Vivo X90 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 20 Oct 2023 10:41:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo X90 Pro ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-x90-pro-price-drop-india/ Fri, 20 Oct 2023 10:41:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=8488 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo ఈ ఏడాది ఏప్రిల్ లో X90 సిరీస్ ని లాంచ్ చేసింది. Vivo X90 సిరీస్ 6.78-ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 9200 చిప్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఐపీ68 రేటింగ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. Vivo X90 లైనప్ లో Vivo X90, Vivo X90 Pro డివైజెస్ […]

The post Vivo X90 Pro ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo X90 Pro పై రూ.10,000 తగ్గింపు
  • ప్రస్తుతం Vivo X90 Pro ధర రూ.74,999
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo ఈ ఏడాది ఏప్రిల్ లో X90 సిరీస్ ని లాంచ్ చేసింది. Vivo X90 సిరీస్ 6.78-ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 9200 చిప్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఐపీ68 రేటింగ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. Vivo X90 లైనప్ లో Vivo X90, Vivo X90 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా Vivo X90 Pro డివైజ్ ధరను కంపెనీ తగ్గించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo X90 Pro ధర తగ్గింపు

  • భారత్ లో Vivo X90 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ రూ.84,999 ధరతో లాంచ్ అయ్యింది. తాజాగా Vivo X90 Pro డివైజ్ ధరను రూ.10,000 వరకు తగ్గించారు.
  • ప్రస్తుతం భారత్ లో Vivo X90 Pro డివైజ్ ని రూ.74,999 కే కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 20 నుంచి అనగా నేటి నుంచి ఈ ఫోన్ కొత్త ధర అమలులో ఉంటుంది.
  • ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • రూ.10,000 క్యాష్‌బ్యాక్ లేదా ఎంపిక చేయబడిన బ్యాంక్స్ అందించే 24-నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం పొందవచ్చు.
  • అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ద్వారా రూ.8,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇంకా వీ-షీల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X90 Pro లో 6.78-ఇంచ్ క్యూ9 అల్ట్రా-విజన్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • ఓఎస్: Vivo X90 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ప్రాసెసర్: ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. 3.05 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది.
  • మెమొరీ: 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు.
  • కెమెరా: Vivo X90 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ సెన్సర్, 12ఎంపి ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్758 పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

The post Vivo X90 Pro ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
120W ఫాస్ట్ చార్జింగ్, 50MP ఐఎంఎక్స్989 సెన్సర్ తో లాంచైన Vivo X90 Pro https://www.91mobiles.com/telugu/vivo-x90-pro-launched-india-price-specs-availability/ Wed, 26 Apr 2023 13:27:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=6048 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో నేడు భారత్ లో Vivo X90 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. రెండు డివైజెస్ కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ లెన్స్ తో Vivo X90 Pro డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో మనం Vivo X90 Pro […]

The post 120W ఫాస్ట్ చార్జింగ్, 50MP ఐఎంఎక్స్989 సెన్సర్ తో లాంచైన Vivo X90 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Vivo X90 Pro మరియు Vivo X90
  • Carl Zeiss కెమెరా లెన్స్ తో వచ్చిన Vivo X90 Pro
  • 120W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో నేడు భారత్ లో Vivo X90 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. రెండు డివైజెస్ కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ లెన్స్ తో Vivo X90 Pro డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో మనం Vivo X90 Pro డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత గురించి తెలుసుకుందాం.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Vivo X90 Pro లో 6.78-ఇంచ్ క్యూ9 అల్ట్రా-విజన్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

చిప్సెట్, ఓఎస్, ర్యామ్

Vivo X90 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. 3.05 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా విభాగం

Vivo X90 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ సెన్సర్, 12ఎంపి ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్758 పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

Vivo X90 Pro ధర

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర రూ.84,999 గా ఉంది. లెజెండరీ బ్లాక్ కలర్ ఆప్షన్ లో ఈ ఫోన్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ తో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.8,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో రూ.8,000 డిస్కౌంట్ ని పొందవచ్చు. ఈ డివైజ్ ని మే 5 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120W ఫాస్ట్ చార్జింగ్, 50MP ఐఎంఎక్స్989 సెన్సర్ తో లాంచైన Vivo X90 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 26 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/vivo-x90-series-india-launch-date-official/ Mon, 17 Apr 2023 14:07:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5917 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ Vivo X90 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. భారత్ లో ఏప్రిల్ 26 న Vivo X90 సిరీస్ లాంచ్ కానుంది. ఎక్స్-సిరీస్ అనేది వివో సంస్థ యొక్క ఫ్లాగ్షిప్ లైనప్. ఈ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, పొట్రెయిట్ 2ఎక్స్ […]

The post ఏప్రిల్ 26 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 26 వ తేదీన భారత్ లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
  • లైనప్ లో రానున్న Vivo X90, Vivo X90 Pro
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ Vivo X90 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. భారత్ లో ఏప్రిల్ 26 న Vivo X90 సిరీస్ లాంచ్ కానుంది. ఎక్స్-సిరీస్ అనేది వివో సంస్థ యొక్క ఫ్లాగ్షిప్ లైనప్. ఈ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, లెదర్ బ్యాక్ ఫినిషింగ్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఈ సిరీస్ రానుంది.

Vivo X90 సిరీస్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ అనే మూడు మోడల్స్ ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం ప్లస్ వేరియంట్ ని లాంచ్ చేయడం లేదు.

భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ తేదీ

Vivo X90 సిరీస్ భారత్ లో ఏప్రిల్ 26 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. సిరీస్ లభ్యత, కచ్చితమైన ధర వివరాలు వచ్చే వారం లాంచ్ సందర్భంగా తెలియనున్నాయి.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Vivo X90 లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

మరోవైపు Vivo X90 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 పీపీఐ, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్

Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ ఉంటాయి.

ర్యామ్ మరియు స్టోరేజీ

Vivo X90 సిరీస్ లో 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉండనున్నాయి.

కెమెరా

Vivo X90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్866 మెయిన్ ఓఐఎస్, ఈఐఎస్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 12ఎంపి పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo X90 Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్866 మెయిన్ ఓఐఎష్, ఈఐఎస్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ మరియు సాఫ్ట్ వేర్

Vivo X90 డివైజ్ లో 4810 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

కనెక్టివిటీ

Vivo X90 సిరీస్ ఫోన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి. ఇంకా రెండు ఫోన్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఆప్ట్ఎక్స్ హెచ్డీ, హై-రెజ్ ఆడియో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 26 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్, టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/vivo-x90-series-teased-by-company-india-launch-imminent/ Thu, 13 Apr 2023 11:19:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=5869 గత కొన్ని రోజులుగా Vivo X90 సిరీస్ కి సంబంధించిన లీక్స్ మరియు సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ 26 న Vivo X90 Pro, Vivo X90 డివైజ్ లాంచ్ కానున్నాయని తాజాగా ఓ వార్త స్పష్టం చేసింది. అయితే వివో సంస్థ ఇంకా లాంచ్ ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈలోపు వివో తన సోషల్ మీడియా హ్యాండిల్ పై Vivo X90 సిరీస్ ని టీజ్ చేసింది. దీంతో త్వరలోనే భారతీయ […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్, టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo X90, Vivo X90 Pro
  • భారత్ కంటే ముందే చైనా మరియు మలేషియాలో లాంచైన సిరీస్
  • తన వెబ్‌సైట్ లో Vivo X90 సిరీస్ ని లిస్ట్ చేసిన కంపెనీ

గత కొన్ని రోజులుగా Vivo X90 సిరీస్ కి సంబంధించిన లీక్స్ మరియు సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ 26 న Vivo X90 Pro, Vivo X90 డివైజ్ లాంచ్ కానున్నాయని తాజాగా ఓ వార్త స్పష్టం చేసింది. అయితే వివో సంస్థ ఇంకా లాంచ్ ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈలోపు వివో తన సోషల్ మీడియా హ్యాండిల్ పై Vivo X90 సిరీస్ ని టీజ్ చేసింది. దీంతో త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ కానుందని స్పష్టమైంది.

Vivo X90 సిరీస్ టీజర్ వీడియో చూడండి

Vivo X90 టీజర్ వీడియో లో కనిపిస్తోన్న విధంగా త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుంది. వీడియో చివర్లో కూడా కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారు. ఈ టీజర్ లో కొన్ని పిక్స్ తో పాటు, కొన్ని ముఖ్యమైన ఫీచర్లు కూడా రివీల్ అయ్యాయి.

భారత్ కంటే ముందే ఈ దేశాల్లో లాంచైన Vivo X90 సిరీస్

గతేడాది నవంబర్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ డివైజెస్ చైనాలో లాంచ్ అయ్యాయి. తర్వాత Vivo X90, Vivo X90 Pro ఫోన్లు ఫిబ్రవరిలో మలేషియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. Vivo X90, Vivo X90 Pro డివైజెస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు.

Vivo X90, Vivo X90 Pro ధర (అంచనా)

Vivo X90 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా MYR 3699 (సుమారు రూ.70,000) ధరతో లాంచ్ అయ్యింది. మరోవైపు Vivo X90 Pro డివైజ్ MYR 4999 (సుమారు రూ.95,000) తో లాంచైంది. భారత్ లో కూడా ఈ ఫోన్ల ధరలు ఇదే విధంగా ఉంటాయని భావిస్తున్నారు.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే, చిప్సెట్

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్

Vivo X90, Vivo X90 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఫీచర్ వంటివి ఉంటాయి.

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. Vivo X90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. మరోవైపు Vivo X90 Pro ఒరిజిన్ఓఎస్ 3 పై పని చేస్తుంది. రెండు ఫోన్లు 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ సపోర్ట్ తో వస్తున్నాయి.

కెమెరా, బ్యాటరీ

  • 50ఎంపి ఐఎంఎక్స్989 సెన్సర్
  • 4870 ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo X90 లో 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్ ఉంటాయి. మరోవైపు Vivo X90 Pro లో 50ఎంపి ఐఎంఎక్స్989 సెన్సర్, 12ఎంపి ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి ఐఎంఎక్స్758 పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. రెండు ఫోన్లలో 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Vivo X90, Vivo X90 Pro డివైజెస్ లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ ఉంటాయి. Vivo X90 లో 4810 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెండు ఫోన్లు కూడా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. Vivo X90 Pro లో 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్, టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 9200 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo X90, Vivo X90 Pro https://www.91mobiles.com/telugu/vivo-x90-vivo-x90-pro-globally-launched-price-specs/ Sat, 04 Feb 2023 16:11:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=4784 2022 నవంబర్ లో చైనాలో లాంచైన Vivo X90 సిరీస్ తాజాగా గ్లోబల్ గా లాంచైంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు ఉన్నాయి. అవి: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+. అయితే Vivo X90 Pro+ మోడల్ మాత్రం చైనాకు మాత్రమే పరిమితం కానుంది. ఇక Vivo X90, Vivo X90 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్లు హై-గ్రేడ్ కెమెరాలు, ఫ్లాగ్షిప్ చిప్సెట్స్, అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీస్ […]

The post Dimensity 9200 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo X90, Vivo X90 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Vivo X90, Vivo X90 Pro
  • కొన్ని రోజుల పాటు చైనాకే పరిమితం కానున్న Vivo X90 Pro+ డివైజ్
  • Vivo X90 ప్రారంభ ధర MYR 3,699 (సుమారు రూ.70,000)

2022 నవంబర్ లో చైనాలో లాంచైన Vivo X90 సిరీస్ తాజాగా గ్లోబల్ గా లాంచైంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు ఉన్నాయి. అవి: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+. అయితే Vivo X90 Pro+ మోడల్ మాత్రం చైనాకు మాత్రమే పరిమితం కానుంది.

ఇక Vivo X90, Vivo X90 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్లు హై-గ్రేడ్ కెమెరాలు, ఫ్లాగ్షిప్ చిప్సెట్స్, అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీస్ తో వస్తోంది. రెండు డివైజెస్ కూడా వివిధ యూరోపియన్, ఏషియన్ మార్కెట్స్ తో పాటు ఇండియాలో కూడా లాంచ్ కానున్నాయి.

Vivo X90, Vivo X90 Pro ఫోన్లు అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, 50ఎంపి జీస్ ప్రైమరీ కెమెరాలు, డెడికేటెడ్ వీ2 చిప్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. సరే, ఓసారి Vivo X90, Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ల యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo X90, Vivo X90 Pro ధరలు, లభ్యత

Vivo X90, Vivo X90 Pro స్మార్ట్ ఫోన్లు నేడు మలేషియాలో లాంచ్ అయ్యాయి. అయితే 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ గల సింగిల్ వేరియంట్ లో మాత్రమే వచ్చాయి. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. Vivo X90 ధర MYR 3,699 (సుమారు రూ.70,000) గా ఉంది. Vivo X90 Pro ధర MYR 4,999 (సుమారు రూ.95,000) గా ఉంది. Vivo X90 బ్రీజ్ బ్లూ, ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుండగా, Vivo X90 Pro డివైజ్ కేవలం లెజెండ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుంది.

ముందుగా ఫోన్లను బుక్ చేసుకునే వారికి ఉచితంగా Vivo TWS Air ఇయర్ బడ్స్ తో పాటు, ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ లభించనుంది. ఈ ప్రొటెక్షన్ ప్లాన్ ద్వారా ఒక ఏడాది ఎక్స్‌టెండెడ్ ఫోన్ వ్యారంటీ, ఒక ఏడాది స్క్రీన్ క్రాక్ ప్రొటెక్షన్, ఒక ఏడాది బ్యాటరీ వ్యారంటీ లభించనుంది.

భారతదేశంలో Vivo X90, Vivo X90 Pro డివైజెస్ లాంచ్ అయిన తర్వాత ధరల వివరాలు తెలియనున్నాయి.

Vivo X90 స్పెసిఫికేషన్స్

Vivo X90 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ క్యూ9 అల్ట్రా-విజన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, హెచ్డీఆర్10+, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ ని కలిగి ఉంది. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి 4.0 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo X90 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ తో కూడిన 50ఎంపి సోని ఐఎంఎక్స్866 మెయిన్ సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ ఓఐఎస్ లెన్స్, 12ఎంపి 2x పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి.

Vivo X90 స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ 2.0 పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4810mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ డ్యూయల్ సెల్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Vivo X90 డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.4 మిల్లీ మీటర్ల మందం, 200 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ క్యూ9 అల్ట్రా-విజన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి. వీ2 ఐఎస్పీ చిప్ తో ఈ ఫోన్ వస్తోంది. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo X90 Pro డివైజ్ లో 1-ఇంచ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్758 పొట్రెయిట్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి కెమెరా ఇచ్చారు.

Vivo X90 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4870mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫ్లాష్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 8 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

Vivo X90 Pro డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.5 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.3 మిల్లీ మీటర్ల మందం, 214.85 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dimensity 9200 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo X90, Vivo X90 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-x90-pro-global-variant-specs-price-revealed-before-launch/ Mon, 30 Jan 2023 10:16:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=4685 ఫిబ్రవరి 3 న గ్లోబల్ గా Vivo X90 సిరీస్ లాంచ్ అవుతోంది. చైనాలో Vivo X90 సిరీస్ ని వివో సంస్థ గతేడాది లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ ఫోన్లు ఉన్నాయి. Vivo X90 Pro, Vivo X90 ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అవ్వనుండగా, Vivo X90 Pro+ మాత్రం కేవలం చైనాకే పరిమితమవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు Vivo X90 Pro […]

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 3 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోన్న Vivo X90 Pro
  • 50 మెగాపిక్సెల్ సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోన్న Vivo X90 Pro
  • 2కే అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోన్న Vivo X90 Pro డివైజ్

ఫిబ్రవరి 3 న గ్లోబల్ గా Vivo X90 సిరీస్ లాంచ్ అవుతోంది. చైనాలో Vivo X90 సిరీస్ ని వివో సంస్థ గతేడాది లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ ఫోన్లు ఉన్నాయి. Vivo X90 Pro, Vivo X90 ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అవ్వనుండగా, Vivo X90 Pro+ మాత్రం కేవలం చైనాకే పరిమితమవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు Vivo X90 Pro యొక్క గ్లోబల్ వేరియంట్ కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo X90 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కి సంబంధించిన ఒక లీక్ ని షేర్ చేశాడు. ఓసారి Vivo X90 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ హై-ఎండ్ కెమెరా, ఫ్లాగ్షిప్ చిప్సెట్ తో వస్తోంది. వచ్చే వారం ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు సమాచారం. లాంచ్ కి ముందు పారస్ గుగ్లాని Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ యొక్క కెమెరా వివరాలను లీక్ చేశాడు. ఈ ఫోన్ 50ఎంపి సోని ఐఎంఎక్స్ 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోంది. దీంతో పాటు 50ఎంపి సోని ఐఎంఎక్స్758 పొట్రెయిట్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా సెన్సర్స్ ఉంటాయి. జైస్ భాగస్వామ్యంతో కలిసి కెమెరా విభాగాన్ని వివో తీర్చిదిద్దింది.

సర్క్యులర్ మాడ్యూల్ లో కనిపించే ట్రిపుల్ కెమెరా సెటప్ కి T* కోటింగ్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ వివో వీ2 చిప్ తో వస్తోంది. దీని వల్లన ల్యాగ్ లేని కెమెరా పనితనాన్ని అనుభూతి చెందవచ్చు. ఈ వివో ఫ్లాగ్షిప్ ఫోన్ ఫ్రంట్ కెమెరా 5 కొత్త పొట్రెయిట్ మోడ్ ఫిల్టర్స్ తో వస్తోంది. 4కే సూపర్ నైట్ మోడ్ వీడియో సపోర్ట్ కూడా ఈ ఫోన్ కి ఉంది.

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. లెజెండ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో ఫోన్ లాంచ్ కానుంది. Vivo X90 Pro ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తుండటం విశేషం. ఇకపోతే ఈ ఫోన్ 9.34 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ భారీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తోంది. ఇది ఫోన్ హీట్ కాకుండా చూస్తుంది. పవర్ బ్యాకప్ కోసం Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. ఫోన్ బ్యాటరీ కేవలం 8 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది.

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ కర్వ్డ్ 2కే డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది.

Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ 12జిబి ర్యామ్, 256జిబి మోడల్ ధర ఆర్ఎమ్ 5,299 (సుమారు రూ.1,01,700) గా ఉంటుందని అంచనా. భారత్ లో ధర ఇంకా తక్కువగా ఉండనుంది. Vivo X90 సిరీస్ భారత లాంచ్ పై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 3 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Vivo X90, X90 Pro; లీకైన రిటైల్ బాక్స్ ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/vivo-x90-series-retail-box-leaked-before-launch/ Fri, 20 Jan 2023 06:00:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=4578 Vivo X90 సిరీస్ గతేడాది చైనాలో లాంచైంది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మూడింట్లో X90, X90 Pro ఫోన్లు మాత్రమే గ్లోబల్ గా లాంచ్ అవుతున్నాయి. Vivo X90 Pro సోని ఐఎంఎక్స్989 50ఎంపి 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోంది. అయితే వివో సంస్థ Vivo X90 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఈలోపు […]

The post ఫిబ్రవరి 3 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Vivo X90, X90 Pro; లీకైన రిటైల్ బాక్స్ ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo X90 సిరీస్ లైనప్ లో రానున్న Vivo X90, Vivo X90 Pro డివైజెస్
  • డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోన్న Vivo X90, Vivo X90 Pro
  • 1-inch కెమెరా సెన్సర్ Vivo X90 Pro ప్రత్యేకత

Vivo X90 సిరీస్ గతేడాది చైనాలో లాంచైంది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మూడింట్లో X90, X90 Pro ఫోన్లు మాత్రమే గ్లోబల్ గా లాంచ్ అవుతున్నాయి. Vivo X90 Pro సోని ఐఎంఎక్స్989 50ఎంపి 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోంది. అయితే వివో సంస్థ Vivo X90 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఈలోపు గ్లోబల్ లాంచ్ తేదీకి సంబంధించి ఒక కొత్త లీక్ బయటకు వచ్చింది.

ప్రముఖ టిప్ స్టర్ పారస్ గుగ్లాని తాజాగా Vivo X90 సిరీస్ యొక్క రిటైల్ బాక్స్ ఇమేజెస్ ని షేర్ చేశాడు. దీని ప్రకారం, జనవరి 27 నుంచి ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. ఇంకా ఫిబ్రవరి 3 నుంచి వివిధ మార్కెట్స్ లో ఫోన్లు లాంచ్ కానున్నాయి. భారత్ లో ఈ ఫోన్ల లాంచ్ తేదీని వివో ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Vivo X90 స్పెసిఫికేషన్స్

Vivo X90 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. పంచ్-హోల్ తో కూడిన ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo X90 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఇది ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ ని కలిగి ఉంది.

గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో Immortalis-G715 GPU వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ LPPDDR5 RAM, UFS 4.0 స్టోరేజీ టెక్నాలజీపై పని చేస్తుంది. Vivo X90 5G లో 50MP Sony IMX866 ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది F/1.75 అపర్చర్ కలిగి ఉంది. ఇంకా 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ (F/2.0), 12MP పొట్రెయిట్ లెన్స్ (F/1.98) తో కలిపి బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 32MP (F/2.45) కెమెరా అందించారు.

Vivo X90 5G డ్యూయల్ మోడల్ 5జీ, డ్యూయల్ 4జీ వోల్టీ సపోర్ట్ కలిగి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కొత్త తరం USB Type-C 3.2 Gen1 తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ తో వస్తోంది. గ్రాఫిక్స్ కోసం Immortalis G715 GPU ని వాడారు. Vivo X90 Pro 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo X90 Pro లో 4,870 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్ మరియు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Vivo X90 Pro లో 50 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్, ఓఐఎస్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి పొట్రెయిట్ సెన్సర్ (2x ఆప్టికల్ జూమ్), 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Vivo X90 Pro లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 3 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Vivo X90, X90 Pro; లీకైన రిటైల్ బాక్స్ ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు https://www.91mobiles.com/telugu/vivo-x90-series-price-specs-launch-timeline/ Wed, 11 Jan 2023 12:15:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=4433 హైలైట్స్ జనవరి 31 న మలేషియాలో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్ అదే రోజున Vivo X90 సిరీస్ ఫోన్లు భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోన్న Vivo X90 సిరీస్ ఫోన్లు తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 ని చైనాలో లాంచ్ చేసిన వివో సంస్థ ఇప్పుడు ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందే […]

The post గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 31 న మలేషియాలో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
  • అదే రోజున Vivo X90 సిరీస్ ఫోన్లు భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోన్న Vivo X90 సిరీస్ ఫోన్లు

తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 ని చైనాలో లాంచ్ చేసిన వివో సంస్థ ఇప్పుడు ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందే Vivo X90 యొక్క ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

టిప్ స్టార్ పారస్ గుగ్లాని సౌజన్యంతో Newzonly.com వెలువరించిన రిపోర్ట్ ప్రకారం, Vivo X90 సిరీస్ మలేషియన్ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే Vivo X90 Pro+ మాత్రం గ్లోబల్ గా లాంచ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈసారి కేవలం Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ మాత్రమే గ్లోబల్ గా ఎంట్రీ ఇవ్వనున్నాయట.

సరే ఓసారి, Vivo X90 సిరీస్ యొక్క ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo X90 ధర, కలర్ ఆప్షన్స్, స్టోరేజీ

రిపోర్ట్ ప్రకారం Vivo X90 యొక్క స్టాండర్ వేరియంట్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.69,170) గా ఉంటుందని, Vivo X90 Pro ధర 5,299 యువాన్లు (సుమారు రూ.98,975) ఉంటుందని సమాచారం. స్టాండర్డ్ మోడల్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: బ్రీజ్ బ్లూ మరియు ఆస్టరాయిడ్ బ్లాక్. మరోవైపు, Vivo X90 Pro లెజెండరీ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానున్నాయి.

Vivo X90 లాంచ్ తేదీ, లభ్యత

ఒక రిపోర్ట్ ప్రకారం, Vivo X90 సిరీస్ 2023 జనవరి 31 న మలేషియన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఇక ఫిబ్రవరి 2 నుంచి సేల్ ప్రారంభం కానుంది. జనవరి 31 వ తేదీనే భారత్ లో కూడా Vivo X90 సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50+12+12 కెమెరా సెటప్ (వివో ఎక్స్90)
  • 50+50+12 కెమెరా సెటప్ (వివో ఎక్స్90 ప్రో)
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Vivo X90 సిరీస్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ కెమెరా సెంట్రిక్ ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నాయి. Vivo X90 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. మరోవైపు Vivo X90 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా 32ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్నాయి.

Vivo X90 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో రానున్నాయి. వీటిలో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్, QHD+ LTPO 4.0 అమోలెడ్ డిస్ప్లేతో లాంచ్ అయిన Vivo X90 Pro+ https://www.91mobiles.com/telugu/vivo-x90-pro-plus-launched-price-specs/ Wed, 23 Nov 2022 08:47:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=3605 హైలైట్స్ చైనాలో లాంచ్ అయిన Vivo X90 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 6.78-ఇంచ్ క్యూహెచ్డీ+ ఎల్టీపీవో 4.0 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ తో లాంచ్ అయిన Vivo X90 Pro+ Vivo X90 Pro+ స్మార్ట్ ఫోన్ ధర RMB 6499 (సుమారు రూ.74,400) నుంచి ప్రారంభం ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 లైనప్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ […]

The post Snapdragon 8 Gen 2 చిప్, QHD+ LTPO 4.0 అమోలెడ్ డిస్ప్లేతో లాంచ్ అయిన Vivo X90 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన Vivo X90 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • 6.78-ఇంచ్ క్యూహెచ్డీ+ ఎల్టీపీవో 4.0 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ తో లాంచ్ అయిన Vivo X90 Pro+
  • Vivo X90 Pro+ స్మార్ట్ ఫోన్ ధర RMB 6499 (సుమారు రూ.74,400) నుంచి ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 లైనప్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ డివైజెస్ ఉన్నాయి. ఈ సిరీస్ కోసం వివో లవర్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. వారి వెయిటింగ్ కి తెరపడినట్లైంది. అయితే ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. త్వరలోనే భారతగడ్డపై కూడా Vivo X90 సిరీస్ అడుగుపెట్టనుంది.

Vivo X90 Pro+ డివైజ్ లేటెస్ట్ సిరీస్ లో టాప్-ఎండ్ ఫోన్ గా నిలుస్తోంది. ఇందులో మాత్రమే స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ జనరేషన్ చిప్ ని వాడటం జరిగింది. మిగతా రెండు మోడల్స్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ వాడారు. ఇకపోతే Vivo X90 Pro+ డివైజ్ క్యూహెచ్డీ+ ఎల్టీపీవో 4.0 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెస్ట్ రేషియో తో లాంచ్ అయ్యింది. పూర్తి స్పెసిఫికేషన్స్ ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Vivo X90 Pro+ స్పెసిఫికేషన్స్

Vivo X90 Pro+ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వాడారు. 6.78-ఇంచ్ క్యూహెచ్డీ+ ఎల్టీపీవో 4.0 అమోలెడ్ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్, డాల్బి విజన్, 517 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10+, డీసీ డిమ్మింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo X90 Pro+ లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo X90 Pro+ లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 164.3 మిల్లీ మీటర్ల పొడవు, 75.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.7 మిల్లీ మీటర్ల మందం, 220 గ్రాముల బరువు ఉంటుంది. అలాగే ఈ డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింట్ తో వస్తోంది.

ఇప్పుడు Vivo X90 Pro+ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 1-ఇంచ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్989 సెన్సర్, 50ఎంపి సోని ఐఎంఎక్స్758 పొట్రెయిట్ సెన్సర్, 48ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 64ఎంపి OV64B40 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 చిప్, QHD+ LTPO 4.0 అమోలెడ్ డిస్ప్లేతో లాంచ్ అయిన Vivo X90 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
6.78-inch 120Hz డిస్ప్లే, Dimensity 9200 ప్రాసెసర్ తో లాంచ్ అయిన Vivo X90 Pro https://www.91mobiles.com/telugu/vivo-x90-pro-launched-china-price-specs/ Wed, 23 Nov 2022 07:14:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=3601 హైలైట్స్ చైనాలో లాంచ్ అయిన వివో ఎక్స్-90 సిరీస్ ఫోన్లు టాప్-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చిన Vivo X90 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, 2కే అమోలెడ్ డిస్ప్లే, 452 పీపీఐ, హెచ్డీఆర్10+ తో వచ్చిన Vivo X90 Pro Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ Vivo X90 సిరీస్ Vivo X80 సిరీస్ కి సక్సెసర్ గా వచ్చింది. Vivo X90, Vivo […]

The post 6.78-inch 120Hz డిస్ప్లే, Dimensity 9200 ప్రాసెసర్ తో లాంచ్ అయిన Vivo X90 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన వివో ఎక్స్-90 సిరీస్ ఫోన్లు
  • టాప్-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చిన Vivo X90 సిరీస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, 2కే అమోలెడ్ డిస్ప్లే, 452 పీపీఐ, హెచ్డీఆర్10+ తో వచ్చిన Vivo X90 Pro

Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ Vivo X90 సిరీస్ Vivo X80 సిరీస్ కి సక్సెసర్ గా వచ్చింది. Vivo X90, Vivo X90 Pro డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ తో వచ్చాయి. Vivo X90 Pro+ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్లు మూడు కూడా అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో వచ్చాయి.

Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నాయి. ఈ అన్ని మోడల్స్ లో కూడా 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా అమర్చబడి ఉన్నాయి. 3 స్మార్ట్ ఫోన్స్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్నాయి. Vivo X90 సిరీస్ Zeiss ఆప్టిక్స్ తో వస్తోంది. ప్రో-మోడల్స్ లో లెదర్ ఫినిష్ బ్యాక్ ఉండనుంది. అలాగే ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఏఐ టాస్క్స్ కోసం వివో వీ2 చిప్ ఉంది.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ తో వస్తోంది. గ్రాఫిక్స్ కోసం Immortalis G715 GPU ని వాడారు. Vivo X90 Pro 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo X90 Pro లో 4,870 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్ మరియు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. Vivo X90 Pro డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.5 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.3 మిల్లీ మీటర్ల మందం, 215 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా హై-రెజుల్యూషన్ ఆడియో, aptX-HD వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo X90 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo X90 Pro లో 50 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్, ఓఐఎస్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి పొట్రెయిట్ సెన్సర్ (2x ఆప్టికల్ జూమ్), 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Vivo X90 Pro లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Vivo X90 Pro ధర

Vivo X90 Pro 8జిబి + 256జిబి మోడల్ ధర RMB 4999 (సుమారు రూ.57,200) గా ఉంది. ఇక 12జిబి + 256జిబి యూనిట్ ధర RMB 5499 (సుమారు రూ.63,000), 12జిబి + 512జిబి వేరియంట్ ధర RMB 5999 (సుమారు రూ.68,700) గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6.78-inch 120Hz డిస్ప్లే, Dimensity 9200 ప్రాసెసర్ తో లాంచ్ అయిన Vivo X90 Pro first appeared on 91Mobiles Telugu.

]]>