెరా విషయంలో, మోటో ఎడ్జ్30 అల్ట్రా, గెలాక్సీ ఎస్22 అల్ట్రా కంటే బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక శాంసంగ్ తీసుకు రాబోతున్న ఆ మూడవ 200ఎంపి సెన్సర్ ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతో మొబైల్ ప్రేమికులు ఉన్నారు. అసలే ప్రెస్టీజియస్ ఎస్23 సిరీస్ కాబట్టి, హెచ్పీ1, హెచ్పీ3 సెన్సర్ ల కంటే అద్భుతంగా పెర్ఫామ్ చేసే సెన్సర్ నే శాంసంగ్ తీసుకువస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. రానున్న రోజుల్లో ఈ సెన్సర్ కు సంబంధించిన మరిన్ని లీకులు, వార్తలు బయటకు వచ్చే అవకాశముంది.

The post 200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>