Ola Electric - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Dec 2022 12:29:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం https://www.91mobiles.com/telugu/ola-electric-announces-year-end-offers/ Thu, 08 Dec 2022 12:29:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=3889 హైలైట్స్ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ 10 స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్న ఓలా ఎలక్ట్రిక్, రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా రూ.4500 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం డ్రా ద్వారా ఎంపికైన వారికి స్కూటర్లు గెలుచుకునే అవకాశం Ola Electric పలు ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్స్ కస్టమర్లకు లభించనున్నాయి. కొత్త ఆఫర్లను చూస్తే, జీరో డౌన్ పేమెంట్, లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓలా […]

The post Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్
  • 10 స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్న ఓలా ఎలక్ట్రిక్, రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా రూ.4500 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం
  • డ్రా ద్వారా ఎంపికైన వారికి స్కూటర్లు గెలుచుకునే అవకాశం

Ola Electric పలు ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్స్ కస్టమర్లకు లభించనున్నాయి. కొత్త ఆఫర్లను చూస్తే, జీరో డౌన్ పేమెంట్, లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓలా ఫాస్ట్ చార్జర్ నెట్వర్క్ కి ఉచిత యాక్సెస్, ఏడాది పాటు ఉచిత సర్వీసింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభించనుంది. డ్రా లో భాగంగా 10 ఎలక్ట్రిక్ స్కూటర్లను గెలుచుకోవచ్చు. ఇందుకోసం మీరు మీకు సమీపంలోని ఓలా అథరైజ్డ్ షోరూమ్స్ లో టెస్ట్ రైడ్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీని ద్వారా కస్టమర్లు రూ.4,500 క్యాష్‌బ్యాక్ పొందుతారు. వారు చేయల్సిందల్లా Ola S1 లేదా Ola S1 Pro వాహనాలను మరొక ముగ్గురికి రిఫర్ చేయడమే. దీంతో రూ.4500 క్యాష్ బ్యాక్ మీ సొంతం అవుతుంది.

ఈ ఏడాది చివరి వరకు ఆఫర్లు చెల్లుబాటు అవుతాయి. అంతే 2022 డిసెంబర్ 31 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. రీసెంట్ గా లాంచ్ అయిన Ola S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ కి కూడా ఈ ఆఫర్స్ వర్తిస్తాయా లేదా అన్నది ఇంకా తెలియదు. కంపెనీ నుంచి కూడా ఎటువంటి ప్రకటన లేదు.

Ola S1 Pro, Ola S1 Pro లపై ఇయర్-ఎండ్ ఆఫర్స్

ఓలా ఎలక్ట్రిక్ రూ.3,499 విలువగల పూర్తి ఉచిత సర్వీస్ ని ఏడాది పాటు Ola S1, Ola S1 Pro స్కూటర్లపై అందిస్తోంది. ఓలా ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. 2022 సెప్టెంబర్ లో పరిచయం చేసిన రూ.10,000 డిస్కౌంట్ ఆఫర్ ని ఇంకొన్ని రోజులపాటు కొనసాగించాలని ఓలా భావిస్తోంది. అలాగే Ola S1 Pro పై తగ్గించిన ధర 2022 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

భారత్ లో ప్రస్తుతం Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.1,29,000 గా ఉంది. Ola S1, Ola S1 Pro లపై ఓలా ఎలక్ట్రిక్ జీరో డౌన్‌పేమెంట్ మరియు జీరో ప్రాసెసింగ్ ఫీ స్కీమ్ ని ఆఫర్ చేస్తోంది. తగ్గించిన వడ్డీ రేట్ల మూలంగా ఈఎంఐ కూడా రూ.2,499 కి తగ్గిపోనుంది. మీరు గనుక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తుంటే, ఓసారి ఓలా ఎలక్ట్రిక్ తన వాహనశ్రేణిపై అందిస్తోన్న వివిధ ఆఫర్లను చెక్ చేయండి. అలాగే ఓలా అందిస్తోన్న ఫీచర్లను కూడా ఇతర ఎలక్ట్రిక్ బండ్లతో పోల్చి చూసి సరైన దాన్ని ఎంపిక చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
MoveOS 3 Beta అప్డేట్ తో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త ఫీచర్లు https://www.91mobiles.com/telugu/ola-s1-move-os-3-beta-update-new-features/ Tue, 01 Nov 2022 15:01:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=3183 హైలైట్స్ S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి లేటెస్ట్ అప్డేట్ ని రోలౌట్ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్ MoveOS 3 Beta అప్డేట్ తో ఎనేబుల్ కానున్న ప్రాక్సిమిటీ ఆటోమేటిక్ అన్-లాక్ ఫీచర్ పార్టీ మోడ్, అదనపు రైడర్ ప్రొఫైల్స్ వంటి ఎన్నో ఫీచర్లతో వచ్చిన MoveOS 3 Beta అప్డేట్ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ MoveOS అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఎన్నో అదనపు ఫీచర్లు ఎనేబుల్ కానున్నాయి. MoveOS […]

The post MoveOS 3 Beta అప్డేట్ తో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి లేటెస్ట్ అప్డేట్ ని రోలౌట్ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్
  • MoveOS 3 Beta అప్డేట్ తో ఎనేబుల్ కానున్న ప్రాక్సిమిటీ ఆటోమేటిక్ అన్-లాక్ ఫీచర్
  • పార్టీ మోడ్, అదనపు రైడర్ ప్రొఫైల్స్ వంటి ఎన్నో ఫీచర్లతో వచ్చిన MoveOS 3 Beta అప్డేట్

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ MoveOS అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఎన్నో అదనపు ఫీచర్లు ఎనేబుల్ కానున్నాయి. MoveOS 3.0 beta వర్షన్ తో Ola S1 యూనిట్స్ ఇప్పుడు ప్రాక్సిమిటీ అన్‌లాక్, కొత్త పార్టీ మోడ్, మరిన్ని రైడర్ ప్రొఫైల్స్ వంటి పీచర్లు పొందనున్నాయి. యూజర్లు తమ Ola S1 స్కూటర్ల డ్యాష్ బోర్డ్ ని కొత్త థీమ్స్ తో ఆకర్షణీయంగా మార్చేయవచ్చు. అలాగే కొత్త ఈ-స్కూటర్ సౌండ్స్ కూడా ఈ తాజా అప్డేట్ తో వస్తున్నాయి.

పేరులో ఉన్నట్లుగానే ప్రస్తుతం ఈ MoveOS బీటా ఫేస్ పై ఉంది. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వారికి మాత్రమే యాక్సెస్ లభిస్తుంది. అఫీషియల్ MoveOS3 ల్యాండింగ్ పేజీకి వెళ్ళి బీటా యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేయండి. అందుకోసం మీరు మీ యొక్క Ola S1 బండితో అసోసియేట్ అయి ఉన్న ఫోన్ నంబర్ ని నమోదు చేయాల్సి ఉంటుంది. MoveOS 3 beta వర్షన్ ప్రస్తుతానికి Ola S1 యూనిట్స్ కి మాత్రమే పరిమితం. రీసెంట్ గా లాంచ్ అయిన Ola S1 Air కి అందుబాటులో లేదన్న విషయం గమనించాలి.

ట్విట్టర్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రోలౌట్ ని ప్రకటించింది. దాంతో సాఫ్ట్‌వేర్ అప్డేట్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వెహికిల్స్ కి ఎలా రీచ్ అవుతుందో అర్థమైంది. MoveOS 3 beta అప్డేట్ ని విడతల వారీగా రోలౌట్ చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది. స్టేబుల్ వర్షన్ వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అటు తర్వాత, అన్ని Ola S1 యూనిట్స్ కి MoveOS 3 అప్డేట్ యాక్సెస్ లభిస్తుంది.

MoveOS 3 అప్డేట్ ద్వారా Ola S1 డ్యాష్ బోర్డ్స్ కి కొత్త కస్టమైజేషన్ ఆప్షన్స్ రానున్నాయి. కొత్త సౌండ్స్ తో పాటు పలు ఇతర కొత్త ఫీచర్లు జత చేరనున్నాయి. వాటిలో ప్రాక్సిమిటీ అన్‌లాక్, పార్టీ మోడ్ ఫీచర్లు ముఖ్యమైనవి.

MoveOS 3 Beta – కొత్త ఫీచర్లు

MoveOS 3 Beta అప్డేట్ లో హైలైట్ ఏంటంటే అది ‘ప్రాక్సిమిటీ అన్‌లాక్ ఫీచర్’. ఈ అప్డేట్ తో Ola S1 ఓనర్లు తమ స్కూటర్స్ ని వాటి సమీపంలోకి వెళ్తే చాలు అవి అన్‌లాక్ అయిపోతాయి. యూజర్స్ యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ఫీచర్ వర్కవుట్ అవుతుంది. దగ్గరకు వెళ్ళగానే బండి అన్ లాక్ అయిపోయి రైడ్ కి సిద్ధంగా ఉంటుంది. అలాగే బండి ఓనర్ దూరంగా వెళ్ళగానే స్కూటర్ లాక్ అవుతుంది.

MoveOS 3 Beta అప్డేట్ ద్వారా మల్టీపుల్ రైడర్ ప్రొఫైల్స్ ఆప్షన్ జతచేరుతోంది. బండి ఓనర్స్ తమ స్కూటర్ ని ఇతరులకు ఇచ్చినప్పుడు డిఫరెంట్ ప్రొఫైల్ ని సెట్ చేసి, రైడ్స్ ని ట్రాక్ చేసే అవకాశం ఉంది. స్కూటర్ ని రైడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా డ్యాష్ బోర్డ్ స్క్రీన్ ద్వారా రిప్లైస్ ఇచ్చే ఫీచర్ కూడా ఈ అప్డేట్ తో వస్తోంది.

ఇక పార్టీ మోడ్ సాయంతో Ola S1 యొక్క అన్ని లైట్స్ ని సింక్రనైజ్ అవుతాయి. అలాగే ఏకకాలంలో సంగీతం కూడా ప్లే అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్ చార్జింగ్ సాయంతో 15 నిమిషాల పాటు చార్జ్ చేస్తే, 50 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని ఓలా ఎలక్ట్రిక్ చెబుతోంది. ఈ అప్డేట్ నిజంగా ఆహ్వానించదగినది. ఇక బ్రేక్ వేసినప్పుడు బండి బ్యాటరీ చార్జ్ అయ్యే విధంగా 3 విభిన్న రెజెన్ మోడ్స్ ని ఈ నయా అప్డేట్ తీసుకొస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MoveOS 3 Beta అప్డేట్ తో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
చౌకైన Electric Scooter ని లాంచ్ చేసిన Ola https://www.91mobiles.com/telugu/ola-s1-air-launched-india-price-specifications/ Tue, 25 Oct 2022 13:32:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=3056 హైలైట్స్ చీపెస్ట్ ఈ-స్కూటర్ Ola S1 Air ని లాంచ్ చేసిన Ola Electric 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 101 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చిన Ola S1 Air మిస్ అయిన బాడీ కలర్ ప్యానెల్స్, డిస్క్ బ్రేక్స్, అల్యూమినియమ్ గ్య్రాబ్ రెయిల్స్ చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 Air ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. సరికొత్త Ola S1 Air, Ola S1 కంటే చీపెస్ట్ […]

The post చౌకైన Electric Scooter ని లాంచ్ చేసిన Ola first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చీపెస్ట్ ఈ-స్కూటర్ Ola S1 Air ని లాంచ్ చేసిన Ola Electric
  • 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 101 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చిన Ola S1 Air
  • మిస్ అయిన బాడీ కలర్ ప్యానెల్స్, డిస్క్ బ్రేక్స్, అల్యూమినియమ్ గ్య్రాబ్ రెయిల్స్

చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 Air ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. సరికొత్త Ola S1 Air, Ola S1 కంటే చీపెస్ట్ స్కూటర్. దానికి తగినట్లే పలు మార్పులు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. కాస్ట్ కట్టింగ్ అనేది అనువణువుగా కనిపించింది. తక్కువ ధరకు స్కూటర్ ని అందించాలనే ఉద్దేశ్యంతో బెంగళూరు స్టార్టప్ అయిన ఓలా ఎలక్ట్రిక్ పలు ఫీచర్లను కట్ చేసింది. మరి Ola S1 Air విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Ola S1 Air ధర, లభ్యత

Ola S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ నుంచి వచ్చిన చీపెస్ట్ ఆఫరింగ్. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరని రూ.79,999 గా నిర్ణయించారు. అయితే ఇది పరిమితకాల ఆఫర్ అని గుర్తించాలి. అతి త్వరలో దీని ధర రూ.84,999 కి చేరుకుంటుంది. ఇప్పుడు ఈ స్కూటర్ ని బుక్ చేసుకునే వారికి ఓలా 2023 ప్రథమార్థం నుంచి డెలివరీ చేయడం మొదలు పెడుతుంది.

Ola S1 Air స్పెసిఫికేషన్స్

Ola S1 Air డిజైన్ చూస్తే గత మోడల్స్ మాదిరే కనిపిస్తోంది. కానీ, పలు మార్పులను గమనించవచ్చు. ఫ్లోర్ బోర్డ్ ఫ్లాట్ గా మారిపోయింది. ఇంకా సీటు క్రింద బూట్ స్పేస్ ని 2 లీటర్లు తగ్గించారు. దీంతో మొత్తం బూట్ స్పేస్ 34 లీటర్లకు చేరుకుంది. స్కూటర్ క్రింది భాగాలు పెయింట్ చేయబడని ప్లాస్టిక్ ఫినిషింగ్ తో వస్తున్నాయి. సింగిల్ పీస్ గ్య్రాబ్ రెయిల్ అందించారు. సింపుల్ గా కనిపించే విధంగా స్కూటర్ ని డిజైన్ చేశారు.

Ola S1 Air లో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీన్ని పూర్తిగా చార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ మోటర్ 4.5 కిలోవాట్ పీక్ పవర్ ని జనరేట్ చేస్తుంది. ఇకపోతే ఈ స్కూటర్ 4.3 సెకన్లలో 0 నుంచి 43 కేఎంపీహెచ్ స్పీడ్ ని అందుకుంటుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 85కేఎంపీహెచ్. Ola S1 Air సింగిల్ చార్జ్ పై 101 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది.

Ola S1 Air లో ఫ్యాన్సీ రైడ్ మోడ్స్ ని తీసివేశారు. కేవలం ఇకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్స్ ని అందించారు. అయితే Ola S1 Air లో 7-ఇంచ్ టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ ని అందించడం విశేషం. ఈ టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ Move OS 3.0 సాఫ్ట్ వేర్ పై పని చేస్తుంది. Ola S1 Air లో రివర్స్ మోడ్, హిల్-హోల్డ్ ఫంక్షనాలిటీ, యూజర్ ప్రొఫైల్స్ ని అందించారు.

Ola S1 Air చౌకైన స్టీల్ వీల్స్ తో వస్తోంది. అయితే డిజైన్ అట్రాక్టివ్ గానే ఉంది. Ola S1 Air బేసిక్ ట్విన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్సార్బర్స్ ని కలిగి ఉంది. Ola S1 Air లో ముందు వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది. Ola S1 Air యొక్క మొత్తం బరువు 99 కిలోలు. Ola S1, Ola S1 Pro తో పోల్చితే ఇది చాలా తేలికగా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post చౌకైన Electric Scooter ని లాంచ్ చేసిన Ola first appeared on 91Mobiles Telugu.

]]>
Ola S1 Pro దీపావళి ఆఫర్: డిస్కౌంట్ గడువు తేదీని పొడిగించిన Ola https://www.91mobiles.com/telugu/ola-electric-extends-discount-offer-on-ola-s1-pro-till-diwali/ Tue, 18 Oct 2022 06:35:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=2937 హైలైట్స్ Ola S1 Pro పై నవరాత్రి డిస్కౌంట్ రూ.10,000 ని దీపావళి వరకు పొడిగించిన ఓలా సేల్ సందర్భంగా డిస్కౌంట్ ధర రూ.1,30,000 కి లభించనున్న Ola S1 Pro ఐదు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ ప్యాకేజీ పై రూ.1500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న ఓలా Ola Electric ఇటీవలె నవరాత్రి డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఏంటంటే, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. జనాల […]

The post Ola S1 Pro దీపావళి ఆఫర్: డిస్కౌంట్ గడువు తేదీని పొడిగించిన Ola first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Ola S1 Pro పై నవరాత్రి డిస్కౌంట్ రూ.10,000 ని దీపావళి వరకు పొడిగించిన ఓలా
  • సేల్ సందర్భంగా డిస్కౌంట్ ధర రూ.1,30,000 కి లభించనున్న Ola S1 Pro
  • ఐదు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ ప్యాకేజీ పై రూ.1500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న ఓలా

Ola Electric ఇటీవలె నవరాత్రి డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఏంటంటే, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. జనాల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో, ఈ నవరాత్రి ఆఫర్ ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అసలైతే, Ola S1 Pro డిస్కౌంట్ ఆఫర్ 2022 అక్టోబర్ 5 తో ముగియాల్సి ఉంది. కానీ, దీపావళి వరకు పొడిగించారు. ఈ బండిని కొనుగోలు చేసే వారికి ఇదొక సదవకాశమని చెప్పాలి.

భారత్ లో Ola S1 Pro బండి ధర, ఆఫర్లు

Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని అనుకుంటున్న కస్టమర్లకు రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీపావళి వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ ప్యాకేజీ పై రూ.1500 డిస్కౌంట్ ని కూడ ఓలా అందిస్తోంది. అలాగే స్టాండర్డ్ వర్షన్ అయిన Ola S1 స్కూటర్ ఇంట్రడక్టరీ ధర (రూ.99,999 ఎక్స్-షోరూమ్) ను కూడా ఓలా ఎక్స్‌టెండ్ చేసింది.

మరోవైపు Ola S1 Pro రూ.1,40,000 (ఎక్స్-షోరూమ్) కి సేల్ అవుతోంది. రూ.10,000 డిస్కౌంట్ తో ఈ స్కూటర్ రూ.1,30,000 (ఎక్స్-షోరూమ్) కి లభిస్తుంది. ఫెస్టివ్ సీజన్ ఆఫర్ లో భాగంగా, ఓలా కంపెనీ లోన్స్ పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ తీసుకోవడం లేదు. అలాగే లోన్ వడ్డీ రేటు 8.99 శాతంగా ఉంది.

Ola S1 Pro, Ola S1 స్పెసిఫికేషన్స్

Ola S1 Pro 4 కిలోవాట్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఈ బండి సింగిల్ చార్జ్ పై 181 కిలోమీటర్లు పరిగెడుతుంది. Ola S1 Pro 11.3బీహెచ్‌పీ హార్స్‌పవర్, 58ఎన్ఎం పీక్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. మరోవైపు Ola S1 బండి 3 కిలోవాట్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 141 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. Ola S1 11.3 బీహెచ్2పి హార్స్‌పవర్, 58ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. Ola S1 Pro మరియు Ola S1 స్కూటర్లు 7.0-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తున్నాయి. ఈ క్లస్టర్ Move OS 2.0 సాఫ్ట్‌వేర్ పై పని చేస్తుంది.

అక్టోబర్ 22 న ఓలా ఎలక్ట్రిక్ దీపావళి ఈవెంట్ ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో కంపెనీ నుంచి మరింత తక్కువ ధర కలిగిన Ola S1 వేరియంట్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలె కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ టీజ్ చేశారు. దీంతో రాబోవు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై హైప్ పెరిగింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Ola S1 Pro దీపావళి ఆఫర్: డిస్కౌంట్ గడువు తేదీని పొడిగించిన Ola first appeared on 91Mobiles Telugu.

]]>
దీపావళి రోజున లాంచ్ అవుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/ola-s1-affordable-e-scooter-to-launch-this-diwali/ Fri, 07 Oct 2022 14:41:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=2802 హైలైట్స్: దీపావళి రోజున కొత్త చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ రీసెంట్ గా ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన Ola సీఈవో భవీశ్ అగర్వాల్ సెప్టెంబర్ లో 9,634 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మిన ఓలా కంపెనీ భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మే కంపెనీల్లో Ola Electric కూడా ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఒక ఈ-స్కూటర్ ని తీసుకొస్తొంది. ఓలా సీఈవో భవీశ్ చేసిన ట్వీట్ […]

The post దీపావళి రోజున లాంచ్ అవుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • దీపావళి రోజున కొత్త చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్
  • రీసెంట్ గా ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన Ola సీఈవో భవీశ్ అగర్వాల్
  • సెప్టెంబర్ లో 9,634 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మిన ఓలా కంపెనీ

భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మే కంపెనీల్లో Ola Electric కూడా ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఒక ఈ-స్కూటర్ ని తీసుకొస్తొంది. ఓలా సీఈవో భవీశ్ చేసిన ట్వీట్ ని బట్టి ఈ బడ్జెట్ స్కూటర్ దీపావళి పండుగ రోజున లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది.

ఈ నెలలోనే న్యూ వెహికిల్ లాంచ్ కానుందని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. “ఈ నెలలో సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తున్నాం. #EndICEAge రెవొల్యూషన్ ని కనీసం 2 ఏళ్ళు యాక్సలరేట్ చేయనుంది. నిజంగా ఎగ్జైటింగ్ గా ఉంది,” అంటూ భవీశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఓలా ఎస్1 వెహికిల్స్ లో కెల్లా అత్యంత చౌకైన స్కూటర్ ని ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేయబోతున్నట్లు కార్ అండ్ బైక్ ఓ కథనాన్ని వెలువరించింది.

కార్ అండ్ బైక్ రిపోర్ట్ లో పేర్కొన్న దాని ప్రకారం, సరికొత్త, చౌకైన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.80,000 లోపు ఉండనుందని సమాచారం. అంటే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పెట్రోల్ స్కూటర్ల ధరలోనే ఈ స్కూటర్ వస్తుందన్న మాట. ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను ఈ బడ్జెట్ స్కూటర్లో కూడా అందిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ చెబుతోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ యొక్క MoveOS ప్లాట్ఫామ్ పై పని చేస్తుంది.

ఆగస్టులో ఓలా కంపెనీ Ola S1 స్కూటర్ ని లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ప్రో కంటే దీని ధర తక్కువ. ఓలా ఎస్1 ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999 గా కంపెనీ నిర్ణయించింది. ఇది 5.5 కిలో వాట్ మోటర్, 8.5 కిలో వాట్ పీక్ పవర్ ని కలిగి ఉంది. ఇది 141 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చింది. అలాగే 95 కేఎంపీహెచ్ అత్యధిక స్పీడ్ ని కలిగి ఉంది. హోమ్ చార్జర్ తో ఓలా ఎస్1 స్కూటర్ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

Ola S1 స్కూటర్ లో 3 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఓలా యొక్క మూవ్ ఓఎస్ ప్లాట్ఫామ్ పై ఈ స్కూటర్ పని చేస్తుంది. మ్యూజిక్ ప్లే బ్యాక్ ఫీచర్, నేవిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఈ బండి లో ఉన్నాయి. దీపావళి వరకు మూవ్ ఓఎస్ 3.0 అప్డేట్ ని ఓలా తీసుకురానుంది.

ఇటీవలె నవరాత్రి పర్వదినాల్లో తమ కంపెనీ విజయవంతంగా ప్రతి నిమిషం ఎలక్ట్రిక్ స్కూటర్ ని అమ్మినట్లు సదరు కంపెనీ తెలిపింది. పండుగ సీజన్ లో తమ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయని కంపెనీ చెప్పింది. దేశ వ్యాప్తంగా 1 లక్ష కస్టమర్ టెస్ట్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేసామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. సెప్టెంబర్ లో ఓలా సంస్థ 9364 యూనిట్లను అమ్మింది. వాహన్ నంబర్స్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ కి మాత్రం సమస్యలు లేకపోలేదు. ఇటీవలి కాలంలో ఓలా ఈ-స్కూటర్లపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఓలా ఎస్1 ప్రో లో సాఫ్ట్ వేర్ సమస్యల వల్లన 90 కిలోమీటర్ల వేగంతో బండి రివర్స్ వెళ్ళడం భయం కలిగించే విషయం. అలాగే అడపాదడపా మంటలు చెలరేగడం వంటి ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. త్వరలోనే అన్ని సమస్యలకు ఓలా ఎలక్ట్రిక్ చెక్ పెడుతుందని ఆశిద్దాం.

The post దీపావళి రోజున లాంచ్ అవుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి https://www.91mobiles.com/telugu/ev-fire-electric-scooter-battery-explodes-7-years-old-boy-dies/ Mon, 03 Oct 2022 15:39:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=2719 హైలైట్స్: ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి, ముంబై లో ఘటన బ్యాటరీ పేలినప్పుడు చార్జింగ్ లో ఉన్న స్కూటర్ ఇంకా బయటకు రాని స్కూటర్ మోడల్ మరియు కంపెనీ పేరు ముంబైలోని వాసై ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ళ బాలుడు మృతి చెందాడు. స్కూటర్ చార్జింగ్ లో ఉండగా బ్యాటరీ పేలింది. అప్పుడు బాలుడు పక్కనే నిద్రిస్తున్నట్లు సమాచారం. 70 శాతం గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. […]

The post Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి, ముంబై లో ఘటన
  • బ్యాటరీ పేలినప్పుడు చార్జింగ్ లో ఉన్న స్కూటర్
  • ఇంకా బయటకు రాని స్కూటర్ మోడల్ మరియు కంపెనీ పేరు

ముంబైలోని వాసై ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ళ బాలుడు మృతి చెందాడు. స్కూటర్ చార్జింగ్ లో ఉండగా బ్యాటరీ పేలింది. అప్పుడు బాలుడు పక్కనే నిద్రిస్తున్నట్లు సమాచారం. 70 శాతం గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.

ముంబై లోని వాసై (ఈస్ట్) ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బ్యాటరీ పేలినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్ద చార్జింగ్ లో ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, రాందాస్ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ 23 న ఉదయం 4.30 నుంచి 5.00 గంటల మధ్య పేలుడు సంభవించింది. ఘటన జరిగిన సమయంలో మృతుడు షబ్బీర్ అన్సారి తన నానమ్మతోపాటు హాల్ లో నిద్రిస్తున్నాడు.

అన్సారి తండ్రి తాను పడుకునే ముందు బ్యాటరీకి చార్జింగ్ పెట్టి తన గదిలోకి వెళ్ళాడు. భారీ శబ్దం రావడంతో బాలుడి తల్లిదండ్రులు మేలుకున్నారు. ఇక బాలుడి నానమ్మకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. 70 శాతం గాయాలైన అన్సారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అన్సారి కన్ను మూశాడు.

బ్యాటరీని ఎంతసేపు చార్జింగ్ పెట్టారో తెలియదని పోలీసులు చెప్పారు. ఘటనకు ముందు రాత్రి 2.30 గంటలకు స్కూటర్ చార్జింగ్ పెట్టామని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. అంటే పేలుడు జరిగేందుకు రెండు గంటల ముందు చార్జింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.

బాధిత కుటుంబం ఏ మోడల్, ఏ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాడుతుందో ఇంకా తెలియలేదు. ఏదేమైనా, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల పేలుడు ఉదంతాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీలకు నిప్పంటుకోవడం, పేలడం, జనాలు ప్రాణాలు కోల్పోవడం సాధారణమై పోయింది. దీంతో ఈ-స్కూటర్లు కొనాలంటేనే జనాలు వణుకుతున్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం కూడా ఈవీ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గత నెలలో సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో మంటలు వ్యాపించడంతో 8 మంది దుర్మణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఉదంతాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో మరి.

అంతకు ముందు, ఇటువంటి ఘటనే కేరళ లోని కోలికోడ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో 12 స్కూటర్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఓ స్కూటర్ బ్యాటరీ సమస్యను సరిచేస్తుండగా ఉన్నట్లుండి మంటలు చెలరేగాయని సమాచారం. ఆ వెనువెంటనే మిగతా స్కూటర్లకు కూడా మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు వ్యాపించాయి.

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలతోనే పేలుడు ఉదంతాలు సంభవిస్తున్నాయని ఏథర్ కంపెనీ సీఈవో అన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల పేలుళ్ళను నివారించేందుకు ఓలా కంపెనీ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని రూపొందిస్తోంది. ఓలా కంపెనీ ఈ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఏదేమైనా, ఎవరో ఒకరి ఆవిష్కరణతో ఈ బ్యాటరీ పేలుళ్ళకు చెక్ పడాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో మళ్ళీ లాంచ్ అయిన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/ola-electric-launched-ola-s1-electric-scooter/ Mon, 15 Aug 2022 15:29:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=1677 హైలైట్స్: రూ.99,999 ధరతో భారత్ లో రీ-లాంచ్ అయిన ఓలా ఎస్1 ఓలా యొక్క ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియో లోని S1 Pro తో చేరిన ఓలా ఎస్1 స్కూటర్ 2024 లో లాంచ్ కానున్న ఓలా ఎలక్ట్రిక్ కారు భారత్ యొక్క 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, మిషన్ ఎలక్ట్రిక్ 2022 ఈవెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ నేడు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఓ కొత్త ప్రోడక్ట్ లాంచ్ ఉంటుందని […]

The post భారత్ లో మళ్ళీ లాంచ్ అయిన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.99,999 ధరతో భారత్ లో రీ-లాంచ్ అయిన ఓలా ఎస్1
  • ఓలా యొక్క ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియో లోని S1 Pro తో చేరిన ఓలా ఎస్1 స్కూటర్
  • 2024 లో లాంచ్ కానున్న ఓలా ఎలక్ట్రిక్ కారు

భారత్ యొక్క 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, మిషన్ ఎలక్ట్రిక్ 2022 ఈవెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ నేడు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఓ కొత్త ప్రోడక్ట్ లాంచ్ ఉంటుందని గతంలో ఓలా ఎలక్ట్రిక్ టీజ్ చేసింది. అది ఓలా ఎలక్ట్రిక్ కారు లేదా తక్కువ ధరలో స్కూటర్ అని అంతా అనుకున్నారు. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు, ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఎలక్ట్రిక్ కారుని ఓలా టీజ్ చేసింది. అలాగే ఎలక్ట్రిక్ కారు 2024 లో లాంచ్ అవుతుందని ఓలా ప్రకటించింది. ఇంకా, ఖాకీ రంగు ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అనౌన్స్ అయ్యింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాగా, కేవలం 1947 యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.

ఓలా ఎస్1 ప్రో స్కూటర్ కి, ఓలా ఎస్1 బడ్జెట్ వర్షన్ గా లాంచ్ అయ్యింది. ఈ స్కూటర్ కూడా ఒకే ప్లాట్ఫామ్ పై నిర్మితమై, సేమ్ డిజైన్ ని కలిగి ఉంది.

భారత్ లో Ola S1 ధర, ఆఫర్లు, లభ్యత, వ్యారంటీ

రూ.99,999 పరిచయ ధరతో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఓలా ఎస్1 ప్రో (రూ.1.39 లక్షలు) ధరతో పోల్చితే తక్కువ వెలతో ఎస్1 స్కూటర్ లాంచ్ కావడం విశేషం. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 మధ్య ఓలా ఎలక్ట్రిక్ యాప్ లేదా కంపెనీ యొక్క అధికార వెబ్ సైట్ ద్వారా రూ.499 చెల్లించి ఈ బండిని బుక్ చేసుకోవచ్చు. రిజర్వ్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 1 నుంచి ఎర్లీ యాక్సెస్ పర్చేస్ విండో ఓపెన్ అవుతుంది. మిగతా వారికి సెప్టెంబర్ 2 నుంచి అమ్మాకానికి అందుబాటులోకి వస్తుంది. ఇక సెప్టెంబర్ 7 నుంచి డెలివరీలు మొదలవుతాయి.

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని అనుకునే వారికి, ఓలా వద్ద ఫైనాన్సింగ్ సౌకర్యం కలదు. రూ.2,999 నుంచి ఈఎంఐ మొదలవుతుంది. అలాగే ఓలా పార్ట్నర్ బ్యాంక్స్ నుంచి లోన్ ప్రాసెసింగ్ ఫీ నుంచి మినహాయింపు లభిస్తుంది. 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీని కూడా ఓలా అందిస్తోంది. వ్యారంటీ పరిధిలోకి బ్యాటరీ, మోటర్ ఇతర కంపోనెంట్స్ వస్తాయి. ప్రస్తుతం ఉన్న ఓలా ఎస్1 ప్రో వినియోగదారులు కూడా ఈ వ్యారంటీని కొనుగోలు చేయవచ్చు.

Ola S1 కలర్స్, డిజైన్, స్పెసిఫికేషన్స్, రేంజ్

ఓలా ఎస్1 డిజైన్ ని గమనిస్తే, ఓలా ఎస్1 ప్రో మాదిరే ఉంది. అలాగే రెండు బండ్లు కూడా ఒకే ప్లాట్ఫామ్ పై నిర్మితమయ్యాయి. ఇక ఓలా ఎస్1 బండి రెడ్, జెట్ బ్లాక్, పార్సిలిన్ వైట్, నియో మింట్, లిక్విడ్ సిల్వర్ వంటి రంగుల్లో లభ్యమవుతుంది. ఇందులో కూడా మూవ్ఓఎస్ ఉంది. మూవ్ ఓఎస్ 3.0 తో పాటు, ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ కూడా లభిస్తాయి. కాగా, మూవ్ఓఎస్ 3.0 దీపావళికి లాంచ్ అవుతోంది.

ఓలా ఎస్1 3 కిలో వాట్ బ్యాటరీని కలిగి ఉంది. ఓలా ఎస్1 ప్రో లో 3.97 కిలోవాట్ బ్యాటరీ ఉంది. ఓలా ఎస్1 యొక్క ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ 131 కిలోమీటర్లు. ఎకో మోడ్ లో 128 కిలోమీటర్లు, నార్మల్ మోడ్ లో 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్ లో 90 కిలోమీటర్లు గా ఈ బండి రేంజెస్ ఉన్నాయి. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ బండి అత్యధికంగా గంటకు 90 కిలోమీటర్లు వేగాన్ని అందుకోగలదు. సాఫ్ట్‌వేర్ ఫీచర్లలో మ్యూజిక్, నేవిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్, దాదాపుగా ఓలా ఎస్1 ప్రో బండిలో ఉన్న అన్ని ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి.

2021 ఆగస్టు 15 న తొలుత ఓలా ఎస్1 లాంచ్ అయ్యింది. కానీ, కొన్ని వివాదాల కారణంగా ఈ బండి ఈ ఏడాది జనవరిలో నిలిపివేయబడింది. అలాగే ఖరీదైన ఓలా ఎస్1 ప్రో బండి పై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేయడం వల్లన ఈ విధంగా జరిగింది.

ఇక భారత్ లో గత కొన్ని నెలలుగా టాప్ సెల్లర్ గా ఉంటూ వస్తోన్న ఓలా ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ లో 5 శాతం వాటాను కలిగి ఉంది. అయితే, బ్రేకింగ్ సస్పెన్షన్, రివర్స్ మోడ్ దానికదే అప్లై అవుతుండటం, ఫైర్ యాక్సిడెంట్స్ వంటి ఫిర్యాదులు కస్టమర్ల నుంచి వస్తుండటంతో ఓలా కంపెనీ పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మరి ఈసారి వీటిని అధిగమించి మార్కెట్లో ఓలా దూసుకెళ్తుందేమో చూడాలి.

The post భారత్ లో మళ్ళీ లాంచ్ అయిన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టు 15 న Greenest EV ని లాంచ్ చేయనున్న Ola https://www.91mobiles.com/telugu/ola-electric-to-launch-new-products-august-15-event/ Tue, 09 Aug 2022 10:36:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=1570 హైలైట్స్: ఆగస్టు 15 న జరిగే ఈవెంట్ లో గ్రీనెస్ట్ ఈవీ ని లాంచ్ చేయనున్న ఓలా ఎలక్ట్రిక్ తక్కువ ధరలో ఈ-స్కూటర్, ఓలా ఎలక్ట్రిక్ కార్, ఓలా ఎస్1 ప్రో కొత్త రంగుల వేరియంట్స్ లాంచ్ అయ్యే అవకాశం ఎస్1 ప్రో ఈ-స్కూటర్ ని లాంచ్ చేసి ఆగస్టు 15 కి ఏడాది పూర్తి ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తమ కంపెనీ నుంచి రాబోవు కొత్త ప్రోడక్ట్ ని సోషల్ మీడియా ద్వారా […]

The post ఆగస్టు 15 న Greenest EV ని లాంచ్ చేయనున్న Ola first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 15 న జరిగే ఈవెంట్ లో గ్రీనెస్ట్ ఈవీ ని లాంచ్ చేయనున్న ఓలా ఎలక్ట్రిక్
  • తక్కువ ధరలో ఈ-స్కూటర్, ఓలా ఎలక్ట్రిక్ కార్, ఓలా ఎస్1 ప్రో కొత్త రంగుల వేరియంట్స్ లాంచ్ అయ్యే అవకాశం
  • ఎస్1 ప్రో ఈ-స్కూటర్ ని లాంచ్ చేసి ఆగస్టు 15 కి ఏడాది పూర్తి

ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తమ కంపెనీ నుంచి రాబోవు కొత్త ప్రోడక్ట్ ని సోషల్ మీడియా ద్వారా టీజ్ చేశారు. ఆగస్టు 15 న ఈ లాంచ్ ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఓలా ఈ-స్కూటర్ ఆగస్టు 15 తో ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఇక దీని కంటే భిన్నమైన ఓ గ్రీనర్ వెహికిల్ ని లాంచ్ చేయాలని ఓలా భావిస్తోంది. ఓలా ఎస్1 ప్రో న్యూ కలర్ ఆప్షన్స్, ఓలా ఎలక్ట్రిక్ కార్ తదితర లాంచెస్ ఉంటాయని నెట్టింట్లో రూమర్లు వ్యాపిస్తున్నాయి.

ట్విట్టర్ ద్వారా ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ పోస్ట్ చేసిన వీడియో తో అంచనాలు పెరిగిపోయాయి. ఈ వీడియోలో పచ్చదనంతో నిండిన అడవి మధ్యలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పచ్చటి రంగులో కనిపిస్తోంది. “గ్రీనెస్ట్ స్కూటర్ మరింత గ్రీనర్ గా తయారైంది,” అంటూ భవీశ్ రాసుకొచ్చారు. ఆగస్టు 15 న జరిగే ఈవెంట్లో ఏయే లాంచెస్ ఉంటాయో గెస్ చేయాల్సిందిగా తన ఫాలోవర్లకు భవీశ్ అగర్వాల్ ఒక పోల్ ను కూడా నిర్వహించారు.

Ola S1 Pro కొత్త రంగులు, మెరుగైన రేంజ్

ఇప్పుడు లాంచ్ లో ఏవీ ఉంటాయో చూద్దాం. కొత్త రంగుల్లో ఓలా ఎస్1 ప్రో ని పరిచయం చేయవచ్చు. గ్రీన్ ఐవరీ రంగు ని తీసుకొచ్చే అవకాశముంది. గతంలో హోలీ పండుగ సందర్భంగా ఓలా గెరువా కలర్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే అది పరిమిత కాలం వరకు మాత్రమే కొనసాగింది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ ఎన్నెన్నో రంగుల ఆప్షన్స్ ను కస్టమర్లకు అందిస్తోంది.

సింగిల్ చార్జ్ పై ఓలా ఎస్1 ప్రో 181 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదని ఓలా చెబుతోంది. అయితే కొందరు అంతకంటే సుదూరం ప్రయాణించామని క్లెయిమ్ చేశారు. 200 కిలోమీటర్ల మార్కుని దాటామని చెప్పిన కస్టమర్లలో కొందరికి సీఈవో అగర్వాల్ ఉచితంగా ఎస్1 ప్రో ఈ-స్కూటర్ ని బహూకరించడం జరిగింది. రీసెంట్ గా మూవ్ఓఎస్ 2.0 అప్డేట్ వచ్చాక, పలువురు బయ్యర్లు తాము 300 కిలోమీటర్ల మార్కుని దాటినట్లు తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్ మరింత మెరుగైన, కొత్త బ్యాటరీ ప్యాక్ ని పరిచయం చేసే అవకాశముంది. ఇది భద్రతా ప్రమాణాలకు మరింత ప్రాధాన్యమిచ్చేలా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఎన్నో ఈవీ ఫైర్ ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కంపెనీలు నాణ్యతా ప్రమాణాలపై బాగా శ్రద్ధ పెడుతున్నాయి.

తక్కువ ధరలో స్కూటర్

తక్కువ ధరలో ఒక ఈ-స్కూటర్ ను లాంచ్ చేయాలని ఓలా అనుకుంటున్నట్లు సమాచారం. ఇది చాలా మంది ఔత్సాహిక వినియోగదారులకు మేలు చేయనుంది. బడ్జెట్ సెగ్మెంట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ శక్తితో కూడిన ఎఫిషియంట్ మోటర్ తో రానుంది. అలాగే తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉండనుంది. ఎస్1 ప్రో స్కూటర్లో కనిపించిన కొన్ని ఫీచర్లను ఓలా తొలగించనుంది. ధరను తగ్గించడం కోసం ఈ మార్పులు చేయనున్నారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ స్కూటర్ ని ఓలా ఎస్1 అని పిలవనుంది.

ఓలా అభివృద్ధి చేస్తున్న కొత్త బ్యాటరీ గురించి మరిన్ని వివరాలు ఈవెంట్ లో తెలిసే అవకాశముంది. అందుకోసం ఈ ఈవెంట్ ను ఓలా బాగా వాడుకోవడం ఖాయం. భవిష్యత్తులో విస్తరణ లక్ష్యాలు, సొంతంగా బ్యాటరీ ఉత్పత్తి ఆలోచనలు తదితర వాటి గురించి సీఈవో భవీశ్ జరగబోవు ఈవెంట్లో ప్రస్తావించనున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ కార్ (Ola Electric Car)

భారత మార్కెట్లో త్వరలో ఓలా ఒక ఎలక్ట్రిక్ కారుని పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఉంది. గతంలో ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన పలు కాన్సెప్ట్ లను ఓలా కంపెనీ టీజ్ చేస్తూ వచ్చింది. అయితే, ఆ ప్రాజెక్టు గురించి ఎక్కువగా వివరాలు ఏమీ తెలియలేదు. రోడ్లపై టెస్ట్ చేసినట్లుగా కూడా కనిపించలేదు. దీంతో ఎలక్ట్రిక్ కార్ లాంచ్ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

మూవ్ ఓఎస్ 3.0 (MoveOS 3.0)

ప్రస్తుతం తమ ఇంజినీర్లు అభివృద్ధి చేస్తున్న మూవ్ ఓఎస్ 3.0 సాఫ్ట్‌వేర్ యొక్క గ్లిమ్స్ ని ఓలా సీఈవో ఇటీవలె చూపించారు. మూవ్ ఓఎస్ 3.0, హిల్ హోల్డ్, ప్రాక్సిమిటీ అన్‌లాక్ ఫీచర్, మూడ్స్, రీజెన్ వీ2, హైపర్ చార్జింగ్, కాలింగ్, కీ షేరింగ్ తదితర ఎన్నో ఫీచర్లతో వస్తోంది.

The post ఆగస్టు 15 న Greenest EV ని లాంచ్ చేయనున్న Ola first appeared on 91Mobiles Telugu.

]]>