Honor: లీకైన Honor 200, 200 Pro చిప్సెట్, చార్జింగ్ స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో Honor 200 సిరీస్ లాంచ్
  • 3సీ పై లిస్టైన హానర్ 200, 200 ప్రో
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నుంచి త్వరలో హానర్ 200 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Honor 200, Honor 200 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ రెండు ఫోన్లు 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ డివైజెస్ యొక్క చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. మరొక లీక్ ద్వారా చిప్సెట్ వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Honor 200 సిరీస్ 3సీ సర్టిఫికేషన్ వివరాలు

Honor 200 సిరీస్ 3సీ సర్టిఫికేషన్ పై ELP-AN00 మరియు ELI-AN00 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని Gizmochina వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలిపింది. అయితే ఈ రెండింట్లో బేస్ మోడల్, ప్రో-మోడల్ ఏదో తెలియదు.

అయితే 3సీ లిస్టింగ్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. Honor 200 ఫోన్లు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Honor 200 సిరీస్ చిప్సెట్ వివరాలు

చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై ఓ యూజర్ Honor 200 సిరీస్ యొక్క చిప్సెట్ వివరాలను షేర్ చేశారు.

Honor 200 డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు Honor 200 Pro ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

Honor 200 సిరీస్ కెమెరా ఐల్యాండ్ అప్‌గ్రేడ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ప్రైమరీ కెమెరా వేరియబుల్ అపర్చర్, ఓఐఎస్ ఫీచర్లతో వస్తోంది. దీనికి తోడు ఒక టెలీఫోటో లెన్స్ కూడా ఉండనుంది.

వీబో ప్లాట్ఫామ్ పై మరొక యూజర్ Honor 200 సిరీస్ డ్యూయల్ సెల్పీ కెమెరాలు, క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలిపారు.

ఇటీవలె లాంచైన Honor 200 Lite 1.5కే డిస్ప్లే, పిల్-షేప్డ్ నాచ్ తో వచ్చింది. ఓసారి ఆ స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Honor 200 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor 200 Lite లో 6.7-ఇంచ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్) ఉన్నాయి.

ప్రాసెసర్: Honor 200 Lite లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

మెమొరీ: Honor 200 Lite డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

బ్యాటరీ: Honor 200 Lite లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor 200 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Honor 200 Lite లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.